/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png StreetBuzz Thirupathi : ఎడతెరిపి లేకుండా వర్షం... శ్రీవారి భక్తులకు అలెర్ట్... Andrapradesh
Thirupathi : ఎడతెరిపి లేకుండా వర్షం... శ్రీవారి భక్తులకు అలెర్ట్...

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అలెర్ట్. తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఈ క్రమంలో టీటీడీ పాలక మండలి పాపవినాశనం, శ్రీవారి మెట్టు మార్గాలు మూసివేసింది. ఇక అటు తిరుమలలో ఉన్న గోగర్భం జలాశయం కూడా పూర్తిగా నిండిపోయింది. దీంతో మూడు సెంటిమీటర్ల మేర గేట్లు ఎత్తారు. తిరుమల భక్తులు సహకరించాలని టీటీడీ పాలక మండలి అధికారులు కోరడం జరిగింది.

 ఇక తిరుమలలో భారీ వర్షాలకు రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా సిబ్బంది ఎప్పటికప్పుడు జేసీబీలతో బండరాళ్లను తొలగిస్తున్నారు.

 వర్షం కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని టీటీడీ అధికారులు తెలిపారు.

 సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని.. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4-5 గంటల సమయం పడుతోందని చెప్పారు. ఇక, శనివారం 73,619 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరిలో 25,112మంది భక్తులు తలనీలాలు సమర్పించారని, స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.35 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు.

డిసెంబర్ 3వ తేదీ నుంచి స్థానిక భక్తులకు శ్రీవారి దర్శనం... మార్గ దర్శకాలు ఇవే...

తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని ఇటీవలే టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రతి నెలా మొదటి మంగళవారం వారికి స్వామి దర్శన భాగ్యం కల్పించాలని టీటీడీ ఏర్పాట్లు చేసింది. డిసెంబర్ 3వ తేదీ నుంచి స్థానిక భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు.

 దీనికి సంబంధించి డిసెంబర్ 2న తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీనగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో దర్శన టోకెన్లు ఉచితంగా జారీ చేస్తారు. మహతి ఆడిటోరియంలో 2,500 టోకెన్లు, తిరుమలలోని బాలాజీ నగర్‌ కమ్యూనిటీ హాల్‌లో 500 టోకెన్లు ఉదయం 3 నుంచి 5గంటల మధ్య జారీ చేయనున్నారు.

మార్గ దర్శకాలు ఇవే..

ముందుగా వచ్చిన వారికి తొలి ప్రాధాన్యత క్రమంలో టోకెన్లు కేటాయిస్తారు

దర్శనం టికెట్‌ పొందడానికి స్థానికులు తమ ఒరిజినల్‌ ఆధార్‌కార్డు తప్పనిసరిగా చూపించాలి

టోకెన్లు పొందిన భక్తులు దర్శన సమయంలో ఒరిజినల్‌ ఆధార్‌కార్డు తీసుకురావాల్సి ఉంటుంది

వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని ఫుట్‌పాత్‌ హాల్‌ (దివ్యదర్శనం)క్యూలైన్‌లో భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు

ఇతర దర్శనాల్లో ఇచ్చే విధంగా దర్శనానంతరం ఒక లడ్డూ ఉచితంగా అందిస్తారు

స్థానికుల కోటాలో దర్శనం చేసుకున్న వారికి తిరిగి 90 రోజుల వరకు దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉండదు.

టిడిపిలో చేరబోతున్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత తీగల కృష్ణారెడ్డి... ఎప్పుడంటే...

మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత తీగల కృష్ణారెడ్డి టీడీపీలో చేరబోతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

 డిసెంబర్ 3న ఆ పార్టీ చీఫ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో కృష్ణారెడ్డి టీడీపీలో చేరనున్నారట. ఈ విషయాన్ని ఆయన మీడియాకు వెల్లడించారు.

ఏపి ముఖ్యమంత్రి ప్రమాణం చేసిన అనంతరం హైదరాబాద్ కు వచ్చిన చంద్రబాబును మాజీ మంత్రి మల్లారెడ్డితోపాటు ఆయన కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు.

 కాగా, 2014లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, అనంతరం బీఆర్ఎస్‌లో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. కాగా తీగల కృష్ణారెడ్డి తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఇవ్వాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.

AP : తగ్గిన మద్యం ధరలు... అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు జారీ...

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలను తగ్గించడానికి మూడు మద్యం కంపెనీలు ముందుకు వచ్చాయి. ప్రముఖ సంస్థల ప్రతిపాదనలకు ఎక్సైజ్‌ శాఖ ఆమోదం తెలిపి తగ్గించిన ధరలను అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 ప్రస్తుతం మద్యం షాపుల్లో పాత ధరలతో ఉన్న బాటిళ్లను ఆదే ధరలకే విక్రయించి కొత్తగా వచ్చే వాటికి తగ్గించిన ధరలతో అమ్ముతారు. ఏపీలో గత ఐదేళ్లలో ప్రముఖ బ్రాండ్ల విక్రయాలకు అవకాశం ఉండేది కాదు. 

తాజాగా అన్ని బ్రాండ్లను విక్రయించుకోడానికి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం దుకాణాల్లో పాత ఎమ్మార్పీలతో ఉన్న బాటిళ్లను ఆ ధరలకే విక్రయిస్తారు. కొత్తగా వచ్చే స్టాకును తగ్గించిన ధరలతో అమ్ముతారు. ఏపీలో గత ఐదేళ్లలో ప్రముఖ బ్రాండ్ల విక్రయాలకు అవకాశం ఉండేది కాదు. తాజాగా అన్ని బ్రాండ్లను విక్రయించుకోడానికి అనుమతిస్తున్నారు.

వీటి ధరలు తగ్గాయి.

ధరలు తగ్గిన బ్రాండ్లలో మాన్షన్‌ హౌస్ ఒకటి. 2019లో టీడీపీ ప్రభుత్వం గద్దె దిగే సమయానికి క్వార్టర్‌ రూ.110 ఉన్న మద్యాన్ని వైసీపీ హయంలో ఓ దశలో రూ.300కు విక్రయించారు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ధరలు తగ్గించి చివరకు రూ.220కు ఫిక్స్‌ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అవే ధరలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మాన్షన్‌ హౌస్‌ బ్రాందీ క్వార్టర్‌ ధర రూ.220 నుంచి రూ.190కి తగ్గింది. అదే బ్రాండ్‌ హాఫ్‌ బాటిల్‌ ధర రూ.440 నుంచి రూ.380కి, ఫుల్‌ బాటిల్‌ ధర రూ.870 నుంచి రూ.760కి తగ్గించారు. రాయల్‌ చాలెంజ్‌ సెలెక్ట్‌ గోల్డ్‌ విస్కీ క్వార్టర్‌ ధర రూ.230 నుంచి రూ.210కి తగ్గింది. ఇదే బ్రాండ్‌ ఫుల్‌ బాటిల్‌ ధర రూ.920 నుంచి రూ.840కి తగ్గించారు. యాంటిక్విటీ బ్లూ విస్కీ ఫుల్‌ బాటిల్‌ ధర రూ.1600 నుంచి రూ.1400కు తగ్గింది.

అన్ని బ్రాండ్లపై కొత్త ధరలు..…

మద్యం ధరలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. త్వరలో ఈ కమిటీ అన్ని బ్రాండ్ల కంపెనీలతో చర్చించి ధరల సవరణపై సిఫారసు చేయనుంది. 

అందుకు అనుగుణంగా కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. కమిటీ నిర్ణయించక ముందే కొన్ని బ్రాండ్లు రేట్లు తగ్గించుకుంటున్నాయి. మరో రెండు ప్రముఖ బ్రాండ్ల మద్యం ధరలు రెండు మూడు రోజుల్లో ధరలు తగ్గించనున్నాయి.

AP : అగ్ని ప్రమాదం... కాలేజి బస్సు కు తప్పిన పెను ప్రమాదం... ఎక్కడంటే...

బాపట్ల జిల్లాలో దగ్ధమైంది ఓ కాలేజి బస్సు. ఈ ప్రమాదం జరిగినప్పుడు మొత్తం 30 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 

బాపట్ల జిల్లా లో కాలేజి బస్సుకు పెను ప్రమాదం చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద, షార్ట్ సర్క్యూట్ తో ఓ కాలేజీ బస్సు దగ్ధం అయింది. రేపల్లె ఐ ఆర్ ఇ ఎఫ్ నర్సింగ్ కాలేజీకి చెందిన బస్సుగా పోలీసులు గుర్తించారు.

రేపల్లె నుంచి గుంటూరుకు విద్యార్థుల పరీక్షల నిమిత్తం వస్తుండగా ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఇక ఈ ఘటన సమయం లో బస్సులో మొత్తం 30 మంది విద్యార్థులు ఉన్నారు. బస్సుకు మంటలు అంటుకోగానే, ఒకసారిగా కిందకి దిగేశారు విద్యార్థులు.

 దీంతో పెను ప్రమాదం తప్పింది. లేకపోతే.. చాలా వరకు మరణించేవారు. ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని..దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం*
*అమరావతి* * *ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కారెక్కేందుకు వస్తుండటం చూసి ఎదురుగా నిలబడ్డ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ*

తిరుపతి ప్రజలకు శ్రీవారి దర్శనంపై టి.టి.డి. నిర్ణయం హర్షణీయం

తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కల్పిస్తూ టిటిడి పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. ఈ నిర్ణయం తిరుపతి ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో ఆ నగర ప్రజలు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకువచ్చారు. ఆ సందర్భంలో కూటమి ప్రభుత్వం తప్పకుండా తిరుపతి ప్రజలకు నెలలో ఒక రోజు శ్రీవారి దర్శనం కల్పిస్తుందని హామీ ఇచ్చాను. నగర ప్రజల ఆకాంక్షను టిటిడి ఛైర్మన్, ఈవో దృష్టికి తీసుకువెళ్లి పరిశీలించాలని సూచించాను. టిటిడి పాలక మండలి తొలి సమావేశంలోనే ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నందుకు ఛైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడు గారికి, పాలక మండలి సభ్యులకు, ఈవో శ్రీ శ్యామలరావు గారికి అభినందనలు. తిరుమల పవిత్రతను పరిరక్షించేందుకు ఆలోచనలు చేస్తూ, ఆ దిశగా సంబంధిత అధికార యంత్రాంగాన్ని నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. #టీటీడీ #TTDevasthanams #TTD
AP : ఫీజు రీయింబర్స్మెంట్ సర్కారు కీలక నిర్ణయం...

విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను కాలేజీల ఖాతాల్లోకే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కాలేజీలకే చెల్లించే ఫైలుపై నేడు కేబినెట్ సమావేశంలో చర్చించి, ఆమోదించనుంది. ప్రస్తుత విధానంతో కాలేజీలు విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి చేయడంతో కొందరు పరీక్షలు కూడా రాయలేని పరిస్థితి నెలకొందని ప్రభుత్వం దృష్టికి రావడంతో కాలేజీలకే చెల్లించాలని చూస్తోంది.

AP : శ్రీశైలంలో ఈ రోజు నుండి కార్తీక మాసోత్సవాలు...

శ్రీశైల మహాక్షేత్రంలో ఈ రోజు నుండి డిసెంబర్ 1 వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. 

భ్రమరాంబికా మల్లికార్జున స్వామివార్లను దర్శించుకునేందుకు భారీగా భక్తులు రానుండటంతో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. కార్తీక సోమవారాలు, పౌర్ణమి రోజున పుష్కరిణి వద్ద లక్ష దీపార్చన, హారతి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నారు.

 ఉత్సవాల ప్రారంభ సూచికగా ఆలయ ప్రాంగణంలో నేడు అర్చకులు ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు.

AP : ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీని ప్రారంభించిన సీఎం

ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ అయిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని సీఎం చంద్రబాబు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.

 ఇది ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకమే అయినా ముందుగా డబ్బు చెల్లిస్తేనే సిలిండర్ బుక్ అవుతుంది. అయితే డబ్బులు ముందుగా కట్టకుండానే సిలిండర్ ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. అదే జరిగితే లబ్దిదారులకు భారీ ఊరట కాబోతోంది.