నేడే హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేసింగ్..

నేడు హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేసింగ్ జరగబోతోంది. హుస్సేన్‌సాగర్ తీరాన ఎలక్ట్రిక్ కార్లు రయ్ రయ్‌మని దూసుకెళ్లబోతున్నాయి. ఫార్ములా-ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు హైదరాబాద్‌ ఆతిథ్యమిస్తోంది..

శనివారం హుస్సేన్‌సాగర్‌ తీరంలోని ఎన్టీఆర్‌ మార్గ్‌ ఈ-కార్ల రేసుతో సందడిగా మారనుంది. భారత్‌లో జరగనున్న తొలి ఫార్ములా-ఈ రేసు ఇదే కావడం విశేషం.

హుస్సేన్‌సాగర్‌ తీరాన జరిగే అంతర్జాతీయ పోటీల కోసం 2.8 కిలోమీటర్ల స్ట్రీట్‌ సర్క్యూట్‌ను తీర్చిదిద్దారు. లుంబినిపార్కు నుంచి ప్రారంభమై సచివాలయం పక్క నుంచి మింట్‌ కాంపౌండ్‌, ఐమాక్స్‌ మీదుగా ఎన్టీఆర్ గార్డెన్‌ వరకు రేస్‌ సాగనుంది. మొత్తం 11 ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్‌ కార్లు పాల్గొనేపోటీలో. 22మంది రేసర్లు సత్తాచాటనున్నారు. రక్షణ చర్యల్లో భాగంగా స్ట్రీట్ సర్క్యూట్‌కి ఇరువైపులా పెద్ద ఎత్తున బారికేడ్లు, ప్రేక్షకుల గ్యాలరీలు ఏర్పాటు చేశారు.

కనేకల్ మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల లో PDSU కమిటీ ఎన్నిక

•అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడు :మల్లె ప్రసాద్,

కణేకల్ మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పిడిఎస్ యు కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. PDSU వ్యవస్థాపకుడు : జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్.రంగవల్లి. చేరాల. ఇలాంటి మహునుభావులు ఆశయ సాధన కోసం నిరంతరం విద్యారంగ సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తామని

ప్రభుత్వ పాఠశాలలో గాని ప్రభుత్వ కళాశాలలో గానీ మరియు నూతన జాతీయ విద్యా,విధానం పేరుతో తెచ్చిన జోవును వెంటనే ఉపసంహరించుకోవాలని ఎందుకు అంటే పేద, మధ్య,తరగతి విద్యార్థులు చదువుకు దూరం పెట్టే విధంగా ఉంది కాబట్టి ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, లేనిపక్షంలో కేంద్ర,రాష్ట్ర, ప్రభుత్వాలను గద్దె దించుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.

TTD: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్‌లైన్‌ కోటా టికెట్లు 13న విడుదల..

TTD: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్‌లైన్‌ కోటా టికెట్లు 13న విడుదల..

తిరుమల: తిరుమల (Tirumala) శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (SED TICKETS)

ఆన్‌లైన్‌ కోటా టికెట్లు ఈనెల 13న ఉదయం 9గంటలకు విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రకటనలో తెలిపింది.

E-racing: ఫార్ములా-ఈ రేసింగ్‌ ప్రాక్టీస్‌లో ప్రమాదం..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్న ఫార్ములా-ఈ రేసింగ్‌ (E-racing) ప్రాక్టీస్‌లో ప్రమాదం చోటు చేసుకుంది.మూలమలుపు దగ్గర కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనతో ప్రాక్టీస్ రేసుకు నిర్వాహకులు బ్రేక్ ఇచ్చారు..

ఈ నెల 11, 12 తేదీల్లో ఫార్ములా ఈ రేసింగ్‌ జరుగుతుండడంతో మంగళవారం నుంచి సాగర తీరం చుట్టూ (ట్యాంక్‌బండ్‌ మినహా) వాహనాలను మళ్లించి ట్రాక్‌ను సిద్ధం చేస్తున్నారు.

అంతర్జాతీయస్థాయి ఈవెంట్‌ కావడంతో ఆ స్థాయిలోనే మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. దేశ, విదేశాల నుంచి కార్‌ రేస్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులతోపాటు పోటీల్లో పాల్గొనేందుకు పలు సంస్థలు, రేసర్లు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

Hyderabad: చాదర్‌ఘాట్‌ రహదారిపై 20 అడుగుల గుంత.. ఆదమరిస్తే అంతే!

చంచల్‌గూడ: హైదరాబాద్‌లో కీలకమైన ఎంజీబీఎస్‌ - చాదర్‌ఘాట్‌ రహదారిపై భారీ గుంత ఏర్పడింది. వెంటనే సమాచారం అందుకున్న జలమండలి అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని గుంతను పరిశీలించారు..

దాదాపు 20 అడుగుల లోతు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అయితే, నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో ఇప్పటికిప్పుడు గంతను తవ్వి మరమ్మతులు చేయడం సాధ్యం కాదని.. అలా చేస్తే పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతాయని అధికారులు చెప్పారు.

రాత్రికి ఎంజీబీఎస్‌ - చాదర్‌ఘాట్‌ మార్గంలో రాకపోకలు నిలిపివేసి మరమ్మతులు కొనసాగిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గుంత పడిన ప్రాంతంలో మలక్‌పేట ట్రాఫిక్‌ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను నియంత్రిస్తూ ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్నారు..

CM KCR: ఈ నెలాఖరులోపు పోడు భూముల పంపిణీ.. హామీని అతిక్రమిస్తే పట్టాలు రద్దు: కేసీఆర్‌

హైదరాబాద్: పోడు, అటవీ భూములు కొందరికి ఆటవస్తువుల్లా తయారయ్యాయని తెలంగాణ సీఎం కేసీఆర్‌ (CM KCR) అన్నారు. విచక్షణారహితంగా అడవులను నరికివేయడం సరికాదని చెప్పారు.

పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయన్నారు. పోడుభూములపై తమకు ప్రత్యేక విధానం ఉందని చెప్పారు. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శాసనసభలో (TS Assembly) కేసీఆర్‌ మాట్లాడారు.

''గిరిజనులకు గత పాలకులు చేసిన మోసాలు అందరికీ తెలుసు. పోడు భూములపై మాకు ప్రత్యేక విధానం ఉంది. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. వాటిపై ఇప్పటికే నివేదికలు సిద్ధమయ్యాయి. ఈ నెలాఖరులోపు పోడు భూముల పంపిణీని ప్రారంభిస్తాం. 11.5లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇస్తాం. ఇకనుంచి పోడు భూములను రక్షిస్తామని.. పట్టాలు ఇచ్చాక గజం భూమినీ ఆక్రమించబోమని ప్రభుత్వానికి హామీ ఇవ్వాలి. ఎవరైనా దాన్ని అతిక్రమిస్తే పోడు పట్టాలు రద్దు చేస్తాం.

ఆ భూములు పంపిణీ చేశాక రైతుబంధు, విద్యుత్‌, తాగునీటి సౌకర్యం కల్పి్స్తాం. భూమిలేని గిరిజన బిడ్డలకు గిరిజన బంధు ఇచ్చి సాయం చేస్తాం. పోడు భూముల పంపిణీ పూర్తయ్యాక అటవీ ప్రాంతాలను ఆక్రమిస్తే ఊరుకోం. గుత్తికోయలను తీసుకొచ్చి అడవులను నరికివేయిస్తున్నారు. గిరిజనులపై పోలీసులు, అటవీ అధికారులు దాడి చేయొద్దు.. అదే సమయంలో అధికారులపైనా గిరిజనుల దాడులను సహించబోం. ఇకపై అటవీ ప్రాంతాల్లో ఒక్క చెట్టూ కొట్టనివ్వం'' అని కేసీఆర్‌ అన్నారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో పేదింటి ఆడపడుచు వివాహానికి హాజరై నవ వధూవరులను ఆశీర్వదించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ గారు.

ఈరోజు ఉరుమడ్ల గ్రామంలో ఉయ్యాల యాదయ్య గౌడ్ గారి కుమార్తె వివాహానికి మాజీ జెడ్పిటిసి శేపూరి రవీందర్ గారు బిజెపి జిల్లా నాయకులు పల్లపు బుద్ధుడు గారితో కలిసి కళ్యాణ మహోత్సవానికి హాజరై 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.

ఈ నకిరేకల్ నియోజకవర్గంలో ప్రతి పేద కుటుంబాల ఆడపడుచులకు ఎల్లప్పుడూ నా సహాయ సహకారాలు ఉంటాయని, చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో శివనేనిగూడెం ఒకటవ వార్డు కౌన్సిలర్ గా ప్రతి వివాహానికి ఉచితంగా నా యొక్క రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్ ఇవ్వడం జరుగుతుందన్నారు.

అదేవిధంగా ఈ నియోజకవర్గంలో పేద కుటుంబానికి చెందినటువంటి నా ఆడపడుచులకు నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు మాస శ్రీనివాస్, బూత్ కమిటీ అధ్యక్షులు ఉయ్యాల లింగస్వామి, బొమ్మకంటి రాము, ఈదుల పవన్, పాలకూరి వెంకన్న, సందీప్, సైదులు, రాంబాబు, సత్యనారాయణ, లింగస్వామి, జగన్ తదితరులు పాల్గొన్నారు.

SSLV-D2 Launch Successfully: ఇస్రో సరికొత్త అధ్యాయం.. ఎస్ఎస్ఎల్‌వీ -డీ2 ప్రయోగం విజయవంతం..

SSLV-D2 Launch Successfully: సరికొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టింది ఇస్రో.. ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి ఉపగ్రహాల పంపినా ఘనత సొంతం చేసుకుంది..

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఇవాళ నింగిలోకి దూసుకెళ్లింది ఎస్ఎస్ఎల్‌వీ-డీ2 రాకెట్‌.. ఈ ప్రయోగం ద్వారా ఇస్రో రూపొందించిన 156.3 కిలోల బరువు గల భూ పరిశీలన ఉపగ్రహం EOS-07,

దేశీయ బాలికల ద్వారా స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా సంస్థ రూపొందించిన 8.7కిలోల బరువు గల ఆజాదీశాట్‌-02 ఉపగ్రహం, అమెరికాలోని అంటారిస్‌ సంస్థకు చెందిన 11.5 కిలోల బరువు గల జానూస్‌-01 ఉపగ్రహాన్ని రోదసీ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది ఇస్రో.. ఇప్పటికే ఎన్నో ప్రయోగాలతో అంతరిక్షంతో సత్తా చాటిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇవాళ చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2 ప్రయోగాన్ని కూడా విజయవంతం చేసింది..

PDSU ఆధ్వర్యంలో ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో కాలేజీలకు బందుకు పిలుపు

PDSU రాయదుర్గం డివిజన్ కార్యదర్శి : మల్లెల ను అరెస్ట్ చేసిన కణేకల్ పోలీసులు,

అనంతపురం నారాయణ కాలేజీలో ఫీజులు వేధింపులకు తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్యయత్నానికి పాల్పడంతో

ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ నీ అరికట్టాలని నారాయణ విద్యాసంస్థలను సీజ్ చేయాలని బందుకు పిలుపు ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒకలాగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలాగా మాట్లాడడం సరికాదు

విద్యార్థుల పక్షాన నిలబడాల్సిన సమయంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల కళాశాలలకి వత్తాసాలు పలుకుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు చేత ఉద్యమాలని అణిచివేసే దిశగా చూడ్డం దుర్మార్గం ఆ హత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థినికి ప్రభుత్వం అండగా ఉండాల్సింది పోయి యాజమాన్యాలను కాపాడడానికి ప్రయత్నించడం ప్రభుత్వ తీరుకు నిదర్శనంగా కనబడుతుంది ముందస్తు నోటీసులు ఇచ్చిన ఎన్ని అరెస్టులు చేసినా విద్యార్థి సంఘాలు చేపట్టినటువంటి బందును విజయవంతం అవుతుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు తెలియజేస్తున్నాం.

Viveka Case: నిందితులను తెల్లవారుజామున 4 గంటలకు తరలించిన పోలీసులు..

కడప : వివేకా హత్య కేసు నిందితులను తెల్లవారుజామున 4 గంటలకు పోలీసులు తరలించారు. కడప జైలులో ఉన్న నిందితులను భారీ బందోబస్తు నడుమ హైదరాబాద్‌కు తరలించారు..

కడప జైల్లో ఉన్న ఏ2 సునీల్ కుమార్ యాదవ్, ఏ3 ఉమా శంకర్ రెడ్డి, ఏ5 దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డిలను నేటి ఉదయం సీబీఐ కోర్టులో 10:30 గంటలకు హాజరు పరచనున్నారు.

ఈ క్రమంలోనే వారిని కడప జైలు నుంచి హైదరాబాద్‌కు పోలీసులు తరలించారు. ఈ కేసులో నిందితులైన ఏ1ఎర్ర గంగిరెడ్డి, ఏ4 అప్రూవర్ దస్తగిరిలు బెయిల్‌పై ఉన్నారు. ఇప్పటికే వీరిద్దరూ హైదరాబాద్‌కు చేరుకున్నారు..