E-racing: ఫార్ములా-ఈ రేసింగ్ ప్రాక్టీస్‌లో ప్రమాదం..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్న ఫార్ములా-ఈ రేసింగ్ (E-racing) ప్రాక్టీస్‌లో ప్రమాదం చోటు చేసుకుంది.మూలమలుపు దగ్గర కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనతో ప్రాక్టీస్ రేసుకు నిర్వాహకులు బ్రేక్ ఇచ్చారు..
ఈ నెల 11, 12 తేదీల్లో ఫార్ములా ఈ రేసింగ్ జరుగుతుండడంతో మంగళవారం నుంచి సాగర తీరం చుట్టూ (ట్యాంక్‌బండ్ మినహా) వాహనాలను మళ్లించి ట్రాక్‌ను సిద్ధం చేస్తున్నారు.
అంతర్జాతీయస్థాయి ఈవెంట్ కావడంతో ఆ స్థాయిలోనే మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. దేశ, విదేశాల నుంచి కార్ రేస్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులతోపాటు పోటీల్లో పాల్గొనేందుకు పలు సంస్థలు, రేసర్లు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
Feb 10 2023, 19:02