Venkaiah Naidu: అల్లూరి విగ్రహం మోదీ ఆవిష్కరించడం ఎంతో సంతోషం..
ప.గో. జిల్లా: మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) శనివారం పశ్చిమగోదావరి జిల్లా (West Godavari Dist., భీమవరం (Bhimavaram)లో పర్యటిస్తున్నారు.
వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్బంగా అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraju) కాంస్య విగ్రహాన్ని (Bronze Statue) సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అల్లూరి విగ్రహం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆవిష్కరించడం తన మనసుకి ఎంతో సంతోషం కలిగించిందన్నారు. స్వాతంత్య్రయం కోసం కృషి చేసిన అనేకమంది మహానుభావుల్లో మొట్టమొదటి వరుసలో ఉండే వ్యక్తి అల్లూరి సీతారామరాజుని కొనియాడారు. సీతారామరాజు స్ఫూర్తిని యువతరానికి తెలియజేయాలన్నారు..
రాష్ట్రంలో ఉండే యువత ఎప్పటికప్పుడు భీమవరం వచ్చి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని సందర్శించాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నానని వెంకయ్య నాయుడు అన్నారు. స్వార్థం, అవకాశవాదం, అవినీతి, అరాచకం, పెరిగిపోతున్న ఈ రోజుల్లో యువత ముందుకు వచ్చి నడుంబిగించవలసిన సమయం ఆసన్నమైందని, ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూస్తున్నాయన్నారు. అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర పాఠ్యాంశాలలో భాగంగా ఉండాలని, అది చాలా అవసరం.. దీన్ని ప్రభుత్వాలు గుర్తించాలని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.
Feb 11 2023, 15:09