/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz TG అర్హులైన రైతులందరికీ రుణ మాఫీ చేసే బాధ్యత ప్రజా ప్రభుత్వానిది: సీఎం రేవంత్ రెడ్డి Mane Praveen
TG అర్హులైన రైతులందరికీ రుణ మాఫీ చేసే బాధ్యత ప్రజా ప్రభుత్వానిది: సీఎం రేవంత్ రెడ్డి

వరంగల్:

అర్హులైన రైతులందరికీ రుణ మాఫీ చేసే బాధ్యత ప్రజా ప్రభుత్వానిది. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 22 లక్షల రైతు కుటుంబాలకు 18 వేల కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ చేశాం. మాట ఇస్తే మడమ తిప్పకుండా అందరికి రుణమాఫీ చేసే బాధ్యత మాది. మీ ఖాతాల్లో పొరపాట్లను సవరించుకోండి. రుణమాఫీ పై తప్పుడు మాటలు నమ్మకండి. మీకు అండగా నిలబడుతానని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఏడాది పాలన సందర్భంగా “ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాలు” కార్యక్రమంలో భాగంగా ఇందిరా గాంధీ జయంతి ని పురస్కరించుకుని.. వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన "ఇందిర మహిళా శక్తి" సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ వేదిక నుంచి ఒకేసారి 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేశారు.మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణ, బీమా చెక్కులను అందజేశారు.

మహిళా సంఘాలు నిర్వహించే సౌర విద్యుత్ కొనుగోలుపై డిస్కంలు - సెర్ప్ కు మధ్య కుదిరిన ఒప్పంద పత్రాలను సీఎం సమక్షంలో మార్చుకున్నారు.

ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్న సీఎం.. ముందుగా స్వయం సహాయక మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. అనంతరం అశేషంగా హాజరైన మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..  రాష్ట్రానికి ప్రతి నెల రూ.18,500 కోట్ల ఆదాయం వస్తుంటే, అందులో దాదాపు 6,500 కోట్లు జీతాలు, పెన్షన్ల కింద చెల్లిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పు లపై అప్పు, వడ్డీ కింద మరో 6,500 కోట్లు పోతున్నాయని, ఇక మిగిలిన 5,500 కోట్ల ఆదాయం ఉంటే, ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ రూపాయి రూపాయి కూడబెట్టి రైతు రుణమాఫీ చేశామని తెలిపారు.

స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ రాష్ట్రం పండించనంత ధాన్యం పండింది. 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించారు. ఈ ధాన్యానికి ఎంఎస్పీ తో పాటు సన్న బియ్యానికి 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొంటున్న రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమే అని అన్నారు.

ఎంతో చారిత్రక ప్రాముఖ్యత, ప్రాశస్త్యం కలిగిన వరంగల్ జిల్లా గత పదేండ్ల లో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేక నిర్లక్ష్యానికి గురైందని, అందుకే హైదరాబాద్‌ తో సమానంగా అభివృద్ధి చేయాలని సంకల్పించామని అన్నారు

జాతీయస్థాయి పరిశ్రమలు, ఇక్కడ ఎయిర్‌పోర్టు రావడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కాకతీయ వర్సిటీ అభివృద్ధి పథంలో నడిపించడం ద్వారా సగం తెలంగాణ అభివృద్ధి బాట పట్టినట్టేనని భావించి, ఈ బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుందని అన్నారు.

మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఐదారు ఎయిర్ పోర్టులు ఉంటే... తెలంగాణలో ఒకే ఒక్క ఎయిర్‌పోర్టు ఉంది. అందుకే వరంగల్‌ తో పాటు కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్‌ లలో కూడా విమానాశ్రయాలను స్థాపించి రాష్ట్రంలో పెట్టుబడులను తెచ్చి పరిశ్రమలను పెట్టుకుని తెలంగాణను అభివృద్ధి పథంవైపు నడిపించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది.

తెలంగాణ పౌరుషానికి మారుపేరు కాళోజీ గారిని గుర్తించని ప్రపంచమే లేదు. ప్రజాకవి కాళోజీ ప్రభావం అందరిపైనా బలంగా ఉందని అన్నారు. కళా ప్రాంగణాన్ని గత ప్రభుత్వం పదేండ్లు విస్మరించిందని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు కేటాయించి పూర్తి చేశామని తెలిపారు.

ప్రజలను ఉద్దేశించి ఇది మీరిచ్చిన ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుంది. ఏ గడ్డ నుంచి పోరాటం మొదలు పెట్టామో.. ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా అదే గడ్డమీద ఉత్సవం జరుపుకుంటున్నామన్నారు.

నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డల కోసం ఒక్క రోజు.. ఒక్క నిమిషం.. సెలవు తీసుకోకుండా రోజు 18 గంటలు పనిచేస్తా. ఆఖరు శ్వాస వరకు... చివరి రక్తపు బొట్టు వరకు... తెలంగాణ కోసం అంకితమవుతానని అన్నారు.

కార్యక్రమంలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ విజయ డెయిరీ ని సందర్శించిన గుత్తా అమిత్ రెడ్డి
హనుమకొండ, వరంగల్ విజయ డెయిరీ ని మంగళవారం తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సందర్శించారు.

ఈ సందర్భంగా సంస్థ అధికారులు, పాడి రైతు నాయకులు, డిస్ట్రిబ్యూటర్లతో డైరీ పనితీరు, పాల ఉత్పత్తుల నాణ్యత, మార్కెటింగ్  కార్యకలాపాలపై సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమం లో వరంగల్ విజయ డెయిరీ డిడి శ్రవణ్ కుమార్, మేనేజర్ ప్రదీప్, రైతు నాయకులు దేవేంద్ర రావు, వివిధ బిఎంసి అధ్యక్షులు, పాల ఉత్పత్తిదారులు, సిబ్బంది పాల్గొన్నారు.

గ్రామ సమస్యల పై ఎమ్మెల్యేకు వినతి
నల్లగొండ జిల్లా:
దేవరకొండ: ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు మద్దిమడుగు బిక్షపతి, మంగళవారం చందంపేట మండలం, పెద్దమూల గ్రామంలో నెలకొన్న  పలు గ్రామ సమస్యల పై ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు.

గ్రామస్తులు పేర్ల నాగేష్, సుందరయ్య,బిక్షపతి భిక్షమయ్య, బండి వెంకట రాములు,మేకల వెంకటయ్య, సత్తెరసాల బిక్షపతి, నూనె బుచ్చమయ్య, ముత్యాల కుమార్,చేపూరి వెంకట రాములు తదితరులు పాల్గొన్నారు.
NLG: బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ ఇంటింటి ప్రచారం
నల్లగొండ జిల్లా, చండూరు:
సిపిఎం నల్లగొండ జిల్లా 21 వ మహాసభల సందర్భంగా, డిసెంబర్ 2న మిర్యాలగూడ జరిగే బహిరంగ సభకు వేలాదిగా తరలిరావాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు.

మంగళవారం చండూరు మండల కేంద్రంలో, మిర్యాలగూడలో జరగనున్న జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు.

కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు చిట్టిమల్ల లింగయ్య,  నరసింహ, నారపాక జలంధర్ తదితరులు పాల్గొన్నారు.
మర్రిగూడ మండలంలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి
నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం:
మర్రిగూడ:  నేడు భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, భారతరత్న, ఉక్కు మహిళ స్వర్గీయ ఇందిరా గాంధీ  జయంతి సందర్బంగా.. మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మర్రిగూడ మండల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు,నాయకులు, కార్యకర్తలు మండల కేంద్రంలోని ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉక్కు మహిళ ఇందిరా గాంధీ జయంతి పురస్కరించుకుని నిర్వహించుకునే ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’ సందర్భంగా  మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె స్పూర్తితో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.

మర్రిగూడ మండల అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ మేతరీ యాదయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ పాల్వాయి అనిల్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు సీనియర్ నాయకులు మారనేని లూర్దయ్య, నున్సవత్ బిచ్య నాయక్, ఐతపాక జంగయ్య, మాజీ ఎంపీటీసీ భీమ్లా నాయక్, వెంకటపేట బాలయ్య, మార్కెట్ పిఎసిఎస్ డైరెక్టర్లు డైరెక్టర్లు, గంట మల్లేష్ , బాయికడి కొండల్, గ్రామ శాఖ అధ్యక్షులు కోలుకుపల్లి శంకర్, జాల వెంకటయ్య, రాజు నాయక్ మునుగోడు యూత్ కాంగ్రెస్ కాంటెస్టెడ్ అధ్యక్షులు అబ్బనగోని రాము యాదవ్, యూత్ కాంగ్రెస్  అధ్యక్షులు బేత వెంకటేష్, కాంటెస్ట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోడలా ఆల్వాల్ రెడ్డి, లవకుమార్, ఎస్సీ సెల్ జిల్లా కన్వినర్ సిరపంగి శ్రీనివాస్, మండల నాయకులు, రావుల రాములు, కోలుకుల పల్లి జంగయ్య, ఎలిమినేటి సతీరెడ్డి మారనేని ప్రశాంత్, పగడాల యాదయ్య, తన్నీరు యాదయ్య,గ్యార వెంకటేష్, లపంగి యాదయ్య,జిల్లా శంకర్, దుబ్బ మల్లేష్, వంపు రాంచరణ్, గొట్టిముక్కల ప్రకాష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసి జయంతి ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు.
ఇందిరాగాంధీ జయంతి ని ఘనంగా నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు
చౌటుప్పల్:
నేడు భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా  చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, పట్టణ కేంద్రంలోని బస్ స్టాప్ పక్కన ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ గాంధీ భవన్ లో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి బంగారు బాటలు వేసిన నాయకురాలు ఇందిరాగాంధీ, భారత తొలి మహిళా ప్రధానిగా అమూల్యమైన సేవలందించారని తెలిపారు. దేశానికి ఆమె చేసిన సేవలను కొనియాడారు.

మాజీ జడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పబ్బు రాజు గౌడ్,  కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనా రెడ్డి, మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, టౌన్ అధ్యక్షుడు సుర్వి నరసింహా గౌడ్, ఉబ్బు వెంకటయ్య, కౌన్సిలర్ కొయ్యడ సైదులు, పోలోజు అనిల్ కుమార్, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, బొడిగె బాలకృష్ణ, మరియు షాదిఖాన చైర్మన్ కరీం, ఊదరి నరసింహ, బొంగు జంగయ్య, ఆవుల ఏసు,చిలువేరు శ్రీశైలం, ఎం.డి. ఏజాస్, పాలకూర యాదయ్య,ఎర్రగోని లింగస్వామి, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
NLG: మిత్రుడి కుటుంబానికి బాసటగా పూర్వ విద్యార్థులు
నల్గొండ జిల్లా:
చిట్యాల మండలం, పెద్దకాపర్తి గ్రామంలో తెలుసూరి శ్రీను ఇటీవల అకాల మృతి చెందగా, ఆయన మిత్రులు, పూర్వ విద్యార్థులందరూ కలిసి పోగుచేసిన 1 లక్ష 13 వేల రూపాయలను సోమవారం కుటుంబ సభ్యులకు అందజేశారు.

టెన్త్ 2003-04 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఈ మేరకు బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ ను భార్య, తల్లిదండ్రులకు అందించారు. సందర్భంగా పూర్వ విద్యార్థులను గ్రామస్తులు అభినందిస్తున్నారు.
NLG: బీసీ వెల్ఫేర్, బీసీ కార్పొరేషన్లను ఒకే గొడుగు కిందికి తేవడం వల్ల బీసీలకు తీవ్రమైన నష్టం: పిఆర్ పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు

నల్లగొండ:

గత ప్రభుత్వం కలిపిన బీసీ వెల్ఫేర్, బీసీ కార్పొరేషన్ లను మళ్లీ విడగొట్టాలని తద్వారానే బీసీ ప్రజలకు ఎక్కువ న్యాయం జరుగుతుందని ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి అన్నారు.

ఈరోజు నల్లగొండలో జరిగిన ఉమ్మడి జిల్లా బీసీ కమిషన్ బహిరంగ విచారణలో తన అభిప్రాయాన్ని తెలిపారు.

నూనె వెంకటస్వామి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం బీసీ వెల్ఫేర్, బీసీ కార్పొరేషన్లను విడిగా ఉన్న వాటిని ఒకే గొడుగు కిందికి తేవడం వల్ల బీసీ ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. వీటి రెండింటిని విడగొట్టాలని దీనివల్లనే బీసీ విద్యార్థులకు, బీసీ ప్రజలకు సమగ్రమైన న్యాయం జరుగుతుందని అన్నారు.

ఉద్యోగ నియామకాలు చేయలేక, బీసీ ప్రజల జనాభా కనుగుణంగా నిధులను ఇవ్వలేక, సరైన అభివృద్ధి పథకాలు లేక.. బీసీ వెల్ఫేర్ ను కార్పొరేషన్ ను కలిపారని, ఈ విధంగా కలపడం వల్ల బీసీ ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతోందని, ప్రస్తుతం బీసీ కమిషన్ ను వేసినందున ఆ కమిషన్, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, మళ్లీ వాటిని విడగొట్టి అత్యధిక నిధులు రాబట్టాలని వారు కోరారు.

నాగార్జునసాగర్ లో ఉమ్మడి జిల్లా స్థాయి 'నెట్ బాల్'  సెలక్షన్స్: ఎస్ జి ఎఫ్ సెక్రటరీ
నల్లగొండ: జిల్లా విద్యాధికారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి అండర్ 14,17 బాల బాలికల 'నెట్ బాల్'  సెలక్షన్స్, ఈనెల 20 వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు నాగార్జునసాగర్ హిల్ కాలనీలో గల సెయింట్ జోసెఫ్ హై స్కూల్ నందు నిర్వహిస్తున్నట్లు ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ విమల తెలిపారు.

ఈ క్రీడలో పాల్గొనదలచిన క్రీడాకారులు 14 సం.లోపు బాల బాలికలు 01.01.2011 తర్వాత జన్మించి ఉండాలి, 17 సం. ల బాల బాలికలు 01.01.2008 తరువాత జన్మించిన వారు అయి ఉండాలి. క్రీడాకారులు తప్పనిసరిగా ఒరిజినల్ బోనఫైడ్ మరియు ఆధార్ కార్డులతో హాజరు కావాలని సూచించారు.

ఇంటర్మీడియట్ క్రీడాకారులైతే 10 వ తరగతి మెమో తో పాటు, ఈ సంవత్సరం ఒరిజినల్ బోనఫైడ్ మరియు ఆధార్ కార్డు లతో హాజరు కావాలన్నారు.

మరిన్ని వివరాలకు నాగార్జునసాగర్, హిల్ కాలనీ లో గల సెయింట్ జోసెఫ్ హై స్కూల్ పిఈటి కిరణ్ కుమార్ ను సంప్రదించాలని సూచించారు.
NLG: ఎలాంటి షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి: సిపిఎం మండల కార్యదర్శి
నల్గొండ జిల్లా, చండూరు మండలం:
రైతులు పండించిన ప్రతి గింజను ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. సోమవారం చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆ పార్టీ మండల కమిటీ సభ్యులతో కలిసి ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ధనంజయ మాట్లాడుతూ.. రైతులు కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ధాన్యం అమ్ముకునేందుకు వచ్చిన రైతులను తేమ శాతం పేరుతో రోజుల తరబడి కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో సాగు కోసం రైతు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి ఉందన్నారు.

ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని అన్నారు. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తేమతో నిమిత్తం లేకుండా ధాన్యమును కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యము కొనుగోలు చేయకపోవడంతో కురుస్తున్న అకాల వర్షాలకు ధాన్యం తడుస్తుందేమోనని భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం చండూరు మండల కమిటీ సభ్యులు చిట్టిమల్ల లింగయ్య, గ్రామ రైతులు బి.నరసింహ, కె.రామలింగం, గంట గణపతి, బోయపల్లి శివలింగం, తదితరులు పాల్గొన్నారు.