Telugusanatan

Jul 04 2022, 10:09

చరిత్రలో ఈరోజు... జులై 04...

సంఘటనలు 

1776: రెండవ కాంటినెంటల్ కాంగ్రెస్ ద్వారా 1776లో ఈ రోజు ఆమోదించబడిన స్వాతంత్ర్య ప్రకటన, గ్రేట్ బ్రిటన్ నుండి అమెరికన్ కాలనీలు విడిపోవాలని పిలుపునిచ్చింది, ఈ ప్రకటన ఇప్పుడు యూఎస్ జాతీయ సెలవుదినం ద్వారా జ్ఞాపకం చేయబడుతుంది.

1802: యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడమీ న్యూయార్క్‌లోని వెస్ట్ పాయింట్‌లో ప్రారంభించబడింది.

1826: యూఎస్ అధ్యక్షులుగా మారిన అమెరికన్ విప్లవంలో ఇద్దరు ప్రధాన వ్యక్తులు , థామస్ జెఫెర్సన్ మరియు జాన్ ఆడమ్స్ మరణించారు- స్వాతంత్ర్య ప్రకటన ఆమోదించిన 50 సంవత్సరాల తర్వాత .

1865: లూయిస్ కారోల్ యొక్క ఆలిస్ అడ్వెంచర్స్ ఇన్ వండర్‌ల్యాండ్ ప్రచురించబడింది, అయితే నాణ్యత సమస్యల కారణంగా మొదటి ప్రింట్ రన్ వెంటనే రీకాల్ చేయబడింది; కొత్త మొదటి ఎడిషన్ నవంబర్‌లో విడుదలైంది.

1884: స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని పారిస్‌లో ఫ్రెంచ్ వారు యునైటెడ్ స్టేట్స్‌కు సమర్పించారు.

1892: పశ్చిమ సమోవా, అంతర్జాతీయ డేట్ లైన్ మారే చోట ఉంది. అందుకని, 1892 సంవత్సరంలోని రోజులు 367, జూలై 4 తేది సోమవారం, రెండుసార్లు, పశ్చిమ సమోవా దేశంలో వచ్చింది.

1910: "ఫైట్ ఆఫ్ ది సెంచరీ"గా పేర్కొనబడిన దానిలో, ఆఫ్రికన్ అమెరికన్ బాక్సర్ జాక్ జాన్సన్ "గ్రేట్ వైట్ హోప్"గా పరిగణించబడే జేమ్స్ జాక్సన్ జెఫ్రీస్‌ను ఓడించాడు ; అతని విజయం ఆఫ్రికన్ అమెరికన్లు దేశవ్యాప్త వేడుకలకు దారితీసింది, అవి అప్పుడప్పుడు శ్వేతజాతీయుల నుండి హింసకు గురయ్యాయి, ఫలితంగా దేశవ్యాప్తంగా 20 మందికి పైగా మరణించారు.

1946: రిపబ్లిక్ ఆఫ్ ఫిలిప్పీన్స్ స్వతంత్ర దేశంగా ప్రకటించబడింది, మాన్యువల్ రోక్సాస్ దాని మొదటి అధ్యక్షుడిగా ఉన్నారు.

1947: భారతదేశాన్ని ఇండియా - పాకిస్థాన్ గా విభజించాలని బిల్లు ప్రతిపాదన.

1976: పాలస్తీనా ఉగ్రవాదులు ఎయిర్ ఫ్రాన్స్ జెట్ లైనర్ విమానాన్ని, ఉగాండా లోని ఎంటెబ్బె విమానాశ్రయంలో బంధించగా, ఇజ్రాయెల్ కమాండోలు మెరుపు దాడిచేసి, ఆ విమానంలో వున్న ప్రయాణీకులను (నలుగురు ప్రయాణీకులు మరణించారు), విమాన సిబ్బందిని రక్షించారు. ఈ బందీల విడుదల కార్యక్రమానికి ఆపరేషన్ థండర్ బోల్ట్ అనే రహస్యమైన పేరు పెట్టారు.

2006: ఆమ్‌స్టెల్‌వీన్‌లో నెదర్లాండ్స్‌పై జరిగిన ప్రపంచ కప్ విజయంలో శ్రీలంక 443-9తో కొత్త ODI క్రికెట్ రికార్డు స్కోరును నెలకొల్పింది (జయసూర్య 157, దిల్షాన్ 117).

2012: CERN వద్ద ఉన్న లార్జ్ హాడ్రాన్ కొలైడర్‌లోని శాస్త్రవేత్తలు హిగ్స్ బోసాన్ నుండి ఒక ఆసక్తికరమైన సంకేతాన్ని కనుగొన్నట్లు ప్రకటించారు.

జననాలు 

1790: జార్జి ఎవరెస్టు, భారత సర్వేయర్ జనరల్. (మ.1866)

1807: గిసేప్పి గరిబాల్ది, ఇటాలియన్ జనరల్, రాజకీయ నాయకుడు. (మ.1882)

1882: జనమంచి శేషాద్రి శర్మ, తెలుగు కవి, పండితుడు. (మ.1950)

1897: అల్లూరి సీతారామ రాజు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న భారతీయ తెలుగు విప్లవకారుడు.

1897: నానక్ సింగ్ ఒక భారతీయ కవి, పాటల రచయిత మరియు పంజాబీ భాష యొక్క నవలా రచయిత.

1898: గుల్జారీలాల్ నందా ఒక భారతీయ రాజకీయవేత్త మరియు ఆర్థికవేత్త, అతను కార్మిక సమస్యలపై ప్రత్యేకత కలిగి ఉన్నాడు. రెండుసార్లు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించాడు. (మ.1998)

1904: నేదునూరి గంగాధరం, తెలుగు రచయిత. (మ.1970)

1916: నసీమ్ బాను భారతీయ చలనచిత్ర నటి.

1918: చల్లా కొండయ్య, న్యాయవాది, ప్రధాన న్యాయమూర్తి.

1921: గెరాల్డ్ డిబ్రూ, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత

1921: పూర్ణం విశ్వనాథన్ ఒక భారతీయ రంగస్థల మరియు చలనచిత్ర నటుడు, వీరు ప్రధానంగా తమిళ చిత్రాలలో కనిపించారు.

1927: అంగర సూర్యారావు, నాటక రచయిత, చరిత్రకారుడు. (మ.2017)

1933: కొణిజేటి రోశయ్య, భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా ఏడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించాడు. రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నరుగా పని చేశాడు.(మ.2021)

1936: గరిమెళ్ళ రామమూర్తి, నటులు, నాటకసంస్థ నిర్వాహకులు. (మ.2004)

1938: ఉమా రామారావు, కూచిపూడి నర్తకి, నృత్య దర్శకురాలు, పరిశోధకులు, ఆచార్యులు, రచయిత్రి.

1941: ఇందారపు కిషన్ రావు అవధాని, కవి, బహుభాషా కోవిదుడు. (మ.2017)

1947: వంగవీటి మోహన రంగారావు ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడలో భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయ నాయకుడు.

1949: జోగిందర్ షెల్లీ ఒక భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత, గాయకుడు, పాటల రచయిత మరియు పంపిణీదారు.

1951: ఎస్ఎస్ అహ్లువాలియా, భారతీయ జనతా పార్టీ యొక్క భారతీయ రాజకీయ నాయకుడు.

1953: నీరజ్ కుమార్, ఢిల్లీ పోలీస్ మాజీ కమిషనర్, 31 జూలై 2013న ఇండియన్ పోలీస్ సర్వీస్ నుండి పదవీ విరమణ చేశారు.

1954: దేవేంద్ర కుమార్ జోషి, అండమాన్ మరియు నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ మరియు ఐలాండ్స్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ వైస్ ఛైర్మన్.

1959: నీనా గుప్తా, భారతీయ నటి మరియు టెలివిజన్ దర్శకురాలు.

1961: ఎం. ఎం. కీరవాణి, తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు, గాయకుడు.

1961: జోగు రామన్న, తెలంగాణ శాసనసభ్యుడు, మాజీ మంత్రి.

1969: ప్రతిభా సిన్హా, బాలీవుడ్ సినిమాల్లో పని చేస్తున్న మాజీ భారతీయ నటి మరియు మాలా సిన్హా కుమార్తె.

1975: గోబినాథ్ చంద్రన్, భారతీయ టెలివిజన్ యాంకర్, రేడియో జాకీ, పాత్రికేయుడు, రిపోర్టర్ మరియు న్యూస్ ప్రెజెంటర్.

1976: ఆర్యన్ వైద్, ఒక భారతీయ మోడల్, 2000 సంవత్సరంలో గ్రావియరా మిస్టర్ ఇండియా వరల్డ్ మోడలింగ్ పోటీని గెలుచుకున్నాడు.

1983: అమోల్ రాజన్, భారతదేశంలో జన్మించిన బ్రిటిష్ జర్నలిస్ట్, బ్రాడ్‌కాస్టర్ మరియు BBC మీడియా ఎడిటర్.

1984: తోషి సబ్రీ, భారతీయ గాయని మరియు సంగీత స్వరకర్త.

1988: అలోక్ దీక్షిత్, జర్నలిస్టు సామాజిక కార్యకర్తగా మారారు, భారతదేశంలో ఇంటర్నెట్ స్వేచ్ఛ కోసం పోరాడారు.

మరణాలు

1826: జాన్ ఆడమ్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు.

1826: థామస్ జెఫర్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (జ.1743)

1831: జేమ్స్ మన్రో, అమెరికా మాజీ అధ్యక్షుడు.

1902: స్వామి వివేకానంద ఒక భారతీయ హిందూ సన్యాసి, 19వ శతాబ్దపు భారతీయ ఆధ్యాత్మికవేత్త రామకృష్ణ ప్రధాన శిష్యుడు.(జ.1863)

1910: జియోవాన్ని షాపరెల్లీ, ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త, విజ్ఞాన చరిత్రకారుడు.

1934: మేరీ క్యూరీ, భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త. రెండు నోబెల్ బహుమతులు (భౌతిక, రసాయన శాస్త్రాలలో) గ్రహీత. (జ.1867)

1936: తాడూరి లక్ష్మీనరసింహ రాయకవి, తెలుగు కవి, 19 గ్రంథాలు రచించారు. (జ.1856)

1946: దొడ్డి కొమరయ్య, తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరుడు. (జ.1927)

1955: పాల్వంకర్ బాలూ క్రికెటర్ మరియు రాజకీయ నాయకుడు అయిన మొదటి దళితుడు.

1963: పింగళి వెంకయ్య భారత స్వాతంత్ర్య సమరయోధుడు మరియు భారత జాతీయ పతాకంపై ఆధారపడిన జెండా రూపకర్త.

1969: కవికొండల వెంకటరావు, తెలుగు కవి, జానపద, నాటక రచయిత. (జ.1892)

1986: దత్తాత్రేయ రామచంద్ర కప్రేకర్, భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు.

2013: గంటి ప్రసాదం, నక్సలైటు నాయకుడుగా మారిన కవి.

పండుగలు, జాతీయ దినాలు

యూఎస్ఏ స్వాతంత్ర్య దినోత్సవం: ప్రతి సంవత్సరం జూలై 4న జరుపుకుంటారు.


Telugusanatan

Jul 04 2022, 09:54

రాశిఫలాలు జూలై 4,2022

మేషం: 

ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన..దూర ప్రయాణాలు బాదిస్తాయి.

వృషభం: 

కొత్త పనులకు శ్రీకారం. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. ఇంటాబయటా ప్రోత్సాహం. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు..విందువినోదాలు.. దైవదర్శనాలు..

మిథునం: 

పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలు మాములుగానే సాగుతాయి..

కర్కాటకం: 

దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆలయాలు సందర్శిస్తారు. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి..కొట్ర వ్యక్తుల తో పరిచయం..

సింహం:

 ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. అనుకోని ప్రయాణాలు.మిత్రులతో వివాదాలు.

కన్య:

 కొత్త పనులు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవం. కీలక నిర్ణయాలు. శుభకార్యాలకు హాజరవుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆస్తిలాభం..ఈరోజు విందు వినొదాల లో పాల్గొంటారు..

వృశ్చికం: 

పనులు ముందుకు సాగవు. ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. సోదరులతో ఉత్తరప్రత్యుత్తరాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

ధనుస్సు: 

ధనవ్యయం. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. శ్రమతప్పదు. విద్యార్థులకు ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.కుటుంబసభ్యులతో వివాదాలు..చికాకులు..కాస్త ఒపికగా ఉండాలి.

మకరం: 

శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. భూములు, వాహనాలు కొంటారు. విద్యార్థులకు అనుకూలం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.ఆస్తి వివాదాల పరిష్కారం.సమాజంలో గౌరవం పెరుగుతుంది.. అనుకున్న పనులు పూర్తీ అవుతాయి.

కుంభం: 

దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. పనుల్లో పురోగతి. సంఘంలో విశేష గౌరవం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత..కొత్త రుణాలు ఫలిస్తాయి.

మీనం: 

ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు..కొత్త పనులు వాయిదా..నిరాశ ఎక్కువ..


Telugusanatan

Jul 04 2022, 09:44

ఈ రోజు పంచాంగం జూలై 4, 2022

శ్రీ విఘ్నేశ్వరాయః నమః

శ్రీ మాత్రే నమః

శ్రీ గురుభ్యోనమః

ఈ రోజు పంచాంగం 

జూలై 4, 2022

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు

 ఆషాఢ మాసం -  శుక్ల పక్షం

తిథి: పంచమి మ2.34 వరకు

 

వారం: సోమవారం (ఇందువాసరే)

నక్షత్రం: మఖ ఉ6.07 వరకు తదుపరి పుబ్బ 

యోగం: సిద్ధి ఉ10.31 వరకు

కరణం: బాలువ మ2.34 వరకు తదుపరి కౌలువ రా2.46 వరకు

వర్జ్యం: మ2.31 - 4.11

దుర్ముహూర్తం: మ12.30 - 1.22 & మ3.06 - 3.58

అమృతకాలం: మ12.36 - 2.17

రాహుకాలం: ఉ7.30 - 9.00

యమగండ/కేతుకాలం:ఉ10.30-12.00

సూర్యరాశి: మిథునం

చంద్రరాశి: సింహం

సూర్యోదయం: 5.33 

సూర్యాస్తమయం: 6.35 

స్కంధ పంచమి

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు 

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి


Telugusanatan

Jul 02 2022, 08:48

నేటి భక్తి ....!!!

భక్తి పేరుతో మనము దైవమును వెతుక్కుంటూ వెళ్తున్నాము...

అయితే నిజమునకు భక్తి అంటే భగవంతుడే మనలను వెతుక్కుంటూ రావాలి!...

అదీ అసలైన భక్తి , ఇట్టి భక్తి నేడు ఏ ఒక్కరి యందునూ లేదని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు!!...

ఎలా???...

భగవంతుడు అంటే కేవలము కోరికలు తీర్చే కొండగట్టున ఉన్న ఒక రాతి విగ్రహం అనే భావనలో ఉంటున్నాం....

నా కోరిక తీరిస్తే మీకు అది ఇస్తాను, ఇది చేస్తాను అని దైవముతో బేరాలకు దిగుతూ భక్తిని వ్యాపారంగా మారుస్తున్నామంటే , దైవమును మనము ఎంత చక్కగా అర్థం చేసుకున్నామో తెలుస్తూనే వుంది.! 

మలినమైన మనస్సుతో, స్వప్న దృశ్యములైన పదార్ధాలతో నిత్యసత్యమైన పరమాత్మ ప్రేమను కొనడం సాధ్యమవుతుందా! ఆనాటి గోపికలు పరిపూర్ణమైన మనస్సుతో, శరణాగతి భావముతో తమ హృదయ కమలమునే కృష్ణునికి అర్పించి తద్వారా కృష్ణుని ప్రేమమకరందమును గ్రోలగలిగారు...

మలినమైన మనస్సును గానీ, క్షణభంగురమైన వస్తువులను గానీ వారు ఏనాడూ అర్పితము చేయలేదు...

కానుకలు ఇవ్వడం వలన మన కోరికలు తీరుతాయనుకుంటే దైవమును దైవముగా భావిస్తున్నామో లేక వ్యామోహసహితుడైన వ్యక్తిగా భావిస్తున్నమో అనేది ఎవరికి వారు విచారణ చేసుకోవాలి...


Telugusanatan

Jul 02 2022, 08:33

చరిత్రలో ఈరోజు జూలై 2

సంఘటనలు

 

1613: సామ్యూల్ అర్గాల్ ఆధ్వర్యంలో మెసాచుసెట్స్ నుంచి అకాడియాకి (నేటి క్విబెక్ లోని కొంత ప్రాంతం) మొదటి ఇంగ్లీష్ వారి సాహస యాత్ర ప్రారంమైంది.

1644: ఇంగ్లీష్ సివిల్ వార్: మా ర్స్ టన్ మూర్ యుద్ధం.

1679: డేనియల్ గ్రేసలన్ డి డు లుత్ నాయకత్వంలో యూరోపియన్లు మొదటిసారిగా మిన్నెసోటా వెళ్ళి అక్కడి మిస్సిసిపి నది హెడ్ వాటర్స్ ని చూసారు.

1698: థామస్ సావెరీ మొదటి స్టీమ్ ఇంజన్ కి పేటెంట్ హక్కులు పొందాడు.

1777: అమెరికా లోని 'వెర్మెంట్' అనే ప్రాంతంలో మొదటిసారిగా 'బానిసత్వాన్ని' నిర్మూలించారు.

1823: బహియా దేశ స్వాతంత్ర్య దినం: బహియా దేశంలో జరిగిన ఆఖరి యుద్ధంలో పోర్చుగీసు వారు ఓడిపోయారు. ఆ ఓటమితో బ్రెజిల్ లో పోర్చుగీసు వారి పాలన అంతమయ్యింది.

1839: 53 మంది తిరుగుబాటు ఆఫ్రికన్ బానిసలు, జోసెఫ్ సిన్క్య్ నాయకత్వంలో, క్యూబా తీరానికి 20 మైళ్ళ దూరంలో, బానిసలతో ప్రయాణిస్తున్న నౌక 'అమిస్తాడ్'ని స్వాధీనం చేసుకున్నారు.

1863: అమెరికన్ సివిలి వార్: గెట్టిస్ బర్గ్ యుద్ధం ప్రారంభమై రెండవ రోజు.

1881: 20వ అమెరికన్ అధ్యక్షుడు జేమ్స్ ఎ. గార్ ఫీల్డ్ ని, ఛార్లెస్ జూలియస్ గిట్యూ అనే లాయర్ (సమయం 9:30) తుపాకితో కాల్చాడు. తీవ్రంగా గాయపడిన అమెరికా అధ్యక్షుడు 1881 సెప్టెంబరు 19 న మరణించాడు.

1897: ఇటాలియన్ వైజ్ఞానికుడు అయిన గూగ్లీమొ మార్కొని లండన్ లో రేడియో కోసం పేటెంట్ పొందాడు.

1900: జర్మనీ లోని కాన్స్ టేన్స్ చెరువులో (ఫ్రీడ్రిఖ్ షాఫెన్ దగ్గర) మొదటి 'జెప్లిన్ విమానం' ఎగిరింది.

1940: స్వాతంత్ర్య యోధుడు సుభాస్ చంద్రబోస్ ని అరెస్ట్ చేసి కలకత్తాలో బంధించారు.

1962: అమెరికాలోని ఆర్కన్సాస్ రాష్ట్రంలోని 'రోజెర్స్' అనే నగరంలో మొదటి 'వాల్ మార్ట్' చిల్లర దుకాణం వ్యావారం నిమిత్తం మొదలయ్యింది.

1976: ఉత్తర, దక్షిణ వియత్నాం దేశాలు, 22 సంవత్సరాల తర్వాత, తిరిగి ఒకటైనాయి.

2000: ఫ్రాన్సు 2-1 తేడాతో ఇటలీని ఓడించి యూరోకప్-2000 సాధించింది.

2009: స్వలింగ సంపర్కం చట్టబద్ధమేనంటూ ఢిల్లీ హై కోర్టు తుది తీర్పు వెలువరించింది.

జననాలు

 

1939: మల్లెల గురవయ్య, కవి, మదనపల్లె రచయితల సంఘం (మరసం) స్థాపకుడు. (మ.2016)

1965: కృష్ణ భగవాన్, తెలుగు చలనచిత్ర హాస్యనటుడు, రచయిత.

1965: జయలలిత, చలన చిత్ర నటి.

1968: గౌతమి తెలుగు, తమిళ సినిమా నటి.

మరణాలు

1566: నోస్ట్రడామస్, ఫ్రాన్సుకు చెందిన జ్యోతిష్కుడు, ప్రవక్త.

1644: విలియం గేస్కోయిన్, ఇంగ్లీషు ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త, మైక్రోమీటర్ ఆవిష్కర్త. (జ.1612)

1843: శామ్యూల్ హనెమాన్, హొమియోపతీ వైద్యశాస్త్ర పితామహుడు. (జ.1755)

1961: హెమింగ్వే, సాహిత్యములో నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1899)

1982: చెరబండరాజు, విప్లవ కవి. (జ.1944)

1995: గడ్డం రాంరెడ్డి, దూరవిద్య ప్రముఖులు, సమాజ శాస్త్ర విజ్ఞానంలో మేటి వ్యక్తి. వీరిని "సార్వత్రిక విశ్వవిద్యాలయ పితామహుడు". (జ.1929)

2002: దోమాడ చిట్టబ్బాయి, నాదస్వర విద్వాంసులు. (జ.1933)

2005: పోణంగి శ్రీరామ అప్పారావు, నాటకకర్త, అధ్యాపకుడు, నాట్యశాస్త్రం అనువాదకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. (జ.1923)

పండుగలు , జాతీయ దినాలు

 

ప్రపంచ క్రీడా జర్నలిస్ట్ ల దినోత్సవం.


Telugusanatan

Jul 02 2022, 08:25

రాశిఫలాలు జూలై 2,2022

మేషం: 

ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన..దూర ప్రయాణాలు బాదిస్తాయి.

వృషభం: 

కొత్త పనులకు శ్రీకారం. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. ఇంటాబయటా ప్రోత్సాహం. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు..విందువినోదాలు.. దైవదర్శనాలు..

మిథునం:

 పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలు మాములుగానే సాగుతాయి..

కర్కాటకం: 

దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆలయాలు సందర్శిస్తారు. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి..కొట్ర వ్యక్తుల తో పరిచయం..

సింహం: 

ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. అనుకోని ప్రయాణాలు.మిత్రులతో వివాదాలు.

కన్య: 

కొత్త పనులు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవం. కీలక నిర్ణయాలు. శుభకార్యాలకు హాజరవుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆస్తిలాభం..ఈరోజు విందు వినొదాల లో పాల్గొంటారు..

వృశ్చికం: 

పనులు ముందుకు సాగవు. ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. సోదరులతో ఉత్తరప్రత్యుత్తరాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

ధనుస్సు: 

ధనవ్యయం. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. శ్రమతప్పదు. విద్యార్థులకు ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.కుటుంబసభ్యులతో వివాదాలు..చికాకులు..కాస్త ఒపికగా ఉండాలి.

