Andrapradesh

Nov 22 2021, 20:08

చిత్తూరు జిల్లా

 


తిరుపతి టీటీడీ అటవీ కార్మికుల సమస్యలపై నవంబరు 26న భారీ నిరసన ... 365 రోజులకు చేరుకుంటున్న నిరాహార దీక్షలు

 

ఏడాది కాలంగా దీక్షలు చేస్తున్నా టిటిడి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం టిటిడి అటవీ కార్మికుల గురించి పట్టించుకోకపోవడం అన్యాయమని, నవంబరు 26న భారీ నిరసనను చేపట్టనున్నామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘం గౌరవాధ్యక్షులు కందారపు మురళి ప్రకటించారు. తిరుపతి ఎంబి భవన్ లో సోమవారం నాటి ఉదయం కె. సురేష్ అధ్యక్షతన కార్మికుల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కందారపు మురళి ప్రసంగిస్తూ గత ఏడాది నవంబరు 26న టిటిడి అటవీ కార్మికులు సమస్యల పరిష్కారంకై రిలే నిరాహార దీక్షలు చేపట్టారని, ఈ ఏడాది కాలంలో 14 సార్లు భారీ నిరసన కార్యక్రమాలతో పాటు, 365 రోజులుగా నిరాహార దీక్షలు సాగిస్తున్నా, టిటిడి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. టిటిడి పాలక మండలిలో అటవీ కార్మికులకు టైం స్కేల్ ఇస్తామని తీర్మానం చేసి, రెండేళ్లు పూర్తయినా అమలు చేయలేదని, హైకోర్టు ఆదేశాలను, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీని అమలు పరచలేదని తీవ్రంగా విమర్శించారు. 26న చేపట్టే నిరసన కార్యక్రమంలో అన్ని పక్షాల నేతలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అటవీ కార్మికుల సంఘం నేతలు ఈశ్వర్ రెడ్డి, పురుషోత్తం, మునిరాజా, వెంకటరెడ్డి, వాసు, మునికృష్ణ, మల్లికార్జునతో పాటు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు... 

Andrapradesh

Nov 22 2021, 19:10

రాయల చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉంది..చెవిరెడ్డి హెచ్చరికలు

 


తిరుపతిలో రాయల చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని సమీప ప్రజలు పునరావాసా కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదిక ద్వారా పలు ట్వీట్స్ చేశారు. ఒక వేళ రాయలచెరువు కట్ట తెగిపోతే సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్దంగా ఉన్నాయని, హెలికాఫ్టర్‌లను కూడా సిద్దం చేశామని ప్రకటించారు. తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఆర్సీపురం ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి, ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు రాయలచెరువు కట్టను పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు.

 

 రాయలచెరువు గండి పడి నీరు లీకేజీ అవుతున్న ప్రాంతంలో ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి రాయలచెరువు ముంపు ప్రాంత గ్రామాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఎప్పటికప్పుడు వరద ఉదృతిని పరిశీలిస్తూ, చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆయన సూచించారు. మరో రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఆయన హెచ్చరించారు. రామాపురంలోని వెరిటాస్‌ సైనిక్‌ స్కూలు, గంగిరెడ్డిపల్లెలోని ఏఈఆర్‌ ఎంబీఏ కళాశాల, కమ్మకండ్రిగ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, తిరుచానూరులోని పద్మావతి నిలయంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో 2 వేల కుటుంబాలకు వసతి, భోజన సదుపాయం కల్పించామన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. తాము చర్యలు తీసుకోవడం జరిగిందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెల్లడించారు.

 

 దిగువ ప్రాంతానికి నీరు లీకవుతుండడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఏ క్షణమైనా రాయల చెరువు కట్ట తెగే ప్రమాదం  ఉండడంతో.. నీటి మట్టాన్ని, గండిని పరిశీలించారు కలెక్టర్‌ హరి నారాయణ్‌, ఎస్పీ వెంకట అప్పలనాయుడు. గండి పూడ్చివేత పనులను పరిశీలించారు. ముందస్తు చర్యగా సుమారు 20 గ్రామాల  ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముంపు బాధితులకు రెండు సురక్షిత కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నారు రెవెన్యూ అధికారులు. లోతట్టుప్రాంతాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు హెచ్చరించారు. కొండ ప్రాంతాల నుంచి చేరిన వర్షపునీరుతో రాయల చెరువు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరింది.

 దీంతో చెరువు దిగువనున్న ముళ్లపూడి, పాడిపేట, కుంట్రపాకం, తనపల్లి, పద్మవల్లి పురం, బలిజ పల్లి, గంగిరెడ్డి పల్లి గ్రామాలకు ముంపు పొంచి ఉంది. సంతబైలు, ప్రసన్న వెంకటేశ్వరపురం, నెన్నూరు, సంజీవరాయపురం, కమ్మపల్లి గ్రామాలకు వరద పోటెత్తే ప్రమాదం ఉంది.  గొల్లపల్లె, కమ్మ కండ్రిగ, నడవలూరు, వెంకట్రామపురం, రామచంద్రాపురం, మెట్టూరు గ్రామాల ప్రజలనూ అధికారులు అప్రమత్తం చేశారు. ఆయా గ్రామాలను ప్రజలంతా ఖాళీ చేయాలని హెచ్చరించారు. రాయల చెరువుకు చిన్న గండి పడడంతో.. ఈ రూట్‌లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. 

 రాయల చెరువుకు పడిన చిన్న గండితో ప్రస్తుతానికి ప్రమాదమేమీ లేదన్నారు కలెక్టర్‌ హరినారాయణ్‌. అయితే చెరువు ఏ క్షణమైనా తెగే ప్రమాదం ఉందని.. ముందస్తు చర్యగా ప్రజల ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా అలర్ట్‌ ప్రకటించామన్నారు.* 

Andrapradesh

Nov 22 2021, 18:51

కృష్ణా జిల్లా ఎస్పీ తనదైన శైలిలో మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు

 


తనతో సమానంగా విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లను తన ప్రక్కనే ప్రెస్ మీట్ లో కూర్చోబెట్టిన జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్..

 

పోలీస్ శాఖలో ఏదైనా కేసును ఛేదించితే, కేసు చేదనలో కృషి చేసిన సిబ్బందికి కాకుండ పోలీస్ ఆఫిసర్లకు మాత్రమే గౌరవం దక్కేది..

 

విధి నిర్వహణలో ర్యాంకులతో సంబంధం లేదని అత్యుత్తమ ప్రతిభ కనబరిస్తే ప్రతి ఒక్కరికి తన పక్కన సముచిత స్థానం ఉంటుందని నిరూపించారు కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్

మునుపెన్నడూ లేనివిధంగా అవనిగడ్డ బాలుడి కిడ్నాప్ కేసును చేదించడంలో కృషి చేసిన కానిస్టేబుల్స్ యొక్క ప్రతిభను గుర్తించి, ప్రత్యేకంగా అభినందించి, వారిని తన పక్కన కూర్చోబెట్టుకుని, విలేఖరుల సమావేశం నిర్వహించి,తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు కృష్ణా జిల్లా ఎస్పీ....

ఆయన పక్కనే కూర్చోబెట్టి ఆయనతో సమానంగా ఇచ్చిన గౌరవానికి కృతజ్ఞతలు తెలిపిన కానిస్టేబుల్స్...

 ఇలాంటి ఎస్పి జిల్లాకు వచ్చినందుకు తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేసిన కానిస్టేబుల్స్... 

Andrapradesh

Nov 22 2021, 17:00

నందలూరు లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ల మీడియా సమావేశం...

 సోము వీర్రాజు కామెంట్స్...

 


వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించడం జరిగింది...

 

అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడానికి అధికారుల నిర్లక్ష్యం కారణం.

వైసీపీ నేతలకు బెడిసి అధికారులు సరైన సమయం లో స్పందించలేదు..


ఇసుక రీచ్ ల కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టిన వైసీపీ..


వరద ప్రభావిత గ్రామాల్లో ప్రజలు చాలా నష్టపోయారు..


ఇలాంటి నష్టం గతంలో ఎప్పుడూ చూడలేదు..

నష్ట నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి..

చనిపోయిన వారి కి 5 లక్షలు మాత్రమే జగన్ కేటాయించారు..

విశాఖ లో మాత్రం కోటి రూపాయలు నష్టపరిహారం అందించారు..

సీఎం సొంత జిల్లాలో ఇలాంటి ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు.

సర్వం కోల్పోయిన వారికి నష్టపరిహారం వెంటనే అందించాలి..


ప్రతి ఒక్క కుటుంబానికి 5 లక్షలు ఎక్స్గ్రేషియా అందించాలి..

సీఎం ఏరియల్ సర్వే చేయడం కాదు..

ప్రతి గ్రామంలో సీఎం పర్యటించాలి..


