RBI: రెపోరేటును పెంచిన ఆర్బీఐ.. మరింత పెరగనున్న వడ్డీల భారం..
RBI Policy Review: అంచనాలకు అనుగుణంగానే రిజర్వు బ్యాంకు ఇండియా రెపోరేటును పావుశాతం పెంచింది. వరుసగా ఆరోసారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి పెంచింది..
దీంతో 6.25 శాతంగా ఉన్న కీలక వడ్డీరేటు 6.50 శాతానికి చేరింది. రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.
బుధవారం ద్రవ్య విధాన ప్రకటనను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. మూడేళ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితితో కూడిన పరిస్థితులు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఫలితంగా ద్రవ్యపరపతి విధానంలో సవాళ్లు ఎదురయ్యాయన్నారు. ఇది వరుసగా ఆరోసారి వడ్డీ రేటు పెంపు. డిసెంబర్ మానిటరీ పాలసీ సమీక్షలో కీలక బెంచ్ మార్క్ వడ్డీ రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచింది. గత ఏడాది మే నుంచి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ స్వల్పకాలిక రుణ రేటును 225 బేసిస్ పాయింట్లు పెంచింది..
Feb 08 2023, 11:21