Andrapradesh

May 20 2021, 10:29

కరోనా ప్రభావం ఆర్థిక రంగంపై తీవ్రంగా ఉంది: గవర్నర్
 


అమరావతి: కరోనా ప్రభావం ఆర్థిక రంగంపై తీవ్రంగా ఉందని ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. నేడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగించారు. కొవిడ్ మృతులకు సంతాపం తెలిపిన అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. దేశంలో కరోనా సంక్షోభం కొనసాగుతోందన్నారు. కొవిడ్‌తో పరిస్థితులు ఎలా మారాయో అందరికీ తెలుసన్నారు. సెకండ్ వేవ్‌లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ పేర్కొన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు సెల్యూట్ తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా 95శాతం హామీలు పూర్తి చేశామన్నారు. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని గవర్నర్ తెలిపారు. కరోనాను ఆరోగ్యశీలో చేర్చామన్నారు. ఆరోగ్యశ్రీకి ప్రైవేట్ ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్లు కేటాయించామని వెల్లడించారు. నవరత్నాలు ద్వారా లబ్ధిదారులకే నేరుగా సాయం అందుతోందన్నారు. రూ.1,600 కోట్లతో 36.8 లక్షల మందికి జగనన్న గోరుముద్ద అందిస్తామని తెలిపారు. 44.5 లక్షల మంది తల్లులకు జగనన్న అమ్మ ఒడి అందుతోందన్నారు. జగనన్న విద్యా కానుక ద్వారా 47లక్షల మందికి కిట్‌లు అందించామని గవర్నర్ బిశ్వభూషణ్ తెలిపారు.

Andrapradesh

May 20 2021, 10:28

భారీగా పెరిగిన డీఏపీ ధ‌ర‌లు.. స‌బ్సిడీపై కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం
 


డీఏపీ ధ‌ర‌లు పెరుగుతూ రైతుల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తిస్తున్నాయి.. అయితే, కేంద్రం ప్ర‌భుత్వం ఇవాళ రైతుల‌కు అనుకూలంగా చారిత్రాత్మ‌క‌మైన నిర్ణ‌యం తీసుకుంది.. డీఏపీ ఎరువు ధరల‌ను భారీగా పెంచేందుకు నిర్ణ‌యించిన మోడీ స‌ర్కార్.. అదే స‌మ‌యంలో.. పెరిగిన భారాన్ని రైతుల‌పై మోప‌కుండా సబ్సిడీ రూపంలో తామే భ‌రిస్తామ‌ని పేర్కొంది. డీఏపీపై ప్రభుత్వ సబ్సిడీని కేంద్ర స‌ర్కార్ 140 శాతం పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది.. అంటే.. ఇప్పటి వరకు డీఏపీ బ్యాగ్‌ ధర రూ. 1,700 ఉండ‌గా.. రూ. 500 సబ్సిడీతో రూ. 1,200కి డీఏపీ ల‌భ్యం అవుతుంది.. కానీ, ఇప్పుడు డీఏపీ ధ‌ర రూ.2400కు చేరింది.. అయితే, రైతులు చెల్లించాల్సింది మాత్రం.. అదే రూ.1200లు.. మిగ‌తా రూ. 1,200 కేంద్రం సబ్సిడీ రూపంలో ఇస్తుంది. రైతుల‌కు డీఏపీకి రూ.1200 చెల్లిస్తే.. మిగ‌తా రూ.1,200లను కేంద్రం నేరుగా కంపెనీలకు చెల్లించ‌నుంది. తాజా నిర్ణయంతో ప్ర‌భుత్వంపై రూ. 14,775 కోట్ల అద‌న‌పు భారం ప‌డ‌నుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఎరువుల ధ‌ర‌ల‌పై ఇవాళ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అధ్య‌క్ష‌త‌న ఉన్న‌త‌స్థాయి స‌మావేశం జ‌రిగింది.. అంతర్జాతీయంగా ఫాస్పోరిక్ ఆమ్లం, అమ్మోనియా మొదలైన‌వాటి ధరలు పెరగడం వల్ల ఎరువుల ధరలు పెరుగుతున్నాయని చర్చించారు. అయితే, రైతులు పాత ధ‌ర‌ల‌కే రువులు పొందాలని ప్ర‌ధాని మోడీ స్ప‌ష్టం చేశారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ.. డీఏపీ ఎరువుల రాయితీని ఒక్కో సంచికి రూ .500 నుంచి రూ .1,200 కు పెంచాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇది 140 శాతం పెరుగుదల అని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇటీవ‌ల డీఏపీలో ఉపయోగించే ఫాస్పోరిక్ ఆమ్లం, అమ్మోనియా మొదలైన వాటి ధ‌ర‌లు అంతర్జాతీయంగా 60 శాతం నుండి 70 శాతం వరకు పెరిగాయి. కాబట్టి, డీఏపీ బ్యాగ్ ధ‌ర ఇప్పుడు రూ .2,400గా చేరింది.. పాత స‌బ్సిడీ ప్ర‌కారం.. ఎరువుల కంపెనీలు రూ .500 సబ్సిడీని పరిగణనలోకి తీసుకున్న త‌ర్వాత రూ .1,900కు బ‌స్తా అమ్మాల్సి ఉంటుంది.. కానీ, ఇవాళ కేంద్రం తీసుకున్న నిర్ణ‌యంతో రైతులకు రూ .1,200కే డిఎపి బ్యాగ్ ల‌భించ‌నుంది.

Andrapradesh

May 20 2021, 10:26

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న 5 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం తిరుమల శ్రీవారిని 5,030 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 18 లక్షల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 2295 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Andrapradesh

May 20 2021, 10:26

కోవిడ్ వ్యాక్సినేషన్ పై కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక నిబంధనలు విడుదల చేసింది. 
 


కోవిడ్ బారినపడి, పాజిటివ్ వచ్చినవారు రికవరీ అయిన మూడు నెలలకు మొదటి డోసు వ్యాక్సిన్ వేయించుకోవాలని.
మొదటి డోసు వేసుకున్నాక కోవిడ్ బారినపడిన, రికవరీ తరువాత మూడు నెలలు గడువు.
ప్లాస్మా ట్రీట్మెంట్ తీసుకున్న కరోనా రోగులు కూడ 3 నెలలు తరువాత వ్యాక్సిన్ వేసుకోవాలి.
ఇతర రోగాలతో సీరియస్ స్టేజ్ లో ICUలో ఉండి, రికవరీ అయినవారు 4 నుండి 8 వారాలు తరువాత వ్యాక్సిన్ వేసుకోవాలి.బ్లడ్ డొనేట్ చేసే వారు రికవరీ అయిన 14 రోజుల తర్వాత RT-PCR టెస్ట్ లో నెగిటివ్ వచ్చాక రక్తదానం చేయవచ్చు.
బాలింతలు అందరూ వ్యాక్సిన్ వేసుకోవచ్చు.

Andrapradesh

May 20 2021, 10:25

AP Budget 2021: అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభం
 


అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశం ప్రారంభమైంది. తొలిసారిగా మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ... అందుకు తగ్గట్టే కేటాయింపులు చేసిన జెండర్‌ బేస్డ్‌ బడ్జెట్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ముందుకు రాబోతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీతో పాటు మహిళలకు ప్రత్యేకంగా ఉప ప్రణాళికలు పొందుపరిచిన 2021–22 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను గురువారం శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నారు.

ఉదయం 11 గంటలకు  ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో బడ్జెట్‌ను హోంమంత్రి సుచరిత ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను ధర్మాన కృష్ణదాస్‌  ప్రవేశపెట్టనున్నారు.

Andrapradesh

May 20 2021, 08:24

అమిత్ షాతో ఎంపీ రఘురామ కృష్ణరాజు భార్య, పిల్లలు భేటీ..    
 


ఆ విషయాలన్నీ పూసగుచ్చినట్లు.. సంచలనం!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు భార్యా,పిల్లలు బుధవారం రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
  
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సతీమణి రమాదేవి,కూతురు ఇందు ప్రియదర్శిని,కుమారుడు భరత్‌ బుధవారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు.రఘురామపై జగన్‌ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు.తన తండ్రికి సంబంధించి జరిగిన విషయాలన్నీ అమిత్ షా‌కు పూసగుచ్చినట్లు వివరించినట్లు తెలుస్తోంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి చోటుచేసుకున్న పరిణామాలను అమిత్‌షాకు ఇందు ప్రియదర్శిని,భరత్‌ వివరించారు.అనంతరం అమిత్‌షాకు ఇరువురు కలిసి వినతిపత్రం అందజేశారు.

అమిత్ షాతో ఎంపీ రఘురామ పిల్లలు భేటీ.

కాగా,పథకం ప్రకారం ప్రభుత్వాన్ని,ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారనే ఆరోపణలతో ఎంపీ రఘురామ కృష్ణరాజును ఏపీ సీఐడీ శుక్రవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.ఈ కేసులో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ 12/ 2021 నమోదు చేశారు. A1గా రఘురామకృష్ణ రాజు,A2గా టీవీ5, A3గా ఏబీఎన్‌ ఛానల్‌ను సీఐడీ ఎఫ్‌ఐర్‌లో పేర్కొంది. సీఐడీ డీఐజీ ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. రఘురామపై అభియోగాలను సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచింది. 

అదేవిధంగా ప్రభుత్వంపై విద్వేషాలను రెచ్చగొట్టేలా రఘురామ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంది.

అయితే, సీఐడీ కస్టడీలో తనను కొంతమంది కొట్టారని ఎంపీ రఘురామ ఆరోపించారు.దీంతో వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు సూచించగా.. 

గుంటూరు జీజీహెచ్‌లో నిర్వహించి రిపోర్ట్ అందజేశారు.రఘురామ మాత్రం వైద్య పరీక్షలపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు.దీంతో కోర్టు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించడంతో..అక్కడ పరీక్షలు నిర్వహించి రిపోర్టులను సీల్డ్ కవర్‌లో తెలంగాణ హైకోర్టు ద్వారా సుప్రీం కోర్టుకు అందజేశారు.         

ఈ రిపోర్టులో ఏముందనేంది ఉత్కంఠరేపుతోంది.

Andrapradesh

May 20 2021, 08:07

ఒరిస్సా నుండి గుంటూరు వెళ్తున్నా ఆక్సిజన్ వాహనానికి అంతరాయం
 


వెంటనే మరమ్మతులు చేయించి, రవాణాకు అంతరాయం లేకుండా చూసిన జంక్షన్ ఎస్సై

ఆక్సిజన్ వాయువుతో ఒరిస్సా నుండి గుంటూరు కు రవాణా చేస్తున్న ఆక్సిడెంట్ ట్యాంకర్ నెంబర్ AP 31 TB 8127 వాహనం హనుమాన్ జంక్షన్ సెంటర్లో అక్సిల్ విరిగి పోవడంతో లారీ అక్కడే ఆగిపోయింది. సమాచారము అందుకున్న హనుమాన్ జంక్షన్ si పి గౌతమ్ కుమార్ గారు, వెనువెంటనే ఆ వాహనం ప్రయాణానికి అంతరాయం లేకుండా దగ్గర్లో ఉన్న రోడ్ సేఫ్టీ మొబైల్ వారి తో కలిసి మరమ్మతులు చేయించి, ప్రయాణానికి మార్గం సుగమం చేశారు. కోవిడ్ వైద్యశాల యందు ఆక్సిజన్ యొక్క ప్రాముఖ్యత, క్షణం ఆలస్యమైతే జరిగే పరిణామాలను ముందుగా ఆలోచించి, క్షణం మాత్రం ఆలస్యం చేయకుండా ఎస్ఐ గారు స్పందించిన తీరు, ఆక్సిజన్ రవాణాకు అంతరాయం లేకుండా జరిగింది.

Andrapradesh

May 20 2021, 08:06

అమరావతి
 


మంగళగిరి NRI లో మరో భారీ స్కామ్.....!

దాదాపుగా కోటి రూపాయలు పైగా విలువైన రిమెడిసిఆర్ ఇంజెక్షన్స్...పక్కదారి..

గతంలో పని NRI లో కీలకమైన బాధ్యతలు నిర్వహించిన ఒక వ్యక్తి..

 విజయవాడ లో సొంత గా
 క్యారంటేన్ సెంటర్స్ ఏర్పటు...

NRI ఇండెంట్ లో కోనుగోలు చేసిన వ్యక్తి....

విజయవాడ క్యారంటేన్ సెంటర్ లో ఇంజెక్షన్స్ 10 రేట్లు అధికంగా విక్రయాలు....

ఇంజెక్షన్ కి సంభందించిన GSt బిల్లు ఆధారంగా విచారణ చేపడుతున్న అధికారులు..

అంత నగదు హెటేరో కంపినీ కి ఎవరో చెల్లింపు చేసేరో అనే కోణంలో కూడా విచారణ....

విజిలెన్స్ dg కి రాజేంద్రనాద్ రెడ్డి కి పిర్యాదు చేసిన అధికారపార్టీ నేతలు....

రహస్యంగా విచారణ చేస్తున్న విజిలెన్స్ అధికారులు

Andrapradesh

May 19 2021, 18:59

పెను సంచలనం ! నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం కృష్ణ పట్నం లో కరోనా కు ఆయుర్వేద మందు 
 *పెను సంచలనం. ఒకప్రక్క కరోనా కు సరైన మందులు లేక రెమిడెసివిర్ లాంటి ఇంజెక్షన్లు, అత్యంత ప్రభావవంతమైన స్టెరాయిడ్స్ కూడా పనిచేయక అల్లోపతిలో అనేక వేల మంది అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం మరణిస్తుంటే...???
దీనికి సంబంధించి వైరల్ అవుతున్న పూర్తి వార్త మీకోసం 
నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం కృష్ణ పట్నం లో ఉచితంగా ఇస్తున్న ఆయుర్వేద మందు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలలో కూడా పెను సంచలనం సృష్టిస్తోంది.
కరోనా ఏ స్థాయిలో ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే నెగెటివ్ రావడం, CT SCAN లో చెస్ట్ సివియారిటీ స్కోర్ 24/25 ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే 0 కి రావడం, ఆక్సిజన్ అందక తీవ్ర విషమ పరిస్థితుల్లో ఉన్న వారు కూడా ఒక్కరోజులో లేచి కూర్చోవడం పెను సంచలనం సృష్టిస్తోంది.
సోషల్ మీడియాలో గత మూడు రోజులుగా ఈ విషయం పెను దుమారం రేపడంతో కేరళ, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అందరి దృష్టి ఒక్కసారి గా కృష్ణపట్నం పైకి మళ్ళింది.
ఒక్క పైసా డబ్బు తీసుకోకుండా ఒక్కరోజు లోనే ఎంత తీవ్రమైన కేసైనా, తగ్గిపోవడం, ఎంత తీవ్రంగా కరోనా ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే నెగెటివ్ రావడం, కార్పొరేట్ ఆసుపత్రులు చేతులెత్తేసిన కేసులు కూడా రెండు రోజుల్లోనే తగ్గిపోవడం, ఇంత వరకు ఈ వైద్యం పై ఒక్క రిమార్క్ కూడా రాకపోవడంతో వేలాది మంది కృష్ణ పట్నానికి క్యూ కట్టడానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది.
ఏది ఏమైనప్పటికీ 25 లక్షలు ఖర్చు చేసిన ఏ మాత్రం గ్యారంటీ ఇవ్వని కార్పొరేట్ ఆసుపత్రులు కంటే ఒక్క పైసా తీసుకోకుండా రెండు రోజుల్లోనే నెగెటివ్ తెప్పిస్తామని భరోసా ఇస్తున్న ఆయుర్వేద వైద్యులు మనలాంటి సామాన్యులకు దేవుడితో సమానం అని అనడం అతిశయోక్తి కాదు.

సమాచార నిమిత్తము తెలియపరచడమైనది.

"కృష్ణపట్నంలో కరోనాకు మందు పంపిణీ పై కాకాణి స్పందన".

కృష్ణపట్నం గ్రామంలో బొణిగి ఆనందయ్య, తన మిత్రులతో కలిసి కరోనా నివారణకు మరియు కరోనా సోకిన వారికి ఆయుర్వేద వైద్యం అందిస్తున్నారు.
బొణిగి ఆనందయ్య, తన మిత్రులతో అందిస్తున్న ఆయుర్వేద మందుకు సంబంధించి ఒక్క పైసా కూడా డబ్బులు తీసుకోకుండా ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవాభావంతో మందులు అందిస్తున్నారు.
ఆనందయ్య అందిస్తున్న మందు వల్ల వినియోగించిన వారిలో ఇప్పటివరకు సత్ఫలితాలు తప్ప, ఎక్కడా దుష్ప్రభావం చూపలేదు.
ఆనందయ్య అందిస్తున్న మందు గురించి లోకాయుక్త, జిల్లా అధికారులను వివరణ కోరడం జరిగింది.
అధికారులు, ఆనందయ్య అందిస్తున్న మందు పట్ల ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం చేయనప్పటికీ, లోకయుక్తకు నివేదిక అందించేందుకు, మందును పరిశీలించవలసిన అవసరం ఉందని చెప్పిన మీదట, మందు యొక్క ప్రభావం పరిశీలించుటకు గడువు కోరడమైనది.
జిల్లా కలెక్టర్ గారు, ఆయుష్ మరియు ఇతర అధికారులతో సంప్రదించాం.
వీలైనంత త్వరలో, 24 గంటలలోపే మందు యొక్క ప్రభావంపై పరిశీలన పూర్తిచేయవలసినదిగా కోరాం.
 కరోనా నివారణలో భాగంగా, మ

Andrapradesh

May 19 2021, 18:54

మైనింగ్‌ శాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ సమీక్ష
 


మైనింగ్‌ శాఖలో సంస్కరణలు 

ఈ– ఆక్షన్‌ ద్వారా మైనర్‌ మినరల్స్‌ అమ్మాలని నిర్ణయం

సీనరేజీ ఫీజు వసూలను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించాలని నిర్ణయం

గ్రానైట్‌ౖ మైనింగ్‌లో సైజు (పరిమాణం) పద్దతిలో కాకుండా బరువు ఆధారంగా సీనరేజీ నిర్ణయించాలని నిర్ణయం

ఇకపై ఎన్నిటన్నులు బరువు ఉంటే.. ఆమేరకు సీనరేజీ నిర్ణయం

దీనివల్ల కనీసం 35 నుంచి 40శాతం ఆదాయం పెరుగుతుందని అంచనా:

లీజులు పొంది, గనులు నిర్వహించని చోట కొత్తగా ఈ వేలం నిర్వహించాలని నిర్ణయం

దీనివల్ల మరో రూ.వేయికోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తుందని అంచనా

ఈ నిర్ణయాలకు సీఎం ఆమోదం

సెప్టెంబరు నుంచి కొత్త నిర్ణయాలు అమల్లోకి వస్తాయన్న అధికారులు

మైనింగ్‌ శాఖలో నిఘా, అమలు విభాగం పటిష్టంగా ఉండాలన్న సీఎం
ఆదాయాలకు గండి పడకుండా చూడాలన్న సీఎం

వర్షాలు వచ్చేలోగా కనీసం 60 నుంచి 79 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుకను అందుబాటులోకి ఉంచండి:
వర్షాలు వల్ల రీచ్‌లు మునిగిపోయే అవకాశం ఉంటుంది, మళ్లీ ఇసుకకు ఇబ్బందులు రాకూడదు:
అందుకనే సరిపడా నిల్వలను అందుబాటులోకి ఉంచాలని అదేశించిన సీఎం

హాజరైన పంచాయతీరాజ్, భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మైనింగ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, భూగర్భగనుల శాఖ డైరెక్టర్‌ (డిఎంజి) విజి.వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు