ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే స్ట్రీట్ కార్నర్ సమావేశాలు
బిజెపి జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి
Street Buzz news సిద్దిపేట జిల్లా:
(సిద్దిపేట):- ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే స్ట్రీట్ కార్నర్ సమావేశాలు నిర్వహిస్తున్నామని భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని గాంధీ చౌరస్తా,ఇందిరానగర్,భారత్ నగర్,శ్రీనగర్ కాలనీలలో సోమవారం ప్రజా గోస-బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా స్ట్రీట్ కార్నర్ సమావేశాలు నిర్వహించారు.ఈ సమావేశాల్లో శ్రీకాంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. బస్తీలలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం బిజెపి నిరంతర పోరాటం చేస్తుందన్నారు.కాలనీలలోని ప్రజలకు అండగా బిజెపి కార్యకర్తలు ఉండాలని సూచించారు.కెసిఆర్ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజా దీవెనతో మెజార్టీ సీట్లలో బిజెపి గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారు.మహిళలకు వడ్డీ లేని రుణాల పేరిట, యువతను నిరుద్యోగ భృతి పేరిట కెసిఆర్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.అధిక కరెంటు చార్జీలు వసూలు చేస్తూ ప్రజలను బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకు తింటుందని మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి బిజెపియే ప్రత్యామ్నాయమని అన్నారు.రాష్ట్రంలోని గ్రామాలన్నిటికీ 14,15 ఫైనాన్స్ కింద కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు.సిద్దిపేట అభివృద్ధికి కూడా కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు. హరితహారం లో భాగంగా నాటిన కొనొకార్పస్ చెట్ల వల్ల ప్రజలకు అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉందని తెలిసినా అధికారులుపట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసం ప్రశ్నించారు.హరితహారం పేరుతో అక్రమాలు చేశారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఈ సమావేశాల్లో పట్టణ అధ్యక్షుడు పత్రి శ్రీనివాస్ యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు వంగ రామచంద్రరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ ఉపేందర్ రావ్,గుండ్ల జనార్ధన్, తొడుపునూరి వెంకటేశం,శ్రీనివాస్,గాడిపల్లి అరుణ రెడ్డి,బోమ్మగోని పద్మ,ఇంద్రాణి,విజయ,నీలం దినేష్ ,లక్కర్సు కృష్ణ, కేమ్మసారం సంతోష్ కుమార్,కమ్మ శ్రీనివాస్,బోగీ శ్రీనివాస్,రాగం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Feb 16 2023, 08:30