పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక భేటీ - ఆ ఎమ్మెల్యేలకు డేంజర్ బెల్స్..!?

ముఖ్యమంత్రి ఎన్నికల కసరత్తు వేగవంతం చేసారు. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి..పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలను గడప గడపకు ప్రభుత్వం పేరుతో ప్రజల వద్దకు పంపిన సీఎం..త్వరలో తాను ప్రజల మధ్యకు వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు..

అందులో భాగంగా పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేసారు.

ఇప్పటికే ఎమ్మెల్యేల పని తీరు పైన సీఎం జగన్ క్షేత్ర స్థాయి సర్వే నివేదికలు తెప్పించుకున్నారు. కొంత మంది ఎమ్మెల్యేల పని తీరు పైన ఆగ్రహంగా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో కఠిన నిర్ణయాలకు సీఎం సిద్దమయ్యారు. ఇదే సమయంలో ప్రజల్లో ఎమ్మెల్యేల గ్రాఫ్ పైన ఫోకస్ పెట్టారు. ఈ సమావేశంలో ఆ అంశమే కీలకం కానుంది.

మంత్రులు - ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక భేటీ

ఈ నెల 13న మంత్రులు..ఎమ్మెల్యేలు..పార్టీ సమన్వయకర్తలతో ముఖ్యమంత్రి జగన్ సమావేశం ఏర్పాటు చేసారు. ఇప్పటికే పార్టీ రీజలన్ కో ఆర్డినేటర్లతో సమావేశమైన సీఎం..ఈ సారి మంత్రులు.. ఎమ్మెల్యేల తో మీటింగ్ కు నిర్ణయం తీసుకున్నారు. గత సమావేశంలో ప్రతీ సచివాలయ పరిధిలో కన్వీనర్లు..గృహ సారథుల నియమాకం పై నిర్ణయించినా..ఇప్పటికీ నియామకాలు పూర్తి కాలేదు.

రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంలో వీరి నియామకం పైన సీఎం గట్టిగానే హెచ్చరించారు. ఇప్పుడు ఇదే అంశం పైన మరోసారి ఎమ్మెల్యేలకు స్పష్టత ఇవ్వనున్నారు. అదే సమయంలో గత సమావేశంలో దాదాపు 28 మంది ఎమ్మెల్యేల పని తీరుకు సంబంధించి ముఖ్యమంత్రి సర్వే వివరాలను వెల్లడించారు..ప్రజల్లో గ్రాఫ్ పెరగకపోతే సీట్లు ఇవ్వటం కష్టమని తేల్చి చెప్పారు. పని తీరు మెరుగు పర్చుకోవటానికి వారికి మరో అవకాశం ఇచ్చారు. దీంతో. ఈ సమావేశంలో సీఎం ఏం చెప్పబోతున్నారనేది ఉత్కంఠ పెంచుతోంది..

ఎమ్మెల్యే ప్రోగ్రస్ రిపోర్టులు సిద్దం

వైసీపీ ఎమ్మెల్యేలు...నియోజకవర్గ ఇంఛార్జ్ లకు సంబంధించిన ప్రోగ్రస్ రిపోర్టులు ఐ పాక్ తో పాటుగా మరో రెండు సర్వే సంస్థలు ముఖ్యమంత్రికి నివేదికలు ఇచ్చినట్లు సమాచారం. అందులో ప్రధానంగా ఎమ్మెల్యేలు ప్రజలతో ..పార్టీ కేడర్ తో మమేకం అవుతున్న విధానం.. వారికి ప్రజల్లో ఉన్న ఆదరణ ఆధారంగా మార్కులు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ఈ ప్రత్యక సమావేశంలో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల పని తీరు పైన ఫైనల్ వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఎన్నికలకు ఆరు నెలల ముందే టికెట్లు ఖరారు చేస్తామని ఇప్పటికే సీఎం స్పష్టం చేసారు. ప్రతిపక్ష టీడీపీ సిట్టింగ్ లకు సీట్లు ఖరారు చేయటం తో పాటుగా కొత్తగా ఇంఛార్జ్ లను నియమిస్తోంది.

దీంతో..ప్రత్యర్ది పార్టీల వ్యూహాలను గమనిస్తూ..గెలుపే ప్రామాణికంగా నియోజకవర్గాల్లో అభ్యర్దుల ఎంపిక..గెలుపు దిశగా నిర్ణయాలు ఉంటాయని ముఖ్యమంత్రి ఖరా ఖండిగా చెబుతున్నారు. గెలిచే వారికే టికెట్లు అనే సిద్దాంతం మాత్రమే అభ్యర్ధు ఎంపికకు కీలక సూత్రంగా చెబుతున్నారు. ఈ వ్యవహారం పై సీఎం స్పష్టత ఇవ్వనున్నారు..

సీఎంతో సహా నేతలంతా ప్రజల్లోనే..

ఇక..పార్టీ - ప్రభుత్వ వ్యవహారాలను సమన్వయం చేసుకుంటూ నేతలంతా ప్రజల్లోనే ఉండేలా సీఎం జగన్ కార్యాచరణ సిద్దం చేసినట్లు సమాచారం, అందులో భాగంగా ముఖ్యమంత్రి సైతం ఇక రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ పల్లెనిద్రకు నిర్ణయించారని సమాచారం.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తరువాత ఇక సీఎం తో పాటుగా ఎమ్మెల్యేలంతా ప్రజల్లోనే ఉండేలా కొత్త కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేలకు సీట్లు..ఇవ్వలేని వారికి ప్రత్యామ్నాయంగా అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చే గుర్తింపు పైన సంకేతాలు ఇస్తున్నారు. దీంతో.. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఏం ప్రకటన చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది..

ఫార్మా పరిశ్రమలో ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

తెలంగాణ: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారం పారిశ్రామికవాడలోని లీ ఫార్మా పరిశ్రమలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవాశాత్తు అగ్ని ప్రమాదం జరిగి పరిశ్రమలో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు.

ఫార్మా కంపెనీల్లో పెద్ద ఎత్తు కెమికల్స్‌ నిలువ ఉండడంతో మంటల దాటికి కెమికల్స్‌ డ్రమ్స్‌ పేలిపోతున్నాయి.

కార్మికులు మంటలు అర్పడానికి ప్రయత్నం చేసినా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో పరిశ్రమ అధికారులు వెంటనే సమాచారం అందించడంతో నాలుగు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేస్తున్నారు.

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశంలో మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

కేబినెట్‌ నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు.

►కర్నూలు జిల్లా డోన్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బోధనా సిబ్బంది నియామకానికి కేబినెట్‌ ఆమోదం

►ఈ నెల రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సీడీ చెల్లింపునకు కేబినెట్‌ ఆమోదం

►ఈ నెల 28న జగనన్న విద్యాదీవెన చెల్లింపునకు కేబినెట్‌ ఆమోదం

►1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థుల పోస్టుల భర్తీకి ఆమోదం

►డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం

►విశాఖలో టెక్‌ పార్క్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం

►నెల్లూరు బ్యారేజ్‌ను నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి బ్యారేజ్‌గా మారుస్తూ నిర్ణయం

►రామాయపట్నం పోర్టులో 2 క్యాపిటివ్‌ బెర్త్‌ల నిర్మాణానికి ఆమోదం

►లీగల సెల్‌ అథారిటీలో ఖాళీ పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం

►పంప్‌ స్టోరేజ్‌ హైడ్రో ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులకు ఆమోదం

Amaravati: విభజన చట్టం ప్రకారం రాజధానిగా అమరావతిని నోటిఫై చేశారు: కేంద్రం

దిల్లీ: విభజన చట్టం ప్రకారమే ఆంధ్రప్రదేశ్‌ (Andhra pradesh) రాజధానిగా అమరావతి (Amaravathi)ని 2015లో ఏపీ ప్రభుత్వం నోటిఫై చేసిందని కేంద్రం తెలిపింది..

బుధవారం వైకాపా పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. విభజన చట్టంలోని సెక్షన్‌ 5, 6 ప్రకారం రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు సంబంధించిన విషయంపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని..

ఈ కమిటీ ఇచ్చిన సూచనలు, సలహాలు, నివేదికలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించగా.. దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రాజధానిగా అమరావతినే ఎంపిక చేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసిందన్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ క్యాపిటల్‌ రీజినల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని (ఏపీసీఆర్‌డీఏ) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చినట్లుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పార్లమెంట్‌కు వివరించింది.

Breaking: హైస్కూల్లో ఫుడ్ పాయిజన్.. 45 మంది విద్యార్థులకు అస్వస్థత..

హైస్కూల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో 45మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని పార్వతీపురం మన్యం పరిధిలోని కోన హైస్కూల్ లో ఫుడ్ పాయిజన్ అయ్యింది..

ఆ హైస్కూల్ లోని 45మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు.

మా భూములు ఆక్రమించుకొని దాడులు చేస్తున్నారు

కూడేరు తహశీల్దార్ కార్యాలయం ధర్నా లో SC,ST JAC సాకే హరి

ఎస్సీ,ఎస్టీల భూములు అన్యాయంగా ఆక్రమించుకొని వారిపైనే దాడులు చేయడమేమిటని ఎస్సీ,ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి మండిపడ్డారు.బుధవారం కూడేరు తహశీల్దార్ కార్యాలయం ముందు ఎస్సీ,ఎస్టీ భూ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేపట్టారు.అనంతరం సాకే హరి మాట్లాడుతూ..దళిత,గిరిజనులకు చెందిన భూములను దౌర్జ్యన్య పరుల నుండి కాపాడాలని కోరారు. పాలకులు మాత్రం పేదలకు భూ పంపిణీ చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్న ఎస్సీ,ఎస్టీలకు మాత్రం తీవ్రమైన అన్యాయం జరిగిందని వాపోయారు.ఎన్నో ఏళ్లుగా భూ సమస్యలు పరిష్కారం లేక ఇబ్బందులు పడుతున్నారు.విడతల వారి భూ పంపిణీలో ఎంత మంది ఎస్సీ,ఎస్టీలకు న్యాయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.ఎం ఎం హళ్లిలో 6వ విడుత భూ పంపిణీలో 4దళితులకు భూమిస్తే నేటికి భూమి చూపకపోగా,ఏకంగా అన్ లైన్ తొలగించారని వాపోయారు.

భూ పంపిణీ చేసిన వారే అన్యాయం చేస్తే మాకు దిక్కేవరన్నారు.పేరుక పోయిన భూ సమస్యలకు మార్గం చూపలేరుకాని కొత్తగా భూములు పంచుతామనడం విడ్డూరమన్నారు.తాతాల కాలనుండి సాగులో ఉన్న భూములకు అన్యాయంగా అన్ లైన్ నమోదు చేయించుకోవడం,రికార్డులో తాముంటే దౌర్జ్యాన్యపరులు సాగులోకి వస్తున్నారని వీటిని రెవెన్యూ,పోలీస్ అధికారులు చూచి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు.

అమాయక ఎస్సీ,ఎస్టీల భూములను అక్రమంగా సంబంధం లేని వ్యక్తులు, అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని తెలిపారు.ఎస్సీ,ఎస్టీలకు చెందిన భూములు సాధించు కోవడానికి ఎంతటి పోరాటాలకైనా సిద్ధమన్నారు.ఎస్సీ,ఎస్టీల స్మశాన వాటికలను సైతం కబ్జాలు చేస్తున్నారని ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు లక్ష్మన్న. జే,ఏ,సీ నాయకులు మన్నల శివయ్య.రేకల కుంట రామాంజనేయులు.రామకృష్ణ.మంజునాథ్.ప్రతాప్.చెన్న కేశవ.గణేష్ నాయక్.భూ బాధిత శ్రీరాములు.ముత్యాలప్ప.రమేష్.నారాయణ స్వామి.గంగన్నతదితరులు పాల్గొన్నారు.

పెయిల్ అయినా రాయదుర్గం ప్రభుత్వ కే.టీ.స్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఇవ్వండి

PDSU అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు : మల్లెల ప్రసాద్,

రాయదుర్గం ప్రభుత్వ కేటీఎస్ డిగ్రీ కాలేజీలో గతంలో ఉన్నటువంటి 9 సంవత్సరాల ఫెయిల్ అయిన విద్యార్థుల సమయాన్ని ఇప్పుడు కేవలం 3 సంవత్సరాల్లకే పరిమితం VC గారు దానిని గతంలో తొమ్మిది సంవత్సరాల సమయాన్ని ఎలా ఉంటే అలా కొనసాగించాలని నిరసన తెలియజేయడం జరిగింది.

గతంలో డిగ్రీ అయిపోయి ఫెయిల్ అయిన విద్యార్థిని విద్యార్థులకు ఎగ్జామ్ రాయడానికి 9 సంవత్సరాలు ఉన్నటువంటి సమయాన్ని ఈ సంవత్సరం జనవరిలో 24వ తారీఖు రోజున ఐదు సంవత్సరాలకు కుదిచడం జరిగింది. దాన్ని తర్వాత జనవరి 31 వ తారీఖున మూడు సంవత్సరాలకు

కుదిచడం జరిగింది.

ఈ కుదిoచడం అనేది విద్యార్థిని విద్యార్థులకు గాని సామాజిక మద్యమాల్లో గాని వార్తాపత్రికల్లో గాని ఎక్కడ విద్యార్థిని విద్యార్థులకు తెలియజేయకుండా అకస్మాత్తుగా ఒకేసారి పది రోజుల్లో 9 సంవత్సరాలు ఉన్నటువంటి ఫెయిల్ అయిన విద్యార్థిని విద్యార్థుల సమయాన్ని మూడు సంవత్సరాలకు కుదించడం చాలా దుర్మార్గం విద్యార్థిని విద్యార్థుల జీవితాలను ఎస్కేయూ VC నాశనం చేస్తున్నాడు, 2014 15 16 17 సంవత్సరాలకు చెందిన గవర్నమెంట్ ప్రైవేట్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు దాదాపు 14 నియోజకవర్గాల్లో కూడా కొన్ని వేలమంది ఉండడం జరుగుతుంది వారందరివి కూడా కేవలం 1సబ్జెక్టు లేదా 2సబ్జెక్టు లు మాత్రమే ఉన్నాయి.వారు అందరి జీవితాలను కూడా లెక్క చేయకుండా ఎవరి ప్రతిపాదనలు కూడా తీసుకోకుండా కనీసం విద్యార్థిని విద్యార్థులకు ఎలాంటి సమాచారం తెలియజేయకుండా కేవలం విద్యార్థి జీవితాలను నాశనం చేయాలనీ SKU VC ఆలోచనతో ప్రవేశపెట్టినటువంటి ఈ 3 సంవత్సరాల కుదింపును 9 సంవత్సరాలుగా యధాతధంగా కొనసాగించాలని PDSU ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘo నుండి డిమాండ్ చేస్తున్నాం.

వేల మంది విద్యార్థుని విద్యార్థులను వారి తల్లిదండ్రులని కలుపుకొని పాదయాత్ర చేపట్టడం గాని చలో ఎస్కేయూ ముట్టడికి పిలుపునిస్తాం వెంటనే మీరు ఏదైతే ఈ మూడు సంవత్సరాలకు కుదించడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా VC గారికి ఎగ్జామ్ కంట్రోల్ గారికి తెలియజేస్తున్నాం, ఫెయిల్ అయిన విద్యార్థుల కు అవకాశం ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.

Rahul Gandhi: జీవీకేను బెదిరించి అదానీకి అనుభవం లేకున్నా ముంబై విమానాశ్రయం కట్టబెట్టారు

ఆంధ్రాలో కూడా రేవులను అప్పగించారు.

మోదీ... అదానీతో మీ సంబంధాలేంటి?

రక్షణ నుంచి అన్ని కాంట్రాక్టులూ అదానీకే

ఆయన కోసమే మోదీ విదేశీ యాత్రలు

609 నుంచి 2వ స్థానానికి ఎలా ఎదిగారు?

