నేను కూడా రాజీనామా చేసి వెళ్ళాలనుకున్నా
శిక్షణ పొందిన వారు అకుంటిత దీక్షతో పని చేయాలని సీపీ సీవీ ఆనంద్ సూచించారు. పోలీసులు రాజ్యాంగానికి విధేయత చూపాలన్నారు. పోలీసులు నిజాయితీగా, న్యాయంగా పనిచేయాలని తెలిపారు. ప్రజల మాన, ప్రాణాలు కాపాడడంలో కర్తవ్యం నెరవేర్చాలని స్పష్టం చేశారు. పోలీస్ డ్యూటీ అంటే ఒత్తిడితో కూడుకున్నదని ఆయన తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా 8,047 మంది పోలీస్ కానిస్టేబుల్స్ శిక్షణ పొందారని.. ఇందులో 4,100 సివిల్, 3,685 మంది ఏఆర్ 2,028 కమ్యూనికేషన్స్, 18 మంది పోలీస్ ట్రాన్స్ పోర్ట్ ఉన్నారని సీపీ సీవీ ఆనంద్ (CP CV Anand) తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఇందులో నుంచి హైదరాబాద్ పోలీస్ శాఖకు 1,128 మందిని ట్రైనింగ్ కోసం కేటాయించినట్లు చెప్పారు. ఇప్పుడు 747 మంది దీక్షత్ పాసింగ్ అవుట్ పరేడ్ చేశారన్నారు. 3,081 మంది మహిళల కానిస్టేబుల్స్ పోలీస్ శిక్షణ పొందారన్నారు.
1992లో నేను ఐపీఎస్ శిక్షణ పొందాను పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. అప్పుడు 80 మంది ట్రైనీ ఐపీఎస్‌లు పాల్గొన్నాం. వర్షం పడుతున్నా పరేడ్ పూర్తి చేశాం’’ అంటూ ఆనాటి విషయాలను గుర్తుచేశారు సీపీ. శిక్షణ పొంది పోలీస్ శాఖలో 35 ఏళ్లు గడపబోతున్నారని... శిక్షణ పొందిన వారు అకుంటిత దీక్షతో పని చేయాలని సూచించారు. పోలీసులు రాజ్యాంగానికి విధేయత చూపాలన్నారు. పోలీసులు నిజాయితీగా, న్యాయంగా పనిచేయాలని తెలిపారు. ప్రజల మాన, ప్రాణాలు కాపాడడంలో కర్తవ్యం నెరవేర్చాలని స్పష్టం చేశారు. పోలీస్ డ్యూటీ అంటే ఒత్తిడితో కూడుకున్నదని ఆయన తెలిపారు.
అలాగే పోలీసులకు సీపీ ముఖ్య సూచన చేశారు. పోలీసులు తాగుడుకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. యువ పోలీసులు ఫిజికల్ ఫిట్‌నెస్‌గా ఉండాలని.. దేనికి ఏ వ్యసనానికి కూడా లొంగకూడదని.. బానిస కాకూడదని తెలిపారు. ‘‘నా 33 ఏళ్ల పోలీస్ సర్వీస్‌లో 75 కేజీల మధ్యలో ఉన్నాను. నేను చాలా ఫిట్‌గా ఉన్నాను. 30 ఏళ్ల క్రితం నా ఐపీఎస్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో వేసుకున్న పోలీస్ డ్రెస్ ఇప్పుడు కూడా వేసుకోగలను. మీరు శిక్షణ పొందిన పేట్లబురుజు ఆర్మ్ రిజర్వ్ ఇన్చార్జ్ డీసీపీ దక్షిణామూర్తిని చూడండి ఎంత ఫిట్‌గా ఉన్నారో. ఫిట్‌గా ఉన్న వారిని ఆదర్శంగా తీసుకోండి. పోలీసుల జీతాల విషయంలో ప్రభుత్వం ఎక్కువగా పెంచదు. పోలీసులు అవినీతికి పాల్పడకూడదు. ఐపీఎస్ లాంటి ఉద్యోగంలో కూడా జీతాలు అంతంత మాత్రమే. పోలీస్ శాఖలో మెల్లమెల్లగా జీతాలు పెరుగుతూనే ఉంటాయి. పోలీస్ ఉద్యోగం అంటే టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లాంటిది. ఒక పరిస్థితిలో నేను కూడా రాజీనామా చేసి వెళ్ళలనుకున్నా. శిక్షణ తీసుకున్నవారు మీ సేవల ద్వారా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురండి’’ అంటూ సీపీ ఆనంద్ పేర్కొన్నారు.
తెలంగాణా పోలీస్ అకాడమీలో కానిస్టేబుల్స్ నాలుగవ పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీజీపీ జితేందర్, పోలీసులు ఉన్నతాధికారులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏఆర్, సివిల్, ఎస్‌ఏఆర్‌సీపీఎల్, ఐటీ, సీఏఎన్‌పీటీఓ విభాగాలకు చెందిన 8,047 మంది స్టైపెండరీ ట్రైనీ కానిస్టేబుల్స్ శిక్షణ విజయవంతమైంది. ఫిబ్రవరి21, 2024లో స్టైపెండరీ ట్రైనీ కానిస్టేబుల్స్ శిక్షణ మొదలైంది. రాష్ట్రంలో మొత్తం 19 ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్‌లో శిక్షణ జరిగింది. కానిస్టేబుల్ శిక్షణ పొందిన వారిలో 5709 పురుషులు, 2338 మహిళ అభ్యర్థులు ఉన్నారు. ట్రైనీ కానిస్టేబుల్స్‌కు సమగ్రంగా అన్ని అంశాలపై శిక్షణ పూర్తి అయ్యింది. సివిల్, క్రిమినల్, సైబర్ కేసులు, ఎన్‌డీపీఎస్ యాక్ట్, క్రైమ్, సెల్ఫ్ డిఫెన్స్ ఇలా చాలా అంశాలపై ట్రైనింగ్ జరిగింది. కానిస్టేబుల్స్‌లో గ్రాడ్యుయేషన్ 5470 , పోస్ట్ గ్రాడ్యుయేషన్ 1361 చదివిన వారు ఉన్నారు. ఇందులో టెక్నికల్1755, నాన్ టెక్నికల్ 5505, లా పూర్తి చేసుకున్న వారు 15 మంది ఉన్నారు. నేడు పాసింగ్ ఔట్ పరేడ్ తరువాత తెలంగాణ పౌరుల సేవలో 8,047 మంది కానిస్టేబుల్స్ పాల్గొననున్నారు.
Nov 22 2024, 10:37