TeluguCentralnews

Jun 03 2022, 11:17

నిర్మాణ రంగంపై ధరల భారం.. దక్షిణాది రాష్ట్రాల్లో పెరిగిన సిమెంట్‌ ధరలు..

నిర్మాణ రంగంపై ధరల భారం పడుతోంది. నిర్మాణానికి సంబంధించి దాదాపు ప్రతి వస్తువు పెరిగింది. అటు మేస్త్రీ కూలీ కూడా పెరిగింది. తాజాగా ఇప్పుడు సిమెంట్‌ రేట్లు కూడా భారీగా పెరిగాయి. దక్షిణాది రాష్ట్రాల్లో 50 కిలోల సిమెంటు బస్తా ధరను రూ.20-30 మేర పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈనెల 2 నుంచే పెంచిన ధరలు అమల్లోకి వచ్చినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ముడి పదార్థాల అధిక ధరలతో పాటు ఇంధన వ్యయాలు పెరగడమే ఇందుకు కారణమని తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో బస్తాపై రూ.20 పెరగ్గా, తమిళనాడులో రూ.20-30 మధ్య పెరిగాయి. కర్ణాటకలో బ్రాండ్‌, ప్రాంతం ఆధారంగా ధరల పెంపు వేర్వేరుగా ఉంది. ధర పెరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో సిమెంట్‌ బస్తా ధర రూ.320-400 మధ్య; తమిళనాడు, కర్ణాటకల్లో రూ.360-450 ఉంది.

ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్‌లోనే ధరలు పెంచాలని చూసినా, కొనుగోళ్లు తక్కువగా ఉండటంతో డీలర్లు వ్యతిరేకిండంతో వాయిదా వేశారు. ఖర్చలు పెరగడంతో పెంచక తప్పలేదని కంపెనీలు చెప్పాయి. గత 3 రోజులుగా సిమెంట్‌ కంపెనీలు డీలర్లకు సరఫరాలు నిలిపి, ఇప్పటికే ఉన్న పాత స్టాక్‌ విక్రయించాల్సిందిగా కోరాయి. కొత్త ధర ప్రకారం, సరఫరాను గురువారం సాయంత్రం నుంచి ప్రారంభిస్తాయని డీలర్లు చెప్పారు.

ధరలు పెంచిన సంస్థలు:

అల్ట్రాటెక్‌ సిమెంట్‌

ఇండియా సిమెంట్స్‌

కేసీపీ

ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌

సాగర్‌ సిమెంట్స్‌

దాల్మియా భారత్‌

శ్రీ సిమెంట్‌

రామ్‌కో సిమెంట్స్‌

ఓరియంట్‌ సిమెంట్‌


TeluguCentralnews

May 29 2022, 15:19

AnarnathYatra: అమర్ నాథ్ యాత్రే లక్ష్యంగా మాగ్నెటిక్ బాంబులు..!

అమర్‌నాథ్‌ యాత్రలో విధ్వంసం సృష్టించాలని పాక్‌ చేసిన యత్నాలను జమ్ముకశ్మీర్‌ పోలీసులు భగ్నం చేశారు. పాకిస్థాన్‌ నుంచి వస్తున్న ఓ క్వాడ్‌కాప్టర్‌ను కథువాలోని తాల్లీ హరియా చాక్‌ గ్రామం వద్ద పోలీసులు ఆదివారం కూల్చివేశారు.ఆ డ్రోన్‌ నుంచి ఏడు మాగ్నెటిక్‌ బాంబులను, ఏడు యూజీబీఎల్‌ గ్రనేడ్లను స్వాధీనం చేసుకొన్నారు.

తొలుత డ్రోన్‌ కదలికలను రాజ్‌బాఘ్‌ పోలీసులు ఏర్పాటు చేసిన సెర్చిపార్టీ గుర్తించింది. అది పాకిస్థాన్‌ వైపు నుంచి వస్తున్నట్లు గుర్తించి వెంటనే దానిపై వారు కాల్పులు జరిపారు. అమర్‌నాథ్‌ యాత్రను లక్ష్యంగా చేసుకొని ఈ పేలుడు పదార్థాలను తెచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ డ్రోన్‌ తీసుకొచ్చిన మాగ్నెటిక్‌ బాంబులను చార్‌ధామ్‌ యాత్ర బస్సులకు అమర్చేందుకు తెప్పించి ఉంటారని భావిస్తున్నారు.

ఇది తాలిబన్ల శైలి..!

అమెరికా సేనలు, ఇతర అధికారులను హత్య చేసేందుకు గతంలో తాలిబన్లు మాగ్నెటిక్‌ బాంబులను విరివిగా వాడేవారు. వీరు పేలుడు పదార్థాలకు అయస్కాంతాలు అమర్చి అఫ్గాన్‌ అధికారులు, నాయకుల కార్ల కింద పెట్టేవారు. కాబుల్‌ వంటి పట్టణాల్లో దాడులకు ఇలాంటి వ్యూహాలను అమలు చేసేవారు. ఇవి ఎంత ప్రమాదకరమైనవో తాలిబన్లకు తెలిసినంత మరెవరికీ తెలియదు.

ఏమిటీ మాగ్నెటిక్‌ బాంబ్‌..

అమెరికాతో శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో చేసిన దాడుల్లో వీటినే అత్యధికంగా వినియోగించారు. నిత్యం ఈ బాంబులు అమర్చిన కార్లు ఎక్కడో ఒకచోట పేలుతుండేవి. దీంతో కాబుల్‌ వాసులు వణికిపోయేవారు. ఈ బాంబులను మెకానిక్‌ షెడ్లలో కూడా తయారు చేయవచ్చు. వీటికి 25 డాలర్లకు మించి ఖర్చుకాదు. చిన్న డబ్బాలో పేలుడు పదార్థాలను అమర్చి దానిని సెల్‌ఫోన్‌తో అనుసంధానిస్తారు. దీనికి ఒక అయస్కాంతం అమరుస్తారు. దీనిని ప్రత్యర్థి వాహనం కింద ఇంధన ట్యాంక్‌ సమీపంలో పెట్టి.. బాంబుకు అమర్చిన మొబైల్‌ నంబర్‌కు ఫోన్‌ చేస్తారు. దీంతో భారీ పేలుడు సంభవిస్తుంది. అఫ్గాన్‌ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు 2020, 2021ల్లో డజన్ల కొద్దీ పేలుళ్లకు పాల్పడ్డారు.

కాబుల్‌లో తాలిబన్‌ సానుభూతిపరులు రిపేర్లకు వచ్చిన కార్లలో వీరు మాగ్నెట్‌ బాంబులను పెట్టి పంపించేవారు. సమీ అనే ఉగ్రవాది అక్కడ అరెస్టయ్యే వరకు ఈ విషయం బయటపడలేదు. తాలిబన్లు నయానో భయానో వీరిని లొంగదీసుకొని ఈ పనులు చేయించారు.

కశ్మీర్‌లో వాడేందుకు పాక్‌ పన్నాగం..

భారత్‌లో 2012లో ఒక ఇరాన్‌ ఉగ్రవాది ఇజ్రాయెల్‌ దౌత్య సిబ్బంది భార్యపై దాడికి తొలిసారి ఈ మాగ్నెట్‌ బాంబ్‌ను వాడారు. కశ్మీర్‌లో కూడా తాలిబన్‌ స్టైల్‌లో ఈ బాంబులను వాడాలని పాక్‌ పన్నాగం పన్నింది. గతేడాది సాంబ సెక్టార్‌లో భద్రతా దళాలు ఈ మాగ్నెట్‌ బాంబులను స్వాధీనం చేసుకొన్నాయి. వీటిని పాక్‌ ఐఎస్‌ఐ సంస్థ ఉగ్రవాదులకు సరఫరా చేస్తోంది. కొన్నాళ్ల క్రితం పూంచ్‌ జిల్లాలో నాలుగు మాగ్నెట్‌ బాంబులను భద్రతా దళాలు నిర్వీర్యం చేశాయి.


TeluguCentralnews

May 29 2022, 12:43

_నేపాల్ లో విమానం మిస్సింగ్.. అందులో నలుగురు భారతీయులు_

_న్యూఢిల్లీ: నేపాల్‌లో ఓ విమానం అదృశ్యమైన ఘటన కలకలం సృష్టించింది. ఆదివారం ఉదయం తారా ఎయిర్‌కు చెందిన 9 NAET ట్విన్‌ ఇంజిన్‌ విమానం ఆచూకీ గల్లంతైంది. కాగా, ఈ విమానం పోఖారా నుంచి నేపాల్‌లోని జోమ్‌సోమ్‌కు వెళ్తుండగా ఉదయం 9.55 గంటలకు ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయని అధికారులు ధృవీకరించారు. మరోవైపు.. జోమ్‌సోమ్‌లోని సమీపంలో ఉన్న దౌలత్‌గిరి పర్వతం వైపు విమానం మళ్లిన తర్వాతే ఏటీసీతో సంబంధాలు తెగిపోయినట్టు తెలుస్తోంది._

_కాగా, తప్పిపోయిన విమానంలో ముగ్గురు విమాన సిబ్బందితో సహా 19 మంది ప్రయాణీకులు ఉండగా.. వారిలో నలుగురు భారతీయులు, ముగ్గురు జపానీయులు ఉన్నట్టు సమాచారం. విమానం సిగ్నల్స్‌ కట్‌ అవడంతో గాలింపు చర్యల కోసం ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టినట్టు తారా ఎయిర్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా తెలిపారు._


TeluguCentralnews

May 28 2022, 20:23

గుజరాత్ ఫైల్స్ బ్లాక్ చేసి నన్ను ద్వేషించారు:ప్రధాని మోదీ

రాజ్‌కోట్‌: ఎనిమిదేళ్ల పాలనలో మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కలలు కన్న భారత్ నిర్మాణానికి పని చేశానని, గుజరాత్‌ సిగ్గుపడేలా ఏ తప్పూ చేయలేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

గుజరాత్ రాజ్ కోట్‌లో శనివారం జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. పేదలు, దళితులు, గిరిజనులు, మహిళలు సాధికారత సాధించాలని బాపూజీ కోరుకున్నట్టు గుర్తు చేశారు.

''నేను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు యూపీఏ సర్కారు ఫైళ్లకు ఆమోదం తెలిపేది కాదు. గుజరాత్ కోసం ప్రాజెక్టులకు వారు ఆమోదం తెలియజేయలేదు. గుజరాత్ ఫైల్స్ ను బ్లాక్ చేసి నన్ను ద్వేషించారు'' అని గత అనుభవాలను ప్రజలతో పంచుకున్నారు.

తన హయాంలో జన్ ధన్ యోజన పథకం ప్రజలకు ఉపయోగపడినట్లు ఈ సందర్భంగా చెప్పారు. రైతులు, కార్మికుల జన్ ధన్ ఖాతాల్లో నేరుగా నగదు డిపాజిట్ చేసినట్టు తెలిపారు. కరోనా, యద్ధ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొన్నామని, ఎక్కడా రాజీ పడలేదని గుర్తు చేశారు. పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను సరఫరా చేయడంతోపాటు.. ప్రజలు అందరికీ ఉచిత టీకాలు అందించామన్నారు. ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రజల ప్రయత్నాలు తోడైనప్పుడు సేవ చేసే బలం పెరుగుతుందన్నారు.

తాను ఈ స్థాయిలో ఉండడానికి గుజరాతే కారణమని ప్రధాని మోదీ ప్రజల సమక్షంలో ప్రకటించారు. అందుకు ధన్యవాదాలు తెలియజేశారు. గుజరాత్ ప్రజలు సిగ్గు పడే పని ఒక్కటీ చేయలేదని అంటూనే.. యూపీఏ సర్కారు తీరును ఈ సందర్భంగా ప్రధాని ఎండగట్టారు. ఇదిలా ఉండగా.. ప్రధాని స్వరాష్ట్రమైన గుజరాత్ లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.


TeluguCentralnews

May 28 2022, 20:22

తెలంగాణలో కాషాయ శకం ప్రారంభం

..కేసీఆర్ ను గద్దె దింపుతాం: విజయశాంతి

హైదరాబాద్: నగరానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాకతో తెలంగాణలో కాషాయ శకం ప్రారంభమైందని బీజేపీ నేత విజయశాంతి అన్నారు.

శనివారం ఫేస్‌బుక్ వేదికగా స్పందిస్తూ ప్రధాని రాకతో తెలంగాణలో కొత్త మార్పు స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయిందని, కేసీఆర్ నియంతృత్వ పాలనపై ప్రధాని ధ్వజమెత్తారన్నారు. రాష్ట్రాభివృద్ధిని ఒక ఫ్యామిలీ అణచివేయాలని చూస్తోందన్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో వేలాదిమంది అమరులయ్యారని ఒక్క ఆశయం కోసం ఎందరో ప్రాణత్యాగాలు చేశారని, కానీ కేసీఆర్ నిరంకుశ పాలనలో ఎవరి ఆకాంక్షలు నెరవేరడం లేదని బీజేపీ నేత విమర్శించారు.

తెలంగాణకు విముక్తి కావాలని అన్నారు. కుటుంబ పాలనను, కుటుంబ పార్టీలను తరిమేస్తేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని మోదీ తెలంగాణ ప్రజలు స్పష్టం చేసినట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కొత్త చరిత్ర రాస్తామని తేల్చి చెప్పారన్నారు. ప్రధాని వస్తున్నారంటేనే సీఎం కేసీఆర్‌కు వెన్నులో వణుకు పుడుతోందని అందుకే కర్ణాటకకు పోయి దాక్కున్నారని రాములమ్మ దుయ్యబట్టారు.

కేసీఆర్‌కు ఏం పని ఉందని బెంగుళూర్ వెళ్లారని ప్రశ్నించారు. ''సమస్యలు ఉంటే మోదీని సీఎం నేరుగా కలిసి చెప్పుకోవచ్చు కదా అది చెయ్యరు. ప్రతిదానికి కేంద్రంపైన, ప్రధానిపై ఆరోపణలు చేయడం తప్ప ఇంకేదీ చేత కాదు'' అని మండిపడ్డారు. తెలంగాణలో పార్టీ కోసం కార్యకర్తలు పోరాడుతున్న తీరును మోదీ ప్రస్తావించడంతో కాషాయదళంలో కొత్త కళ కనిపించిందన్నారు. ఇదే ఉత్సహంతో కేసీఆర్‌ను గద్దె దించి కాషాయ జెండాను ఎగురేస్తామని విజయశాంతి ధీమా వ్యక్తం చేశారు.


TeluguCentralnews

May 26 2022, 19:32

వ్యభిచారం చేయడం తప్పు కాదు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు .

వ్యభిచారం చేయడం కూడా ఒక వృత్తే అని, వారిని ఇబ్బందిపెట్టి వారి పరువు తీయడం పద్దతికాదని పోలీసులకు, మీడియా వారికి సుప్రీం కోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇకనుంచివ్యభిచారం చేస్తూ పట్టుపడిన సెక్స్ వర్కర్లపై క్రిమినల్ కేసులు పెట్టకూడదని పోలీసులకు తెలిపింది. తాజాగా సెక్స్ వర్కర్ల పై కేసు నమోదు చేయడం విషయమై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాల్ని జారీ చేసింది.” సెక్స్ వర్కర్లను మేము సమర్ధించం.. అలా అని వారిని అగౌర పరుస్తుంటే చూస్తూ ఉండలేము.. వారిలా పనిచేయడం ఎవరివలన కాదు. ఎవ్వరు స్వచ్చందంగా వ్యభిచారంలోకి దిగాలి అనుకోరు.. ఎవరి బాధలు వారికి ఉంటాయి. ఒక్కొక్కరిది ఒక్కో కథ. అలాంటివారి విషయంలో ఇప్పటివరకు అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వాలు కూడా ఉన్న సమస్యను ఉన్నట్లుగా చర్చించింది లేదు. ఇక వీటి విషయంలో పట్టించుకొనేవారు వారిని ఇంకా వేధించడానికి చూస్తూ ఉంటారు.

వ్యభిచార గృహంలో పట్టుబడడం ఆలస్యం పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టడం, మీడియా వారి ఫోటోలను క్లిక్ చేసి అందరికి చూపించి వారి పరువును బయటపెట్టడం. ఇక నుంచి ఇలాంటివాటికి చెక్ పెట్టినట్లే.. సెక్స్ వర్కర్లను ఇక నుంచి వేధించకూడదు. వారి ఫోటోలను మీడియా క్లిక్ చేయడం కానీ, పబ్లిష్ చేయడం కానీ చేయకూడదు. వారికి కూడా సమాజంలో ఒక గౌరవం ఇవ్వాలి. వారిపై భౌతికంగా కానీ మాటలతో కానీ ఎలాంటి దాడి చేయకూడదని పోలీసులు ఆదేశించింది. వారి విషయంలో మర్యాద పాటించాలని పేర్కొంది. ఒకవేళ తమ ఆదేశాలను కాదని మీడియా వారి ఫోటోలను ప్రచురిస్తే వారిపై క్రిమినల్ కేసును నమోదు చేయాల్సి ఉంటుందని పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తున్నాం” అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా మరికొన్ని కీలక ఆదేశాలను జారీ చేసింది న్యాయస్థానం..

వ్యభిచారం చేయడం తప్పు.. కానీ స్వచ్ఛందంగా వ్యభిచారం చేయడం నేరం కాదు.

బలవంతంగా మహిళలను వ్యభిచారం కూపంలోకి తీసుకెళ్లినవారిపై క్రిమినల్ కేసులు పెట్టండి.. వారి వద్ద నుంచి మహిళలను కాపాడి నిర్దిష్ట గడువు లోపు వారిని విడిపించటానికి చర్యలు తీసుకోవాలి.

గృహాలపై దాడులు నిర్వహించినప్పుడు స్వచ్ఛందంగా ఉంటున్న సెక్సు వర్కర్లను అరెస్టు చేయకూడదు. వారిని శిక్షించటం.. వేధించటం కానీ చేయకూడదు

సెక్సు వర్కర్ల పట్ల పోలీసులు అతి క్రూరంగా ప్రవరిస్తున్నారు.. ఇకనుంచి అలాంటివి మానుకోవాలి.. సున్నితంగా వ్యవహరించాలి.

సెక్స్ ట్రేడ్‌లో ఉన్నారనే కారణంతో సెక్స్ వర్కర్ యొక్క బిడ్డను తల్లి నుండి వేరు చేయకూదు. మానవ మర్యాద మరియు గౌరవానికి సంబంధించిన ప్రాథమిక రక్షణ సెక్స్ వర్కర్లు మరియు వారి పిల్లలకు వర్తిస్తుంది.

సెక్సు వర్కర్ల ఫోటోలు.. వారి వివరాలు వెల్లడించకుండా మీడియా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బాధితులు.. నిందితుల ఫోటోల్ని ప్రసారం చేయటం..ఫోటోల్ని ప్రచురించటం చేయకూడదు.

*అన్నిటికన్నా ముఖ్యంగా వారిని కూడా సమాజంలో మనుషులుగా చూడాలి.. అది వారి వృత్తి అని నమ్మాలి.


TeluguCentralnews

May 26 2022, 19:03

గవర్నర్ ధనకర్ కు షాకిచ్చేనిర్ణయం తీసుకున్న మమత ప్రభుత్వం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, గవర్నర్ జగదీప్ ధనకర్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రస్థాయి యూనివర్సిటీలను ఇకపై ముఖ్యమంత్రే తన గుప్పిట్లో పెట్టుకునేలా రాష్ట్ర కేబినెట్ ఓ సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రస్థాయి వర్సిటీలకు గవర్నర్ ఛాన్సలర్‌గా వ్యవహరిస్తుండగా, ఇకపై ఆ స్థానాన్ని ముఖ్యమంత్రికి అప్పగించేలా అసెంబ్లీలో చట్ట సవరణ చేయాలని గురువారం కేబినెట్ నిర్ణయించినట్టు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బ్రాత్య బసు తెలిపారు.యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ల నియామకాల విషయంలో గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్.. రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం తలెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ ధనఖర్ ఇటీవల మాట్లాడుతూ.. రాజ్‌భవన్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రాష్ట్ర ప్రభుత్వం వైస్ ఛాన్సలర్లను నియమించిందని ఆరోపించారు


TeluguCentralnews

May 26 2022, 18:10

PM MODI:తెలంగాణలో మార్పు తథ్యం అధికారంలోకి వచ్చేది బిజేపినే..

PM MODI: తెలంగాణలో కుటుంబ పాలనకు ప్రజలు విసిగిపోయారు, మార్పు ఖాయమైంది, రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు

గురువారం గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని యాదవ్, తదితరులు మోడీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చేసిన సభా వేదిక నుండి ప్రధాని మోదీ భారీగా తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. తొలుత తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని.. సీఎం కేసీఆర్ టార్గెట్ గా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పట్టుదల, పౌరుషానికి మారుపేరైన తెలంగాణ ప్రజలకు నమస్కారం, మీ ప్రేమాభిమానాలే నా బలం అంటూ మోదీ ప్రసంగించారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్న విషయం నా దృష్టికి వచ్చిందని, తెలంగాణ సౌభాగ్యం కోసం ముగ్గురు బీజేపీ కార్యకర్తలు ప్రాణత్యాగం చేశారని, వాళ్లందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నానంటూ మోదీ తెలిపారు.

హింసతో అధికారం సాధించాలని స్వాతంత్రానికి ముందు కూడా అనుకున్నారని, అప్పుడు విజయం సాధించలేదని, ఇప్పుడు సాధించలేరని అన్నారు. వాళ్లు తెలంగాణను రాజకీయ నేపథ్యంలో నడుపుదామనుకున్నారు.. మేం తెలంగాణను టెక్నాలజీ హబ్ గా మార్చాలనుకుంటున్నాం అంటూ సీఎం కేసీఆర్ లక్ష్యంగా మోదీ పరోక్ష విమర్శలు చేశారు. తెలంగాణను కొత్త శిఖరాలకు చేర్చడమే మా లక్ష్యమని, తెలంగాణ కోసం వందలమంది ప్రాణత్యాగం చేశారని గుర్తుచేసుకున్నారు. ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదని, తెలంగాణలో సామ, దాన, దండోపాయంతో ఒక కుటుంబం అధికారం చెలాయించడానికి ఉద్యమాలు జరగలేదని మోదీ అన్నారు. కుటుంబ పాలనను ప్రోత్సహించే వాళ్లు, ఆ పార్టీలే దేశానికి ద్రోహులు అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. ఒక కుటుంబం అధికారంలోకి వస్తే ఎంత అవినీతిమయంగా ఉంటుందో తెలంగాణ ప్రజలు చూస్తున్నారని, కుటుంబ పాలన తమ ఖజానా నింపుకుంటుందన్నారు. కుటుంబ పాలకులకు పేదల గురించి పట్టదని టీఆర్ఎస్ ప్రభుత్వంపై మోదీ పరోక్ష విమర్శలు

