Telangananews

Jun 03 2022, 10:58

దేశ వ్యాప్తంగా కరోనా అప్డేట్స్... పెరిగిన కరోనా కేసుల సంఖ్య ...

దేశం లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు… ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 4041 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,31,68,585 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 21,177 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 10 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,24,651 కి చేరింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2363 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,26,22,757 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,93,83,72,365 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 12,05,840 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.


Telangananews

Jun 03 2022, 10:49

ఇక నుండి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఎత్తివేత...

గృహ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ పైన సబ్సిడీని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. దీనితో సామాన్య ప్రజలు ఇకపై గ్యాస్ బండ ఖరీదు ఎంత వుంటే అంత చెల్లించాల్సి వుంటుంది. కేవలం ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పొందినవారికి మాత్రమే సబ్సిడీ వర్తిస్తుందని తెలిపింది.

ప్రస్తుతం ఎల్పిజీ సిలిండర్ ధర రూ. 1000కి పైనే వుంది. ఇందులో కొంతమొత్తం కేంద్రం సబ్సిడీగా ఇచ్చేది. ఇప్పుడు దాన్ని ఎత్తివేశారు. దీనితో సామాన్య ప్రజలకు గ్యాస్ బండతో కేంద్రం షాకిచ్చింది. మొత్తం 21 కోట్ల మందికి కేంద్రం తీసుకున్న సబ్సిడీ రద్దు వర్తించనుంది.

సబ్సిడీలను గత కొంతకాలంగా ఎత్తివేస్తూ వస్తోంది మోదీ ప్రభుత్వం. 2010లో పెట్రోలు పైనా, 2014లో డీజిల్ పైనా, 2016లో కిరోసిన్ పైనా సబ్సిడీ ఎత్తివేసారు. ఇప్పుడిక 2022లో గ్యాస్ బండపైన సబ్సిడీ ఎత్తివేసింది కేంద్రం.


Telangananews

May 27 2022, 18:08

జ్ఞాపకశక్తి మెరుగు పరుచుకోవడానికి చిట్కాలు...


మెదడు మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. శరీరంలోని ప్రతి భాగం మనస్సుతో మాత్రమే పనిచేస్తుంది. ఆలోచించే.. అర్థం చేసుకునే సామర్థ్యం కూడా మనస్సుపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు.. మెదడు చేతికి సిగ్నల్ పంపినప్పుడు.. మన చేతి మాత్రమే కొంత పని చేస్తుంది. మెదడు సంకేతాలు పంపకపోతే.. చేతులు కూడా పని చేయవు. అందువల్ల, శరీరం సరైన పనితీరు కోసం, మనస్సును ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. ఇటీవల, యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా పరిశోధకులు ఒక అధ్యయనం చేసారు. ఇది క్రాన్‌బెర్రీస్ ఫ్రూట్స్‌(Cranberry fruit) తినడం వల్ల మెదడు పదును పెట్టవచ్చు.. అంతే కాదు చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మానసిక వైకల్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. క్రాన్బెర్రీ ఎరుపు రంగులో ఉండే పండు.. దీని పరిమాణం చాలా చిన్నదిగా ఉంటుంది. ఔషధ గుణాలు, పోషకాలతో సమృద్ధిగా ఉన్న క్రాన్బెర్రీస్ అనేక ప్రయోజనాలను కలిగి ఉంది.

12 వారాలలో ప్రభావం కనిపిస్తుంది

క్రాన్బెర్రీస్ రుచి చాలా చేదుగా ఉంటుంది. క్రాన్‌బెర్రీ యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా చేసిన పరిశోధన ప్రకారం.. క్రాన్‌బెర్రీ పౌడర్‌ను తినే వ్యక్తులు 12 వారాల తర్వాత మెరుగైన జ్ఞాపకశక్తిని పొందినట్లుగా నిర్ధారణ జరిగింది. అతనికి MRI చేసినప్పుడు.. అతని మెదడులోని ముఖ్యమైన భాగాలకు రక్త ప్రసరణ బాగా జరిగింది. ఇది కాకుండా, ఆ వ్యక్తుల చెడు కొలెస్ట్రాల్ స్థాయి కూడా 9 శాతం తగ్గింది.

