Andrapradesh

Oct 22 2021, 10:20

చంద్రబాబు నాయుడు దీక్ష కు జేసీ ప్రభాకర్ రెడ్డి మద్దతు

- సంఘీభావం తెలుపుతూ దీక్షలో పాల్గొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి

- - సెల్ఫీల కోసం ఎగబడిన టిడిపి కార్యకర్తలు

- - భౌతిక దాడులకు పాల్పడటం హేయమైన చర్య : జేసీ ప్రభాకర్

- వైకాపా దౌర్జన్యాలను సమిష్టిగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది

విజయవాడ

తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి విజయవాడలోని టిడిపి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న 36 గంటల దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేశారు.

 చంద్రబాబు నిర్వహిస్తున్న దీక్షకు ఆయన హాజరై సంఘీభావం తెలియజేశారు.... దీక్షాస్థలికి జేసీ ప్రభాకర్ రెడ్డి చేరుకోగానే టిడిపి కార్యకర్తలు ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ చుట్టుముట్టారు...

 జెసిపిఆర్ తో సెల్ఫీలు దిగడానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎగబడ్డారు... చంద్రబాబు నాయుడు దీక్ష లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు.... 

దీక్షలో పాల్గొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి తనను కలసిన పత్రికేయులతో మాట్లాడుతూ ఏకంగా టిడిపి కార్యాలయం పైన వైకాపా మద్దతుదారులు దాడి చేయడం హేయమైన చర్యగా జేసీ ప్రభాకర్ రెడ్డి అభివర్ణించారు.... 

గతంలో కూడా తాడిపత్రి లోని తన ఇంటి పై వైకాపా నాయకులు దాడి చేసిన విషయాన్ని ప్రజాస్వామ్య వాదులు ఎవరు మర్చిపోలేదు అన్నారు... 

భౌతిక దాడులకు పాల్పడ్డాలనే ఉద్దేశంతో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన తన ఇంటిపైనే వైకాపా నాయకులు దాడికి తెగబడ్డారని ఆయన విమర్శించారు....

 మా జెసి సోదరులు ఇంట్లో లేకున్నా ఆత్మవిశ్వాసం కలిగిన టిడిపి కార్యకర్తలతో పాటు, గుండె ధైర్యం గల యువకులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వచ్చి వారి ఆగడాలపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన విషయాన్ని తెలియజేశారు....

 దీంతో వైకాపా నాయకులు వెనుకకు తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు... 

టిడిపి కేంద్ర కార్యాలయం పై జరిగిన దాడి ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగిస్తోందని జెసి స్పష్టం చేశారు... 

డెమోక్రసీ ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఆంధ్ర ప్రజానీకంపై ఎంతైనా ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు... 

ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రభుత్వంపై తిరగబడే రోజు తొందరలోనే ఉందని జెసి హెచ్చరించారు...

. ప్రభుత్వం పై వస్తున్న వ్యతిరేకత దృష్టి మళ్ళించడానికి వైకాపా కార్యాలయాలు , నాయకులపై దాడులు చేస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు...

 జెసి వెంట రాష్ట్ర రైతు సంఘం సెక్రటరీ మురళి ఉన్నారు రాయల్ మురళి ఉన్నారు... 

Andrapradesh

Oct 22 2021, 08:20

తిరుమల….

నవంబర్ మాసంకు సంభందించిన దర్శన టిక్కెట్లను ఆన్ లైన్ లో విడుదల చేస్తున్న టిటిడి...

శుక్రవారం ఉదయం 9 గంటలకు (300/-) ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను విడుదల చేస్తున్న టిటిడి...

రోజుకి 12 వేల చోప్పున టిక్కెట్లను విడుదల చెయ్యనున్న టిటిడి...

23 వ తేది శనివారం సర్వదర్శనం టిక్కెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్న
టిటిడి...

రోజుకి 10 వేల చోప్పున టిక్కెట్లను విడుదల చెయ్యనున్న టిటిడి.... 

Andrapradesh

Oct 21 2021, 20:48

nపట్టాభికి 14 రోజుల రిమాండ్.. జైలుకు తరలింపు
విజయవాడ: టీడీపీ నేత పట్టాభికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలపై పోలీసులు పట్టాభిని అరెస్ట్ చేశారు. పట్టాభిని గురువారం మూడో అదనపు మెట్రో పాలిటన్ కోర్టులో ప్రవేశ పట్టడంతో ధర్మాసనం ఆయనకు నవంబర్ 4 వరకు రిమాండ్ విధించింది. పట్టాభి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు నిరాకరించింది. దీంతో పట్టాభిని పోలీసులు మచిలీపట్నం జైలుకు తరలించారు. కాగా తనను పోలీసులు కొట్టలేదని టీడీపీ నేత పట్టాభి తెలిపారు. తాను సీఎంను గాని, ప్రభుత్వ పెద్దలనుగానీ తూలనాడలేదన్నారు. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపానని చెప్పారు. గతంలో తనపై దాడి జరిగితే దోషులను పట్టుకోలేదని తెలిపారు. అరెస్ట్ చేసిన తర్వాత తనను తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఉంచారని పట్టాభి పేర్కొన్నారు.

