ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు అల్పాహారం

పదో తరగతిలో వందశాతం ఫలితాలు సాధించేందుకు ప్రయత్నిస్తున్న పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు బుధవారం నుంచి అల్పాహారం పంపిణీని ప్రారంభించనున్నది.

ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు అల్పాహారం

పోషకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్న అధికారులు

4,785 స్కూళ్లలో 1,89,791 మంది పిల్లలకు ప్రయోజనం

రాష్ట్రంలో 34 రోజులపాటు ఈ పథకం అమలు

పదో తరగతిలో వందశాతం ఫలితాలు సాధించేందుకు ప్రయత్నిస్తున్న పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు బుధవారం నుంచి అల్పాహారం పంపిణీని ప్రారంభించనున్నది. రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ పాఠశాలలు, మాడల్‌ స్కూళ్లలోని విద్యార్థులందరికి స్నాక్స్‌ అందజేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 9.67 కోట్లు వెచ్చించనున్నది. రాష్ట్రంలోని 4,785 స్కూళ్లలో 1,89,791 మంది విద్యార్థులకు 34 రోజుల పాటు ఈ అల్పాహారం అందించనున్నారు.

ఈ అల్పాహారంలో పోషకాలుండేలా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రొటీన్లు, ఐరన్‌, క్యాలరీలు అధికంగా ఉండే ఆహారాన్నే స్నాక్స్‌గా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా గుడ్లు, శనగలు, పల్లీలు, బెల్లం, తాజా పండ్లను అందించనున్నారు. ఇందుకోసం పలు జిల్లాల్లో ప్రత్యేకంగా మెనూను రూపొందించారు. హనుమకొండ జిల్లాలోని 123 స్కూళ్లల్లో 3,258 మంది విద్యార్థులుండగా, రాగిజావ, శనగలు, గుడాలు, ఉప్మాతో పాటు వారంలో ఒకట్రెండు రోజులు ద్రాక్ష, సంత్రాలు, అరటిపండ్లు ఇవ్వాలని నిర్ణయించారు.

మధ్యాహ్న భోజనంలో..

రాష్ట్రంలో అమలవుతున్న మధ్యా హ్న భోజనం పథకంలో కూడా పోషకాలుండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. పూర్తిగా సొంత నిధులతో వారంలో మూడు రోజులు కోడిగుడ్డు, లేదా అరటిపండును అందజేస్తున్నది. ఈ విద్యాసంవత్సరం నుంచి పోషకాల సమ్మేళనమైన ఫోర్టిఫైడ్‌ రైస్‌తో కూడిన భోజనాన్ని సమకూరుస్తున్నది. పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో మరో 36,154 మంది విద్యార్థులకు అల్పాహారాన్ని సమకూరుస్తున్నది. రాగిజావ, లేత మొలకలు, బెల్లం, పల్లీపట్టి వంటి వాటిని సైతం పిల్లలకు అందజేస్తున్నారు. సుమారు 8 లక్షల మంది విద్యార్థులకు 60 రోజుల పాటు వీటిని అందించనున్నారు. తెలంగాణతో పాటు మరో రెండు రాష్ట్రాలు మాత్రమే 9, 10వ తరగతుల వారికి మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తుండగా, మిగతా రాష్ట్రాలు కేవలం 1 నుంచి 8వ తరగతుల వారికి మాత్రమే అందజేస్తున్నాయి. ఈ పథకంలో తెలంగాణ రాష్ట్రం మాత్రమే నెలకు 12 ఉడకబెట్టిన కోడిగుడ్లను, సన్నబియ్యంతో కూడిన భోజనాన్ని విద్యార్థుల

కిస్తున్నది.

రేపు మల్లన్న సాగర్ కు పంజాబ్ సీఎం

కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ జలాశయాలను సందర్శించేందుకు పంజాబ్‌ సీఎం భగవంత్‌సింగ్‌ మాన్‌ రాష్ట్రానికి రానున్నారు.

బుధవారం సాయంత్రం హైదరాబాద్‌ చేరుకోనున్న ఆయన పలు ప్రైవేట్‌ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గురువారం ఆయనతో పాటు పంజాబ్‌ నీటిపారుదల శాఖ అధికారుల బృందం

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని, తుక్కాపూర్ మల్లన్న సాగర్,, జలాశయాలు, చెక్‌డ్యాంలను సందర్శించనుంది. నీటిపారుదల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను అధ్యయనం చేయనుంది.

Jagan: జగన్‌కు భారీ షాక్.. ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట..

ఢిల్లీ: సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు (IPS AB Venkateswara Rao)కు ఊరట లభించింది. ఏబీ వెంకటేశ్వరరావును డిస్మిస్ చేయాలన్న ఏపీ ప్రభుత్వ విజ్ణప్తిని UPSC తోసిపుచ్చింది..

అవసరమైతే శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చని కేంద్ర హోంశాఖ సూచించింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. చర్యల్లో భాగంగా వెంకటేశ్వరరావు ఇంక్రిమెంట్లు రద్దు చేసే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వ చర్యలను క్యాట్‌లో ఏబీ వెంకటేశ్వరరావు సవాల్‌ చేయనున్నారు..

కాగా ఏబీ వెంకటేశ్వరరావు (IPS AB Venkateswara Rao) ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. భద్రత పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ గతేడాది పిటిషన్ వేశారు.

అయితే ఈ పిటిషన్‌పై విచారణ నుంచి హైకోర్టు జడ్జి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు తప్పుకున్నారు. తగిన బెంచ్‌ ముందుకు ఈ పిటిషన్ విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ ఫైల్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ముందు ఉంచాలన్నారు. ఈ పిటిషన్‌పై గతంలో మరో న్యాయమూర్తి విచారణ జరపగా.. హైకోర్టులో తాజాగా రోషర్‌ మారడంతో ఈ పిటిషన్ జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు పరిధిలోకి వచ్చింది. పిటిషనర్ తరపు లాయర్.. అత్యవసర విచారణ జరపాలని కోరగా.. తాను విచారణ నుంచి తప్పుకొంటున్నట్లు జడ్జి ప్రకటించారు. గతేడాది మార్చి 18న ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఏబీవీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

AP High Court: సచివాలయాల నిర్మాణంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

అమరావతి: గ్రామ సచివాలయ నిర్మాణాలకు నరేగా నిధుల వ్యయంపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖకు హైకోర్టు (AP High Court) ఆదేశాలు జారీ చేసింది.

పాఠశాలల ఆవరణలో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాల నిర్మాణంపై విచారణ జరిగింది. గ్రామ సచివాలయాలు పంచాయతీరాజ్ చట్టం పరిథిలో లేవని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. సచివాలయాలు రాష్ట్ర పరిధిలోకి వస్తాయని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. గ్రామ సచివాలయ నిర్మాణాలకు నరేగా నిధులు ఎలా వినియోగించారని హైకోర్టు ప్రశ్నించింది.

నరేగా నిధుల వినియోగానికి కేంద్రం అనుమతి ఇచ్చిందా అని జస్టిస్ భట్టు దేవానంద్ ప్రశ్నించారు. అలాగే కేంద్రగ్రామీణ అభివృద్ది శాఖకు ఏమైనా లేఖ రాశారని కోర్టు ప్రశ్నించింది. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది.

ప్రపంచ చరిత్రలోనే.. ఎయిరిండియా బిగ్‌ డీల్‌, 500 విమానాల కొనుగోలుకు ఒప్పందం!

ప్రపంచ చరిత్రలోనే.. ఎయిరిండియా బిగ్‌ డీల్‌, 500 విమానాల కొనుగోలుకు ఒప్పందం!

ఎయిర్‌ షోలో ఎయిరిండియా బిగ్‌ డీల్‌ కుదుర్చుకుంది. 500 విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. ఎయిర్‌ బస్‌, బోయింగ్‌ సంస్థల నుంచి 500 విమానాల కొనుగోలుకు డీల్‌ కుదిరింది..

ఈ సందర్భంగా ఫ్రాన్స్‌తో ఒప్పందం చారిత్రాత్మకమని అన్నారు ప్రధాని మోదీ. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌తో వీడియో కాన్ఫిరెన్స్‌లో మోదీ మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎయిరిండియా చైర్మన్‌ రతన్‌ టాటా పాల్గొన్నారు.

Vijayawada: సీఎం ఇంటి సమీపంలో బాలికను హత్యచేసిన నిందితుడి అరెస్టు

తాడేపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తాడేపల్లిలో బాలిక హత్యకేసు నిందితుడు కుక్కల రాజును పోలీసులు అరెస్టు చేశారు.

అంధురాలైన బాలికను హత్య చేసిన సమయంలో రాజు గంజాయి సేవించలేదని జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. బాలికతో రాజు అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తల్లి మందలించడంతో..

అది మనసులో పెట్టుకున్న నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఎస్పీ తెలిపారు. మద్యం మత్తులోనే ఈ దారుణానికి ఒడిగట్టాడని ఎస్పీ వివరించారు. ఇప్పటివరకు రాజుపై ఎలాంటి రౌడీషీట్‌ లేదని, నిందితుడిపై రౌడీషీట్‌ ఓపెన్ చేస్తున్నామని తెలిపారు.

తొలి దళిత ముఖ్యమంత్రి నీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది

కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆదిముల శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా తొలి దళిత మాజీ ముఖ్యమంత్రి దామోదర్ సంజీవయ్య గారి 102 వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుకు సుధాకర్ మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తండు సైదులు గౌడ్ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు దామోదర్ సంజీవయ్య గారికి పూలమాల వేసి జయంతి కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ

ఉమ్మడి రాష్ట్రంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా ఆయన సేవలు ఎంతో అమోఘమైనవి చాలా గొప్పవి మరియు భారతదేశంలోనే తొలి దళిత నాయకుడిగా కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామానికి ఒక పేద ఇంటి నుంచి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ పార్టీది మరియు ఆయన పార్లమెంటు సభ్యుడిగా కార్మిక శాఖ మత్యులుగా నీటిపారుదల శాఖలను పులిచింతల అనేక నీటిపారుదల శాఖలను ఏసీబీ అవినీతి చర్యలను రూపుమాపడానికి నిర్మించారు.

మరియు అనేక కార్యక్రమాలు చేపట్టి దేశంలో రాష్ట్రంలో మచ్చలేని మనిషిగా పేరు ప్రఖ్యాతలు పొందిన వ్యక్తి దామోదర సంజీవయ్య తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి దళితులను మోసం చేశాడు కానీ కాంగ్రెస్ పార్టీ 1960లోనే దామోదర్ సంజీవయ్య లాంటి ఒక పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని అనేక పర్యాయాలు అనేక విధాలుగా సత్కరించి గౌరవించి ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది కనుక నేడు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో కచ్చితంగా సంపన్న వర్గాలకు అధికారం చేకూరాలంటే న్యాయం జరగాలంటే ఈ రోజున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరియు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మరియు ఓబిసి వర్గాలకు సంబంధించి అన్ని వర్గాలకు న్యాయం సామాన్యాయం జరుగుతుంది.

ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీని అందముందించే పరిస్థితులు ఏర్పడినాయి ప్రజలు కచ్చితంగా బీఆర్ఎస్ కు బుద్ధి చెప్తారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలియజేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓబీసీ జిల్లా అధ్యక్షుడు జిల్లాపల్లి పరమేష్ , చర్లపల్లి గౌతమ్ ,శివరామకృష్ణ ,నర్సింగ్ మురళీధర్ గౌడ్ మైనార్టీ నాయకులు ఇబ్రహీం ,ముంతాజ్, చైతన గిరి ,నల్గొండ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఆర్ల సూర్య ప్రకాష్ ,పగిళ్ల శివ, బుర్రి శంకర్ ,సుధీర్ ,గురుజాల బొజ్జ నాగరాజు ,జాకటి సుమన్ ,తదితరులు పాల్గొన్నారు.

AP: 26 టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లను ప్రారంభించిన సీఎం జగన్..

తాడేపల్లి: పర్యాటకుల భద్రతే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పర్యాటక ప్రదేశాల్లో టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.

రాష్ట్ర వ్యాప్తంగా 26 ​టూరిస్ట్ పోలీసు స్టేషన్‌లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మరో మంచి కార్యక్రయం చేపట్టినట్లు తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. పోలీసులు మీ స్నేహితులే అనే భావనను తీసుకురాగలిగామని, ఇంతకుముందు జరగని రీతిలో పోలీస్‌ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. పోలీస్‌ స్టేషన్లలో రిసెప్షనిస్టులు పెట్టి తోడుగా నిలిచే కార్యక్రమం చేపట్టామని అన్నారు.

హైదరాబాద్​లో భారీగా డ్రగ్స్, గంజాయి పట్టివేత..

రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల కట్టడికి ప్రభుత్వం అనేక రకాల చర్యలు చేపట్టింది. డ్రగ్స్ సరఫరా, వినియోగంపై రాష్ట్ర పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు..

ఎక్కడికక్కడ సరఫరాను నియంత్రిస్తున్నారు. అయినా రోజూ ఏదో చోట డ్రగ్స్, గంజాయి పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్​లో భారీగా డ్రగ్స్, గంజాయి పట్టుబడ్డాయి.

ముంబయికి చెందిన నలుగురు డ్రగ్ స్మగ్లర్లను హైదరాబాద్ నార్కోటిక్ విభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠా సభ్యుల నుంచి 204 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ స్మగ్లర్లపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నగరంలోని పలువురు ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసేందుకు ఈ ముఠా ముంబయి నుంచి వచ్చినట్లు తెలుస్తోంది..

మరోవైపు ఇవాళ నగరంలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రెస్టు చేశారు. ఆ ముఠా నుంచి 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న కారును సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Pulwama Attack Anniversary: పుల్వామా అమర వీరులకు ప్రధాని మోదీ నివాళులు..

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఈ ఘటన జరిగి నాలుగేళ్లయిన సందర్భంగా వారిని స్మరించుకున్నారు.

పుల్వామా అమరుల త్యాగాన్ని దేశం ఎన్నిటికీ మరువదని, దేశాభివృద్ధికి వీర సైనికుల శౌర్యమే స్ఫూర్తిదాయకమన్నారు. ఈమేరకు ఆయన మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు.

2019 ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్‌ పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 40 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఇందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ బాలాకోట్‌లోకి ప్రవేశించి భారత సైన్యం మెరుపుదాడులు చేసింది. ఉగ్ర శిబిరాలను పేల్చి వేసింది. ఈ ఘటనలో దాదాపు 250 మంది తీవ్రవాదాలు హతమైనట్లు అమిత్ షా ఓ ఎన్నికల ర్యాలీలో తెలిపారు.