పరిశోధకుల బృందం ఇచ్చిన నివేదిక ప్రకారం.. క్రాన్బెర్రీ మెదడును మెరుగుపరుస్తుంది. వాస్తవానికి, ఎల్‌డిఎల్ ‘చెడు’ కొలెస్ట్రాల్ ధమనులలో పేరుకుపోతుంది. మెదడుకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది. క్రాన్‌బెర్రీ తీసుకోవడం వల్ల మెదడులో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మార్కెట్‌లో లభించే క్రాన్‌బెర్రీ జ్యూస్‌ని తాగే బదులు పచ్చి క్రాన్‌బెర్రీస్ తినాలని వైద్యులు సూచిస్తున్నారు. దీని ఘాటైన.. చేదు రుచి చాలా మందికి నచ్చకపోవచ్చు కానీ ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

పరిశోధనలో 60 మంది పాల్గొన్నారు

ఈ పరిశోధనలో 60 మంది పాల్గొన్నారు. అందులో సగం మంది 50 నుంచి 80 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. 60 మందికి 4.5 గ్రాముల ఎండిన క్రాన్‌బెర్రీ పౌడర్ ఇవ్వబడింది. ఇతరులకు ప్లేసిబో ఇవ్వబడింది. ఈ పరిశోధనలో పెద్ద అనారోగ్యం ఉన్నవారు. మందులు వాడేవారు లేదా ఎక్కువగా ధూమపానం చేసిన వ్యక్తులు చేర్చబడలేదు. దీని తరువాత, ప్రతి ఒక్కరి రక్త నమూనాలు MRI స్కాన్‌లు సమీక్షించబడ్డాయి. ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడ్డాయి. అధ్యయనంలో ప్రధాన రచయిత డాక్టర్ డేవిడ్ వజౌర్ ప్రకారం, 12 వారాల తర్వాత, క్రాన్‌బెర్రీ పౌడర్‌ని తినే సమూహం వారి మెదడులోని ముఖ్యమైన భాగాలకు జ్ఞాపకశక్తిని మరియు మెరుగైన రక్త ప్రసరణను గణనీయంగా మెరుగుపరిచింది.

ఈ పరిశోధనలో వచ్చిన నిర్ధారణలు మెరుగ్గా ఉన్నాయి. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, కేవలం 12 వారాలలో, క్రాన్బెర్రీ జ్ఞాపకశక్తిని, నాడీ పనితీరును మెరుగుపరచడం ప్రారంభించింది. క్రాన్‌బెర్రీ రాబోయే కాలంలో మెరుగైన పరిశోధనలకు దోహదపడుతుంది.


Telangananews

May 26 2022, 14:49

ప్రధాని మోడీ పర్యటన - పొలిటికల్ హీట్... ప్రధానికి రేవంత్ రెడ్డి తొమ్మిది ప్రశ్నలతో బహిరంగ లేఖ

ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఇవాళ హైదరాబాద్ రానున్న ప్రధానికి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తొమ్మిది ప్రశ్నలతో ఆయన లేఖ రాశారు. తెలంగాణ ప్రజలు అంటే ఎందుకంత చులకన అని అన్నారు. పార్లమెంట్ లో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు మోడీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టులో అవినీతిపై సీబీఐ విచారణ జరిపించడానికి మీకున్న ఇబ్బందేంటని ప్రశ్నించారు. కేవలం కమీషన్ల కోసమే కేసీఆర్ ఆ ప్రాజెక్టును రీడిజైన్ చేశారని ఆరోపించారు

నిజామాబాద్ లో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందని అడిగారు. ఐటీఐఆర్ రద్దు చేశారు..స్టీల్ ఫ్యాక్టరీ ఊసేలేదు..మీ దృష్టిలో తెలంగాణకు అంత అప్రధాన్యత దేనికన్నారు. ఒడిస్సాలోని నైనీ కోల్ మైన్స్ టెండర్ల కుంభకోణంలో కేసీఆర్ బంధువుల పాత్ర ఉందని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ పై ఈగ వాలకుండా కాపాడుతున్నది మీరు కాదా అని నిలదీశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏమైందని ప్రశ్నించారు.

ఇక గిరిజన యూనివర్సిటీకి ఇప్పటికీ అతిగతీ లేదు..పైగా అదిలాబాద్ లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను మూసివేశారు..దీనిపై స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారా లేదా చెప్పాలన్నారు. రైతుల చావులకు బాధ్యులు మీరు కాదా అని ప్రశ్నించారు. రామయణ సర్క్యూట్ లో భద్రాద్రి రాముడికి చోటెందుకు ఇవ్వలేదని క్వశ్చన్ చేశారు. ఈ ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్తారని ఆశిస్తున్నట్లు రేవంత్ తెలిపారు.


Telangananews

May 26 2022, 14:38

నేటి నుంచి బ్యాంకు లలో కొత్త రూల్స్‌ అమలు...

ఒక ఏడాదిలో బ్యాంకుల నుంచి రూ.20 లక్షలకు మించి విత్‌డ్రా లేదా డిపాజిట్‌ చేస్తే ప్రజలు కచ్చితంగా పాన్‌ లేదా ఆధార్‌ నంబర్‌ ఇవ్వాల్సిందే. కో ఆపరేటివ్‌ బ్యాంకులు, పోస్టాఫీసుల్లోనూ ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కరెంట్‌ ఖాతా ఓపెన్‌ చేస్తున్నప్పుడూ ఇవే నిబంధనలు వర్తిస్తాయని కేంద్ర ప్రత్యక్ష్య పన్నుల శాఖ ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసింది. నేటి నుంచి ఈ కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి.

ఎవరైనా అధిక విలువ గల లావాదేవీలు చేయాలనుకున్నప్పుడు, వారికి పాన్‌కార్డ్‌ లేకపోతే ఆధార్‌ నెంబర్ ఇచ్చేందుకు అవకాశం కల్పించారు. గతంలో ఒక రోజులో 50 వేలకు మించి డిపాజిట్‌ చేస్తే పాన్‌ కార్డు అవసరం అయ్యేది. 114బీ నిబంధన పరిధిలో ఉన్నందున ఏడాది కాలంలో నగదు డిపాజిట్లు, విత్‌డ్రావల్స్‌పై పరిమితి ఉండేది కాదు. అంతేకాకుండా బ్యాంకులో డిపాజిట్‌ చేసినప్పుడు మాత్రమే ఈ నిబంధన వర్తించేది.

ఒకవేళ బ్యాంకులో ఏడాదిలో రూ.20 లక్షలకు మించి డిపాజిట్‌ లేదా విత్‌డ్రావల్‌ చేసినప్పుడు పాన్‌ లేకుంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. వారం రోజుల్లోగా దరఖాస్తు చేస్తామని ధ్రువీకరించాలి. ఆర్థిక నేరాలు, మోసాలు అరికట్టేందుకు, అత్యధిక విలువగల లావాదేవీలను పన్నుల శాఖ పర్యవేక్షించేందుకు ఈ నిబంధనలు తీసుకొస్తున్నారు. అంతేకాకుండా నగదు లావాదేవీలను గమనించేందుకూ ఇది ఉపయోగపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల పన్ను రిటర్నులు దాఖలు చేయకుండా తప్పించుకునే వారిని కట్టడి చేసేందుకు వీలవుతుందని అంటున్నారు.


Telangananews

May 26 2022, 14:24

కేసీఆర్ బెంగళూరు పర్యటన మాజీ ప్రధాని దేవగౌడ తో భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువారం బెంగళూరు పర్యటనకు బయలుదేరారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. ఈ మేరకు మధ్యాహ్నం మాజీ ప్రధాని దేవగౌడ నివాసానికి చేరుకుని.. ఆయనతో పలు విషయాలపై చర్చించనున్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, జాతీయ రాజకీయాలు, రైతుల సమస్యలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, భవిష్యత్ కార్యచరణపై మాజీ ప్రధాని దేవగౌడ, కుమారస్వామితో చర్చించనున్నారు.

సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటన సందర్భంగా అక్కడ భారీ కటౌట్లతో ఉన్న ఫ్లెక్సీలు వెలిశాయి. దేశ్‌కి నేత అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటనలో పలు అంశాలపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో జరగబోయే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల అంశాలపై కూడా మాట్లాడనున్నారు. సమావేశం ముగిశాక తిరిగి సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ రానున్నారు.


Telangananews

May 26 2022, 14:16

తెలంగాణలో బీజేపీ రావడ ఖాయం : బేగంపేట ఎయిర్‌ పోర్టు సభలో ప్రధాని మోడీ

ప్రధాని మోడీ హైదరాబాద్‌లో నేడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో హెచ్‌సీయూకు ప్రధాని మోడీ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా బీజేపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అయితే బేగంపేట ఎయిర్‌ పోర్టులో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని తెలుగులో… పట్టుదలకు, పౌరుషానికి మారుపేరైన తెలంగాణ ప్రజలకు నమస్కారం అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. పట్టుదలకు, పౌరుషానికి తెలంగాణ ప్రజల పేరుందని, తెలంగాణ ఎప్పుడొచ్చిన మీ రుణం పెరగిపోతోందని అనిపిస్తోందన్నారు.

అంతేకాకుండా.. ఇంత ఎండలోనూ మీరు నాకు ఘన స్వాగతం పలికారని మీ ప్రేమే నా బలం అని.. బీజేపీ ఒక్కొక్క కార్యకర్త సర్దార్‌ పటేల్‌ ఆశయాల కోసం పోరాడుతారని మోడీ అన్నారు. భారతదేశానికి సేవ చేసేందుకు మనమంతా పనిచేస్తామన్నారు. పటేల్ ఆశయాలను బీజేపీ కార్యకర్తలు ముందు తీసుకెళ్లాలని, బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్న విషయం నా దృష్టికి వచ్చిందన్నారు. అంతేకాకుండా తెలంగాణను టెక్నాలజీ హబ్‌గా మార్చామన్నారు. అంతేకాకుండా తెలంగాణలో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలి అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ రావడం ఖాయమని మోడీ ఉద్ఘాటించారు.


Telangananews

May 26 2022, 10:12

TS : రానున్న రెండ్రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు... - హైదరాబాద్ వాతావరణ కేంద్రం

తెలంగాణలో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముంది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు కురిసే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

అయితే రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. ఓవైపు ఎండలు మండుతుంటే.. మరోవైపు అక్కడక్కడ వానలు పడుతున్నాయి. ఇక కర్ణాటక నుంచి తమిళనాడు వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. 

బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం నైరుతి ప్రాంతాలకు గురు, శుక్ర వారాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశాలున్నాయని వివరించింది.

ఇక మంగళవారం ఉదయం నుుంచి బుధవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు పడ్డాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే అదే జిల్లాలోని నెన్నెలలో 3.2 సెంటీమీటర్ల వాన పడింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మందలపల్లిలో 2.6 సెంటీ మీటర్లు, నిర్మల్ జిల్లాలోని తాండ్రలో 2.5 సెంటీమీటర్ల వాన కురిసింది. మరోవైపు ఇతర ప్రాంతాల్లో ఎండలు మండాయి. 

బుధవారం మధ్యాహ్నం అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్‌లో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.


Telangananews

May 26 2022, 09:10

TS : చార్మినార్‌లోని లాడ్ బజార్‌లో భారీ అగ్నిప్రమాదం

 చార్మినార్‌లోని లాడ్ బజార్‌లో రెండంతస్తుల భవనంలో ఉన్న ఓ బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో క్రమంగా మంటలు షాప్‌ మొత్తం వ్యాపించడంతో.. దుకాణం పూర్తిగా దగ్ధమయింది. పెద్దఎత్తున మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా పొగలు కమ్ముకున్నాయి. దీన్ని గమనించిన స్థానికి వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బంఇ సమాచారం అందించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరకున్నారు.

ఫైర్‌ ఇంజన్‌ సాయంతో దాదాపు 2 గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. అయితే.. షాట్‌సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ నేపథ్యంలో.. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని, కానీ.. ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. ఎంత మేరక ఆస్తి నష్టం వాటిల్లిందో అంచనా వేస్తున్నామన్నారు.


Telangananews

May 25 2022, 15:16

పూజల నెపంతో.. యువతిపై లైంగిక వాంఛ తీర్చకున్న దొంగ బాబా..

నేటి సమజంలో అత్యాచారాలు నిత్యకృత్యంగా మారాయి. ఎక్కడ చూసిన చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిపైనా కామాంధులు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. సందు దొరికితే చాలు.. స్త్రీలపై పడి తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఇంట్లో సమస్యలు ఉన్నాయని మీ సమస్యలను తీర్చుతానంటూ ఓ దొంగ బాబా యువతిని నగ్నంగా చేసి పూజల పేరుతో శారీరక వాంఛ తీర్చకున్నాడు. వివరాల్లోకి వెళితే.. సదరు పూజారి పేరు నరేష్. హిసార్‌లోని ఆజాద్‌ నగర్‌లో స్థలం కొన్న నరేష్.. అక్కడ ఇంటి నిర్మాణం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆజాద్ నగర్ వచ్చినప్పుడు బాధితురాలి ఇంటికి వచ్చేశాడు. ఆ కుటుంబంలో భర్త సీఆర్‌పీఎఫ్ జవానుగా వేరే రాష్ట్రంలో పని చేస్తున్నాడు.

ఈ క్రమంలో తల్లీకూతుళ్లను దగ్గరలోని ఆలయానికి తీసుకెళ్లిన అతను.. వారి జీవితాల్లో కొన్ని కష్టాలు ఉన్నాయని, అవి తొలగిపోవాలంటే పూజలు చేయాలని చెప్పాడు. ఈ కారణంతో ఆ ఇంటికి తరచూ వస్తూ.. యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తను చేసిన పాడుపనిని వీడియో తీసి ఆమెను బ్లాక్‌మెయిల్ చేశాడు. అలాగే పూజల పేర్లు చెప్పి రూ.1.15 లక్షలు కాజేశాడని బాధితురాలు పోలీసులకు చెప్పింది. అలాగే కొన్ని నగలు కూడా తీసుకున్నట్లు వాపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సదరు పూజారి నరేష్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు పోలీసులు.