బాధిత కుటుంబానికి శేపూరి రవీందర్ ఆర్థిక సాయం
నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీలోని ఫస్ట్ వార్డ్ శివనేనిగూడెం లో 02.02. 2023న మరణించిన కాలేరు చంద్రమ్మ గారి దశదినకర్మ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ గారు నేడు కుటుంబ సభ్యులను పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసినారు.
నకిరేకల్ నియోజకవర్గంలో పేదల పక్షాన ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా అనుక్షణం ప్రజాసేవలో ఉంటానన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు గుండాల నరేష్ గౌడ్, బూత్ అధ్యక్షులు నోముల లింగస్వామి గౌడ్, ప్రధాన కార్యదర్శి శివరాత్రి కొండల్, కార్యదర్శి అమరోజు సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Feb 11 2023, 13:12