Telangananews

Oct 12 2021, 17:13

మీడియా ముందుకు ప్రకాష్ రాజ్ ప్యానెల్

 


తన ప్యానెల్ సభ్యుల రాజీనామా నిర్ణయం వెల్లడించిన ప్రకాష్ రాజ్

 

జరిగిన సంఘటనలపై చర్చించాం 

 

ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది 

 

ఎన్నికల్లో రౌడీయిజం చేశారు... ప్రకాశ్ రాజ్

 

రాత్రికి రాత్రే ఫలితాలు మార్చేశారు 

మా ప్యానెల్ ఈసీ సభ్యులు అందరూ రాజీనామా చేస్తారు.... ప్రకాశ్ రాజ్

ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి 11 మంది రాజీనామా 

Telangananews

Oct 12 2021, 17:02

టాలీవుడ్ నిర్మాత, ఎన్టీఆర్ పి.ఆర్.వో మహేశ్ కోనేరు హఠాన్మరణం..! 

 


జూనియర్ ఎన్టీఆర్ పి.ఆర్.వో, నిర్మాత, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్ కోనేరు ఈ రోజు ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 38 సంవత్సరాలు. 

 

దసరా సెలవులకు స్వస్థలం వైజాగ్ వెళ్ళిన మహేశ్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్ గా కెరీర్ ఆరంభించి ఆ తర్వాత సినిమాలకు పి.ఆర్.వోగా పని చేశారు. 

 

ఆ తర్వాత ఎన్టీఆర్ కు పర్మినెంట్ పి.ఆర్.వోగా సెటిల్ అయిన మహేశ్ ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి నిర్మాతగా కూడా మారారు. 118, మిస్ ఇండియా, తిమ్మరుసు వంటి స్ట్రెయిట్ సినిమాలతో పాటు విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాను తెలుగువారికి అందించాడు. మహేశ్ మృతి పట్ల ఎన్టీఆర్ తో పాటు చిత్రరంగ ప్రముఖులు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు...!! 

Telangananews

Oct 12 2021, 14:47

నిర్లక్ష్యపు నీడలో తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు: షర్మిల

 


నల్గొండ: సీఎం కేసీఆర్‌ పాలనలో తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. వర్సిటీలు నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతున్నాయని విమర్శించారు. నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఎదుట నిరుద్యోగ నిరాహార దీక్షలో షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. విశ్వవిద్యాలయాల్లోని ఖాళీలను ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని ఆరోపణలు చేశారు. అనంతరం ప్రతి మంగళవారం రాష్ట్రంలోని నిరుద్యోగులకు సంఘీభావంగా చేపట్టే నిరాహార దీక్షలో ఆమె కూర్చున్నారు... 

Telangananews

Oct 12 2021, 14:46

దసరాకు ప్రత్యేక రైళ్లు

 రైలు నెంబర్ 08579 విశాఖపట్నం-సికింద్రాబాద్ రూట్‌లో అక్టోబర్ 17, 20, 21 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సాయంత్రం 7 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్ చేరుకుంటుంది.

 


రైలు నెంబర్ 08580 సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్‌లో అక్టోబర్ 14, 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సాయంత్రం 7.40 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 6.40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. రైలు నెంబర్ 08585 విశాఖపట్నం-సికింద్రాబాద్ రూట్‌లో అక్టోబర్ 19, 26 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సాయంత్రం 5.35 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్ చేరుకుంటుంది.రైలు నెంబర్ 08586 సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్‌లో అక్టోబర్ 20,27 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రాత్రి 9.05 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.రైలు నెంబర్ 08583 విశాఖపట్నం-తిరుపతి రూట్‌లో అక్టోబర్ 18, 25 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సాయంత్రం 7.15 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్ చేరుకుంటుంది.

 

రైలు నెంబర్ 06036 చెన్నై సెంట్రల్-సంత్రగచ్చి రూట్‌లో అక్టోబర్ 12, 29, 26, నవంబర్ 2 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఉదయం 8.10 గంటలకు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.25 గంటలకు సంత్రగచ్చి జంక్షన్ చేరుకుంటుంది. రైలు నెంబర్ 08584 తిరుపతి-విశాఖపట్నం రూట్‌లో అక్టోబర్ 19, 26 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రాత్రి 9.55 గంటలకు తిరుపతిలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.20 గంటలకు విశాఖపట్నం చేసుకుంటుంది.రైలు నెంబర్ 06035 సంత్రగచ్చి-చెన్నై సెంట్రల్ రూట్‌లో అక్టోబర్ 13, 20, 27, నవంబర్ 3 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సాయంత్రం 6 గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి 8.30 గంటలకు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. 

Telangananews

Oct 11 2021, 15:44

కలెక్టరేట్ భవనం ఎక్కి మహిళల ఆత్మహత్యయత్నం

 


హన్మకొండ కలెక్టరేట్ వద్ద సోమవారం టెన్షన్ వాతావరణం నెలకొంది. తమ భూమిని కొంతమంది కబ్జా చేశారంటూ ఇద్దరు మహిళలు ఆత్మహత్యకు యత్నించారు. హన్మకొండ జిల్లాకు చెందిన పిట్టల తిరుపతమ్మ, కావేరి అనే ఇద్దరు మహిళలు కలెక్టరేట్ లో సోమవారం జరిగే గ్రీవెన్స్ కు వచ్చారు. తమ భూమిని కబ్జా చేశారంటూ పోలీసులను ఆశ్రయించినా ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు. దీంతో కలెక్టర్ భవనం ఎక్కి పెట్రోల్ పోసుకునేందుకు ప్రయత్నించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని శాంతింప జేసి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇద్దరు మహిళలు ఒక్కసారిగా భవనంపైకి ఆత్మహత్య యత్నం చేసేందుకు ప్రయత్నం చేయడంతో జనాలంతా గుమిగూడారు. 

Telangananews

Oct 11 2021, 15:43

కడెం ప్రాజెక్టు సందర్శన

 


నిర్మల్ జిల్లా: కడెం మండల కేంద్రం శివారులోని కడెం ప్రాజెక్టును పలువురు ఉన్నతాధికారులు సందర్శించారు. సోమవారం మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూకి, తదితర ఉన్నతాధికారులు కడెం ప్రాజెక్టును సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కడెం ప్రాజెక్టు బోటింగ్ లో విహరించారు. కడెం ప్రాజెక్ట్, పరిసరప్రాంతాలు పచ్చదనంతో ప్రకృతి రమణీయతకు ప్రతిరూపంగా ఉన్నాయని వారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. 

Telangananews

Oct 11 2021, 15:39

చినజీయర్‌స్వామిని కలిసిన సీఎం కేసీఆర్

 


హైదరాబాద్‌: త్రిదండి శ్రీ చినజీయర్‌ స్వామిని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కలిశారు. ముచ్చింతల్‌లోని ఆశ్రమానికి సతీమణి శోభ, కుటుంబసభ్యులతో కలిసి ఆయన వెళ్లారు. యాదాద్రి నూతన ఆలయం ప్రారంభంపై చినజీయర్‌స్వామితో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. అంతకుముందు కేసీఆర్‌ దంపతులను చినజీయర్‌ శాలువాతో సత్కరించారు.  

Telangananews

Oct 11 2021, 15:38

కొత్త మున్సిపాలిటీలు కరువైన మౌలిక వసతులు

 


మంచిర్యాల జిల్లా: లో కొత్తగా ఏర్పడిన నస్పూర్, చెన్నూర్, లక్షెట్టిపేట, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. నాలుగేళ్లు మౌలిక వసతులు కరువై ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని మున్సిపాలిటీల్లో వారానికి కనీసం ఒకటి, రెండు సార్లు మాత్రమే తాగునీరు సరఫరా జరుగుతుంది. అంతర్గత రహదారులు, మురుగు కాల్వల పరిస్థితి దయనీయంగా ఉంది. జనాభాకు అనుగుణంగా శాశ్వత డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు నిర్మాణం చేపట్టలేదు. 

Telangananews

Oct 11 2021, 15:38

ప్రజలు గుర్తుంచుకునేలా పనితీరు ఉండాలి..డిసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి

 


మంచిర్యాల జిల్లా: మందమర్రి పట్టణంలో ఆదివారం సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులకు వ్యక్తిత్వ వికాసం- క్రమశిక్షణ అనే అం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమర్థంగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్లినా కూడా ప్రజలు గుర్తుంచుకునేలా పనితీరు ఉండాలని సూచించారు. విధుల్లో ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొవాలన్నారు. సమస్య చెప్పుకునేందుకు పోలీస్టేషన్కు వచ్చే వారితో మర్యాదగా నడుచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్, మందమర్రి సిఐ ప్రమోద్ కుమార్, బెల్లంపల్లి రూరల్, పట్టణ సిఐలు జగదీష్, రాజు, మందమర్రి ఎస్సై భూమేష్ పాల్గొన్నారు 

Telangananews

Oct 11 2021, 15:34

మిషన్ భగీరథ నీరు రాక ఇబ్బుందులు

 


మంచిర్యాల జిల్లా//తాండూర్ మండలం కాసిపేట గ్రామం ఎస్సి కాలని ( క్వాటర్స్) లో మిషన్ భగీరథ నల్ల నీరు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనిలో 30 ఇళ్లు ఉన్నాయి. వీరంతా రోజు వారి కూలీలు కావడంతో ఉదయం పనులకు వెళ్లాల్సిన సమయంలో నల్ల నీరు రాకపోవడంతో పంచాయితీ పంపుతో నీరు మోస్తూ ఇబ్బందులు పడాల్సివస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పంచింది ప్రతి రోజు మిషన్ భగీరథ నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.