మకరం: 

శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. భూములు, వాహనాలు కొంటారు. విద్యార్థులకు అనుకూలం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.ఆస్తి వివాదాల పరిష్కారం.సమాజంలో గౌరవం పెరుగుతుంది.. అనుకున్న పనులు పూర్తీ అవుతాయి.

కుంభం: 

దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. పనుల్లో పురోగతి. సంఘంలో విశేష గౌరవం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత..కొత్త రుణాలు ఫలిస్తాయి.

మీనం: 

ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు..కొత్త పనులు వాయిదా..నిరాశ ఎక్కువ.


Telugusanatan

Jul 02 2022, 08:15

ఈ రోజు పంచాంగం జూలై 2,2022

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః 

ఓం శ్రీ మాత్రే నమః 

ఓం శ్రీ గురుభ్యోనమః 

     

ఈ రోజు పంచాంగం

జూలై 2,2022

వారం ... స్థిరవాసరే ( శనివారం )

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం,

ఉత్తరాయణం,

గ్రీష్మ ఋతువు,

ఆషాఢ మాసం,

శుక్ల పక్షం,

తిధి   : తదియ రా12.22 వరకు,

నక్షత్రం. : ఆశ్రేష తె4.16 వరకు,

యోగం : హర్షణం ఉ10.31 వరకు,

కరణం : గరజి మ12.22 వరకు,

        తదుపరి వణిజ రా1.01 వరకు,

వర్జ్యం      : సా4.05 - 5.49

దుర్ముహూర్తం : ఉ5.32 - 7.17,

అమృతకాలం : రా2.31 - 4.16,

రాహుకాలం  : ఉ9.00 - 10.30,

యమగండం  : మ1.30 - 3.00,

సూర్యరాశి   : మిథునం,

చంద్రరాశి    : కర్కాటకం,

సూర్యోదయం    : 5.31,

సూర్యాస్తమయం : 6.34,


Telugusanatan

Jul 01 2022, 11:16

నేటి నుండి జగన్నాథ రథయాత్ర... పూరీ శ్రీ జగన్నాథ ఆలయ చరిత్ర ఏమిటి..?

నేటి నుండి జగన్నాథ రథయాత్ర...

పూరీ శ్రీ జగన్నాథ ఆలయ చరిత్ర ఏమిటి..? 

పూరీ పట్టణాన్ని పూర్వం ఏమని పిలిచేవారు..?

మన భారతదేశంలో పురాణకాలం నుండీ ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరీ ఒకటి. 

ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్ కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని, శ్రీ క్షేత్రం అని కూడా పిలిచేవారు. 

ఈ పట్టణంలో విష్ణువు జగన్నాధుని పేరిట కొలువై పూజలందుకుంటున్నాడు. 

ఈ ఆలయం వైష్ణవ దివ్యదేశాల్లో ప్రముఖమైనది మరియూ హిందువులు అతి పవిత్రంగా భావించే " చార్ ధాం " పుణ్యక్షేత్రాలలో ఒకటి.ఈ ఆలయాన్ని 1078 లో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడగంగాదేవ ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్‌ పాలనలో పూర్తయింది. 

అంతకు ముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు. దీని వెనకో కథ ఉంది...

జగన్నాథుడిని పూజించిన విశ్వావసుడు

ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడనీ, నీలమాధవుడనే పేరుతో పూజలందుకున్నాడనీ స్థలపురాణం. 

అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. 

విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు, ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ని అడవికి పంపుతాడు. 

విశ్వావసుడి కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్ళాడతాడు. 

ఈ జగన్నాధ విగ్రహాన్ని చూపించమని పదేపదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవర రాజు, అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు. 

విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళే ఆ దారి పొడుగునా ఆవాలు జారవిడుస్తాడు. 

కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. 

దీంతో వెంటనే అతను ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు.

కలలో కనిపించిన జగన్నాథుడు

రాజు అడవికి చేరుకునే లోగా అక్కడ ఆ విగ్రహాలు మాయమవుతాయి. 

దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహారదీక్ష మొదలుపెట్టి, అశ్వమేథయాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు.

 ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా, జగన్నాథుడు కలలో కనిపించి సముద్రతీరంలో చాంకీనది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయనీ వాటితో విగ్రహాలు చేయించమనీ ఆదేశిస్తాడు. 

కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ, విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు.

ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. 

తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తాననీ, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోననీ, ఆ 21 రోజులూ అటువైపు ఎవరూ రాకూడదనీ, తన పనికి ఆటంకం కలగకూడదనీ షరతు విధిస్తాడు. 

రాజు అంగీకరిస్తాడు, రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు, దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తికాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు.

పూరీ విగ్రహాలకు కనిపించని అభయహస్తం, వరదహస్తం...

శిల్పి కనిపించడు, చేతులూ కాళ్లూ లేని, సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇకమీదట అదేరూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిస్తాడు. 

తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరీ ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించవు. చతుర్దశ భువనాలనూ వీక్షించడానికా అన్నట్టు ఇంతింత కళ్లు మాత్రం ఉంటాయి.

దేశంలో ఎక్కడ లేనివిధంగా పూజలందుకుంటున్న ఇక్కడి ఈ దారు దేవత మూర్తులను 8-12 లేదా 19 సంవత్సరాలకి ఒకసారి మార్చి నూతన దేవతా మూర్తులను ప్రతిష్టించుతూ ఉంటారు ..

దీనిని నవ కళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు , ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర." జగన్నాధ రధ యాత్ర " గా పిలవబడే ఈ రధయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు..

12 రోజుల పాటు జరిగే ఉత్సవం

సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా సరే, ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్లా చూసేదే. ఈ సంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిశాలోని ఈ పూరీ జగన్నాథ స్వామి ఆలయం. 

బలభద్ర, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు.

 ఊరేగించేందుకు ఏటా కొత్తరథాలను నిర్మిస్తారు. అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు. 

ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాడ శుధ్ధ విధియ రోజున ప్రారంభమై 3 కిలోమీటర్ల దూరంలోని గుండిచా ఆలయం వరకు సాగుతుంది. ఆ తరువాత సుభద్ర , బలబద్ర సమేత జగన్నాథుని ఉత్సవ మూర్తులు బహుదా యాత్ర పేరిట తిరిగి పూరీ ఆలయానికి చేరటంతో ముగుస్తుంది. ఇది 12 రోజులు పాటు జరిగే ఉత్సవం .ఈ యాత్రకి రెండు నెలలముందు నించే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతాయి.రథం ఇలా ఉంటుంది

వైశాఖ బహుళ విదియనాడు రథనిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరీ రాజు. అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు. ప్రధాన పూజారి, తొమ్మిది మంది ముఖ్య శిల్పులు, వారి సహాయకులు మరో 125 మంది కలిసి అక్షయ తృతీయనాడు రథ నిర్మాణం మొదలుపెడతారు. 1072 వృక్ష భాగాలనూ నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం తయారీకీ, 763 కాండాలను బలరాముడి రథనిర్మాణానికీ, 593 భాగాలను సుభద్రాదేవి రథానికీ వినియోగిస్తారు.ఆషాఢ శుద్ధ పాడ్యమినాటికి రథనిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి. ఇందులో జగన్నాథుడి రథాన్ని " నందిఘోష " అంటారు. 45 అడుగుల ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండిటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఎర్రటిచారలున్న పసుపువస్త్రంతో ‘నందిఘోష'ను అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని " తాళధ్వజం " అంటారు. దీని ఎత్తు 44 అడుగులు. పద్నాలుగు చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నీలివస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు. సుభద్రాదేవి రథం " పద్మధ్వజం " . దీని ఎత్తు 43 అడుగులు. పన్నెండు చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. ప్రతిరథానికీ 250 అడుగుల పొడవూ ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు. ఆలయ తూర్పుభాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ మూడు రధాలనీ నిలబెడతారు.

అంతా ఒక పద్ధతి ప్రకారం...

రధయాత్ర మొదటి రోజున మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్ళే పండాలు అని పిలవబడే ఇక్కడి పూజరులు ఉదయకాల పూజాదికాలు నిర్వహిస్తారు. శుభముహూర్తం ఆసన్నమవగానే ‘ మనిమా (జగన్నాథా) ' అని పెద్దపెట్టున అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు, అరుణస్తంభం మీదుగా వాటిని వూరేగిస్తూ బయటికి తీసుకువస్తారు. ఈ క్రమంలో ముందుగా దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు. బలభద్రుడ్ని చూడగానే " జై బలరామా, జైజై బలదేవా " అంటూ భక్తులు చేసే జయజయధ్వానాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతుంది. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు. అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు. వాటి కోసం భక్తులు ఎగబడతారు. అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటికి తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు.

జగన్నాథుడి దర్శనం కోసం భక్తుల ఎదురు చూపులు చూస్తారు.

ఇక ఆ జగన్నాథుడిని దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతుంటారు భక్తులు. దాదాపు ఐదడుగుల ఏడంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటికి తీసుకువస్తుండగానే " జయహో జగన్నాథా " అంటూ భక్తిపారవశ్యంతో జయజయధ్వానాలు చేస్తారు. ఇలా మూడు విగ్రహాలనూ రథాలపై కూర్చుండబెట్టే వేడుకను " పహాండీ " అంటారు. ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు. ఈ మూడు విగ్రహాలనూ తీసుకువచ్చేవారిని దైత్యులు అంటారు. వీరు ఇంద్రద్యుమ్న మహారాజుకన్నా ముందే ఆ జగన్నాథుడిని నీలమాధవుడి రూపంలో అర్చించిన సవరతెగ రాజు విశ్వావసు వారసులు. ఆలయ సంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్టులను అంతరాలయం నుంచి బయటికి తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపచేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది.

బంగారు చీపురుతో శుభ్రం చేసే సంస్థానాదీశులు

సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరీ సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటాడు. జగన్నాథుడికి నమస్కరించి రథం మీదికి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. ఈ వేడుకను " చెరా పహారా " అంటారు. అనంతరం స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేస్తాడు. ఇదే తరహాలో బలరాముడినీ, సుభద్రాదేవినీ అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాడు. అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటిమెట్లను తొలగిస్తారు. ఇక యాత్ర మొదలవడమే తరువాయి.జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కళ్లాపి చల్లి హారతిచ్చి " జై జగన్నాథా " అని పెద్దపెట్టున అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలుపెడతారు. విశాలమైన బోడోదండ అని పిలవబడే ప్రధానమార్గం గుండా ఈ యాత్ర మందగమనంతో సాగుతుంది.

నెమ్మదిగా కదిలే రథం లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే ఘోషయాత్ర అంటారు. భక్తుల తొక్కిసలాటలో చక్రాలకింద ఎవరైనా పడినా, దారిలో ఏ దుకాణమో అడ్డువచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకే నడిపిస్తారు.ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం మూడు మైళ్ల దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండుగంటల సమయం పడుతుంది. గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూలవిరాట్లకు విశ్రాంతినిస్తారు.మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళతారు. వారం రోజులపాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమినాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని " బహుదాయాత్ర " అని అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలూ జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడిబయటే ఉండిపోతాయి.

స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతారు.

మర్నాడు ఏకాదశినాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. సునావేషగా వ్యవహారించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు. ద్వాదశినాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే. యాత్రపేరిట పదిరోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకుని కొత్తకళ సంతరించుకుంటుంది.ఇలాంటి ఎన్నో విశిష్టతలూ , భిన్న సంస్కృతులూ, సాంప్రదాయాలు కలగలిసిన ఈ పూరీ జగన్నాధుని ఆలయాన్ని ఏటా ఎన్నో లక్షల మంది సందర్శిస్తారు.

"జగన్నాధ అంటే... లోకానికి నాధుడు" అని అర్ధం,ఈ పదం సంస్కృత భాష నుంచి ఉత్పన్నమైంది...

ఈ పదానికి ఒడియాలో... "తిరిగుతున్న భూమికి ఆశ్రయం వంటి వాడు" అని అర్ధం కూడా ఉంది...


Telugusanatan

Jul 01 2022, 10:07

చరిత్రలో ఈరోజు... జూలై 1...

సంఘటనలు

 

1857: భారత స్వాతంత్ర్యోద్యమము: ఢిల్లీ ఆక్రమణ జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31న పూర్తయింది. ఈ యుద్ధంలో ఒకవారంపాటు అడుగడుగునా వీధిపోరాటం జరిగింది.

1904: మూడవ ఒలింపిక్ క్రీడలు సెయింట్ లూయీస్ లో ప్రారంభమయ్యాయి.

1909: భారత స్వాతంత్ర్యోద్యమము: 1909 జూలై 1న ఇండియన్ హౌస్ తో దగ్గరి సంబంధము కలిగిన మదన లాల్ ధిన్‌గ్రా అనే భారతీయ విద్యార్థివిలియమ్ హట్ కర్జన్ అనే బ్రిటీష్ పార్లమెంటు ప్రతినిధిని కాల్చిచంపాడు

1949: ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ దినోత్సవం భారతదేశపు పార్లమెంటు, ఈ రోజు న 1949 లో ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ చట్టం చేసింది. అందుకోసం, భారతదేశంలోని ది ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐ.సి.ఏ.ఐ), ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ అందరూ ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ డేని జరుపుకుంటున్నారు.

1949: కొచిన్, ట్రావెన్కోర్ అనే రెండు సంస్థానాలను కలిపి తిరు-కోచి రాష్ట్రంగా (తరువాత ఈ రాష్ట్రాన్ని కేరళ రాష్ట్రంగా పునర్వవస్తీకరించారు) భారత దేశంలో కలిపి వేసారు. అంతటితో, 1000 సంవత్సరాలుగా పాలిస్తున్న, కొచిన్ రాజకుటుంబం పాలన అంతమయ్యింది.

1955: భారతీయ స్టేట్ బ్యాంకు స్థాపించబడింది.

1960: ఆంధ్రజ్యోతి దినపత్రిక విజయవాడ నుంచి ప్రారంభించబడింది.

1957: ప్రపంచ భూ భౌతిక సంవత్సరంగా 1957 సంవత్సరాన్ని, యునైటెడ్ నేషన్స్ ప్రకటించింది

1960: ఘనా రిపబ్లిక్ దినోత్సవం.

1962: బురుండి, రువాండా దేశాలకు స్వాతంత్ర్యము లభించింది.

1963: అమెరికాలోని తపాలా కార్యాలయాలు 5 అంకెలు గల జిప్ కోడ్‌ను (జోనల్ ఇంప్రూవ్ మెంట్ ప్లాన్) ప్రవేశపెట్టాయి.

1990: జనరల్ ఎస్.ఎఫ్. రోడ్రిగ్స్ భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.

1993: జనరల్ బి.సి.జోషి భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.

1997: బ్రిటన్ 156 సంవత్సరాల బ్రిటిష్ వలస అయిన 'హాంకాంగ్ ' ని చైనాకు తిరిగి ఇచ్చింది.

2002: సోమాలియా స్వాతంత్ర్య దినం.

2008: ఆర్కిటిక్ ప్రాంతంలో భారత్ హిమాద్రి పేరుతో మొట్టమొదటి పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించింది.

జననాలు

1646: గాట్‌ఫ్రీడ్ లైబ్నిజ్, జర్మన్ బహుముఖ ప్రజ్ఞాశాలి, తత్త్వవేత్త. కలన గణితంలో అనేక ఆవిష్కరణలు చేశాడు. (మ.1716)

1882: బి.సి.రాయ్, భారత రత్న గ్రహీతలైన వైద్యులు. (మ.1962)

1904: పి. చంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ఆపద్ధర్మ గవర్నరు. (మ.1976)

1905: రాప్తాటి ఓబిరెడ్డి, అజ్ఞాతకవి.

1909: ఇంటూరి వెంకటేశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు సినిమా చరిత్ర పరిశోధకుడు. (మ.2002)

1911: సింగరాజు రామకృష్ణయ్య, ఉపాధ్యాయుడు, ఏ.పి.టి.యఫ్ ప్రధాన కార్యదర్శి. (మ.2002)

1912: కె.వి.రెడ్డి, ప్రతిభావంతుడైన దర్శకుడు, నిర్మాత, రచయిత. (మ.1972)

1913: కొత్త రాజబాపయ్య, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, విద్యాబోర్డులో, రాష్ట్ర విద్యాసలహా సంఘం సభ్యుడు. (మ.1964)

1916: షేక్ దావూద్, కవి, విద్వాంసుడు. (మ.1994)

1919: టి.ఎన్.విశ్వనాథరెడ్డి, భారత పార్లమెంటు సభ్యుడు.

1923: కె.సభా, కథా రచయిత, నవలాకారుడు, కవి, గేయకర్త, బాలసాహిత్య నిర్మాత, సంపాదకుడు, జానపద గేయ సంకలనకర్త, ప్రచురణకర్త. (మ.1980)

1926: తూమాటి దొణప్ప, ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్యులు, తెలుగు విశ్వవిద్యాలయం మొట్టమొదటి ఉప కులపతి. (మ.1996)

1927: బొడ్డుపల్లి పురుషోత్తం, రచయిత, తెలుగు ఆచార్యుడు.

1928: వై.బాలశౌరిరెడ్డి, హిందీభాషాప్రవీణుడు, ‘హిందీ చందమామ‘ సంపాదకుడు. (మ.2015)

1929: ఏ.ఎం. రాజా, తెలుగు సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటుడు. (మ.1989)

1930: కుమ్మరి మాస్టారు, బుర్రకథ కళాకారులు. (మ.1997)

1931: యస్.రాజన్నకవి, రంగస్థల నటుడు.

1933: దరియా హుస్సేన్‌ షేక్‌, అనంతపురం రాయలకళాగోష్ఠి కార్యదర్శి

1934: వంగపండు అప్పలస్వామి, తెలుగు కవి, రచయిత.

1937: పడాల బాలకోటయ్య, రంగస్థల నటులు, దర్శకులు, న్యాయనిర్ణేత. (మ.2015)

1939: కొలకలూరి ఇనాక్, ఆధునిక సాహిత్య ప్రక్రియలో అన్ని రుచులనూ చవిచూచిన నేర్పరి. వేల మందికి విద్యాదానం చేసిన ఉపకులపతి

1941: డి.కె.ఆదికేశవులు, చిత్తూరు లోక్‌సభ సభ్యులు.

1942: నంది ఎల్లయ్య, మాజీ పార్లమెంటు సభ్యుడు (మ. 2020)

1946: కల్లూరు రాఘవేంద్రరావు, కథారచయిత, బాలసాహిత్యవేత్త.

1946: కల్లూరు రాఘవేంద్రరావు, కథారచయిత, బాలసాహిత్యవేత్త.

1946: శాంతి నారాయణ కథారచయిత, అవధాని.

1946: అర్నాద్, అర్నాద్ గా పేరొందిన చెందిన దుంప హరనాథరెడ్డి తెలుగు నవలా రచయిత. 50 కి పైగా రచనలు చేసాడు.

1949: వెంకయ్య నాయుడు భారత ఉపరాష్ట్రపతి, భారతీయ జనతా పార్టీ నేత, పార్టీ మాజీ అధ్యక్షుడు.

జూలై 1: సురభి బాబ్జీ, సురభి నాటక నిర్వాహకుడు (మ. 2022)

1950: గుడిమెట్ల చెన్నయ్య, తెలుగు రచయిత.

1955: పాలగిరి రామక్రిష్ణా రెడ్డి, నూనె టెక్నాలజీస్టు. ఈయన గత 35 సంవత్సరాలు నూనె గింజల నుండి వివిధ రకాల నూనెలను వేరుచేయడంలో తన అమూల్యమైన అనుభవాన్ని పంచాడు.

1960: అనురాధా నిప్పాణి, రంగస్థల నటి, దర్శకురాలు, రచయిత.

1961: ప్రిన్సెస్ డయానా (వేల్స్ యువరాజు ఛార్లెస్ భార్య), నార్ ఫ్లోక్ (ఇంగ్లాండు) లోని సాండ్రిన్గాం(మ.1997).

1963: ఎస్.ఎం. బాషా, రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు, సినిమా నటుడు.

1986: సితార: భారతీయ సినీ నేపథ్య గాయిని.

మరణాలు

 

1839: మహముద్ II ఒట్టొమాన్ సుల్తాన్, సంస్కర్త, పాశ్చాత్యీకరణ చేసినవాడు. (జ.1785)

1962: బి.సి.రాయ్, భారత రత్న గ్రహీతలైన వైద్యులు. (జ.1882)

1966: దేవరకొండ బాలగంగాధర తిలక్, ఆధునిక తెలుగుకవి. (జ.1921)

1991: పిడతల రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు, మాజీ శాసనమండలి అధ్యక్షుడు. (జ.1917)

1992: తాతినేని ప్రకాశరావు, తెలుగు, తమిళ, హిందీ సినిమా దర్శకులు. (జ.1924)

2002: కడూర్ వెంకటలక్షమ్మ, మైసూరు రాజాస్థానానికి చెందిన భరతనాట్య నర్తకి. పద్మభూషణ్ గ్రహీత. (జ.1906)

2006: కొరటాల సత్యనారాయణ,ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ముఖ్యుడు. (జ.1923).

పండుగలు , జాతీయ దినాలు

 

జాతీయ వైద్యుల దినోత్సవం - బి.సి.రాయ్ జయంతి, వర్ధంతి దినం.

ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ దినోత్సవం భారత దేశంలో

వాస్తు దినోత్సవం.

ప్రపంచ వ్యవసాయ దినోత్సవం.


Telugusanatan

Jul 01 2022, 09:33

ఈరోజు పంచాంగం... 01 - 07 - 2022

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః 

ఓం శ్రీ మాత్రే నమః 

ఓం శ్రీ గురుభ్యోనమః 

ఈరోజు పంచాంగం...

 01 - 07 - 2022వారం ... భృగువాసరే ( శుక్రవారం )

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం,

ఉత్తరాయణం,

గ్రీష్మ ఋతువు,

ఆషాఢ మాసం,

శుక్ల పక్షం,

తిధి   : విదియ ఉ10.40 వరకు,

నక్షత్రం : పుష్యమి రా2.08 వరకు,

యోగం : వ్యాఘాతం ఉ10.28 వరకు,

కరణం : కౌలువ ఉ10.12 వరకు

       తదుపరి తైతుల రా11.17 వరకు,

వర్జ్యం       : ఉ8.31 - 10.17,

దుర్ముహూర్తం : ఉ8.08 - 9.00 &

            మ12.29 - 1.21,

అమృతకాలం : రా7.06 - 8.51,

రాహుకాలం   : ఉ10.30 - 12.00,

యమగండం  : మ3.00 - 4.30

సూర్యరాశి    : మిథునం, చంద్రరాశి     : కర్కాటకం,

సూర్యోదయం    : 5.32,

సూర్యాస్తమయం : 6.34,