/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా 75 వ రాజ్యాంగ దినోత్సవ వేడుక Mane Praveen
NLG: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా 75 వ రాజ్యాంగ దినోత్సవ వేడుక
నల్లగొండ జిల్లా, కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తాలూకా కమిటీ కన్వీనర్ జిల్లా రాములు ఆధ్వర్యంలో, అంబేద్కర్ విగ్రహం వద్ద భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొండమల్లేపల్లి ఎస్ఐ రామ్ మూర్తి యాదవ్ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, భారత రాజ్యాంగ పీఠిక ను ప్రతిజ్ఞ చేశారు.

ఈ మేరకు ఎస్ఐ రామ్ మూర్తి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ ద్వారా నిర్వహించడం అభినందనీయమన్నారు. భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అన్నారు.

ప్రపంచ దేశాల కెల్లా భారత రాజ్యాంగం దృఢమైనటువంటిది, గొప్పది అని, యావత్ దేశ ప్రజలకు భారత రాజ్యాంగం ద్వారా  ప్రాథమిక హక్కులు, విధులు అందించిన మహోన్నతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ రచన కర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.

భారతదేశంలో ప్రజలందరికీ హక్కులను ఇచ్చి మనిషిని మనిషిగా చూసే గొప్ప సంకల్పాన్ని భారత రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డదని అన్నారు.

కొండమల్లేపల్లి విఓ డాకు నాయక్, ఆ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళిత రత్న డా. బుర్రి వెంకన్న మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులను కల్పించిందని అన్ని కులాల జాతుల వారికి సమాన హక్కులను కల్పించినటువంటి భారత రాజ్యాంగం గొప్పతనం గురించి కొనియాడారు.

ఈ కార్యక్రమంలో బహుజన మేధావి డాక్టర్ ఏకుల రాజారావు, ఏఐఎస్ఎస్డి నాయకులు ధర్మపురం శ్రీను, ఏకుల సురేష్, గ్యార యాదగిరి, డివిజన్ నాయకులు ఊరే సురేష్, చేపూరి రాజేష్, వెంకన్న, కూర సాలయ్య, అన్యపాక సంజీవ, కొండమల్లేపల్లి మండల కన్వీనర్ మేదరి ప్రసాద్, చేపురి లక్ష్మయ్య, ఆడెపు శోభన్ బాబు, ఇరిగి రవి, సహదేవ్, చంటి, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పెరిక విజయ్ కుమార్, డీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి పెరిక వెంకటేశ్వర్లు, కందుల చంటి, తదితరులు పాల్గొన్నారు
NLG: అంగన్వాడి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండలం, కొట్టాల గ్రామంలో రూ.12 లక్షలు అంచనా వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడి భవన నిర్మాణానికి, మంగళవారం స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని, మూడు లేదా నాలుగు గ్రామాల కలిపి ఒక పెద్ద స్కూల్ నిర్మించుకుని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసుకుందామని అన్నారు.

కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాస్ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి లు మేతరి యాదయ్య, పాశం సురేందర్ రెడ్డి, మాల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నక్క శ్రీను యాదవ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు కంచుకట్ల సంపత్, ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ కంచుకట్ల సుభాష్,  ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

NLG: 5.7 కి.మీ. బీటీ రోడ్డు ను ప్రారంభించిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా:
నేడు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజా పాలన విజయోత్సవాల లో భాగంగా, మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం దేవత్ పల్లి గ్రామంలో.. సాగర్ హైవే దేవత్ పల్లి గేటు నుండి శర్బాపురం గ్రామం వరకు 4 కోట్ల 35 లక్షల వ్యయంతో  నూతనంగా నిర్మించిన 5.7 కిలోమీటర్ల బీటీ రోడ్డు ను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ప్రారంభించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఈ రోడ్డుపై ప్రయాణించే పది గ్రామాల ప్రజలు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకురాగా.. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, రోడ్డు నిర్మాణ పనులు మంజూరు చేయించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయించారు. ఈ మేరకు స్థానిక 10 గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కార్య దీక్షత పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
NLG: నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
నల్లగొండ జిల్లా:
దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం చింతపల్లి మండలం, వింజమూరు (ధైర్యపురితండా)కు  విచ్చేసి నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

నేడు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని, ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా ఎమ్మెల్యే బాలు నాయక్ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
మర్రిగూడ మండలంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: నేడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, మండలకేంద్రంలో అంబేద్కర్ వాది నాగిల్ల మారయ్య ఆధ్వర్యంలో, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ మేరకు నాగిల్ల మారయ్య మాట్లాడుతూ.. భారతదేశాన్ని  సర్వసత్తాక,సామ్యవాద,లౌకిక,ప్రజాస్వామ్య,గణతంత్ర రాజ్యంగా  నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక,ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన మరియు భావ ప్రకటన, విశ్వాసం, సమానత్వాన్ని చేకూర్చుకోవడానికి వ్యక్తి గౌరవాన్ని జాతీయ ఐక్యతను సౌబ్రాతృత్వాన్ని పెంపొందించడానికి,1949 నవంబర్ 26 రాజ్యాంగ పరిషత్ లో ఎంపిక చేసుకొని శాసనం గా రూపొందించారని భారత రాజ్యాంగ పీఠిక ను గురించి వివరించారు.

ఈ కార్యక్రమంలో పందుల రాములు గౌడ్,కొడిచెర్ల శేఖర్, పగడాల రఘు, అభి సందేశ్, వంపు చరణ్,కోరే అజయ్ తదితరులు పాల్గొన్నారు.
NLG: అదనపు తరగతి గదులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్
నల్లగొండ జిల్లా:
నకిరేకల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే వేముల వీరేశం తో కలసి జిల్లా కలెక్టర్ త్రిపాఠి ప్రారంభించారు.

ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు కోసం స్థానిక శాసనసభ్యులు విద్యా వాలంటీర్లతో పాటు, ప్రత్యేక టీచర్లను ఏర్పాటు చేయడం సంతోషమని అన్నారు.
NLG: రేపు మర్రిగూడ మండలానికి రానున్న ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈనెల 26 న మర్రిగూడ మండలానికి రానున్నారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామదాసు శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఎమ్మెల్యే మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు శివన్నగూడ, కొట్టాల గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు.

శివన్నగూడ గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనానికి, కొట్టాల గ్రామంలో అంగన్వాడీ భవనానికి శంకుస్థాపనలు చేయనున్నారు.

ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని మండల పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ కోరారు.
ఎన్జీ కళాశాల ఎన్సిసి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
నల్లగొండ: ఎన్సిసి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నాగార్జున ప్రభుత్వ కళాశాల ఎన్సిసి క్యాడేట్లు మరియు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నాగార్జున ప్రభుత్వ కళాశాలలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

ఈ  మేరకు ఎన్సిసి బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ లక్షారెడ్డి మరియు నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రక్తదానం (Blood Donation) ఒక మహత్తరమైన కార్యం. ఇది జీవితాలను కాపాడే గొప్ప కార్యక్రమం,
రక్తదానం చేయడం ఒక విధమైన సామాజిక సేవ అని అన్నారు.

ఇది నిస్వార్థతకు ప్రతీక మరియు సమాజం పట్ల మన బాధ్యతను తెలియజేస్తుందనీ ప్రతి ఒక్కరు ఈ సేవలో పాల్గొనడం ద్వారా సమాజంలో మానవత్వాన్ని ప్రోత్సహించవచ్చని.. కేన్సర్, థాలసేమియా, హేమోఫిలియా వంటి వ్యాధులు ఉన్నవారికి రక్తం అత్యవసరం అని గుర్తుచేశారు.

అదే విధంగా కళాశాల ఎన్సిసి ఆఫీసర్ చిలుముల సుధాకర్ మాట్లాడుతూ.. ఎన్సిసి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎన్సిసి క్యాడేట్లు రక్తదాన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేస్తున్నామని, రక్తదానం చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలు, గర్భిణీ స్త్రీల ప్రసవ సమయంలో కాపాడిన వాళ్ళవుతారని, రక్తదానం చేయడం ద్వారా కొత్త రక్తకణాలు ఉత్పత్తి అవుతాయి, ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుందని వివరించారు.

కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మరియు ఎన్సిసి క్యాడేట్లు  కళాశాల సిబ్బంది పాల్గొన్నారు
నల్లగొండలో లాన్ టెన్నిస్ ఎస్ జి ఫ్ అండర్ 14, 17 ఉమ్మడి జిల్లా సెలక్షన్స్
నల్గొండ: ఉమ్మడి జిల్లా లాన్ టెన్నిస్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14, 17 బాలబాలికల సెలక్షన్స్ సోమవారం పట్టణంలోని విపస్య హైస్కూల్ లో నిర్వహించినట్లు, జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి విమల తెలిపారు. ఈ సెలక్షన్లలో 20 మంది బాల బాలికలు పాల్గొన్నారని, త్వరలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి టీమ్స్ ని పంపిస్తున్నామని తెలిపారు.

జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కు సహకరిస్తున్న ప్రతి ఒక్క వ్యాయామ ఉపాధ్యాయులకు  కృతజ్ఞతలు తెలిపారు.
NLG: కోలాటం బృందానికి రూ. 25 వేలు ఆర్థిక ప్రోత్సాహకం అందించిన యువజన నాయకులు
నల్లగొండ జిల్లా:
మర్రిగూడెం మండలం, యరగండ్లపల్లి గ్రామంలో మహిళలు కోలాటం నేర్చుకుంటామని.. అందుకు సహాయ సహకారాలు అందించాలని, కోలాటం కళ కు సంబంధించిన కాలి గజ్జల అవసరం ఉందని.. యరగండ్లపల్లి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పులిమామిడి నరసింహారెడ్డి, ఏడుదొడ్ల కృష్ణారెడ్డి లను కోరారు.

అడిగిన వెంటనే వారికి అయ్యే ఖర్చు తెలుసుకొని రూ.25, 000 వేలు ప్రోత్సాహకంగా అందించారు.

పులిమామిడి నరసింహారెడ్డి, ఏడుదోడ్ల కృష్ణ రెడ్డి లు మాట్లాడుతూ.. యరగండ్లపల్లి గ్రామంలో మహిళలు కోలాటం నేర్చుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని, మహిళలు ఇంకా అనేక రంగాలలో రాణించాలని  అన్నారు.

యరగండ్లపల్లి గ్రామంలో మహిళలను వివిధ రంగాలలో రాణించేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని, మహిళల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.ఈ మేరకు  కోలాటాల బృందం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి శాలువతో సత్కరించారు.