Pawan Kalyan: మౌనంగా ఉండే నాయకుడు కోటలో ఉన్నా.. పేటలో ఉన్నా ఒకటే: పవన్ కల్యాణ్‌..

అమరావతి: తాడేపల్లిలో అంధ యువతి హత్య పూర్తిగా శాంతిభద్రతల వైఫల్యమేనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు అసలు రక్షణ ఉందా?..

సీఎం నివాసం దగ్గరలోనే ఘాతుకాలు జరిగినా మౌనమేనా? అని ప్రశ్నించారు. తాడేపల్లి అసాంఘిక శక్తులకు, గంజాయికి అడ్డాగా మారిందన్నారు. తాడేపల్లిలోనే గతంలో జరిగిన రేప్‌ కేసులో ఒక నిందితుడిని ఇప్పటికీ పట్టుకోలేకపోయారని విమర్శించారు.

''తన నివాసం పరిసరాల పరిస్థితులనే సీఎం సమీక్షించుకోలేకపోతే ఎలా? తల్లి పెంపకంలోనే లోపం ఉందని చెప్పే మంత్రులు ఉన్న ప్రభుత్వమిది.. దొంగతనానికి వచ్చి రేప్‌ చేశారని చెప్పే మంత్రులు గల ప్రభుత్వమిది.. అఘాయిత్యాలు జరుగుతుంటే మహిళా కమిషన్‌ ఏం చేస్తోంది? గంజాయికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్‌ని మార్చారు. మౌనంగా ఉండే నాయకుడు కోటలో ఉన్నా.. పేటలో ఉన్నా ఒకటే. యువతిని కిరాతకంగా చంపిన మృగాడిని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి దారుణ ఘటనలపై అన్ని వర్గాలు స్పందించాల్సిన అవసరం ఉంది'' అని పవన్‌ పేర్కొన్నారు.

Andhra News: జగన్‌ నిర్ణయాన్ని ఎందుకు స్వాగతించకూడదు?: మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ..

అమరావతి: పారిశ్రామికంగా దేశంలోనే అత్యధిక పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్‌ ఆకర్షిస్తోందని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు..

రాష్ట్ర జీఎస్‌డీపీ 11.34 శాతంగా ఉందని.. జాతీయ సగటుతో పోలిస్తే ఏపీ చాలా ముందుందన్నారు. తలసరి ఆదాయం కూడా 38.5 శాతం మేరకు పెరిగిందని చెప్పారు. కొందరు రాష్ట్ర వృద్ధి తిరోగమనంలో ఉందని ప్రచారం చేస్తున్నారని.. అది దుష్ప్రచారం మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు.

'2022 జూలై నాటికి ఏపీకి రూ. 40,361 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దేశవ్యాప్తంగా రూ.1.71 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే అందులో అత్యధిక పెట్టుబడులు ఏపీకే వచ్చాయి. ఈ మేరకు రూ.23,985 కోట్లకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. పెట్టుబడులు రాబట్టడంలో ఏపీ 5వ స్థానంలో ఉంది. అలయన్స్ టైర్స్ సంస్థ విశాఖలో రూ.1,040 కోట్ల పెట్టుబడితో ఉత్పత్తిని ప్రారంభించడానికి ముందుకు వచ్చింది. రాష్ట్ర పారిశ్రామిక విధానానికి ఆకర్షితులై దేశీయ, విదేశీ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఈజ్‌ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లోనూ ఏపీ అగ్రస్థానంలో ఉంది. బల్క్ డ్రగ్ పార్కు కోసం రూ.1000 కోట్ల గ్రాంట్ ఏపీ సాధించింది..

పోలీసులపై రాళ్లూ రువ్విన ఎమ్మార్పీఎస్ నాయకులు..

విజయవాడ కానిస్టేబుల్ గా నందిగామ ట్రాఫిక్ లో చేసే తిరుమల్ రావు అనే కానిస్టేబుల్ కు తలకు గాయం

ఎస్సీ వర్గీకరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) కార్యకర్తలు దిగ్బంధానికి (రాస్తారోకో) పిలుపునిచ్చారు, ఎన్టీఆర్ జిల్లాలో ఆందోళన..

ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు వద్ద ఎమ్మార్పీఎస్ ఆందోళన హింసాత్మకంగా మారింది..

రాళ్ల దాడి మరియు ఒక పోలీసు కానిస్టేబుల్ గాయపడ్డారు, తరువాత పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..

ఎస్సీల రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టాలని ఎంఆర్‌పీఎస్‌ కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు..

ఎలాగు రాజీనామా చేయ్సాలిందే.. కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి షాకింగ్‌ కామెంట్స్‌

న్యూఢిల్లీ: కేంద్రంపై బురద జల్లేందుకు అసెంబ్లీని వాడుకున్నారని కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత బడ్జెట్‌లో ఇచ్చిన ఏ హామీని కేసీఆర్‌ నెరవేర్చలేదన్నారు..

కేంద్రాన్ని విమర్శించిన కేసీఆర్‌ రాష్ట్ర పరిస్థితిపై ఎందుకు మాట్లాడరు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల సంగతేంటి? అంటూ కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

''అసెంబ్లీలో కేసీఆర్‌ పరిధి దాటి మోదీపై మాట్లాడారు. బడ్జెట్‌ సమావేశాలా? మోదీ విద్వేశ సమావేశాలా?. నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి ఏమైంది?. విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడ లేదు. ఆధారాలు లేకుండా కేంద్రంపై ఆరోపణలు చేశారు. కుటుంబ పాలనపై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు. దేశ పరిస్థితులపై కేసీఆర్‌కు అవగాహన లేదు'' అంటూ ఆయన దుయ్యబట్టారు..

''దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చకు మేం సిద్ధం. ప్రగతి భవన్‌ లేదంటే ఫామ్‌హౌజ్‌కు చర్చకు రమ్మంటారా?. అభివృద్ధిపై చర్చకు కేసీఆర్‌ ఎక్కడకు రమ్మన్నా వస్తాం. రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని వస్తే రండి. అసలు కేసీఆర్‌ను రాజీనామా ఎవరు అడిగారు?. వచ్చే ఎన్నికల తర్వాత ఎలాగు రాజీనామా చేయ్సాలిందే'' అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు..

GVL Narasimha Rao: కృష్ణా, మచిలీపట్నం జిల్లాల్లో ఒక జిల్లాకు వంగవీటి పేరు పెట్టాలి..

GVL Narasimha Rao Demands To Put Vangaveeti Name To Krishna District: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో వంగవీటి మోహనరంగా గురించి ప్రస్తావించారు..

రాజ్యసభ జీరో అవర్లో మాట్లాడిన ఆయన.. వంగవీటి మోహనరంగా గురించి తెలియని తెలుగువారు ఉండరన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాలు ఆయన్ను ఆరాధ్య దైవంగా కొలుస్తారన్నారు. అత్యంత పెద్ద సామాజికవర్గమైన కాపులకు చెందిన రంగా.. కేవలం ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా పని చేసినప్పటికీ, గొప్ప ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారని తెలిపారు. అలాంటి రంగాను కొందరు ద్రోహుడు 1986 డిసెంబర్ నెలలో హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు..

రాష్ట్రంలో వంగవీటి రాజకీయ శక్తిగా ఎదుగుతున్న తరుణంలో.. 'కాపునాడు' సభలను నిర్వహిస్తున్న టైంలో ఈ హత్య జరిగిందని గుర్తు చేశారు. లక్షల మంది ప్రజలు, కాపు వర్గం నేతలు వంగవీటిని సమర్థించిన సమయంలో.. ఆయన్ను హతమార్చడం దిగ్భ్రాంతి కలిగించిందని జీవీఎల్ పేర్కొన్నారు. రంగా చనిపోయి 36 సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ ఆయనను ప్రజలు స్మరించుకుంటారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలన్న ప్రతిపాదన వచ్చిందని తెలియజేశారు. ఇతర నాయకుల పేర్లను జిల్లాలకు పెట్టారు కానీ, కానీ రంగా పేరును మాత్రం పెట్టలేదని తెలిపారు. కృష్ణా, మచిలీపట్నం జిల్లాల్లో ఒక జిల్లాకు రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే.. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు రంగా పేరు పెట్టాలని తాను కేంద్రాన్ని కోరుతున్నానని జీవీఎల్ వెల్లడించారు.

గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో సీఎం జగన్‌ దంపతుల భేటీ..

అమరావతి: గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు భేటీ అయ్యారు. ఏపీ గవర్నర్‌గా మూడున్నరేళ్లపాటు సేవలందించి ఛత్తీస్‌గఢ్‌కు బదిలీపై వెళ్తున్న బిశ్వభూషణ్‌కు సీఎం జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా సుప్రీకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ సయ్యద్‌ అబ్దుల్‌ నజీర్‌ను కేంద్రం నియమించిన విషయం తెలిసిందే. ఏపీతోపాటు దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ప్రస్తుతం ఏపీ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బిశ్వభూషన్‌ హరిచందన్‌ను చత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి గవర్నర్‌గా వెళ్లనున్నారు.

స్టేషన్ బెయిల్ పేరిట కొనసాగుతున్న పోలీసులదందా నూ అరికట్టాలి...!

•కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న డిమాండ్

•పోలీసు అధికారుల నిలువుదోపిడీకీ అడ్డుకట్ట వేయండి

•ప్రజా నేస్తం కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ బహిరంగ లేఖ

•లంచం ఇవ్వకుంటే పోలీసుల'విచక్షణ' అస్త్రం ఇంకెంతకాలం....?

•ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిలదీసిన ప్రజాతంత్ర ఉద్యమకారుడు కామ్రేడ్ బోసన్న

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీసు ఠాణాల్లో స్టేషన్ బెయిళ్ల పేరిట లంచాల వసూళ్ల పర్వం మూడు పువ్వులు ,ఆరు కాయలుగా నిత్యం కొనసాగుతోందనీ సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ ప్రజా నేస్తం కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు.

పోలీసులు ఏసీబీకి చిక్కేది ఎక్కువగా ఈ వ్యవహారాల్లోనే కావడం దీన్ని బలపరు స్తోందనీ.. సంఘసంస్కర్త బొసన్న తెలిపారు.

తాజాగా హైదరాబాద్ కమిషనరేట్ పరి ధిలోని బేగంపేట ఠాణా పరిధిలో ఒక బాధితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.12 వేలు లంచం తీసుకుంటూ.. ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ నరేశ్ లు అవినీతి నిరోధకశాఖ (అనిశా)కు దొరికిన సంఘటన దేనికి నిదర్శనమని నిరంతరం ప్రజాస్వామిక విలువల పరిరక్షణ కోసం పాటుపడే ప్రజా నేస్తం కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

ఏడేళ్లలోపు శిక్ష పడే అవకాశమున్న చిన్న కేసుల్లో నిందితుల్ని రిమాండ్కు తరలించవద్దంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన మినహాయింపును తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 99 శాతం పోలీసు అధి కారులు అనుదినం దుర్వినియోగం చేస్తున్నారనీ .. ప్రజాభ్యుదయవాది జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు.

నిందితులు లంచం ఇచ్చేవరకు ఠాణాల చుట్టూ తిప్పు తున్నారనీ ఒక్కో కేసులో రూ.20-వేల నుండి 50 వేల వరకు

వసూలు చేస్తున్నట్లు సామాజిక ఉద్యమకారుడు జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాసిన లేఖలో తెలంగాణ రాష్ట్ర పోలీసుల అంతులేని అవినీతి ,అక్రమాల దందపై జననేస్తం సుభాషన్న ఫిర్యాదు చేశారు.. చేయి తడపకుంటే కక్ష సాధింపు చర్యలకు పోలీసులు పాల్పడుతున్నారని ప్రజా ఉద్యమకారుడు జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న కెసిఆర్ కు రాసిన బహిరంగ లేఖలో పోలీసుల అవినీతిని కెసిఆర్ కు వివరించారు.

ఏడేళ్ల లోపు శిక్ష పడే నేరాల్లో 41 సీఆర్పీసీ (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్) కింద దర్యాప్తు అధి కారికి విచక్షణాధికారం ఉంటుంది. దీని ప్రకారం నిందితుడికి 41ఏ నోటీసు ఇచ్చి సంజాయిషీ అడగవచ్చు. దానికి నిందితుడి సమాధానం సంతృప్తికరంగా ఉందని భావిస్తే అరెస్టు చేయరు. నిందితుడు సాక్ష్యాల్ని తారుమారు చేస్తాడనో లేక విదేశాలకు పారిపోయే అవకాశ ముందనో అధికారి భావిస్తే రిమాండుకు తరలించవచ్చు. ఇది పూర్తిగా దర్యాప్తు అధికారి 'విచక్షణ' మీద ఆధారపడి ఉంటుందనీ... అనుదినం అణగారిన వర్గాల జన స్వరమై ప్రజా సమస్యలపై ప్రతిక్షణం ప్రజాహితం ద్యేయంగా జీవించే ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

అయితే దీన్నే కొందరు పోలీసు అధికారులు దుర్వినియోగం చేస్తున్నారనీ.. పౌర ,ప్రజాతంత్ర హక్కుల ఉద్యమకారుడు

జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.

లంచం ఇవ్వకుంటే రిమాండ్కు పంపిస్తామని బెదిరిస్తున్నారనీ, డబ్బులు ఇవ్వలేని బాధితులను పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారని శ్రామిక ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా పోరాడే వర్గ పోరాట వాది

జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.

డబ్బు ఇస్తే దర్యాప్తులో అనుకూలంగా వ్యవహరిస్తామని పోలీసులుఆశ చూపుతున్నారనీ.. పోలీసులు అవినీతి ,అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రతిక్షణం ప్రజాహితం కోసం పాటుపడే ప్రజా నేస్తం, సంఘసంస్కర్త, హేతువాది

జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.

నేరాల్లో వాహనాలు ఇరుక్కుపోయి ఉంటే వాటిని తిరిగి ఇచ్చేందుకు మరింత ఎక్కువ డిమాండ్ చేస్తున్నారనీ... సుభాషన్న పోలీసుల అవినీతిపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పోలీసుల దందాపై దళిత బహుజన హక్కుల పోరాట యోధుడు

జైబోరన్నరి నేతాజీ సుభాషన్న ధ్వజమెత్తారు.

పోలీసులకు లంచం వచ్చే అవకాశం లేనప్పుడు.. తప్పుడు కారణాలు చూపి రిమాండ్కు తరలిస్తున్నారనీ... సుభాషన్న తెలిపారు .

తెలంగాణ రాష్ట్రంలో ఏటా 1.3-నుండి 1.4 వరకూ లక్షల కేసులు నమోదవుతున్నాయని భారత్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ అవేర్నెస్ ఆర్ టి ఐ యాక్ట్ ద్వారా

బి .జె. ఆర్ .సర్దార్ పటేల్ సేకరించిన వివరాలను... బాధితుల బంధువు బహుజనుల నేస్తం ,సంఘసంస్కర్త

జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ తెలిపారు.

గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 1,42,917. అనీ...వీటిలో సుమారు లక్ష కేసులు స్టేషన్ బెయిల్కు అర్హత ఉన్నవేనని మెరుగైన సమాజ నిర్మాణానికి అవసరమైన రాళ్లను తన వంతుగా అందిస్తూ అనుక్షణం అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం ఆరాటపడే అభ్యుదయ వాది

జైబోరాన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో నమోదైన కేసులలో చాలావరకు స్టేషన్ బెల్లకు అర్హత ఉన్నప్పటికీ పోలీసులు మితిమీరిన వసూళ్ల దందాకూ పాల్పడుతున్నా ప్రభుత్వం చూసి చూడనట్లు ఉండటం సరైన పద్ధతి కాదని ... కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

జిల్లాలతోపాటు కమిషనరేట్లలోనూ స్టేషన్ బెయిళ్ల వ్యవహారాలు చూసేది దాదాపుగా ఎస్సైలే కావడంతో కానిస్టేబుళ్లు లేదా దళారుల ద్వారా వసూళ్లు చేయిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖలో రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసుల దందా పై ప్రజా నేస్తం సుభాషన్న సమాచారం ఇచ్చారు.

కొత్తగా ఉద్యోగాలు వచ్చిన ఇటీవలి బ్యాచ్లకు చెందిన ఎస్సైలు ఇలాంటి వ్యవహారాల్లో ముందుంటున్నారనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజాభ్యుదయ వాది

జైబోరాన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ బహిరంగ లేఖలో వివరించారు.

ఏడేళ్లలోపు శిక్ష పడే నేరాల్లో నిందితుడిని రిమాండ్కు తరలించాలా? వద్దా? అనే విచక్షణాధికారం దర్యాప్తు అధికారికి ఉంటుంది. రిమాండ్ చేయని పక్షంలో 41ఏ సీఆర్పీసీ నోటీసు ఇచ్చి సంజాయిషీ అడగొచ్చు. ఒకరకంగా ఇది బైండోవర్ మాత్రమే. స్టేషన్ బెయిల్ ఇచ్చే అధికారం దర్యాప్తు అధికారులకు లేకపోయినా.. కొందరు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారనీ పౌర హక్కుల పరిరక్షణ కోసం పాటుపడే ప్రజాతంత్ర ఉద్యమకారుడు

జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 9848540078 తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్టేషన్ బెయిల పేరు మీద జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర న్యాయవిచరణ జరిపించాలని, అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న పోలీస్ అధికారులను, కానిస్టేబుళ్ళనూ, మధ్య దళారీలను కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్మిక ,కర్షక, శ్రామిక స్థాపనకై ఆరాటపడే అభ్యుదయ వాది, కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ, ప్రజా నేస్తం, కామ్రేడ్

జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న

8328277285 రాష్ట్ర ప్రభుత్వంనూ డిమాండ్ చేశారు.

టి 20 వరల్డ్ కప్ - పాక్ పై భారత్ ఘన విజయం..

టి 20 వరల్డ్ కప్ - పాక్ పై భారత్ ఘన విజయం..

దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా తొలి మ్యాచ్ లో దాయాది దేశం పాకిస్థాన్ పై ఘన విజయం సాధించింది..

150 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మూడు వికెట్లు నష్టపోయి 151 పరుగులు చేసింది..

Andhra news: ఏపీలో వైకాపా సర్కార్‌ దివాలా తీసింది: కేంద్రమంత్రి విమర్శలు..

కర్నూలు: వైకాపా ప్రభుత్వంపై కేంద్రమంత్రి దేవ్‌సింహ్‌ చౌహాన్‌ విమర్శలు గుప్పించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. పూర్తిగా దివాలా తీసిందన్నారు..

వాలంటీర్ల ద్వారా విపక్ష నేతలను భయపెడుతున్నారని ఆరోపించారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని వాసవీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో మద్యం, ఖనిజ సంపద ద్వారా వచ్చే ఆదాయంతో ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఆ ఆదాయమంతా ఎక్కడికి పోతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు రోడ్ల మీద ఉన్నారని, వారి హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. 10వ తేదీ దాటినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని దుయ్యబట్టారు. ఏపీలో భాజపా అధికారంలోకి వస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.

దేశంలో తొమ్మిదేళ్ల మోదీ పాలనలో అద్భుతాలు సృష్టించారని కేంద్రమంత్రి అన్నారు. సాంకేతికతతో కూడిన పారదర్శక పాలన అందిస్తున్నారని తెలిపారు. ఒక వ్యక్తి, ఒక వర్గం కాకుండా అందరూ ఎదగడానికి భాజపా కృషి చేస్తోందన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వం పేదల పేరుతో రాజకీయం చేసిందని విమర్శించారు. గ్రామంలో రోజువారి వేతనం రూ.16పైన ఉంటే దారిద్ర్య రేఖకు పైన ఉన్నట్లు పేదలను ఇబ్బంది పెట్టిందన్నారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర నాయకులు విట్టా రమేశ్‌, రాష్ట్ర నాయకులు పార్థసారథి, జిల్లా అధ్యక్షుడు రామస్వామి, మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్‌ జైన్‌ పాల్గొన్నారు.

మోడీ కంటే మన్మోహనే బెటర్.. అదానీ తెలంగాణకు రాలేదు, మన అదృష్టం బాగుంది : అసెంబ్లీలో కేసీఆర్

పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అయ్యిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మన్మోహన్ కంటే మోడీ పాలనలోనే దేశం ఎక్కువగా నష్టపోయిందని.. పార్లమెంట్‌లొ మోడీ స్పీచ్ అధ్వాన్నంగా వుందని కేసీఆర్ చురకలంటించారు.

అదానీ గురించి ప్రధాని ఏం మాట్లాడలేదన్నారు. అదానీ రూపంలో దేశానికి ఉపద్రవం వచ్చిందని.. ఇంత గొడవ జరుగుతున్నా అదానీ గురించి ప్రధాని మాట్లాడలేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అదానీ ఆస్తి కరిగిపోయిందని.. ఆయన సంస్థలు ఉంటాయో, పోతాయోనని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీ పెడతానంటూ అదానీ తెలంగాణకు కూడా వచ్చాడని.. అదృష్టం బాగుండి మన దగ్గర అదానీ కంపెనీ రాలేదన్నారు.