భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ నిధులు వెంటనే విడుధల చేయాలంటూ ఏఐటియూసి ధర్నా
- ఏఐటీయూసీ బీఓసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె అశోక్
సిద్దిపేట కార్మిక శాఖ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ధర్నా
Street Buzz news సిద్దిపేట జిల్లా:
(సిద్దిపేట):- భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ అనుబంధం భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె అశోక్ డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులు డిమాండ్ల సాధనకై రాష్ట్రవ్యాప్త పిలుపుమేరకు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బెక్కంటి సంపత్ ఆధ్వర్యంలో బుధవారం సిద్దిపేట సహాయ కార్మిక శాఖ కార్యాలయం ముందు గంట పాటు ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదవశాత్తు మరణం, సహజ మరణం, మెటర్నిటి, మ్యారేజి బెనిపెట్లు, ఇతర పెండింగ్ క్లెయిమ్స్ 2018 నుండి 2023 జనవరి 31 వరకు పెండింగ్ లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల అడ్డాల వద్ద అన్ని వసతులతో షెడ్లు కట్టించాలని, 55 సంవత్సరాలు నిండిన కార్మికులకు రూ.5వేల పించను ఇవ్వడంతో పాటు, సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని, రాష్ట్రంలో పెండింగులో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించి క్లెయిమ్స్ నిదులు విడుదల చేయాలని, చిన్న చిన్న పొరపాట్లు సరిచేసే అధికారం నోడల్ ఆఫీసర్ కు ఇవ్వాలన్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికులకు రూ. 10 లక్షలు, సహజ మరణానికిరూ.5 లక్షలు, పెండ్లి కానుకకు రూ.1 లక్ష, మెటర్నిటీ రూ.50 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. పిల్లల చదువులకు స్కాలర్ షీప్ లు అందించాలన్నారు. నిర్మాణ రంగంలో వాడే మెటీరియల్స్ ధరలను నియంత్రించాలని,కేంద్ర కార్మిక సంఘాల ప్రతినిధులను సలహా బోర్డులో నియమించాలని, ఈ శ్రమ్ పోర్టల్లో కూడ భవన నిర్మాణ కార్మికులను నమోదు చేయించాలన్నారు. సకాలంలో రెన్యువల్ చేసుకోని వారికి ఆరు నెలల పాటు అనుమతించాలని,నూతనంగా బోర్డులో పేర్లు నమోదు చేసుకునే భవన నిర్మాణ కార్మికులకు రేషన్ కార్డులు జత చేయాలన్న నిబంధనను, కార్మికులు క్లెయిమ్స్ చేసుకున్న సందర్భంలో రేషన్ కార్డు నిబంధనను తొలగించాలన్నారు. జిల్లాలోని నోడల్ ఆఫీసర్, ఏ.ఎల్.ఓ ల పనివిధానం వల్ల కార్మికులు పూర్తిగా నష్టపోతున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు పరిష్కరించాలని
లేని పక్షంలో కార్మికులను ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బెక్కంటి సంపత్, జిల్లా నాయకులు ఈరి భూమయ్య, గజ్జల సురేందర్, తిగుళ్ల కనకయ్య, ఒరుసు అనిల్, మోడీ చంద్రయ్య, లక్ష్మీ, అనంత, రాజయ్య, లింగం, రాములు తదితరులు పాల్గొన్నారు.
Feb 09 2023, 14:52