Andrapradesh

Apr 01 2020, 11:41

ఏపీలో ఒక్క రోజే 43 కరోనా కేసులు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఒక్క రోజే 43 కొవిడ్‌ కేసులు నమోదు కావడం గమనార్హం. దీంతో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రాష్ట్రంలో 87కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9 గంటల మధ్య 43 కొత్త కేసులు నమోదైనట్లు తాజా బులిటెన్‌లో తెలిపింది. గత 12 గంటల వ్యవధిలో 373 మంది నమూనాలను పరీక్షించగా.. అందులో 330 నెగిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగైనట్లు చెప్పారు.
ఈ ఒక్క రోజే తొలిసారిగా కడప జిల్లాలో 15, పశ్చిమగోదావరి జిల్లాలో 13 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. చిత్తూరు జిల్లాలో 5, ప్రకాశం జిల్లాలో 4, తూర్పుగోదావరి జిల్లాలో 2, నెల్లూరు జిల్లాలో 2, కృష్ణ 1, విశాఖ జిల్లాలో 1 కొత్త కేసు నమోదయ్యాయి

Andrapradesh

Apr 01 2020, 11:21

AP: ఉద్యోగులకు: ఈ నెల సగం జీతమే.. సీఎం జగన్ కీలక నిర్ణయం! 

 కరోనా వైరస్‌ (కోవిడ్ 19) ప్రభావం, లాక్‌డౌన్‌తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను రెండు విడతల్లో చెల్లించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చెప్పినట్లు ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ వెల్లడించారు. సీఎంతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న నేపథ్యంలో ఈ నెలలో సగం వేతనం చెల్లిస్తామని సీఎం జగన్ చెప్పినట్లు వివరించారు. నిధులు సర్దుబాటు అయ్యాక మిగతా సగం వేతనం చెల్లిస్తామని సీఎం చెప్పారని సూర్యనారాయణ వెల్లడించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితిలో రెండు విడతలుగా జీతం తీసుకునేందుకు తాము కూడా ఒప్పుకున్నట్లు తెలిపారు. ఈ ఒక్క నెల మాత్రమే రెండు విడతల్లో చెల్లిస్తామని సీఎం చెప్పారని, తర్వాత యథావిధిగా జీతాల చెల్లింపు కొనసాగుతుందని సూర్యనారాయణ స్పష్టం చేశారు

Andrapradesh

Apr 01 2020, 10:52

పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కలకలం

పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. నిన్నటి వరకూ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కానీ పశ్చిమలో ఒక్కసారిగా 14 పాజిటివ్ కేసులు నమోదు కావడం సంచలనం రేకెత్తిస్తోంది. ఏలూరు 8, భీమవరం 2, ఉండి 1, గుండుగోలను 1 నారాయణపురం 1, పెనుగొండ 1 మొత్తం 14 మందికి పాజిటివ్ రావడం తీవ్ర ఉద్రిక్తతకు దారిస్తుంది. నిన్నటి వరకూ జీరోగా ఉన్న పశ్చిమలో ఒక్కసారిగా 14 పాజిటివ్ కేసులు రావడంతో భయాందోళనలకు లోనయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనా కేసుల్లో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమగోదావరి జిల్లా ఒక్కసారిగా మొదటి స్థానంలోకి చేరుకొంది. దీంతో ఈ జిల్లాను రెడ్ అలర్ట్ గా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. 14 మంది పాజిటివ్ కేసుల్లోని సభ్యులంతా జమైతా ఇస్లామిక్ సభలకు మార్చి 14, 15 వ తేదీలలో ఢిల్లీ వెళ్లి వచ్చినట్లుగా సమాచారం. అక్కడ ఇండోనేషియా, ఇతర దేశాలనుంచి ఇస్లామిక్ మత ప్రబోధకులు వచ్చి మత బోధలు చేస్తారు. ఈ క్రమంలో వీరు అక్కడికి వెళ్లడం అక్కడ నుంచి కరోనా వ్యాప్తి చెందినట్లుగా తెలుస్తుంది. వీరిలో అత్యధికంగా ఏలూరుకు చెందిన వారు అధికంగా ఉండటం కొంత ఇబ్బంది కలిగించే అంశం. విచిత్రం ఎంటంటే 14 మందిలో ఒక్కరు, ఇద్దరికి తప్పా కరోనా తాలూకు దగ్గు, జ్వరం, జలుబు లాంటి లక్షణాలు వీరిలో కనిపించడం లేదంటూ వైద్యులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. జిల్లాలో ఉన్న అన్ని ఆసుపత్రులను ఐసోలేషన్ వార్డులుగా ప్రకటించారు. ఈ పద్నాలుగు మంది ఎక్కడెక్కడ తిరిగారో అధికారులు ఆరా తీస్తున్నారు. వీరి కుటుంబ సభ్యులను వీరికి దగ్గరగా మెలిగిన వ్యక్తులను అద్దికారులు గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. అదేవిధంగా వీరు ఎక్కడెక్కడ తిరిగారో ఆరా తీస్తున్నారు. అయితే ఇటీవల నెల్లూరు, విజయవాడ కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన వారు కోలుకుని ఇంటికి వెళ్లడం కొంత ఊరటనిచ్చే అంశం. ఏదైతే ఈరోజు నుంచి మన జిల్లా ప్రజలకు జీవన్మరణ సమస్య కనుక అందరూ ఇంటికే పరిమితమవ్వాల్సిందే. కాదని బయటికొస్తే ఇక అంతే సంగతులు. ఇక నుంచి ఇంకా వళ్ళు దగ్గర పెట్టుకుని మసలాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Andrapradesh

Mar 31 2020, 15:13

బ్రేకింగ్, ఏపీలో 40కి చేరిన కరోనా కేసులు, ఒక్కరోజే 17 కేసులు నమోదు, పదేళ్ల బాలుడికి కరోనా

ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. రాష్ట్రంలో రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40కి పెరిగింది. ఈ ఒక్కరోజే 17 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంగళవారం(మార్చి 31,2020) ప్రకటన విడుదల చేసింది. బాధితుల్లో ఢిల్లీలో మతపరమైన ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి వచ్చిన వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. తాజాగా పదేళ్ల బాలుడికి కరోనా సోకినట్టు తేలడం కలకలం రేపుతోంది. అనంతపురం జిల్లా హిందూపురంకి చెందిన బాలుడి కరోనా పాజిటివ్ వచ్చింది.

నిన్నటి వరకు ఏపీలో కరోనా కేసుల సంఖ్య 23. ఆ సంఖ్య కాస్త ఒక్కసారిగా 40కి పెరగడం అందరిని ఆందోళనకు గురి చేస్తోంది. అటు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కరోనా కట్టడికి మరిన్ని చర్యలు చేపట్టింది. లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేసే యోచనలో ఉంది. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 11 కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

 ఏపీలో పెరిగిన కరోనా కేసులు

 40కి చేరిన బాధితులు

 ఒక్కరోజే 17 కేసులు నమోదు

 అనంతపురం జిల్లా లేపాక్షికి చెందిన పదేళ్ల బాలుడికి కరోనా

 మక్కా నుంచి వచ్చిన కర్నాటక వ్యక్తితో సన్నిహితంగా ఉన్న బాలుడు

 అనంతపురం జిల్లా లేపాక్షికి చెందిన 34 ఏళ్ల మహిలకు కరోనా

 మక్కా నుంచి వచ్చిన కర్నాటక వ్యక్తితో సన్నిహితంగా ఉన్న మహిళ

 ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 11 కరోనా కేసులు

 గుంటూరు జిల్లాలో 9కి చేరిన కరోనా కేసులు

 విశాఖ జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో 5కి చేరిన కరోనా కేసులు

 తూర్పుగోదావరి జిల్లాలో 4 కేసులు

 అనంతపురం జిల్లాలో 2కి చేరిన కేసులు

 చిత్తూరు, కర్నూలు, నెల్లూరులో ఒక్కో కేసు నమోదు

 సోమవారం(మార్చి 30,2020) రాత్రి నుంచి ఇప్పటివరకు(ఉదయం 11 వరకు) 17 కొత్త కరోనా కేసులు

Andrapradesh

Mar 31 2020, 14:39

ఆంధ్రప్రదేశ్ మారువేషంలో జేసీ..అవాక్కైన వ్యాపారులు

సినిమాల్లోనే ఇప్పటి వరకూ మోసాలను వెలుగులోకి తెచ్చేందుకు అధికారులు మారు వేషం వెయ్యడాన్ని చూశాం. కానీ ఇప్పుడు నిజ జీవితంలోనూ అలాంటి అధికారులు కనిపిస్తున్నారు. విజయనగరానికి చెందిన జాయింట్ కలెక్టర్.. మారు వేషంలో కూరగాయల మార్కెట్లను తనిఖీ చేశారు.

విజయనగరం: జిల్లాలో లాక్‌డౌన్, 144 సెక్షన్ కారణంగా నిత్యావసర వస్తువులు, కొరగాయలు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కాకుండా అధిక ధరలకు అమ్ముతున్నారని ఫిర్యాదులు రావటంతో.. జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్.. దీనిపై దృష్టి సారించారు. మంగళవారం ఉదయం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు కూరగాయల మార్కెట్‌లలో సామాన్య వ్యక్తిలా మారువేషంలో వెళ్లి ధరలను తెలుసుకున్నారు.

ఇతర కొనుగోలు దారుల నుంచి ధరలకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని చోట్ల రూ.5 ఎక్కువ అమ్ముతున్నట్లు గుర్తించారు. దీంతో ఎక్కడ తప్పు జరుగుతోందో అధికారులతో సమావేశమై ధరలు నియంత్రణ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మారువేషంలో వచ్చింది జాయింట్ కలెక్టర్ అని తెలుసుకొని కొంత మంది వ్యాపారులు అవాక్కయ్యారు.

Andrapradesh

Mar 31 2020, 14:31

లాక్ డౌన్ పటిష్ట అమలు, నిత్యావసర వస్తువులు సరఫరా,సేవలు పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో సమన్వయ బృందాలు ఏర్పాటు:సిఎస్.

అమరావతి,31ఏప్రిల్: రాష్ట్రంలో లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేసే ప్రక్రియలో భాగంగా ప్రజలకు వివిధ నిత్యావసర సేవలు అందేలా చూడడం ఇందుకు సంబంధించి ఏమైనా సమస్యలు ఫిర్యాదులు ఉంటే రాష్ట్ర స్థాయిలోని 1902 కంట్రోల్ రూమ్ ద్వారా స్వీకరించి వాటిని సత్వరం పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిల్లో సమన్వయ బృందాలను ఏర్పాటు చేస్తూ జిఓఆర్టి సంఖ్య 223 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.
ఈసమన్వయ బృందాలు లాక్ డౌన్ సక్రమంగా అమలు అయ్యే లి చూడడంతో పాటు ఆ సమయంలో ప్రజలకు వివిధ నిత్యావసర సేవలు సక్రమంగా అందేలా చూస్తుంది.అంతేగాక వివిధ నిత్యావసర వస్తువులు డిమాండ్ ను ముందుగానే అంచనా వేసి ఆయా నిత్యావసర వస్తువులు కూరగాయలు ఆయా ప్రాంతాలకు సరఫరా జరిగేలా ఈసమన్వయ బృందాలు చూస్తాయి.నిత్యావసర వస్తువులు సేవలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఫిర్యాదులు ఉంటే 1902 కంట్రోల్ రూమ్ ద్వారా స్వీకరించి వాటిని రాష్ట్ర,జిల్లా స్పందన కంట్రోల్ రూమ్లు ద్వారా సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ నీలం సాహ్ని ఆ ఆదేశాలలో పేర్కొన్నారు.
పౌరసరఫరాలు, పోలీస్, డైరీ డెవలప్మెంట్, పశుసంవర్థక,మత్స్య, మున్సిపల్, పంచాయతీరాజ్, కార్మిక తదితర శాఖల అధికారులు రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ కు రోజువారీ నివేదికను (Daily Situation Report)సమర్పించాలని సిఎస్ స్పష్టం చేశారు.

సంబంధిత సమన్వయ బృందం ఓవరాల్ ఇన్చార్జి రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ సమన్వయంతో వివిధ నిత్యావసర సేవలు ప్రజలకు సక్రమంగా అందేలా చూడాలని ఆదేశించారు.అదే విధంగా జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్లు కూడా రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ తో సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు.
అదేవిధంగా వివిధ నిత్యావసర వస్తువులు తయారీ,రవాణా, సేవలుకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే అలాంటి సమస్యలు, ఫిర్యాదులను ఈసమన్వయ బృందాలు తెల్సుకుని రాష్ట్ర, జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ లో ద్వారా సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 • Andrapradesh
   @Andrapradesh రాష్ట్ర సమన్వయ బృందాలు:
  కేంద్ర ప్రభుత్వం,ఇతర రాష్ట్రాలతో ఓవరాల్ సమన్వయ ఇన్చార్జి టిఆర్ఆండ్బి ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు ఆయనతోపాటు మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వై.మధుసూదనరెడ్డి, మార్కెటింగ్ శాఖ కమీషనర్ ప్రద్యుమ్న,ఎ.శ్రీకాంత్, ఎన్ఫోర్స్మెంట్ ఐజి వినీత్ బ్రిజ్ లాల్,ఐజి లీగల్ హరికుమార్ ఉన్నారు.
  అలాగే మాన్యుఫాక్చరింగ్ మరియు నిత్యావసర వస్తువులు సమన్వయ బృందం ఇన్చార్జి గా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఆయనతోపాటు పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం,కార్మిక శాఖ ప్రత్యేక కమీషనర్ రేఖా రాణి,ఎంపి ఫైబర్ సిఇఓ సుమీత్ ఉన్నారు.
  నిత్యావసర వస్తువులు సరఫరా రాష్ట్ర, జిల్లా సమన్వయ ఇన్చార్జి గా పౌరసరఫరాల శాఖ కమీషనర్ కె.శశిధర్ ఆయనతోపాటు ప్రద్యుమ్న,ఉద్యానవన శాఖ కమీషనర్ చిరంజీవి చౌదరి, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హెచ్ అరుణ్ కుమార్, మార్క్ ఫెడ్ ఎండి శ్రీ కేష్ లక్తర్,ఆయిల్ ఫెడ్ ఎండి శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు.
  అదేవిధంగా నిత్యావసర వస్తువులు రవాణా పర్యవేక్షణ కు ఇన్చార్జి గా రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ విసి మరియు ఎండి వై.భాను ప్రకాశ్ ఆయనతోపాటు రవాణా శాఖ కమీషనర్ పి.సీతారామాంజనేయులు,సిఐడి డిజి డా.సిఎం త్రివిక్రమ్ వర్మ, సర్వే శాఖ డైరెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.
  స్థానిక సంస్థల్లో నిత్యావసర వస్తువులు,తాగునీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం నిర్వహణ ఇన్చార్జిగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది ఆయనతో పాటు మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఆశాఖ కమీషనర్ జిఎస్ఆర్కె విజయకుమార్,ఇంధన శాఖ కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్,ఎసిబి డిఐజి యం.రవిప్రకాశ్, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు రంజిత్ భాషా ఉన్నారు.
  అలాగే స్వచ్చంద సంస్థలు,వాలంటరీ గ్రూపులు,సిఎస్ఆర్ నిధులు సమీకరణ తదితర అంశాలకు ఇన్చార్జి గా సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు కె.హర్షవర్ధన్,బిసి సంక్షేమ శాఖ సంచాలకులు బి.రామారావు,గ్రేహాండ్స్ ఎస్పి రాహుల్ దేవ్ శర్మ ఉన్నారు.
  మీడియా మేనేజిమెంట్ ఇన్చార్జి గా సమాచార శాఖ కమీషనర్ టి.విజయకుమార్ రెడ్డి,ఎపిటిఎస్ ఎండి నందకిశోర్,డిఐజి ఎస్పి రాజశేఖర్ బాబు ఉన్నారు.
  (ప్రచార విభాగం, సమాచార శాఖ, అమరావతి సచివాలయం వారిచే జారీ చేయడమైనది) 
Andrapradesh

Mar 31 2020, 11:51

అత్యవసర సమాచారం

తబ్లిగి జమాత్ వారు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు AP లో జిల్లాల వారీగా వారి సంఖ్య

వారిని త్వరగా తమ ఉళ్ళల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి చెక్ చేపించుకొని చికిత్స తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది...సమాజ హితం కోరి మీరు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కొరటమైనది...


శ్రీకాకుళం జిల్లా  0

విజయనగరం జిల్లా   3

విశాఖపట్నం రూరల్.  1

విశాఖపట్నం సిటీ.   41

తూర్పు గోదావరి జిల్లా   6

పశ్చిమ గోదావరి జిల్లా  16

రాజమండ్రి.       21

కృష్ణ జిల్లా.       16

విజయవాడ సిటీ.   27

గుంటూరు అర్బన్.  45

గుంటూరు రూరల్.  43

ప్రకాశం జిల్లా.      67

నెల్లూరు జిల్లా.     68

కర్నూల్ జిల్లా.      189

కడప జిల్లా.        59

అనంతపూర్ జిల్లా.   73

చిత్తూరు జిల్లా.      20

తిరుపతి.         16

        Total.   711

Andrapradesh

Mar 31 2020, 09:04

ఆ ఎస్పీ చేసిన పనికి నెటీజన్లు ఫిదా 

ఆవిడో 65 ఏళ్ల పైచిలుకు వృద్ధురాలు..చుర్రుమంటున్న ఎండలో కూరగాయలు అమ్మడానికి ఇబ్బందులు పడుతుండటం అర్బన్‌ ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి గమనించారు. ఎండలో నీకెందుకమ్మా!? ఇంతకష్టం? అని ఆమెను పలకరించారు. ఇంతవరకూ అమ్ముడుపోవడం లేదు నాయనా..అని ఆమె దిగాలుగా బదులిచ్చింది. సరేనమ్మా! నువ్వేమీ దిగులుపడొద్దు. అమ్మలాంటి దానివి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వీ పనులు చేయొద్దు అంటూ ఆమె వద్ద ఉన్న కేరట్, వంకాయలు, పచ్చిమిర్చి మొత్తం ఆయనే కొన్నారు.
అంతే ఆమె మోములో ఆనందం తొంగిచూసింది. అలాగే, ఆమె పక్కనే ఇదే పరిస్థితిలో ఉన్న మరో వృద్ధుడి నుంచి మూడు మూటల నిమ్మకాయలు సైతం కొనుగోలు చేశారు. తాను కొన్న వాటన్నింటీనీ అక్కడే ప్రజలు, పాత్రికేయులు, పోలీసులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఆ తర్వాత మళ్లీ వృద్ధురాలి వద్దకు వెళ్లి ఆరోగ్యం కాపాడుకో తల్లీ! అంటూ జాగ్రత్తలు చెప్పి పంపారు. సోమవారం స్థానిక నెహ్రూ మున్సిపల్‌ గ్రౌండ్‌లోని తాత్కాలిక కూరగాయాల మార్కెట్‌లో చోటుచేసుకుంది.

Andrapradesh

Mar 31 2020, 09:03

RBI చెప్పిన వినటం లేదు

లోన్లు తీసుకున్న వారికి యదావిధిగా మెసేజ్ లు పంపుతున్నారు

కరోనా వైరస్ నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కూడా కేంద్రానికి సాయం అందించేందుకు కీలక రెపో రేటును తగ్గించింది. ఇంకా పలు నిర్ణయాలు తీసుకుంది. వీటిల్లో ఈఎంఐ మారటోరియం కూడా ఒకటి. 3 నెలలు ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. దీంతో లోన్ ఈఎంఐ ఉన్న వారు ఊపిరి పీల్చుకున్నారు. కరోనా వైరస్ వల్ల ఆదాయం లేకపోవడంతో నెలవారీ ఈఎంఐ కట్టలేమనే బాధ తప్పిందని భావించారు. కానీ ఇప్పుడు వారికి షాకిస్తున్నాయి ఆర్థిక సంస్థలు. ఆర్‌బీఐ నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని, అందువల్ల మీ ఈఎంఐ గడువు దగ్గరకు వస్తుండటంతో బ్యాంక్ అకౌంట్‌లో తగినంత డబ్బులు ఉంచుకోవాలని పలువురికి మెసేజ్‌లు పంపుతున్నాయి.

దీంతో లోన్ తీసుకున్న వారిలో ఆందోళన నెలకొంది. ఆర్‌బీఐ ప్రకటన ప్రకారం.. అన్ని వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, లోక్ ఏరియా బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, ఎన్‌బీఎఫ్‌సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ కంపెనీలకు చెందిన కస్టమర్లు ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదు. టర్మ్ లోన్స్‌కు ఈఎంఐ మారటోరియం వర్తిస్తుందని ఆర్‌బీఐ పేర్కొంది.

అంటే హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, వెహికల్ లోన్స్ వంటి వాటికి ఇది వర్తిస్తుంది. కన్సూమర్ డ్యూరబుల్ లోన్స్‌కు మారటోరియం ఉంటుంది. అంటే ఫ్రిజ్, స్మార్ట్‌ఫోన్, టీవీ వంటి వాటి కొనుగోలుకు రుణం తీసుకున్న వారు కూడా ఈఎంఐ కట్టక్కర్లేదు. క్రెడిట్ కార్డు బకాయిలకు కూడా ఈఎంఐ మారటోరియం కిందకు వస్తాయని ఆర్‌బీఐ తెలిపింది.

Andrapradesh

Mar 30 2020, 21:09

‘కరోనా’ పై పోరాటానికి సినీ హీరో నారా రోహిత్ రూ.30 లక్షల విరాళం

ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.10 లక్షలు
ఏపీ, తెలంగాణలకు పది లక్షల చొప్పున విరాళం
తగు జాగ్రత్తలతో ‘కరోనా’ను అరికట్టవచ్చు
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంపై జరుపుతున్న పోరాటానికి సినీ నటుడు నారా రోహిత్ మద్దతు ప్రకటించాడు. తన వంతుగా భారీ విరాళం ప్రకటించారు. ప్రధాన మంత్రి సహాయ నిధికి, రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మొత్తం రూ.30 లక్షలు విరాళంగా ఇస్తానని తెలిపాడు. ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.10 లక్షలు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పది లక్షల రూపాయల చొప్పున ప్రకటించాడు. తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా ‘కరోనా’ ను అరికట్టవచ్చని ప్రజలకు పిలుపు నిచ్చాడు.
 సినీ హీరో సందీప్ కిషన్ రూ.3 లక్షల విరాళం
టాలీవుడ్ కి చెందిన మరో నటుడు సందీప్ కిషన్ కూడా రూ. 3 లక్షలు విరాళంగా ప్రకటించాడు. సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) కి ఈ విరాళం ఇచ్చారు. లాక్ డౌన్ నేపథ్యంలో తన సొంత రెష్టారెంట్ వివాహభోజనంబు లో పని చేస్తున్న 500 మందికి పైగా ఉద్యోగుల బాధ్యతలను తాను చూసుకుంటానని చెప్పాడు.