Andrapradesh

May 22 2021, 09:23

గుంటూరు వైద్యుల మెడకు ఉచ్చు బిగుస్తోందా.?   
 


సుప్రీంలో విచారణ.. సీబీఐ!

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కేసు గుంటూరు వైద్యల మెడకు బిగుస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

ఆర్మీ ఆస్పత్రి సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో ఆయనకు గాయాలయ్యాయని తేల్చి చెప్పడం గమనార్హం.
  
ప్రధానాంశాలు:
రఘురామ బెయిల్ పిటిషన్ విచారణ
గాయాలు నిజమేనని ఆర్మీ ఆస్పత్రి నివేదిక
గుంటూరు వైద్యుల రిపోర్ట్‌పై సుప్రీంలో వాదనలు
తప్పుడు నివేదిక ఇచ్చారంటూ ధర్మాసనం దృష్టికి..

వైసీపీ అసమ్మతి ఎంపీ

రఘురామ కృష్ణంరాజు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.సుప్రీం కోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.పిటిషన్‌పై విచారణ సందర్భంగా వాదప్రతివాదనలు హోరాహోరీగా సాగాయి. 

ఎంపీ రఘురామ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. 

రఘురామ వ్యవహారం గుంటూరు వైద్యుల మెడకు బిగుసుకునే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఏపీ హైకోర్టు మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి.. వైద్య పరీక్షలు నిర్వహించి ఎంపీ రఘురామ ఆరోగ్యంపై నివేదిక అందజేయాలని చెప్పిందని ఆయన తరఫు లాయర్ ముకుల్ రోహత్గీ అన్నారు.      

అనంతరం రమేష్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని కోర్టు చెప్పిందని న్యాయస్థానానికి విన్నవించారు.     

అయితే గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ల టీమ్ ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని నివేదిక ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.        

ఆర్మీ ఆస్పత్రి ఇచ్చిన రిపోర్టులో ఆయనకు గాయాలయ్యాయని, ఎముక విరిగినట్లు నివేదికలో ఉందని అన్నారు.

గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ భర్త వైసీపీ లీగల్ సెల్‌లో కీలక నేతగా ఉన్నారని.. 

అందుకే తప్పుడు నివేదిక ఇచ్చారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.హైకోర్టు ఆదేశాల ప్రకారం ఆయన్ను జీజీహెచ్ చెకప్ అనంతరం రమేష్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పినా పట్టించుకోకుండా జైలుకి తరలించారని న్యాయస్థానానికి విన్నవించారు.    

ఎలాంటి గాయాలు లేవని తప్పుడు నివేదిక ఇవ్వడంతో పాటు అందుకు కారణమైన పోలీసులు,వైద్యులపై సీబీఐ విచారణ జరిపించాలని కోరడం సంచలనంగా మారింది. 

కోర్టు ఆదేశాలు బేఖాతరు చేశారని.. కోర్టుకు తప్పుడు నివేదిక సమర్పించారని సుప్రీం కోర్టులో వాదనలు జరగడంతో ఎంపీ రఘురామ వ్యవహారం గుంటూరు వైద్యుల మెడకు చుట్టుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Andrapradesh

May 21 2021, 18:07

చిరంజీవి అన్నా, మీ సాయం మర్చిపోలేను: నటుడు
 


అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు. కానీ చిరంజీవి మాత్రం కళాకారులు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు వారు నోరు తెరిచి అడగకముందే కావాల్సింది సమకూర్చుతాడు. ఆర్థికంగా ఆదుకుంటాడు, చికిత్స చేయించేందుకు చర్యలు తీసుకుంటాడు. వెన్నంటే ఉంటూ మనోధైర్యాన్ని కల్పిస్తాడు. అందుకే ఆయన మెగాస్టార్‌ అయ్యాడు.* 

 తాజాగా ఈ హీరో నటుడు పొన్నాంబళంను ఆదుకున్నాడు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని తెలిసిన చిరంజీవి వెంటనే అతడికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాడు. కష్టకాలంలో తనను దేవుడిలా ఆదుకున్నందుకు నటుడు భావోద్వేగానికి లోనయ్యాడు. 'చిరంజీవి అన్నయ్యకు నమస్కారం. చాలా థ్యాంక్స్‌ అన్నా. నాకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కోసం మీరు పంపిన రెండు లక్షల రూపాయలు చాలా ఉపయోగపడ్డాయి. ఈ సహాయాన్ని నేనెప్పటికీ మరిచిపోలేను. మీకు మరోసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ పేరుతో ఉన్న ఆంజనేయ స్వామి మిమ్మల్ని చిరంజీవిగా ఉంచాలని మనసారా కోరుకుంటూ.. జై శ్రీరామ్‌' అని పొన్నాంబళం తమిళంలో తన సందేశాన్ని తెలియజేశాడు

Andrapradesh

May 21 2021, 18:05

జగనన్న పాలనలో అడుగడుగునా అవినీతి జాడలే! పోతిన వెంకట మహేష్ 
 


నీతి అన్నమాటే లేకుండా అడుగడుగునా అవినీతి జాడలే జగనన్న పాలనలో బడ్జెట్ మొత్తం అవాస్తవాలు అబద్దాల గ్రంథంలా మారిపోయింది. 

కల్ఫితలకు కాకమ్మ కబుర్లుకు చిట్టాగా మిగిలిపోతుంది. బడ్జెట్ కాపీలా లేదు పెద్దబాలశిక్ష అని డౌట్ వచ్చేలా ఉంది. 

బడ్జెట్ ప్రతులు పునుగులు బజ్జీలు సమోసాల పొట్లాలు కట్టుకోడానికి పనికి వచ్చేలా ఉంది రాష్ట్ర అభివృద్ధికి పనికి వచ్చేలా లేదు.

ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల రద్దు ప్రభుత్వానికి ఓ చెంపదెబ్బ.

వైద్య శాఖకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి.

జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఈరోజు తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ

 అప్పుల ఆంధ్రప్రదేశ్లో గా రాష్ట్రం మారిపోయిందనీ,

 నేడు రాష్ట్ర అప్పు 355874 cr ఈ రెండేళ్లలో జగన్ గారి హయాంలో చేసిన అప్పు 200000cr ఇందులో సంక్షేమనికి ఖర్చుపెట్టింది కేవలం 120000.cr మిగిలిన 80 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి 

వెళ్ళాయో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సమాధానం చెప్పాలని,ఈ ఏడాది బడ్జెట్ 229799 cr.దీనిలో అన్ని రకాల ఆదాయాలు మరియు కేంద్ర ప్రభుత్వ వాటా కలిపి 177196cr.అంటె ఇంకా ఈ ఏడాది అప్పు చేయాల్సింది 52600 కోట్లు.ఉందని, సీఎం జగన్కు అప్పులు చేయడం మీదనే దృష్టి ఆదాయాలు సృష్టించడం పై లేదనీ, 

మోసం చేసిన మామయ్య మాయ చేస్తున్న అన్నయ్య cm జగన్ ను మహిళలు పిల్లలు భావిస్తున్నారని, రక్తం పంచుకు పుట్టిన సొంత చెల్లి జగనన్న వదిలిన బాణం షర్మిల కి న్యాయం చేయాలేని వ్యక్తి మహిళలందరికీ న్యాయం చేస్తారనీ, పెన్షన్ ,అమ్మఒడి ఆసరా ఇవన్నీ కలిపి ప్రత్యేక బడ్జెట్ లా తయారు చేసి మహిళలను మోసం చేస్తున్నారని, అదేవిధంగా పిల్లలకి ప్రత్యేక బడ్జెట్ అని ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారనీ, ఈ పథకం కింద మధ్యాహ్న భోజన పథకం వసతిగృహాలు మరుగుదొడ్లు రంగులు వేయడం పారిశుద్ధ్య నిర్వహణ అన్ని గత ప్రభుత్వాలు కూడా చేసినవేనని ఇందులో కొత్తగా చేసేదేముంది ప్రచారం తప్పించి పిల్లల్ని తల్లి మోసం చేయడం తప్పించనీ, అదేవిధంగా

పెన్షన్ పెంపు,పెళ్లి కానుక ఊసేలేదని,విదేశీ విద్యా పథకంపలుకే లేదనీ,.స్వయం ఉపాధి పథకాల కోసం సబ్సిడీ రుణాలు మంజూరు సంగతే మర్చిపోయారనీ,

బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపు కార్పొరేషన్ల నిధులన్నీ నవరత్నాలకు కేటాయిస్తూ ఈ వర్గాలన్నీ మోసం చేస్తున్న మాట వాస్తవం కాదనీ,

 రైతులకు తొలకరి చినుకులు కాదు ఎండమావుల ప్రభుత్వమని, నివార్ తుఫాన్ తుఫాను వలన నష్టపోయిన రైతాంగానికి పది వేల కోట్లలో ఒక్క పైసా ఆయన చెల్లించారా? 0% వడ్డీ పథకానికి తూట్లు పొడవడం వాస్తవం కాదా? మోటార్లకు నీటి మీటర్లు బిగించడం ఉచిత విద్యుత్తును రద్దు చేసే కుట్రలో భాగం కాదా? రైతు భరోసా లో 52 లక్షల మంది రైతులకు 30 వేల రూపాయలు చొప్పున మోసం చేయడం వాస్తవం కాదా? పంటల బీమా పథకం ఎప్పుడు అమలులోకి వస్తుంథో తెలియదని ఇవన్నీ ప్రతిపాదనలే నని, ధరల స్థిరీకరణ నిధి వల్ల ఒక రైతు కన్నీటికి మేలు జరిగిందనీ, మూడు వేల కోట్ల రూపాయలతో ధ

Andrapradesh

May 21 2021, 17:14

న్యూ ఢిల్లీ
 


ఎంపీ రఘురామకు బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

ఎంపీ రఘురామకృష్ణ రాజుకు బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

ఎంపీ తరఫున ముకుల్‌ రోహత్గీ, ప్రభుత్వం తరఫున దుష్యంత్‌ దవే వాదనలు 

ఇరు పక్షాల వాదనలు విని ఎంపీకి బెయిల్‌ను మంజూరు చేసిన సుప్రీం కోర్టు 

ఆర్మీ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులు పరీక్షించి ఎక్స్‌రే, వీడియో కూడా పంపారన్న ధర్మాసనం 

ఎంపీకి జనరల్‌ ఎడిమా ఉందని, ఫ్రాక్చర్ కూడా అయినట్లు నివేదికలో ఉందన్నా ధర్మాసనం. 

ఆర్మీ ఆస్పత్రి వైద్యుల బృందం సమర్పించిన నివేదికను పరిశీలించిన సుప్రీం కోర్టు

Andrapradesh

May 21 2021, 16:31

_కేంద్ర ప్రభుత్వానికి భారీ నిధులిచ్చిన ఆర్బీఐ_
 


_ముంబై : కేంద్ర ప్రభుత్వానికి భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) శుక్రవారం పెద్ద మొత్తంలో నిధులను బదిలీ చేసింది. మార్చి 31తో ముగిసిన తొమ్మిది నెలల అకౌంటింగ్ పీరియడ్‌లో మిగులు నిధులు రూ.99,122 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి ఆమోదం తెలిపింది. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన ఆర్బీఐ డైరెక్టర్ల కేంద్ర బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది._

_దేశంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను ఆర్బీఐ బోర్డు సమీక్షించినట్లు ఈ ప్రకటన పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం వల్ల పడే ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు ఆర్బీఐ ఇటీవల తీసుకున్న విధానపరమైన చర్యలు, అంతర్జాతీయ, దేశీయ సవాళ్ళ గురించి చర్చించినట్లు తెలిపింది._ 

_భారతీయ రిజర్వు బ్యాంకు అకౌంటింగ్ ఇయర్ గతంలో జూలై-జూన్ ఉండేది. ప్రస్తుతం ఏప్రిల్-మార్చికి మారింది. ఈ నేపథ్యంలో 2020 జూలై నుంచి 2021 మార్చి వరకు గల తొమ్మిది నెలల్లో ఆర్బీఐ పని తీరును ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని బోర్డు చర్చించింది. ఈ తొమ్మిది నెలల కాలానికి ఆర్బీఐ వార్షిక నివేదికను, ఖాతాలను ఆమోదించింది._

_ఈ తొమ్మిది నెలల కాలంలో మిగులు నిధులు రూ.99,122 కోట్లును కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. 5.5 శాతం కంటింజెన్సీ రిస్క్ బఫర్‌ను నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొంది._

_బోర్డు సమావేశంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు మహేశ్ కుమార్ జైన్, మైఖేల్ దేబబ్రత పాత్రా, ఎం. రాజేశ్వర్ రావు, టీఆర్ శంకర్ పాల్గొన్నారు. ఆర్బీఐ సెంట్రల్ బోర్డు డైరెక్టర్లు ఎన్ చంద్రశేఖరన్, సతీశ్ కే మరఠే, ఎస్ గురుమూర్తి, రేవతి అయ్యర్, సచిన్ చతుర్వేది, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ దేబశిశ్ పాండా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్ సెక్రటరీ అజయ్ సేఠ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు._

Andrapradesh

May 21 2021, 16:29

నేరుగా సుప్రీంకు ఎలా వస్తారు?: దవే
 దిల్లీ: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణపై అభియోగం కేసులో సుప్రీంలో మళ్లీ వాదనలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తరఫున న్యాయవాది దుష్యంత్‌ దవే వాదలను ప్రారంభించారు. ‘‘ఆర్మీ ఆస్పత్రి నివేదికతో మేం విభేదించడం లేదు. ఆర్మీ ఆస్పత్రి నివేదికలో గాయాలకు గల కారణాలు లేవు. గుజరాత్‌ సొసైటీ కేసు ఆధారంగా బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేయాలి. హైకోర్టులో ఇంకా మెరిట్‌ ఆధారంగా నిర్ణయం తీసుకోలేదు. అలాంటప్పుడు దాన్ని సవాలు చేస్తూ సుప్రీంలో ఎలా పిటిషన్‌ దాఖలు చేస్తారు?’’ అని దవే సుప్రీంకు తెలిపారు. ఆయన రెండు వర్గాలమధ్య రెచ్చగొట్టేలా మాట్లాడారని అన్నారు. 

‘‘ఎంపీ రఘురామ హద్దులు మీరారు. కరోనావేళ ఇదంతా సరికాదని రఘురామకు సమయం ఇచ్చాం. సీఐడీ అధికారులు ఎంపీకి సంబంధించిన 45 వీడియోలు సేకరించి విచారణ చేశారు. కులం, మతం ఆధారంగా సమాజంలో అలజడి సృష్టించేందుకు రఘురామ ప్రయత్నించారు. ఇవన్నీ రాజద్రోహం కిందికే వస్తాయి’’ అని దవే కోర్టుకు వెల్లడించారు.

రఘురామకృష్ణరాజు ఎంపీ అని ముకుల్‌ రోహత్గీ పదేపదే చెబుతున్నారనీ, చట్టం అందరికీ ఒక్కటేనని దవే అన్నారు.

Andrapradesh

May 21 2021, 14:57

ఏపీ ఎన్నికల కమిషనర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
 అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ 
హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఏపీ ఎన్నికల కమిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పును తమకు కావాల్సినట్టుగా ఏపీ ఎన్నికల కమిషన్ అన్వాయించుకుందని పేర్కొంది. చదవటం, అవగాహన చేసుకోవటంలో వైఫల్యం చెందారని సుప్రీంకోర్టు తీర్పును ఇలా అన్వాయించుకోవటం ఆమోదయోగ్యం కాదని తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పులో నాలుగు వారాల సమయం ఇవ్వాలని స్పష్టంగా ఉందని పేర్కొంది. చదవటం, రాయటం, ఇంగ్లీష్ భాషపై అవగాహన ఉన్న సామాన్యుడికి కూడా సుప్రీంకోర్టు తీర్పు అర్థమవుతుందని హైకోర్టు తెలిపింది. కానీ ఏపీ ఎన్నికల కమిషనర్.. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా గతంలో పనిచేశారని.. ఆమె సుప్రీంకోర్టు తీర్పును సరైన దృక్పధంలో అర్థం చేసుకోకపోవటం ఆశ్చర్యాన్ని కల్గించిందని పేర్కొంది. ఇటువంటి తరుణంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఆమె అర్హతపై ఆలోచించాల్సి వస్తుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆమె ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారని... సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఆమె వ్యవహరించారని మండిపడింది. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఏప్రిల్ 1న ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి 10న కౌంటింగ్ ఎలా జరుపుతారని హైకోర్టు ప్రశ్నించింది. ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు పూర్తి విరుద్ధమని, ఇటువంటి చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలు పడిపోతాయని ఏపీ హైకోర్టు పేర్కొంది.

Andrapradesh

May 21 2021, 14:07

రఘురాజుకి జనరల్ ఎడిమా, కాలివేలికి ఫ్రాక్చర్.. ఆర్మీ ఆసుపత్రి నివేదిక వెల్లడి! 
 


 సీల్డ్ కవర్ ను తెరిచిన జస్టిస్ వినీత్ శరన్ 

 రఘురాజుకు ఫ్రాక్చర్ అయినట్టు రిపోర్టులో ఉందన్న న్యాయమూర్తి 

 మధ్యాహ్నం 2.30కు విచారణ వాయిదా 

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు ప్రారంభించింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి వైద్యులు జరిపిన వైద్య పరీక్షల రిపోర్టును, వీడియో రికార్డింగును సుప్రీంకు తెలంగాణ హైకోర్టు సీల్డ్ కవర్ లో అందజేసింది. ఈ సీల్డ్ కవర్ ను జస్టిస్ వినీత్ శరన్ ఈ రోజు తెరిచారు. ముగ్గురు వైద్యులు పరీక్షించిన నివేదిక, ఎక్స్ రే, వీడియో కూడా పంపించారని ఈ సందర్భంగా జస్టిస్ శరన్ తెలిపారు. రఘురాజుకు జనరల్ ఎడిమా ఉందని, కాలి వేలికి ఫ్రాక్చర్ అయినట్టు కూడా రిపోర్టులో ఉందని చెప్పారు.

విచారణ సందర్భంగా రఘురాజు తరపున ముకుల్ రోహత్గీ వాదిస్తూ... ఒక సిట్టింగ్ ఎంపీకే ఇలా జరిగితే సామాన్యుడి పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. కస్టడీలో రఘురాజును చిత్ర హింసలకు గురి చేశారనే విషయం తేలిపోయిందని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని ధర్మాసనాన్ని కోరారు.

మరోవైపు, ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ... ఆ గాయాలను రఘురాజు స్వయంగా చేసుకున్నారా? లేదా? అనే విషయం తెలియదని కోర్టుకు చెప్పారు. ఈ సందర్భంగా దవే వాదనపై ధర్మాసనం స్పందిస్తూ... సీఐడీ కస్టడీ నుంచి ఆర్మీ ఆసుపత్రికి వెళ్లే సమయంలో రఘురాజు గాయాలు చేసుకున్నారని మీరు అంటున్నారా? అని ప్రశ్నించింది. తదుపరి విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.

రిపోర్టులో రఘురాజు కాలికి ఫ్రాక్చర్ అయిందనే విషయం కీలక అంశంగా మారింది. కేసు విచారణ ఈ అంశం చుట్టూ తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Andrapradesh

May 21 2021, 13:06

హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయంగా భావిస్తున్నాం: పవన్ కల్యాణ్.
 

_
ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, హైకోర్టును జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వాగతించారు. ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పు హర్షణీయమని పవన్ అన్నారు. 

స్థానిక స్వపరిపాలనకు ఈ తీర్పు ఊపిరిపోసిందని చెప్పారు. ఏడాది క్రితం నోటిఫికేషన్ జారీ చేసి, ఆ తర్వాత కరోనా కారణంగా ఎన్నికలను రద్దు చేశారని తెలిపారు. అయితే అదే నోటిఫికేషన్ పై ఏడాది తర్వాత ఎన్నికలను నిర్వహించడం అంటే ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కినట్టేననని అన్నారు.

ఏప్రిల్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం తలపెట్టినప్పుడే... జనసేన తీవ్రంగా వ్యతిరేకించిందని పవన్ చెప్పారు. ఎన్నికలకు తాజా నోటిఫికేషన్ జారీ చేయాలని... పోటీ చేసే అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వాలని డిమాండ్ చేశామని తెలిపారు. 

అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు వెళ్లిందని... మొండిగా ఎన్నికలకు వెళ్లడంతో జనసేన హైకోర్టును ఆశ్రయించిందని చెప్పారు. ఎన్నికలను రద్దు చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని ప్రజాస్వామ్య విజయంగా భావిస్తున్నామని తెలిపారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం పంతాలకు, పట్టింపులకు పోకుండా... తగిన సమయంలో తాజా నోటిఫికేషన్ జారీ చేసి, ఎన్నికలను నిర్వహించాలని కోరుతున్నామని అన్నారు

Andrapradesh

May 21 2021, 12:05

Big Breaking....
 

అమరావతి:


రాష్ట్రంలో ఎంపీటిసి, జెడ్పీటిసి ఎన్నికలను రద్దు చేసిన హైకోర్టు

ఎన్నికలకు కొ
నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికలు జరపలేదన్న హైకోర్టుసుప్రీంకోర్టు ఆదేశాలు పాటించలేదని హైకోర్. పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు .ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు .ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు.