₹- 1.40/- కోట్లతో పలు అభివృద్ది పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే
మొగుళ్లపల్లి మండలంలో రూ.1.40 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గండ్ర

ఇస్సిపేటలో సర్పంచ్ కోడారి సునీత రమేష్ యాదవ్ తో కలిసి సిసి రోడ్లకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే గండ్ర
Street Buzz news జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
(మొగుళ్ళపల్లి):- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆశీస్సులతో, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో మొగుళ్ళపల్లి మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. బుధవారం రోజున మొగుళ్లపల్లి మండలంలోని రంగాపురం, ఇస్సిపేట, మెదరమట్ల, అంకుశపూర్, మొగుళ్లపల్లి గ్రామాలలో రూ.1.40 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శంకుస్థాపనలు చేశారు. అనంతరం మొగుళ్లపల్లి మండల ముదిరాజ్ కమ్యూనిటీ హల్ వద్ద కొత్త బోర్ ప్రారంభోత్సవానికి పాలకాయ సమర్పించారు. ఎంపీడీఓ కార్యాలయంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమంలో దృష్టి లోపం ఉన్న వారికి ప్రత్యేక కళ్ళజోడులను పంపిణి చేశారు.భారతీయ జనతా పార్టీ దళితమోర్చ మండల అధ్యక్షుడు మంద జగన్నాథం BRS పార్టీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే రమణారెడ్డి సమక్షంలో BRS పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
Feb 16 2023, 15:12
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
24.2k