Andrapradesh

Apr 03 2020, 12:05

కరోనా వైరస్ సమయంలో టు వీలర్ పై చక్కర్లు కొట్టడం అవసరమా? 

వాహనంతో రోడ్లపైకి రావొద్దు రెండేళ్ల జైలు శిక్ష అనుభవించిన వద్దు

రోడ్లపై వాహనంతో పట్టుబడితే రెండేళ్ల జైలు శిక్ష 

నడుచుకుంటూ వెళ్లి సరుకులు కొనుక్కో దాం ఇంటికి హ్యాపీగా వెళ్దాం

కఠిన మైన నిర్ణయాల అమలులో ఉన్నప్పుడు
ప్రజలు సహకరించాలి

లేకపోతే ప్రజలకు నష్టం వాటిల్లుతుంది

పోలీసులను సహకరిద్దాం  ప్రజలుగా మనల్ని మనం రక్షించుకుందాం


వ కరోనా వైరస్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉంది. అయినా ప్రజల్లో మార్పు రావటం లేదు. పదేపదే పోలీసులు హెచ్చరించినప్పటికీ ప్రజలను పట్టించుకోవడం లేదు. కరోనా వైరస్ ప్రమాదం అని తెలిసినప్పటికీ 
మనకి మనము గా సీరియస్ గా తీసుకోవడం లేదు. ఇప్పటికైనా సీరియస్ గా ఉందాం . రైతు బజార్ కు కిరాణా సరుకులు కాలినడకనే వెళ్ళి కొను కొందాం వాహనాలపై వెళ్లి రెండు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన వద్దు. ఇలాంటి మార్పు నేటి నుంచే శ్రీకారం చుడదాం అంటూ ప్రతి పౌరుడు సైనికుడిలా వ్యవహరించాలి. కరోనా వైరస్ వ్యాధి నుంచి తప్పించుకోవాలి  ఎక్కడో ఎందుకు మన పక్క  జిల్లాలైన విజయనగరం శ్రీకాకుళం లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకుండా ఆ జిల్లా ప్రజలు ఎంత పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారో అవి చూసి మనం మారలేమా. మనం కూడా బైకుల మీద తిరగవద్దు. అనవసరంగా రెండేళ్లు జైలుశిక్ష అనుభవించిన వద్దు. గోరుతో పోయిందని గొడ్డలి దాక తెచ్చుకోవడం. స్వచ్ఛందంగా ఉదయం 6 నుంచి 9 వరకు దొరికే సరుకుల ని కాలినడకన వెళ్లి తెచ్చుకుందాం. అవసరం అయినా మేరకే తెచ్చుకుందాం. ప్రభుత్వానికి పోలీసులకి సహకరిద్దాం ఇలాంటి ఆలోచనలు ప్రజల్లో రావాల్సిన అవసరం ఉంది. ఎవరికోసం ఈ లాక్ డౌన్ ఎందుకోసం ఈ లాక్ డౌన్ మనం ఒక్కసారి ఆలోచిస్తే రో డ్ల పైకి వెళ్ళాం.  ఎక్కడో విజయనగరంలో తల్లి చనిపోయింది. కొడుకు విజయవాడలో ఎస్సైగా డ్యూటీ చేస్తున్నారు. అయినా ఆ కొడుకు రాలేకపోయాడు

 • Andrapradesh
   @Andrapradesh ఎందుకు రాలేకపోయారని ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. తనువు చాలించిన తల్లి మరల రాదు గాని బ్రతికి ఉన్న వారిని కరోనా వైరస్ నుండి రక్షించడానికి ఆ పోలీసు వెళ్లలేదు. అంటే
  ఆ లాంటి పోలీసులకు మనం సహకరించాల్సిన అవసరం లేదా. ఇప్పటికైనా లాక్ డౌన్ ని  సక్రమ పద్ధతిలో పాటిద్దాం. మన ప్రాణాలను మనమే రక్షించుకుందాం. జైలు పాలు కాకుండా ఇంటి వద్దనే ఉందాం.ఉదయం ఆరు నుంచి తొమ్మిది వరకు కాలినడకన వెళ్లి బజారు చేసుకుందాం. ఎంత సరుకు అవసరమో అంతే తెచ్చుకుందాం.
  అనే ఆలోచన ప్రతి వ్యక్తిలో కలిగితే కరోనా వైరస్ నుండి తప్పించుకోవడం సాధ్యం . మన ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్పటికీ ప్రజలే మా ప్రాణమంటూ పదేపదే చెపుతున్నప్పటికీ ప్రజలలో మార్పు రావడం లేదు. కనీసం మారడానికి ప్రయత్నించటం లేదు . ఇతర దేశాలలో మరణాలు చూసైనా మనం ఇంటిపట్టునే ఉందాం ఏప్రిల్ 14 వరకు ఎవరి ఇళ్లలో వారు ఉండండి .కరోనా మహమ్మారి వ్యాధి నుండి మనల్ని మనం రక్షించుకుందాం 
Andrapradesh

Apr 03 2020, 12:03

నిత్యావసర సరుకుల సరఫరాలో విఫలం అవుతున్న కొందరు అధికారులు

ముఖ్యమంత్రి నివాసం ఉండే నియోజకవర్గం పరిధిలోనే రేషన్ దుకాణాల్లో నిత్యావసర సరుకుల కొరత

కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే సరుకుల రవాణాలో ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్న కొందరు రేషన్ డీలర్లు.

