దిల్లీ లిక్కర్ స్కామ్.. ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ అరెస్టు
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో ఈడీ, సీబీఐలు దూకుడు పెంచాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు తాజాగా మరో వ్యక్తిని అరెస్టు చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు పాత్ర ఉందని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటికే ఈ కేసు అనుబంధ ఛార్జిషీట్‌లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ స్కామ్‌లో భాగంగా సౌత్‌గ్రూప్ విజయ్‌నాయర్ ద్వారా… ఆప్ నేతలకు 100 కోట్లు ఇచ్చారని ఛార్జ్‌షీట్‌లో ఈడీ వెల్లడించింది. కల్వకుంట్ల కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్ చంద్ర సౌత్ గ్రూపులో భాగమని తెలిపింది.
విజయ్ నాయర్ ఆదేశాల మేరకు ఇండోస్పిరిట్‌లో 65శాతం కవిత…. మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఇచ్చినట్లు వెల్లడించింది. కవిత 3 కోట్ల 40 లక్షలు, మాగుంట 5కోట్లు ఇండో స్పిరిట్‌లో పెట్టుబడి పెట్టినట్లు తెలిపింది. కవిత తరఫున అరుణ్‌పిళ్లై, మాగుంట తరఫున ప్రేం రాహుల్ ఇండోస్పిరిట్‌లో ప్రతినిధులుగా ఉన్నట్లు ఈడీ పేర్కొంది.
Feb 08 2023, 15:20