Andrapradesh

Jun 10 2021, 16:52

_AP News: జావడేకర్‌తో సీఎం జగన్‌ భేటీ_
 


_దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. రెండ్రోజుల పర్యటన నిమిత్తం దిల్లీ చేరుకున్న సీఎం... ఈరోజు మధ్యాహ్నం కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌తో  సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, పెండింగ్‌ ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇతర అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నారు. ఇవాళ రాత్రి 9 గంటలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో జగన్‌ భేటీ కానున్నారు. ఇవాళ రాత్రి దిల్లీలోనే బస చేయనున్న సీఎం రేపు మధ్యాహ్నం రాష్ట్రానికి తిరిగిరానున్నారు.._

Andrapradesh

Jun 09 2021, 19:55

సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా: నవనీత్‌ కౌర్‌
 


ముంబై:-అమరావతి పార్లమెంట్ సభ్యురాలు నవనీత్ కౌర్‌కు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. నవనీత్ కౌర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కాదని, నకిలీ క్యాస్ట్‌ సర్టిఫికెట్‌తో ఆమె పోటీచేసి గెలుపొందారని ఆరోపిస్తూ మాజీ ఎంపీ, శివసేన నేత ఆనందరావు అదసూల్ దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టి కీలక ఉత్తర్వులు వెలువరించింది. పంజాబ్‌ మూలాలు కలిగిన నవనీత్‌ కౌర్‌.. మహారాష్ట్రలో ఎస్సా కేటగిరికి రాదని, ఆమె కులధ్రువీకరణ పత్రాన్ని రద్దుచేసింది. దీంతోపాటు రూ.2 లక్షల జరిమానా విధించింది. ఆరు నెలల్లోగా కులధ్రువీకరణకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లను కోర్టు ముందుంచాలని నవనీత్ కౌర్‌ను ఆదేశించింది.

Andrapradesh

Jun 09 2021, 18:10

ఇకపై ఇసుక తవ్వకాలకు ఈ-పర్మిట్
 


- మరింత పారదర్శకత కోసం చర్యలు
- రీచ్‌ల వారీగా జేపీ సంస్థ ఇసుక తవ్వకాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి
- డిఎంజి కార్యాలయం నుంచి ఈ పర్మిట్ జారీ
- దీంతో జవాబుదారీతనం మరింత పెరుగుతుంది
- ఇందుకోసం సాఫ్ట్ వేర్‌ను సిద్దం చేసిన మైనింగ్ శాఖ

: డిఎంజి విజి వెంకటరెడ్డి

ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలకు ఈ పర్మిట్ తప్పనిసరి చేస్తూ, ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్‌ను సిద్దం చేసినట్లు భూగర్భ గనులశాఖ సంచాలకులు (డిఎంజి) విజి వెంకటరెడ్డి తెలిపారు. ప్రైవేటు వ్యక్తులకు ఇసుక తవ్వకాలను అప్పగించే క్రమంలో టెండర్లను దక్కించుకున్న జేపీ పవర్ వెంచర్స్‌తో జరిగిన అగ్రిమెంట్‌లోనే ఈ మేరకు అంగీకారం జరిగిందని వెల్లడించారు. ఇసుకకు ఈ పర్మిట్‌ కోసం మైనింగ్ డిపార్ట్‌మెంట్ ద్వారా సాఫ్ట్‌వేర్‌ను సిద్దం చేశామని, దానిని ఇప్పుడు అమలులోకి తీసుకువస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు ఇతర మినరల్స్‌కు అనుమతులు ఇచ్చేందుకు ఈ పర్మిట్ విధానంను అమలు చేస్తున్నామని, ఇకపై ఇసుక తవ్వకాలకు కూడా ఇదే విధానం వర్తింపచేస్తున్నామని తెలిపారు. 
 రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఉన్న జేపీ పవర్ వెంచర్స్‌ సంస్థ ఇకపై రీచ్‌ల వారీగా ఇసుక తవ్వకాలు జరిపేందుకు ఆన్‌లైన్‌లో ఈ పర్మిట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఆయా రీచ్‌ల పరిధిలోని మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి ఎటువంటి జాప్యం లేకుండా డిఎంజి కార్యాలయం నుంచి ఈ పర్మిట్‌ను జారీ చేస్తామని అన్నారు. ఈ పర్మిట్ వల్ల ఏ రీచ్‌లో ఎంత ఇసుక తవ్వకానికి సంబంధించి అనుమతులు ఇచ్చాం, ఏ మేరకు మైనింగ్ జరిగిదనేది ఖచ్చితంగా తెలుస్తుందని, ఆన్‌లైన్‌లో దీనికి సంబంధించిన వివరాలు నమోదవ్వడం వల్ల మరింత పారదర్శకత, జవాబుదారీతనం వస్తుందని అన్నారు.

Andrapradesh

Jun 09 2021, 15:21

వైఎస్ఆర్ బీమా: కొత్త మార్పులతో జులై 1 నుంచి అమలు
 తాడేపల్లి: 

వైఎస్ఆర్ బీమా పథకాన్ని జులై1 నుంచి కొత్త మార్పులతో అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘వైఎస్ఆర్ బీమా’ పథకంపై సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు సీఎం జగన్‌ మాట్లాడుతూ.. మరణించిన వ్యక్తి కుటుంబానికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వ సాయం అందిస్తుందని తెలిపారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి (18-50ఏళ్లు) సహజంగా మరణిస్తే లక్ష, 18-70ఏళ్లు ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణస్తే రూ. 5లక్షల సాయం అందజేయాలని ఆదేశించారు.

ఇక జులై 1 నుంచి కొత్త మార్పులతో వైఎస్ఆర్ బీమా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈలోగా సంపాదించే వ్యక్తుల మరణాలకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జులై 1లోగా క్లెయిమ్‌లన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లో బీమా పరిహారం చెల్లించాలని సీఎం జగన్‌ అన్నారు. బీమా పరిహారంపై ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం జగన్‌ చెప్పారు. ఈ సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Andrapradesh

Jun 09 2021, 14:53

శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద 
 


కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద పెరుగుతోంది. సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశయంలోకి 3,284 క్యూసెక్కుల నీరు చేరుకుంది. ఇన్‌ ఫ్లో 3,284 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో నిల్‌గా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 809.10 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు, ప్రస్తుతం 33.7658 టీఎంసీలకు చేరుకుంది.

Andrapradesh

Jun 09 2021, 14:51

కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్​తో​ ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ...
 


పోలవరం నిర్వాసితుల పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదు...

కేంద్ర మంత్రి గజేంద్రసింగ్​ను ఎంపీ రఘురామకృష్ణరాజు కలిశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పేరుతో అక్రమాలు జరుగతున్నాయని ఫిర్యాదు చేశారు. నకిలీ ఖాతాలతో నిర్వాసితుల సొమ్ము కాజేస్తున్నారని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. లబ్ధిదారులను పక్కనపెట్టి నకిలీలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. వెంటనే పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలని గజేంద్రసింగ్‌ను కోరారు.

రివర్స్ టెండరింగ్ పేరుతో అదనపు నిధులు కేటాయింపు చేస్తున్నారన్న రఘురామ.. కేటాయింపులు పెంచి 25 శాతం వరకు కమీషన్లు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. గత నెల 14న ఏపీ సీఐడీ పోలీసుల ప్రవర్తన తీరుపైనా వివరాలను గజేంద్రసింగ్​కు తెలిపినట్లు సమాచారం. పోలవరం, తనతో పోలీసుల ప్రవర్తన వంటి వివరాలతో.. రెండు వేర్వేరు లేఖలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Andrapradesh

Jun 09 2021, 13:04

హోదా ఎప్పుడు వస్తుందని...జగన్ ఏం చేస్తారో చెప్పాలి: రామ్మోహన్ నాయుడు 
 అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పుడు వస్తుందని... అందుకు జగన్ రెడ్డి ఏం చేస్తారో సమాధానం చెప్పాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. హోదాపై మోసగించిన జగన్ రెడ్డిని యువత నిలదీయాలని కోరారు. కేసుల కోసం లాలూచీ పడి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారని ఆరోపించారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడంలో జగన్ రెడ్డి విఫలమయ్యారన్నారు. 25 మంది ఎంపీలను ఇస్తే.. కేంద్రం మెడలు వంచి హోదా తీసుకువస్తానన్నారని ఎంపీ గుర్తుచేశారు. హోదా వస్తేనే పెట్టుబడులు, ఉద్యోగాలు, నిధులు వస్తాయని యువతకు చెప్పి నమ్మకద్రోహం చేశారని మండిపడ్డారు. 28 మంది ఎంపీలున్నా కేంద్రాన్ని నిలదీయడం లేదన్నారు. ఓట్లు దండుకోవడానికి, ప్రజలను మోసం చేయడానికే జగన్ రెడ్డి హోదాను వినియోగించుకున్నారని విమర్శించారు. అవినీతి కేసుల్లో జైలుకు పంపిస్తారనే భయంతో కేంద్రాన్ని గట్టిగా అడగలేకపోతున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు

Andrapradesh

Jun 08 2021, 19:44

ఏపీ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్  చేస్తూ రాజమండ్రి- బిజేపీ కార్యాలయ ఆవరణలో బిజేపీ నిరసన దీక్ష
 


దీక్ష లో పాల్గొన్న బిజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు , బిజేపీ నాయకులు,రైతులు

బిజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మీడియాలో కామెంట్స్ ...

రైతు భరోసా కేంద్రాలలో ధాన్యం కొనుగోలు జరగడం లేదు

ధాన్యం బస్తాకు రైతు 300 రూపాయలు నష్టపోతున్నారు

ధాన్యం రవాణాకు రైతులకు ఏడాదికి 200 కోట్లు చెల్లించినట్టు చూపి అధికారులు, మంత్రులు పంచుకుంటున్నారు

భరోసా లే పరిపాలన కాదు

సన్నబియ్యం కేజీ 42 రూపాయలకే అమ్మాలి

రైతులను రక్షించడం పరిపాలన

ఎకరానికి 30వేలు నష్టపోతున్నారు
గిట్టుబాటు ధర కల్పించాలి 

మిల్లర్లు, ప్రజాప్రతినిధులు 
రెండు పంటలలో 2వేల కోట్లు కుంభకోణం రవాణా పేరుతో జరుగుతుంది

అమ్మఒడి, తోడు వంటి కానుక పధకాలు పరిపాలన కాదు

వ్యవస్థను పరిపాలన లో పెట్టాలి

రైతుల వద్ద బ్రోకర్లు ద్వారానే కొనుగోలు జరుగుతుంటే రైతు భరోసా అంటున్నారు 

జగన్ ది తప్పుడు పరిపాలన

బ్రోకర్లుకు జగన్ ప్రభుత్వం తాబేదారులుగా పనిచేస్తుంది.

మిల్లర్లు రైతులను దోచేసుకుంటున్నారు..

రైతుల్ని,ప్రజల్ని మిల్లర్ల దోపిడీ నుంచి రక్షించాలి..

కానుకలు పేరుతో ప్రజలను గాలికొదిలేశారు

బిజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు

Andrapradesh

Jun 08 2021, 18:38

మంత్రి గౌతమ్ రెడ్డి కామెంట్స్
 


 ఏపీలో సంక్షేమంతో పాటే పారిశ్రామిక అభివృద్ధి

 కరోనా కాలంలోనూ ఏపీలో 1.58 శాతం అభివృద్ధి

 దేశంలో 10 శాతం ఎగుమతులే లక్ష్యంగా పనిచేస్తున్నాం

 2030 సంవత్సరం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం

 రాష్ట్రంలో కొత్తగా 5 మేజర్ పోర్టుల నిర్మాణం

 2023 నాటికి భోగాపురం ఎయిర్ పోర్ట్ పూర్తవుతుంది 

 కర్నూలు ఎయిర్ పోర్టు ఇప్పటికే ప్రారంభమయింది

 మేం ఎక్కువ చేస్తున్నాం..... చేసినదానికన్నా తక్కువ చెప్పుకుంటున్నాం

 రాష్ట్రంలో పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి చేస్తున్నాం

 3 కాన్సెప్ట్ సిటీల నిర్మాణానికి ప్రణాళికలు

 ఏపీని పారిశ్రామిక రంగంలో అగ్రస్థానంలో నిలబెడతాం

 సీఎం జగన్ ముందుచూపు వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు

 పారిశ్రామిక కారిడర్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం

 నూతన పరిశ్రమల ఏర్పాటుకు సులభతర విధానాలు 

 త్వరలో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి

 ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1032 కోట్ల పెట్టుబడులు

 రూ.18000 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రగతిలో ఉన్నాయి

 కరోనా సంక్షోభంలో MSMEలకు ప్రభుత్వం అండగా నిలిచింది

 గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను MSMEలకు చెల్లించాం 

 పారిశ్రామికాభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తున్నాం

 రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో MSME క్లస్టర్ల ఏర్పాటు 

 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ ముందు వరసలో ఉంది

 ఏపీలో రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తక్కువ

 రాష్ట్రంలో త్వరలో 30 స్కిల్ కాలేజీల ఏర్పాటు : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

Andrapradesh

Jun 08 2021, 18:37

పెందుర్తిలో విషాదం
 


పులగాని పాలెం నల్ల క్వారీ సమీపంలో ఇంటి మేడపై ఉన్న తల్లి కొడుకుల పై పడిన పిడుగు.

6 ఏళ్ల కుమారుడు రోహిత్ మృతి, తల్లి పావని కి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు.

 దర్యాప్తు చేస్తున్న పోలీసులు