8 ఏళ్లలో ఆయన సంపద 8 బిలియన్‌ డాలర్ల నుంచి 140 బిలియన్‌ డాలర్లు ఎలా అయింది?

యాత్రలో ప్రతిచోటా ప్రజలు ఇవే ప్రశ్నలు అడిగారు

లోక్‌సభలో నిప్పులు చెరిగిన రాహుల్‌ గాంధీ

అదానీ విమానంలో మోదీ ఉన్న ఫొటో ప్రదర్శన.

అదానీ వ్యాపార సామ్రాజ్యానికి ప్రధాని మోదీ అండదండలు న్నాయి. విమానాశ్రయాల నిర్వహణలో ఎటువంటి అనుభవం లేకపోయినా.. ఆయన కంపెనీ కోసం నిబంధనలు మార్చారు. 6 విమానాశ్రయాలు కట్టబెట్టారు. జీవీకే గ్రూపు నిర్వహిస్తున్న ముంబై విమానాశ్రయాన్నీ బలవంతంగా వారి నుంచి లాక్కొని అదానీకి అప్పగించారు. అదానీతో మోదీకి ఉన్న సంబంధం ఏమిటి?

అదానీ వ్యాపార సామ్రాజ్యానికి ప్రధాని మోదీ అండదండలున్నాయి. విమానాశ్రయాల నిర్వహణలో ఎటువంటి అనుభవం లేకపోయినా.. ఆయన కంపెనీ కోసం నిబంధనలు మార్చారు. 6 విమానాశ్రయాలు కట్టబెట్టారు. జీవీకే గ్రూపు నిర్వహిస్తున్న ముంబై విమానాశ్రయాన్నీ బలవంతంగా వారి నుంచి లాక్కొని అదానీకి అప్పగించారు. అదానీతో మోదీకి ఉన్న సంబంధం ఏమిటి?

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మంగళవారం లోక్‌సభలో ప్రధాని మోదీ, వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీపై విరుచుకుపడ్డారు. అదానీ వ్యాపార సామ్రాజ్యానికి మోదీ అండదండలు ఉన్నాయని ఆరోపించారు. విమానాశ్రయాల నిర్వహణలో ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికీ అదానీకి అనుకూలంగా నిబంధనలు మార్చి, ఆయనకు ఆరు విమానాశ్రయాలు కట్టబెట్టారని తెలిపారు. ముంబై విమానాశ్రయాన్ని జీవీకే గ్రూపు నిర్వహిస్తుండగా, సీబీఐ, ఈడీలతో ఈ గ్రూపుపై దాడి చేయించి, ఆ విమానాశ్రయాన్ని అదానీకి అప్పగించేలా చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా రేవులను ఇదే విధంగా అదానీకి కట్టబెట్టారన్నారు. తన భారత్‌ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు ఒకే ఒక వ్యాపారవేత్త పేరు వినిపించిందని, అది అదానీ అని చెప్పారు.