Andrapradesh

Oct 21 2021, 14:10

nతల్లి ఎవరికైనా తల్లే సీఎం గారు గుర్తుపెట్టుకోండి :జనసేన నేత పోతిన వెంకట మహేష్
విజయవాడ : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై జనసేన నేత పోతిన వెంకట మహేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘తల్లి ఎవరికైనా తల్లే సీఎం గారు గుర్తుపెట్టుకోండి. మీ తల్లిని దూషించారని బాధపడిన మీరు కాకినాడలో మీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి మాతృమూర్తిని దూషించారు. ఆనాడు కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేస్తే ప్రజలు మిమ్మలని నమ్మేవారు. నేతి బీరకాయలో నెయ్యి, సీఎం జగన్ మాటల్లో నిజాయితీ ఎప్పటికీ దొరకవు’’ అని పోతిన వెంకట మహేష్ వ్యాఖ్యానించారు.

Oct 21 2021, 12:44

nజగన్ రెడ్డి నవ రూపాల్లో సైకో రూపాన్ని నిన్న చూసాం. ఆయనకి నవ రూపాలు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి ఒక్కో రూపం బయటపడుతుంది. ప్రజా వేదిక కూల్చి శాడిస్ట్ రూపాన్ని బయటపెట్టారు. ఇప్పుడు టీడీపీ కార్యాలయాల పై దాడులు చేయించి సైకో రూపాన్ని బయటపెట్టారు. ఎవరైనా బాధపడటాన్ని చూసి నవ్వుకునే వాళ్ళని ఏమంటాం? సైకో అంటాం. టీడీపీ కార్యాలయాల పై దాడులు చేసి కార్యకర్తల పై దాడులు చేయించి హ్యాపీగా నవ్వుకుంటాడు కాబట్టే జగన్ రెడ్డిని సైకో అంటున్నా. ప్రశ్నిస్తే చంపేస్తారా? దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుకున్నా దాని లింక్ ఏపీలోనే ఉంటుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు, పక్క రాష్ట్రం పోలీసులు ఏపీ డ్రగ్స్ హబ్ గా మారిందని ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెబుతున్నారు. వాళ్ళకి నోటీసులు ఇచ్చే దమ్ము ఉందా డీజీపీ. డ్రగ్స్ దందా జగన్ రెడ్డి బినామిలే నడిపిస్తున్నారు. వాళ్లంతా జైలులో ఊచలు లెక్కపెట్టడం ఖాయం. ఎవరూ లేని సమయం చూసుకొని దొంగ చాటున దాడులు ఎందుకు? దమ్ముంటే ధైర్యంగా చెప్పి రండి. ఎవరి సత్తా ఏంటో తేల్చేసుకుందాం. మా అధినేత మంచితనం వల్ల జగన్ బ్రతికిపోయాడు. ఆయన ఒక్క సైగ చేస్తే వైసీపీ కుక్కల్ని గుడ్డలిప్పి తన్నుతాం. చేతనైతే సమాధానం చెప్పు. డ్రగ్స్ వ్యాపారానికి నీకు సంబంధం లేదని నిరూపించు. అంతేగాని దొంగ దెబ్బ ఎందుకు జగన్ రెడ్డి. దాడులతో నువ్వు ఎంత పిరికి వాడివో అర్థమైంది. తప్పు చెయ్యకపోయి ఉంటే దాడులు చేసే అవసరమేంటి. టీడీపీ పై దాడితో డ్రగ్స్ దందా చేసింది జగన్ అండ్ కో అని తేలిపోయింది. పార్టీ కార్యాలయంలో కుర్చీలు అద్దాలు పగలగొట్టి కాలర్ ఎగరేస్తున్నారు. మేము వచ్చాకా తోలు వలిచి తాటతీస్తాం జాగ్రత్త. సభ్యత, సంస్కారం గురించి వైసీపీ నాయకులకు మాట్లాడే నైతిక హక్కు లేదు. ఒక ముఖ్యమంత్రి గా చేసిన వ్యక్తి, ప్రతిపక్ష నేత ని మీరు ఎం అన్నారు. మీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడిన బూతులు ఏంటి? డీజీపీ కి అప్పుడు అవి రెచ్చగొట్టే మాటల్లా కనపడలేదా? వైసీపీ వాళ్ళు బూతులు తిడితే సంసారమా? మా వాళ్ళు విమర్శించినా అది వ్యభిచారమా? డీజీపీ గారు సమాధానం చెప్పాలి. వైసీపీ నాయకులు బూతులు మాట్లాడినప్పుడు మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? జగన్ రెడ్డి కొత్త ట్రెండ్ తీసుకొచ్చాడు. పొలిటికల్ టెర్రరిజంతో బయపెట్టాలని చూస్తున్నాడు. ఆయన మొదలెట్టిన పొలిటికల్ టెర్రరిజం ఆయన పతనానికి కారణం కాబోతోంది. ...టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవి. ఆంజినేయులు

Andrapradesh

Oct 21 2021, 11:43

n*అక్కసుతో పథకం ప్రకారమే రాష్ట్రంలో కుట్ర: సీఎం జగన్‌*
విజయవాడ: అధికారం దక్కలేదనే రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని విపక్షాలను ఉద్దేశించి ఏపీ సీఎం జగన్‌ పరోక్షంగా ఆరోపించారు. సంక్షేమ పథకాలకు అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేస్తున్నారన్నారు. విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసుల బాగోగుల గురించి ఆలోచించామన్నారు. పోలీసులు తమ కుటుంబాలతో గడపాలని.. వారికి కూడా విశ్రాంతి కావాలన్నారు. వీక్లీ ఆఫ్‌ను మొదటిసారిగా ప్రకటించిన ప్రభుత్వం తమదేనని చెప్పారు. హోంగార్డులకు గౌరవ వేతనాన్ని కూడా పెంచామని.. కరోనాతో మృతిచెందిన పోలీసు కుటుంబాలకు పరిహారం ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ అత్యంత ప్రాధాన్యాంశమని చెప్పారు. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైనా జగన్‌ మాట్లాడారు. కేవలం అక్కసుతో పథకం ప్రకారమే రాష్ట్రంలో కుట్రచేస్తున్నారని ఆక్షేపించారు. ‘‘రాష్ట్రంలోని పిల్లలను డ్రగ్‌ అడిక్ట్స్‌గా ప్రపంచానికి చూపించే దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతోంది. ఇది అత్యంత తీవ్రమైన నేరం.. అధర్మం. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం, డీఆర్‌ఐ వివరణ ఇచ్చినా.. విజయవాడ సీపీతో పాటు డీజీపీ సైతం ఆ ఆరోపణలు అబద్ధాలు అని పదేపదే చెప్పినా లెక్కలేనితనం, అక్కసుతో వ్యవహరించారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకూ వెనకాడట్లేదు. అధికారం దక్కలేదనే ఈ విధంగా చేస్తున్నారు. చీకట్లో ఆలయాలకు సంబంధించిన రథాలను తగలబెడుతున్నారు. ఆఖరికి సీఎంపైనా అసభ్య పదజాలం వాడుతున్నారు. ముఖ్యమంత్రిపై పరుష పదజాలం వాడటం సమంజసమేనా? సీఎంను అభిమానించేవాళ్లు తిరగబడాలి.. భావోద్వేగాలు పెరగాలని వాళ్లు ఆరాటపడుతున్నారు. వాళ్లు గెలవలేదని రాష్ట్రం పరువు తీసేందుకూ వెనుకాడట్లేదు. గిట్టనివాడు పరిపాలన చేస్తున్నారని ఓర్వలేకపోతున్నారు’’ అని జగన్‌ ధ్వజమెత్తారు.

Oct 21 2021, 10:31

n*చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష ప్రారంభం*

*అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష ప్రారంభమైంది. తెదేపా కేంద్ర కార్యాలయంపై దుండగుల దాడి, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాలపై వైకాపా నేతలు, కార్యకర్తల దాడి యత్నాలకు నిరసనగా ఆయన దీక్ష చేపట్టారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో పగిలిన అద్దాలు, ధ్వంసమైన సామగ్రి మధ్యలోనే చంద్రబాబు దీక్షకు కూర్చొన్నారు. ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన దీక్ష రేపు రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది.చంద్రబాబు దీక్ష నేపథ్యలో పార్టీ కేంద్ర కార్యాలయానికి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా వివిధ జిల్లాల నుంచి ముఖ్యనేతలంతా అక్కడికి చేరుకున్నారు.*