ఇప్పటికే ప్రధాని సీఎం జగన్ తో మాట్లాడారు.. 

Andrapradesh

Nov 22 2021, 16:58

ఇప్పుడు ఇంటర్వెల్‌ మాత్రమే.. శుభం కార్డుకు చాలా సమయం ఉంది'

 


మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై మంత్రి పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..  న్యాయపరమైన చిక్కుల వల్లే ఈ పరిస్థితి ఉండొచ్చు. కేబినెట్‌ సమావేశంలో నేను లేను. పూర్తి వివరాలు తెలీదు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం. ఇప్పుడు ఇంటర్వెల్‌ మాత్రమే. శుభం కార్డుకు చాలా సమయం ఉంది. రాజధాని పేరుతో ఉద్యమం చేసేది పెయిడ్‌ ఆర్టిస్టులే అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.* 

 

 ఇదే విషయంపై మంత్రి కొడాలి నాని స్పందిస్తూ.. కొందరు కోర్టుకెళ్లి అడ్డంకులు సృష్టించారు. అమరావతిపై ఏపీ కేబినెట్‌లో చర్చించాం. కేబినెట్‌ నిర్ణయాన్ని అసెంబ్లీలో వివరిస్తామని మంత్రి కొడాలి నాని అన్నారు. 

 

 కాగా, మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు అడ్వకేట్‌ జనరల్‌ తెలిపారు. మూడు రాజధానులపై అసెంబ్లీలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కాసేపట్లో అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ అధికారికంగా ప్రకటిస్తారని ఏజీ కోర్టుకు తెలిపారు. 

Andrapradesh

Nov 22 2021, 14:34

అమరావతి రైతుల విజయం తథ్యం అని ముందే చెప్పా 

 


రైతుల విజయానికి అమిత్ షా కూడా కారణమే 

 

ఇక ఎలాంటి మెలికలు పెట్టే సాహసం జగన్ చేయలేడు ఇక నుంచి అయినా రాష్ట్రాభివృద్ధిపై దృష్టిపెట్టాలి 

 

నేను కూడా అమరావతి కోసం ముడుపు కట్టాను 

ఇది కచ్చితంగా రైతుల విజయమే 

జగన్ ఇకపై పిచ్చి నిర్ణయాలు తీసుకోరని అనుకుంటున్నా 

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు 

Andrapradesh

Nov 22 2021, 14:33

మూడు రాజధాని ల బిల్లును వెనక్కి తీసుకోవడం పై మాజీ మంత్రి శ్రీ నక్కా.ఆనంద్ బాబు స్పందన

 


★వీళ్ళు మొట్టమొదటి సారిగా బిల్లు ప్రవేశపెట్టినప్పుడే రాజ్యాంగ విరుద్ధం గా అప్రజాస్వామికం గా ప్రవేశపెట్టారు.
★ఈ రోజు అమరావతి పై రోజువారీ విచారణ కోర్ట్ లో జరుగుతుంది.
★ ఎక్కడ వీళ్ల భాగోతం బయటపడుతుందో అని హడావుడి గా బిల్ ను వెనక్కి తీసుకుంటున్నాం అని చెపుతున్నారు.
★నాకైతే నమ్మకం కుదరడం లేదు ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసే వరకు
★మంత్రులు కొడాలి నాని ఏమో టెక్నికల్ ప్రాబ్లమ్ అంటున్నాడు.
★పెద్దిరెడ్డి అయితే అహంకార ధోరణి తో రైతులను పెయిడ్ ఆర్టిస్ట్ లు అంటున్నాడు. మంత్రుల ప్రవర్తన,మాట తీరు సరిగా లేదు
★శాసన సభ లో ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన తరువాత పూర్తిగా స్పందిస్తా. 

Andrapradesh

Nov 22 2021, 13:26

మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం

 మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చట్టాన్ని ఉపసంహరించుకున్నట్లు ఆ రాష్ట్ర హైకోర్టుకు ఏపీ అడ్వకేట్ జనరల్​ తెలిపారు. వికేంద్రీకరణ బిల్లును మంత్రి వర్గం రద్దు చేసిందని.. చట్టం రద్దుపై అసెంబ్లీలో కాసేపట్లో సీఎం జగన్ ప్రకటన చేయనున్నట్లు కోర్టుకు చెప్పారు. త్రిసభ్య ధర్మాసనానికి ఏజీ వివరాలు అందజేశారు. ఈ అంశంపై విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ఏపీ హైకోర్టు తెలిపింది.మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకున్న ఏపీ రాష్ట్ర మంత్రివర్గ భేటీ ముగిసింది. చట్టం ఉపసంహరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశముంది. మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమరావతి ఐకాస స్వాగతించింది. ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఏ సర్కారైనా వెనక్కి తీసుకోవాల్సిందేనని పేర్కొంది. అమరావతిని రాజధానిగా చేస్తూ.. త్వరగా అభివృద్ధి చేయాలని కోరింది. అమరావతిని విమర్శించిన వాళ్లంతా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. తమ మహాపాద యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేసింది. 

Andrapradesh

Nov 22 2021, 11:45

మూడు రాజధానులు బిల్లు ను ఉపసంహరించుకున్నట్లు హైకోర్టుకు తెలిపిన అడ్వకేట్ జనరల్

 


మూడు రాజధానులు అంశంపై ఏపీ హైకోర్టులో గత కొద్దిరోజులుగా జరుగుతున్న విచారణ

 

నేటి వాదోపవాదాల్లో భాగంగా మూడు రాజధానుల బిల్లు ఉపసంహటించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపిన అడ్వకేట్ జనరల్

 

ఇదే అంశంపై ఏపీ సచివాలయంలో కొనసాగుతున్న అత్యవసర కేబినెట్ సమావేశం

ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో అన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ.. 

Andrapradesh

Nov 22 2021, 11:12

చెన్నై మార్గంలో భారీగా రైళ్ల రద్దు

 


విజయవాడ డివిజన్‌ పరిధిలోని నెల్లూరు-పడుగుపాడు సెక్షన్‌లో రైలు పట్టాలపై నీళ్లు చేరి ట్రాక్‌ పాక్షికంగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో చెన్నై వైపు వెళ్లే పలు రైళ్లు రద్దయ్యాయి. దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ మరమత్ములు చేపట్టారు. చెన్నై మార్గంలో నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేయడంతోపాటు మరికొన్నింటిని దారి మళ్లించారు. అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో ప్రత్యేకంగా హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు. కావలి, చీరాల, ఒంగోలు స్టేషన్లలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో భోజనం, తాగునీరు అందజేశారు. రద్దయిన రైళ్ల ప్రయాణికుల కోసం అదనంగా రిజర్వేషన్‌ కౌంటర్లు ఏర్పాటు చేసి, టికెట్ల నగదు తిరిగి ఇచ్చారు. సోమవారం నాటికి రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ దాదాపుగా పూర్తవుతుందని విజయవాడ రైల్వే అధికారులు ఆదివారం తెలిపారు.
ఇవీ హెల్ప్‌లైన్‌ నంబర్లు: విజయవాడ: 0866-27678522, 2767055, 2767055

 

నేడు రద్దయిన రైళ్ల వివరాలు: రైలు నంబరు 12707 తిరుపతి-హజ్రత్‌ నిజాముద్దీన్‌, 07657-07658 రేణిగుంట-గుంతకల్‌, నంబరు 22160 చెన్నై-ముంబయి, 12164 చెన్నై సెంట్రల్‌-ఎల్‌టీటీ ముంబయి, 07261 గూడూరు-విజయవాడ, 12709 గూడూరు-సికింద్రాబాద్‌, 12077 చెన్నై సెంట్రల్‌-విజయవాడ, 12743-12744 విజయవాడ-గూడూరు, 17247-17248 నరసాపురం-ధర్మవరం, 17643-17644 కాకినాడ పోర్ట్‌-చెంగలపట్టు, 17249-17250 కాకినాడ టౌన్‌- తిరుపతి, 17210 కాకినాడ టౌన్‌- బెంగళూరు, 12710 సికింద్రాబాద్‌-గూడూరు, 12655 అహ్మదాబాద్‌- చెన్నై సెంట్రల్‌, 06426-06427 నాగర్‌కోయిల్‌-తిరువనంతపురం, 06425 కొల్లం-తిరువనంతపురం, 06435 తిరువనంతపురం-నాగర్‌కోయిల్‌, 12269 చెన్నై సెంట్రల్‌-హజ్రత్‌నిజాముద్దీన్‌, 12842 చెన్నై సెంట్రల్‌- హావ్‌డా(హౌరా), 12656 చెన్నై సెంట్రల్‌-అహ్మదాబాద్‌, 12712 చెన్నై సెంట్రల్‌- విజయవాడ, 12510 గౌహతి-బెంగళూరు, 15930 న్యూతీన్‌సుకియా-తాంబరం.