ఏ వ్యాపారంలోకి ప్రవేశించినా అదానీకి విజయమే తప్ప వైఫల్యం లేకపోవడానికి కారణం ఏంటని ప్రజలు తనను అడిగారని తెలిపారు. అదానీ విమానంలో ఆయనతో కలిసి మోదీ ప్రయాణిస్తున్నట్లున్న ఫొటోను రాహుల్‌ ప్రదర్శించారు. నిన్నటి వరకు అదానీ వ్యవహారంపై పార్లమెంటును స్తంభింపచేసిన కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు మంగళవారం తమ వ్యూహాన్ని మార్చుకుని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో పాల్గొన్నాయి. లోక్‌సభలో కాంగ్రెస్‌ తరఫున చర్చను రాహుల్‌ గాంధీ ప్రారంభించారు. భారత్‌ జోడో యాత్ర పూర్తయిన తర్వాత తొలిసారి పార్లమెంటులో ప్రసంగించిన రాహుల్‌... అదానీతో మోదీకి ఉన్న సన్నిహిత సంబంధం ఏమిటని నిలదీశారు. ఒకప్పుడు ప్రపంచంలో 609వ స్థానంలో ఉన్న అదానీ ఇప్పుడు రెండో స్థానానికి ఎదిగారని, 2014 నుంచి 2022 మధ్య ఆయన సంపద 8 బిలియన్‌ డాలర్ల నుంచి 140 బిలియన్‌ డాలర్లకు పెరిగిందని, ఇదెలా సాధ్యమైందని జోడోయాత్రలో తనను ప్రజలు అడిగారని చెప్పారు. మోదీతో సాన్నిహిత్యం వల్లే అనేక రంగాల్లో అదానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించిందన్నారు. మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు, అదానీకి మధ్య సంబంధాలు ప్రారంభమయ్యాయని, వారిద్దరూ భుజం భుజం కలిపి నడిచారన్నారు. మోదీ 2014లో ఢిల్లీ చేరుకున్న తర్వాత అసలైన అద్భుతాలు జరిగాయని అన్నారు. విమానాశ్రయాలు, రేవులు, డాటా సెంటర్లు, హరిత విద్యుత్‌ వంటి రకరకాల వ్యాపారాల్లోకి అదానీ ప్రవేశించగలిగారని చెప్పారు. అదానీకి విమానాశ్రయాల నిర్వహణలో అనుభవం లేకపోయినా ఆయనకు అనుకూలంగా నిబంధనలు మార్చారని, ఆరు విమానాశ్రయాలు కట్టబెట్టారన్నారు.

మోదీ బంగ్లాదేశ్‌ వెళ్లిన తర్వాత అక్కడ విద్యుత్తు కాంట్రాక్టు అదానీకి దక్కిందని, శ్రీలంకలో మోదీ అప్పటి అధ్యక్షుడు రాజపక్సపై ఒత్తిడి తెచ్చి అదానీకి గ్రీన్‌ ఎనర్జీ కాంట్రాక్టు దక్కేలా చేశారని ఆ దేశ విద్యుత్‌ బోర్డు అధికారే చెప్పారని తెలిపారు. మారిష్‌సలో అదానీకి షెల్‌ కంపెనీలు ఉన్నాయని, అక్కడి నుంచి భారత్‌కు నిధులు భారత్‌కు ప్రవహించాయన్నారు. ఇలాంటి వ్యక్తికి రక్షణ రంగ కాంట్రాక్టులు అప్పగించడం ప్రమాదకరం కాదా అని ప్రశ్నించారు. రాహుల్‌ నిస్సిగ్గుగా నిర్లక్ష్యంగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ లోక్‌సభలో విమర్శించారు. భారీ కుంభకోణాలతో దేశ ప్రతిష్ఠను మసకబార్చింది కాంగ్రెసేనని అన్నారు. అదానీ గ్రూపు అక్రమాల పుట్ట అంటూ హిండెన్‌బర్గ్‌ నివేదికపై దర్యాప్తునకు జేపీసీ ఏర్పాటు చేయాని రాజ్యసభలో కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.

Ap Cabinet Meeting: ఏపీ కేబినేట్ భేటీలో కీలక నిర్ణయాలు..

ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన నేడు జరిగిన ఏపీ కేబినేట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ ప్రాజెక్టులో మొదటి విడతలో 55 వేల కోట్లు, రెండో విడతలో 55 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తుంది.

ఇక న్యూ ఎనర్జీ పార్క్ తో పాటు కర్నూల్, అనంతపురం, నంద్యాల, సత్యసాయి జిల్లాలో విండ్ అండ్ సోలార్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కూడా కేబినేట్ ఆమోదం తెలిపింది. వైజాగ్ టెక్ పార్క్ కు 60 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది..

Mekapati Chandrashekar Reddy: వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు.. చెన్నైకు తరలింపు ?

ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించారు..

ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు.. పలు పరీక్షలు నిర్వహించారు.

గుండెలో రెండు వాల్వ్‌లు మూసుకుపోయినట్టు డాక్టర్లు చెబుతున్నట్టు తెలుస్తోంది. మెరుగైన చికిత్స కోసం ఆయనను చెన్నైకు తరలించే అవకాశం ఉందని సమాచారం..