వంద రూపాయల కాయిన్ పై ఎన్టీఆర్ బొమ్మవేయడం తెలుగుజాతికి దక్కిన గౌరవం
◆యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జనగామ తిరుపతి◆
Street Buzz news పెద్దపల్లి జిల్లా:
(రామగుండం):- గోదావరిఖని ఫిబ్రవరి 16 :- ఆంధ్రుల ఆరాధ్యదైవం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావుగారి బొమ్మతో వందరూపాయల వెండి నాణెం ముద్రణకు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జనగామ తిరుపతి హర్షం వ్యక్తం చేశారు. ఓవైపు సినిమాలతో మరోవైపు రాజకీయాల్లో రాణించి, పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన మహానటుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు, ప్రతి పౌరాణిక పాత్రకు సజీవ రూపంగా నిలిచిన మహానటుడు ఎన్టీఆర్ అని అన్నారు. భారతీయ సినీ పరిశ్రమకు ఆయనే చిరునామా అని అదేవిధంగా రాజకీయాల్లో చిరస్మరణీయుడు అని పేర్కొన్నారు. ఆయన కన్నుమూసి రెండున్నర దశాబ్దాలు దాటినా జనం గుండెల్లో సజీవంగానే ఉన్నారు అని అటు సినీ రంగంలో ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన ఎన్టీఆర్, రాజకీయరంగంలో ఇంకెవ్వరికీ సాధ్యం కానీ విధంగా చరిత్ర సృష్టించారు అని తెలిపారు. తెలుగోడి ఆత్మగౌరవం నినాదంతో 1982 పసుపు జెండాను ఎగురవేశారు అని తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పార్టీని ప్రకటించి 9 నెలలు తిరగకుండానే ఎంతో ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చారు అని అన్నారు. ఉమ్మడి ఏపీలో తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు అని ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ కేంద్రం తెలుగు ప్రజలకు శుభవార్త అందించి ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణాన్ని త్వరలో విడుదల చేయనున్నట్టు ప్రకటిండాన్ని యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జనగామ తిరుపతి నందమూరి సేవా సమితి పక్షాన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఇదే సందర్భంలో నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇచ్చి గౌరవించాలి అని కోరారు.
Feb 16 2023, 15:26