హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి -సమాన పనికి సమాన కూలి కల్పించాలి
సిఐటియు ఉమ్మడి కొండపాక మండల కార్యదర్శి అమ్ముల బాల్ నర్సయ్య
Street Buzz news సిద్దిపేట జిల్లా:
(కుకునూర్ పల్లి) :- మండలకేంద్రమైన కుకునూర్ పల్లి లో ఏర్పాటు చేసినహమాలీ కార్మికుల సమావేశంలో సిఐటియు కొండపాక ఉమ్మడి మండల కార్యదర్శి అమ్ముల బాల్ నర్సయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్న గ్రామీణ హమాలీ కార్మికులకు ఒకే కూలీ రేటు నియమించి, వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుండి కార్మికులకు ఎలాంటి సంక్షేమ బోర్డు లేకపోవడంతో వారికి రావలసిన సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. కార్మికులకు ప్రమాద బీమా 10 లక్షలు అమలు చేయాలని, అదే మాదిరిగా సాధారణ మరణం పొందితే రెండు లక్షలు ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు. బరువులు మోసి మోసి 40 సంవత్సరాలకే వృద్ధాప్యంలోకి నిట్టబడుతున్నారని అన్నారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంత హమాలీలను గుర్తించి వారికి ఈ,ఎస్,ఐ,పి,ఎఫ్ గుర్తింపు కార్డులు 50 సంవత్సరాల నిండిన ప్రతి కార్మికునికి రూ. 5000లు పెన్షన్ ఇచ్చి వారు పనిచేస్తున్న ప్రాంతాలలో సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.కుకునూర్ పల్లి మండల హమాలి వర్కర్ సమావేశం లో సిఐటియు మండల నాయకులు హమాలి కార్మికులు మీసా ఐలయ్య,ముచ్చర్ల బిక్షపతి, ముచ్చర్ల రమేష్, కర్ణాకర్, అశోక్, మల్లయ్య, నర్సింలు, కనకయ్య,ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
Feb 10 2023, 10:19