కుటుంబ పాలన నుంచి విముక్తి కలిగించడం ఈ శతాబ్దపు నినాదంగా పెట్టుకోవాలని మోదీ యువతకు సూచించారు. ఎక్కడైతే కుటుంబ పాలన అంతమైందో అక్కడ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. తెలంగాణను విచ్ఛిన్నం చేసే వాళ్లు నాడు, నేడు ఉన్నారన్నారు. మా పోరాటం ఫలితాన్ని ఇస్తోందని, తెలంగాణలో మార్పు తథ్యంమని, తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. తెలంగాణలో బడుగు, బలహీన, గిరిజనులు, మహిళలకు కేంద్ర ప్రభుత్వ పథకాలతో లాభం జరుగుతోందని, కానీ, ఇక్కడ పేర్లు మార్చి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని తెరాస ప్రభుత్వం తీరుపై మోదీ విమర్శలు గుప్పించారు. తెలంగాణ సామర్థ్యం ఏంటో మనకు తెలుసని, ఇక్కడి ప్రజల సత్తా ఏంటో తెలుసని, గతంలో జరిగిన కొన్ని ఎన్నికల ఫలితాలు స్పష్టమైన సంకేతాలిస్తున్నాయని, తెలంగాణలో మార్పు ఖాయమని తేలిపోయిందని, తెలంగాణలో బీజేపీకి అధికారం ఖాయమంటూ మోదీ అన్నారు.


TeluguCentralnews

May 26 2022, 10:03

ఈ రోజు దేశ వ్యాప్తంగా పెట్రోల్, డిజిల్ ధరలు...

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 96.76  

డిజిల్ రేటు రూ. 89.66 

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర రూ.111.33  

డీజిల్ రేటు రూ. 97.26

 బెంగళూరులో పెట్రోల్ ధర 101.92

 డీజిల్ ధర రూ. 87.87

 చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.62 

డీజిల్ రేటు రూ. 94.22 

కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 106.01, 

డీజిల్ ధర రూ. 92.74

హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 109.64  

డీజిల్ ధర రూ 97.8 

వైజాగ్‌లో పెట్రోల్ ధర రూ.110.46 

డీజిల్ రేటు రూ.98.25  

 

 కడపలో పెట్రోల్ ధర లీటరుకు రూ.110.68  

డీజిల్ ధర రూ. 98.48

 చిత్తూరులో పెట్రోల్ ధర లీటరుకు రూ. 112.59గా, డీజిల్ రేటు రూ.100.23గా ఉన్నాయి.


TeluguCentralnews

May 25 2022, 14:17

Kapil Sibal:కాంగ్రెస్ కు భారీ షాక్..!పార్టీని వీడిన కపిల్ సిబల్

దిల్లీ : వరుస పరాజయాలతో కుదేలవుతోన్న కాంగ్రెస్‌ పార్టీ సంస్కరణలకు సిద్ధమవుతోన్న వేళ.. ఆ పార్టీకి తాజాగా భారీ షాక్‌ తగిలింది.సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్‌ సిబల్‌ పార్టీకి రాజీనామా చేశారు. తాను కాంగ్రెస్‌ను వీడినట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. అంతేకాకుండా సమాజ్‌వాజ్‌ పార్టీ తరపున రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్‌ దాఖలు చేశారు. మే 16నే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు.

ఇదిలాఉంటే, కాంగ్రెస్‌ పార్టీలో సంస్థాగత మార్పులపై పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ బహిరంగంగానే తన గళాన్ని వినిపించారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ రెబల్‌గా మారిన జీ-23 బృందంలోనూ కపిల్‌ సిబల్‌ ఉన్నారు. పార్టీ మొత్తం గాంధీ కుటుంబం చేతుల్లోనే ఉండడాన్ని వ్యతిరేకిస్తోన్న ఆయన.. అధ్యక్షుడు కానప్పటికీ నిర్ణయాలన్నీ రాహుల్‌ గాంధీనే తీసుకుంటారని పలుసార్లు విమర్శించారు. ఇలా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కపిల్‌ సిబల్‌ చివరకు పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు.