ఐకేపి ఏపీఎం వెంకన్న ను సన్మానించిన ఎస్ బి ఐ , ఎడిబి బ్యాంక్ అధికారులు
Street Buzz news సూర్యాపేట జిల్లా:
(సూర్యాపేట):- ఎస్,బి,ఐ బ్యాంక్ మెగా ఋణమేల సందర్భంగా బుధవారం సూర్యాపేట మండలం సంబంధించిన 15 స్వయం సహాయక సంఘాలకు 1 కోటి 26 లక్షల రూపాయల మైక్రో క్రెడిట్ ప్లాన్ (సూక్ష్మ ఋణ ప్రణాళిక) ఋణాలు అందించాలని ఋణ ప్రణాళికను తయారుచేసి బ్యాంకు అధికారులకు అందించడం జరిగిందనీ ఈ సందర్భంగా బ్యాంకు వారితో ఏ పీఎం వెంకన్న మాట్లాడుతూ ఈ సంవత్సరం టార్గెట్ పూర్తి చేయుటకు సహకరించాలని కోరగా బ్యాంకు అధికారులు అందుకు స్పందించి అర్హత గల అన్ని సంఘాలకు ఋణాలు అందిస్తామని చెప్పారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళా సంఘాల కోసం ఐకెపి సిబ్బంది కృషి చేయడం అభినందనీయంమని తెలుపుతూ రికవరీ 98% ఉన్న కారణంగా ఏపీఎం వెంకన్నను అదేవిధంగా సిసి లను సిబ్బందిని అభినందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఏ పీఎం వెంకన్నను సన్మానిస్తున్నామని తెలిపారు.పీఎం ఎఫ్ఎంఈ స్కీం కింద ముగ్గురు లబ్ధిదారులకు డిపిఆర్లు పూర్తిచేసి మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.మహిళా సంఘాలకు ఋణాలు అందించేందుకు తమ బ్యాంకు ఎల్లవేళలా ముందుంటుందని ఆర్ఎం కృష్ణమోహన్ తెలిపారు. ఐకెపి సిబ్బంది సీసీలు(ప్రధానమంత్రి ఫుడ్ ప్రాసెసింగ్) ద్వారా సూర్యాపేట మండల సమ భావన సంఘాలకు ఇప్పించేందుకు కృషి చేసిన సూర్యపేట మండల ఐకెపి ఏపిఎం రణపంగా వెంకన్నను సూర్యాపేట జిల్లా కేంద్రానికి సంబంధించిన ఎస్బిఐ ఎడిబి ఆర్ఎం కృష్ణమోహన్ అదేవిధంగా బ్యాంకు అధికారులు సిబ్బంది బుధవారం శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.ఈ సందర్భంగా బ్యాంకు ఆర్ఎం కృష్ణమోహన్ మాట్లాడుతూ మహిళా సంఘాల అభివృద్ధి కోసం ఏపిఎం వెంకన్న చేసిన కృషి అభినందనీయం అన్నారు. చిత్తశుద్ధి కలిగి విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరిని సన్మానించి ప్రోత్సహించాలని అప్పుడే ఇంకా తమ తమ బాధ్యతలను ఎక్కువగా నిర్వర్తిస్తారని తెలిపారు. అదేవిధంగా ఏపిఎం వెంకన్న మాట్లాడుతూ పై అధికారుల సూచనలు సలహాలు ప్రోత్సాహంతో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లకు ఈ ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తి గా 35 అయిదు కోట్ల 77 లక్షల రూపాయలు అందించాల్సి ఉండగా ఇప్పటివరకు సుమారుగా 30 కోట్ల వరకు స్వయం సహాయక సంఘాలకు ఋణాలు అందించడం జరిగిందన్నారు.అన్ని బ్యాంకుల ద్వారా ఋణాలు అందించామని తెలిపారు. అదేవిధంగా శ్రీనిధి ద్వారా టార్గెట్ 8 కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు సుమారు ఏడు కోట్ల రూపాయలు ఋణాలు అందించడం జరిగిందని వివరించారు.బ్యాంకు ద్వారా మిగిలిన టార్గెట్ మార్చి నెల ఆఖరి వరకు అందే విధంగా చూస్తామని ఏపీఎం తెలిపారు.ఈ ఋణాల ద్వారా మహిళ సంఘాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని ఇందుకు సహకరించిన రీజనల్ బ్యాంకు మేనేజర్ కృష్ణమోహన్ కు అదేవిధంగా బ్యాంకు అధికారులందరికీ అదేవిధంగా ఐకెపి,శ్రీనిధి అధికారులకు సిబ్బంది కి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు
Feb 16 2023, 08:44