సాధారణ సమయాల్లో అయితే ఎలాగోలా బుజ్జగించి చెప్పిన వినేవారని, కానీ ఇలాంటి విపత్తు సమయంలో ఇలా చేయడం సమంజసం కాదని రేషన్ కార్డు దారులు ఆగ్రహం.

కందిపప్పు సరఫరాలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు.

సరుకులు పంపిణీలో సైతం నాణ్యత లోపించటంపై కార్డు దారులు ఆగ్రహం

తాశీల్ధార్ లు పర్యవేక్షణ లోపం కూడా వారికి శాపంగా మారింది

గోడౌన్ లో నిల్వలు ఉన్నాయ!!! లేవా ???

ఉంటే సరఫరా చేసేందుకు ఆ శాఖ అధికారులు చొరవ చూపకపోటంలో ఆంతర్యం ఏమిటో???

ప్రస్తుత పరిస్థితుల్లో వాహనాల కొరత కూడా ఓ కారణంగా ఉందని కొందరు డీలర్లు వ్యాఖ్యలు

మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన సివిల్ సప్లయికు సంబంధించిన ఓ అధికారి రేషన్ షాపులకు సరుకులు కావాలంటే మీరే వాహనాలు తెచ్చుకోవాలని అనటం కోసమేరుపు

తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి విపత్తు సమయంలో పేద ప్రజలకు మేలు చేయాలని వాపోతున్నారు

Andrapradesh

Apr 03 2020, 11:07

ఏపీ లో 161 కి చేరిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు.

నిన్న రాత్రి 10 గంటలు తరువాత నుంచి ఇప్పటి వరకు 12 కొత్త కేసులు నమోదు.

జిల్లాల వారిగా ఇప్పటి వరకు నమోదు అయిన కేసులు..

అనంతపురం - 2
చిత్తూరు - 9
తూర్పుగోదావరి - 9
గుంటూరు - 20
కడప - 19
కృష్ణ - 23
కర్నూలు - 1
నెల్లూరు - 32
ప్రకాశం - 17
శ్రీకాకుళం - 0
విశాఖపట్నం - 14 
విజయనగరం - 0
పశ్చిమగోదావరి - 15
ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారి బంధువులలో వైరస్ వ్యాప్తి

Andrapradesh

Apr 03 2020, 10:28

కరోన చీకట్లు తరిమి వెద్దాం.... ప్రదాని నరేంద్ర మోడీ...

న్యూఢిల్లీ: దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ముందుగా ప్రకటించినట్టుగానే సరిగ్గా ఉదయం 9 గంటలకు ఆయన ట్విటర్ వేదికగా ఈ వీడియో షేర్ చేసుకున్నారు. కరోనా మహమ్మారిపై పోరాటానికి కలిసి నడుస్తున్న దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఈ సందర్భంగా ధన్యావాదాలు తెలిపారు. కొవిడ్-19పై భారత్ చేస్తున్న పోరాటాన్ని చాలా దేశాలు అనుసరిస్తున్నాయన్నారు. జనతా కర్ఫ్యూతో దేశ ప్రజలు తమ సామర్థ్యాన్ని చాటారని కొనియాడారు. దేశ ప్రజలంతా ఒక్కటిగా నిలిచి కరోనాను జయించాలని పేర్కొన్నారు. ఐక్యంగా పోరాడితేనే విజయం సాధిస్తామనీ.. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటే కరోనాను జయించినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని జయించేందుకు రాబోయే ఐదు రోజులు అత్యంత కీలకమని ఆయన గుర్తుచేశారు.
కాగా కరోనాపై విజయం సాధించేందుకు దేశ ప్రజలంతా మరోసారి సంకల్పం చాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఏప్రిల్ 5న ఆదివారం రాత్రి కరోనా చీకట్లను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఆరోజు రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు ఆర్పేయాలన్నారు. ఎవరెక్కడున్నా లైట్లు ఆర్పేసి దీపాలు వెలిగించాలని ప్రధాని కోరారు. ఈ సందర్భంగా సామాజిక దూరం (సోషల్ డిస్టెన్సింగ్) పాటించాలని కోరారు. విద్యుత్ లైట్లన్నీ ఆర్పివేసి కొవ్వొత్తి, దీపం లేదా మొబైల్ ఫ్లాష్ లైట్ వెలిగించాలన్నారు. తద్వారా దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు మరోసారి కరోనాను పారదోలేందుకు తమ సంకల్పం చాటాలని ప్రధాని కోరారు. ప్రజలు వెలిగించే దీపాలు కరోనాపై పోరాడే వైద్యులు, అత్యవసర సేవల సిబ్బందిలో మరింత స్ఫూర్తి నింపాలని ఆకాంక్షించారు......

Andrapradesh

Apr 02 2020, 19:08

ఏపీలో మరో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.

ఏపీలో 135 కు చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.

ప్రస్తుతం ఉన్న నాలుగు కరోనా ల్యాబ్స్ తో పాటు మరో మూడు ల్యాబ్స్ ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం .

కడప, గుంటూరు, విశాఖలో ల్యాబ్స్ ఏర్పాటు.

రోజుకు 450 నుంచి 570 వరకు కరోనా టెస్టులు .

మర్కజ్ వెళ్లిన 1085 మందిలో 758 మంది నుంచి శాంపిల్స్ తీసుకున్న అధికారులు.

ఢిల్లీ వెళ్లివచ్చిన వారిలో 91 మందికి కరోనా పాజిటివ్.

Andrapradesh

Apr 02 2020, 17:09

ఏపీలో కరోనా కల్లోలం : ఆ రెండు జిల్లాలు సేఫ్

ఏపీలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. తొలుత వైరస్ సోకిన కేసులు తక్కువగానే నమోదయ్యాయి. కానీ క్రమక్రమంగా వైరస్ బారిన పడిన వారు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వైరస్ వ్యాప్తి చెందకుండా..పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది.

2020, ఏప్రిల్ 02వ తేదీ గురువారం 132 పాజిటివ్ కేసులు నమోదవడం రాష్ట్రాన్ని భయం గుప్పిట్లోకి నెట్టేస్తోంది. వరుసగా కోవిడ్ కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంటోంది. గుంటూరు, నెల్లూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 

 గుంటూరు : మొత్తం పాజిటివ్ కేసులు 20. మృతులు 0. విషమంగా ఉన్న వారు 0. కోలుకున్న వారు 0.

 నెల్లూరు : మొత్తం పాజిటివ్ కేసులు 20. మృతులు 0. విషమంగా ఉన్న వారు 0. కోలుకున్న వారు 01.

 కడప : మొత్తం పాజిటివ్ కేసులు 15. మృతులు 0. విషమంగా ఉన్న వారు 0. కోలుకున్న వారు 00

 కృష్ణా : మొత్తం పాజిటివ్ కేసులు 15. మృతులు 0. విషమంగా ఉన్న వారు 0. కోలుకున్న వారు 00.

 ప్రకాశం : మొత్తం పాజిటివ్ కేసులు 17. మృతులు 0. విషమంగా ఉన్న వారు 0. కోలుకున్న వారు 00.
 
 పశ్చిమ గోదావరి : మొత్తం పాజిటివ్ కేసులు 14. మృతులు 0. విషమంగా ఉన్న వారు 0. కోలుకున్న వారు 00.

 విశాఖపట్టణం : మొత్తం పాజిటివ్ కేసులు 11. మృతులు 0. విషమంగా ఉన్న వారు 0. కోలుకున్న వారు 01

 చిత్తూరు : మొత్తం పాజిటివ్ కేసులు 08. మృతులు 0. విషమంగా ఉన్న వారు 0. కోలుకున్న వారు 00.

 తూర్పుగోదావరి  : మొత్తం పాజిటివ్ కేసులు 09. మృతులు 0. విషమంగా ఉన్న వారు 0. కోలుకున్న వారు 00

 అనంతపురం : మొత్తం పాజిటివ్ కేసులు 2. మృతులు 0. విషమంగా ఉన్న వారు 0. కోలుకున్న వారు 00.

 కర్నూలు : మొత్తం పాజిటివ్ కేసులు 1. మృతులు 0. విషమంగా ఉన్న వారు 0. కోలుకున్న వారు 00.

Andrapradesh

Apr 02 2020, 13:34

రాజధానిలో అందరికీ ఇళ్ల పథకం వర్తింపుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.

అందరికీ ఇళ్ల పథకం అమలు కోసం అవసరమైన పక్షంలో సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ మార్పులు చేర్పులు చేయాలంటూ ఉత్తర్వులు.

సీఆర్డీఏ చట్టం పరిధిలోనే మాస్టర్ ప్లానులో మార్పులుండాలని స్పష్టీకరణ.

హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పథకం అమలు చేసేలా ప్రక్రియ ప్రారంభించాలని గుంటూరు, కృష్ణా కలెక్టర్లకు ఆదేశాలు.

రాజధాని పరిధిలో పేదల ఇళ్ల కోసం 1251.51 ఎకరాలను సిద్దం చేసిన ప్రభుత్వం.

నవులూరు, కృష్ణాయపాలెం, నిడమర్రు, ఐనవోలు, కురగల్లు, మందడం గ్రామాల్లో అందరికీ ఇళ్ల పథకం భూమిని సిద్దం చేసుకున్న సర్కార్.

తాడేపల్లి, మంగళగిరి మున్సిపాల్టీల పరిధిలోని పేదలకు రాజధానిలో ఇళ్ల కేటాయింపు.

తాడేపల్లి, దుగ్గిరాల, మంగళగిరి, పెదకాకాని మండలాల్లోని పలు గ్రామాల్లోని పేదలకు ఇళ్ల కేటాయింపు జరపాలని గతంలోనే నిర్ణయం.

ఇప్పటికే రాజధానిలో ఇళ్ల కేటాయింపుపై జారీ చేసిన జీవో 107ను రద్దు చేసిన హైకోర్టు.

పేదలకు ఇళ్ల పథకం కోసం గుర్తించిన భూమిని రెవెన్యూ అప్పగించేలా ఉత్తర్వులు.

హైకోర్టు తీర్పుపై సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయనున్నట్టు జీవోలో వెల్లడి.

Andrapradesh

Apr 02 2020, 13:33

ట్విట్టర్లో టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు..

ఏ ప్రాంత ప్రజలైనా రామరాజ్యం కావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఒక ఉత్తమ వ్యవస్థకు రూపం ఇచ్చిన ఉత్తమ పాలకుడు శ్రీరాముడు. అధికారాన్ని ప్రజోపయోగంగా ఎలా వినియోగించాలో రాముడు మనకు తెలియచెప్పాడు. అందుకే గాంధీజీ సైతం స్వతంత్ర భారతదేశం రామరాజ్యంలా విలసిల్లాలని కోరుకున్నారు.

విభజన కారణంగా భద్రాద్రిని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ లోటు కనపడనీయకుండా, కడప జిల్లాలో 450 ఏళ్ళ చరిత్ర కలిగిన ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని రూ.100కోట్లతో అభివృద్ది చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతిఏటా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించే ఏర్పాట్లు చేశాం.

అలాంటిది గత ఏడాదిగా ఒంటిమిట్ట కోదండ రామాలయ అభివృద్ధి పనులు ఆగిపోవడం బాధాకరం. ప్రతి ఏటా వీధివీధినా చలువపందిళ్ళలో వేడుకగా జరిగే సీతారాముల కళ్యాణోత్సవాలు ఈ ఏడాది కరోనా వల్ల ఇళ్లకే పరిమితం అయ్యాయి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, రాజ్యం సుభిక్షంగా ఉండాలనేదే కోదండరాముడి ఆకాంక్ష.

కాబట్టి ఈ పండుగవేళ ఇళ్ళకే పరిమితమై శ్రీరాముని దివ్య చరిత్రను మననం చేసుకుందాం. మన ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యంతోపాటు సమాజ ఆరోగ్యం కాపాడదాం. ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

Andrapradesh

Apr 02 2020, 11:01

ఏపీ లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

కొత్త గా మరో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

ఇప్పటివరకు మొత్తం 132 కు చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు

కృష్ణా లో 15
గుంటూరు లో 20
ప్రకాశం లో 17
కడప లో 15
చిత్తూరు లో 8
విశాఖలో 11
అనంతపురంలో 2
నెల్లూరు లో 20
కర్నూల్ లో 1
పగో లో 14
తుగో లో 9

శ్రీకాకుళం, విజయనగరం లో నమోదు కాని కరోనా పాజిటివ్ కేసులు

Andrapradesh

Apr 01 2020, 19:06

కరోనా దెబ్బకు రైతన్న కన్నీరు పెడుతుంటే..: బుద్దా వెంకన్న

అమరావతి : విత్తనాలు, ఎరువులు ఇవ్వలేక చేతులెత్తేసిన వాడు...రైతు రాజ్యం తెస్తా అన్నట్టుంది జగన్‌ పాలన అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేస్తూ ట్వీట్‌ చేశారు. ఏడాదిలో 500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రైతులకు ఏడాదికి రూ. లక్ష ఇస్తామని గాలి హామీలిచ్చారని విమర్శించారు. కరోనా దెబ్బకు రైతన్న కన్నీరు పెడుతుంటే... పొగడ్తలకు తప్ప... రైతులను పట్టించుకునే తీరికలేదు పబ్జీరెడ్డికి అంటూ బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు.