Hyderabad Fake Baba Arrest: దొంగ బాబా అరెస్ట్.. 8వ పెళ్లి చివరి క్షణంలో బాగోతం బట్టబయలు..
Hyderabad Langer House: హైదరాబాద్‌లోని లంగర్ హౌజ్‌లో దొంగ వీఐపీ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. భూతవైద్యం పేరుతో ఇప్పటివరకూ ఈ బాబా 7 పెళ్లిళ్లు చేసుకున్నాడు..
దయ్యం పట్టిందని నమ్మించి, యువతులను లొంగదీసుకోవడం ఈ బాబా స్పెషాలిటీ. ఇప్పుడు ఇతను 8వ పెళ్లికి సిద్ధమయ్యాడు.
ఈ పెళ్లికి హాజరయ్యేందుకు సుమారు 200 మంది ఫంక్షన్ హాల్‌కి చేరుకున్నారు. రాత్రి 11 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. అయితే.. ఆ బాబా రాలేదు. అతని కోసం కొద్దిసేపు వేచి చూసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో.. అమ్మాయి తరఫు వాళ్లు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు రంగంలోకి దిగారు. ఆ దొంగ బాబాను అదుపులోకి తీసుకున్నారు. ఈ దొంగ బాబాకు పక్కం రాష్ట్రంలో ఉన్న బడా రాజకీయ నాయకుల అండ ఉందని సమాచారం.
Feb 12 2023, 15:05