మండలంలో వెలుగులు నింపుతున్న విధ్యుత్ ఏఈ ఆస శంకర్
![]()
అభివృద్ధి పనులతో ప్రశంసలు
మొగుళ్లపల్లి మండల ఎన్ పి డి సి ఎల్ ఏఈ ఆస శంకర్ మండలంలోని గ్రామాలలో విద్యుత్ వెలుగులను ప్రసరింప చేస్తున్నారు. సబ్ ఇంజనీర్ నుంచి అసిస్టెంట్ ఇంజనీర్ గా పదవి చేపట్టినప్పటి నుంచి విద్యుదీకరణ కోసం అనేక పనులు చేపట్టారు. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ఆరేపల్లి గ్రామంలో లింగమ్మ- రాఘవులు దంపతులకు జన్మించిన ఆస శంకర్ 1 నుంచి 9వ తరగతి వరకు గోదావరిఖనిలోని యుపిఎస్ పాఠశాలలో, పదవ తరగతి కరీంనగర్ లోని మల్టీపర్పస్ హైస్కూలులో, వనపర్తిలోని కేడిఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమా, హైదరాబాదులోని జె ఎన్ టి యు కళాశాలలో బీటెక్ విద్యనభ్యసించిన ఆయన 2005 సంవత్సరంలో సబ్ ఇంజనీర్ గా బాధ్యతలను స్వీకరించి 2005 నుంచి 2010 సంవత్సరం వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హార్ మండలంలోని కొయ్యూరులో, 2010 నుంచి 2015 సంవత్సరం వరకు పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని ఓడెడులో, 2015 నుంచి 2017 జూలై వరకు పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ లో సబ్ ఇంజనీర్ గా సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందారు. 2017 సంవత్సరంలో ప్రమోషన్ పొంది మొగుళ్లపల్లి అసిస్టెంట్ ఇంజనీర్ గా బాధ్యతలను స్వీకరించారు. నాటి నుంచి నేటి వరకు వినియోగదారులకు, రైతులకు నాణ్యమైన విద్యుత్ ను అందించడానికి 352 ట్రాన్స్ఫార్మర్లను అమర్చారు. ఉడియుజివివై పథకం కింద 1425 మంది లబ్ధిదారులకు 1032 ఫోల్స్, 33 ట్రాన్స్ఫార్మర్లను అమర్చి గ్రామాలను విద్యుదీకరణ చేశారు. మండలంలో లైన్ కింద 522 ఫోల్స్ వేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. చిట్యాల నుంచి మొట్లపల్లి వరకు వెళ్లే 33 కెవి లైన్ ఇంటర్ లింకింగ్ కింద మొగుళ్లపల్లి సబ్ స్టేషన్ వద్ద 2.28 మీటర్ల లైన్ వేసి విద్యుత్ కు అంతరాయం ఏర్పడకుండా చర్యలు చేపట్టారు. అకినపల్లి సబ్ స్టేషన్ నుంచి టేకుమట్ల సబ్ స్టేషన్ మధ్యలో 6 కిలోమీటర్ల వరకు 33 కెవి లైన్ వేసి రైతులకు విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా కృషి చేశారు. అలాగే మొదటి విడత పల్లె ప్రగతి కార్యక్రమం కింద మండలంలో 474 ఫోల్స్ మరియు 44 కిలోమీటర్ల మేర వీధి దీపాల వైర్లు వేసి గ్రామాలలో వెలుగులు విరజిమ్మేలా కృషి చేశారు. నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొగుళ్లపల్లి, పాత ఇస్సిపేట, పిడిసిల్ల గ్రామాలలో వీధిలైట్ల సౌకర్యార్థం మూడవ వైర్ వేయడంతో ఆయన విధుల నిర్వహణ పట్ల విద్యుత్ వినియోగదారులు, రైతాంగం నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.
Jun 02 2022, 17:31