/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz మాజీమంత్రి కొడాలినానిపై ఫిర్యాదు Raghu ram reddy
మాజీమంత్రి కొడాలినానిపై ఫిర్యాదు

విశాఖ నగరానికి చెందిన లా విద్యార్ధిని సత్యాల అంజన ప్రియ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కొడాలినానిపై ఫిర్యాదు చేశారు. దీంతో విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి 11 గంటలకు విశాఖపట్నం 3వ పట్టణ పోలీసు స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు.

విశాఖ నగరానికి చెందిన లా విద్యార్ధిని (Law Student) సత్యాల అంజన ప్రియ (Anjana Priya) వైఎస్సార్‌సీపీ నేత (YSRCP Leader), మాజీ మంత్రి కొడాలినాని (Ex Minister Kodali Nani)పై ఫిర్యాదు చేశారు. దీంతో విశాఖ పోలీసులు (Visakha Police) కేసు నమోదు (Case Registered) చేశారు. శనివారం రాత్రి 11 గంటలకు విశాఖపట్నం 3వ పట్టణ పోలీసు స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఐదేళ్లుగా కొడాలి నాని పత్రికా ప్రకటనలలో, అసెంబ్లీ సమావేశాలలో వాడిన భాషపై అంజన ప్రియ ఫిర్యాదు చేశారు. అధికారిక కార్యక్రమాలలో తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌‌పై అవమానకరమైన రీతిలో అసభ్య పదజాలం ఉపయోగించారని, దుర్భాషలాడుతూ, వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారంటూ ఆమె పిర్యాదు కాపీలో వెల్లడించారు. కొడాలి నాని వ్యాఖ్యలు వారి పరువు నష్టం కలిగించడమే కాకుండా, సామాజిక మాద్యమాల ద్వారా వారి వ్యక్తిగత గౌరవాన్ని, కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీశాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కొడాలి నాని వ్యాఖ్యలు ఒక బాధ్యతాయుతమైన మహిళగా తనను తీవ్ర ఆవేదన కలిగించాయని అంజన ప్రియ అన్నారు. ఆయన తరచుగా ప్రసంగాల్లో, మీడియా వేదికలపై సాక్షి న్యూస్ ఛానెల్ సహా ఇతర మీడియాలో దుర్భాషలు ఆడారు అని వెల్లడించారు. బాడీ షేమింగ్ చేయడం, నిరాధారమైన ఆరోపణలు చేయడం వంటి చర్యల ద్వారా నారా చంద్రబాబు నాయుడు, వారి కుటుంబంపై తీవ్ర అవమానకర వ్యాఖ్యలు చేశారన్నారు. ఒక మహిళగా, లా విద్యార్థిగా, ఇటువంటి అసభ్య పదజాలం వినడం, చూడడం నాకు చాలా బాధ కలిగించిందన్నారు. ఇది సమాజంలో యువతపై ప్రతికూల ప్రభావం చూపించడమే కాకుండా, ప్రజాస్వామ్య విలువలకు హానికరంగా ఉంటుందన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజా ప్రవర్తనను ప్రతికూలంగా ప్రభావితం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందన్నారు.

ముఖ్యంగా యువతలో ఇది విషపూరితమైన ఆన్‌లైన్ సంస్కృతిని సృష్టించడాన్ని ప్రోత్సహిస్తుందని, ఇటువంటివి ఉపేక్షిస్తే యువత వీటినే ఆదర్శంగా తీసుకునే ప్రమాదం ఉందని అంజన ప్రియ అన్నారు. ఇదే జరిగితే దారి తప్పిన యువత, ముఖ్యంగా మహిళలపై అభ్యంతరకరమైన భాషతో సామాజిక మాద్యమాల్లో దుర్భాషలకు దిగితే ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవడం వల్ల అపఖ్యాతి పాలైన వ్యక్తుల గౌరవాన్ని నిలబెట్టినట్లు ఉంటుందని, బహిరంగ వేదికలపై దూషించే పదజాలం, అవమానకరమైన వ్యాఖ్యలను మరెవ్వరూ ఉపయోగించకుండా బలమైన సందేశాన్ని పోలీసులు పంపాలన్నారు. విశాఖ పోలీస్ కమిషనర్ ఈ అంశంపై అత్యవసర చర్యలు తీసుకోవాలని, అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్ననన్నారు. కాగా కొడాలి నానిపై తాను చేసిన ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

చెన్నైలో తెలుగు భవనం

చెన్నైలో ‘తెలుగు భవనం’ నిర్మాణం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌(Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan)కు తమిళనాడు తెలుగు పీపుల్‌ ఫౌండేషన్‌ విజ్ఞప్తి చేసింది. మంగళగిరిలో పవన్‌ కల్యాణ్‌తో భేటీ అయిన ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు దేవరకొండ రాజు నేతృత్వంలోని ప్రతినిధుల బృందం.. తమిళనాడులోని తెలుగువారి స్థితిగతులను వివరించింది.

చెన్నైలో ‘తెలుగు భవనం’ నిర్మాణం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌(Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan)కు తమిళనాడు తెలుగు పీపుల్‌ ఫౌండేషన్‌ విజ్ఞప్తి చేసింది. మంగళగిరిలో పవన్‌ కల్యాణ్‌తో భేటీ అయిన ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు దేవరకొండ రాజు నేతృత్వంలోని ప్రతినిధుల బృందం.. తమిళనాడులోని తెలుగువారి స్థితిగతులను వివరించింది. చెన్నై, కోయంబత్తూరు, కాంచీపురం, మదురై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, తిరుత్తణి, కృష్ణగిరి(Chengalpattu, Tiruvallur, Tiruttani, Krishnagiri) ప్రాంతాల్లో తెలుగువారు అధికంగా వున్నారని, వివిధ రంగాల్లో వారు స్థిరపడ్డారని వివరించింది.

జయలలిత ముఖ్యమంత్రిగా వున్న సమయంలో చెన్నైలో తెలుగు భవనం నిర్మాణానికి అంగీకరించారని, అయితే కాలక్రమంలో ఆ ప్రాజెక్టు ముందుకు కదల్లేదని వారు వెల్లడించారు. ఇప్పుడైనా ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం చెన్నైలో తెలుగు భవన నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

ఫౌండేషన్‌ తరఫున చేస్తున్న సామాజిక సేవలను, తెలుగు భాష, సంస్కృతుల కోసం చేస్తున్న కృషిని ప్రతినిధుల బృందం వివరించగా, ఉపముఖ్యమంత్రి అభినందించారు. ఈ భేటీలో దేవరకొండ రాజుతో పాటు ప్రొఫెసర్‌ కె.శ్రీనివాసరావు, ఏఎం.మనోజ్‌, ప్రియా శ్రీధర్‌, బి.రఘునాథ్‌ తదితరులున్నారు.

సీఎం చంద్రబాబు సోదరుడు కన్నుమూత

ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి కన్నుమూశారు.

 కొంతకాలంగా అనారోగ్య కారణాలతో చికిత్స తీసుకుంటున్న ఆయన హైదరాబాద్లోని AIG హాస్పిటల్తో మరణించారు.

 1994-99 మధ్య చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. 

రామ్మూర్తి కుమారుడే టాలీవుడ్ నటుడు నారా రోహిత్.

రెస్టారెంట్ గా మారనున్న రైలు

ముంబై- వల్సాద్ ల మధ్య ఆ రైలు దాదాపు యాభై ఏళ్ల పాటు ప్రయాణికులకు సేవలందించింది. ఎంతోమందిని గమ్యస్థానాలకు చేర్చిన ఈ చారిత్రక రైలుకు వచ్చే నెల నుంచి విశ్రాంతి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.

పట్టాలపై పరుగులకు బ్రేక్ వేసి ఈ రైలు కోచ్ లలో ఒకదానిని హోటల్ గా మార్చాలని భావిస్తున్నారు. లోయర్ పారెల్ స్టేషన్ ఆవరణలో డబుల్ డెక్కర్ కోచ్ ల ను హోటల్ గా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

ముంబై, సూరత్ వల్సాద్ రైల్వే రూట్ ప్రారంభమైన కొత్తలో.. 1975-76 ప్రాంతంలో ట్రైన్ నెంబర్ 09023/24 ప్యాసింజర్ రైలు ముంబై, వల్సాద్ ల మధ్య పరుగులు పెట్టేది. ఇప్పటికీ ఈ ప్యాసింజర్ రైలు తిరుగుతోంది.

దాదాపు 50 ఏళ్ల పాటు ప్రయాణికులకు సేవలందించిన ఈ రైలు వచ్చే నెల నుంచి విశ్రాంతి తీసుకోనుంది. ఈ రైలులోని నాన్ ఏసీ డబుల్ డెక్కర్ కోచ్ లను రెస్టారెంట్ గా మార్చాలని అధికారులు నిర్ణయించారని హిందుస్థాన్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది.

ప్రసిద్ధ క్షేత్రంగా భెల్‌ అయ్యప్ప ఆలయం

హిందువులంతా పవిత్రమైన మాసంగా భావించే కార్తీకమాసంలో దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఉత్సవం అయ్యప్పస్వామి మాలధారణ. కార్తీకమాసంలో అయ్యప్ప స్వామి(Ayyappa Swami) భక్తులు మాలలు ధరించి అయ్యప్పస్వామి దేవాలయాన్ని, మకర జ్యోతిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు.

హిందువులంతా పవిత్రమైన మాసంగా భావించే కార్తీకమాసంలో దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఉత్సవం అయ్యప్పస్వామి మాలధారణ. కార్తీకమాసంలో అయ్యప్ప స్వామి(Ayyappa Swami) భక్తులు మాలలు ధరించి అయ్యప్పస్వామి దేవాలయాన్ని, మకర జ్యోతిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ, 41 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్పస్వామికి పూజలు చేసి స్వామి దీక్షలో ఉండి శబరిమళ యాత్రచేసి, జ్యోతిసర్వరూపుడైన అయ్యప్పను దర్శించు కోవడంతో దీక్షలు పూర్తవుతాయి.

అయ్యప్పస్వామి భక్తులు, మాలధారణ చేసే స్వాములకు ఆధ్యాత్మిక క్షేత్రంగా, శబరిమల తరహాలో పూజా కార్యక్రమాలకు వేదికగా మారింది భెల్‌ టౌన్‌షి్‌పలోని శ్రీ అయ్యప్పస్వామి దేవాలయం. కేవలం కార్తీక మాసంలో అయ్యప్పస్వామికి నిర్వహించే ప్రత్యేక మాలధారణలు, మండల పూజలు సమయంలోనే కాకుండా నిత్యం అయ్య ప్ప భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తూ నేడు జిల్లాలోనే ప్రసిద్ధ పుణ్య క్షేతంగా మారింది.

వివిధ భాషాలకు, విభిన్న ప్రాంతాలవారి కలయికలతో మమేకమైన బీహెచ్‌ఈఎల్‌ పరిశ్రమలో పనిచేస్తున్న కొందరు కేరళకు చెందిన కార్మికులు, భక్తులు మండల పూజల రోజుల్లో అయ్యప్పస్వామి మాలలు వేసుకుని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలోని స్వామివారి పాత కల్యాణ మండపంలో అయ్యప్ప మండపాన్ని ఏర్పాటు చేసి పూజలు చేసేవారు. 55 ఏళ్లుగా ఇదే విధంగా పూజలు నిర్వహించడంతో అనవాయితీగా వచ్చింది. ప్రతీ ఏటా అయ్యప్పస్వామి భక్తుల సంఖ్య పెరగడం, వేలాది మంది మాలధారణలు ధరించడం, పూజలు నిర్వహిస్తుండడంతో అయ్యప్పకు ప్రత్యేక దేవాలయాన్ని నిర్మించాలనే సంకల్పం కలిగింది.

అయ్యప్పకు ప్రత్యేక దేవాలయాన్ని నిర్మించాలని భక్తులు, కాలనీవాసులు, కార్మికులు నిర్ణయించి స్థలాన్ని కేటాయించాలని భెల్‌ యాజమాన్యాన్ని కోరారు. వారి కోరికను గౌరవిస్తూ భెల్‌ యాజమాన్యం నాలుగు ఎకరాల స్థలం కేయించింది. దేవాలయ నిర్మాణానికి యాజమాన్యం పరోక్షంగా సహకరించగా భక్తులు, కార్మికులు విరాళాలు అందచేయడంతో దేవాలయ నిర్మాణానికి పునాది పడింది.

దీంతో చిన్నపాటి నిర్మాణంతో ప్రారంభమైన అయ్యప్ప దేవాలయాన్ని దినదినాభివృద్ధి చేస్తూ దాదాపు కోటి రూపాయల వ్యయంతో పూర్తి స్థాయిలో ఆధునీకరించి జిల్లాలోనే అతిపెద్ద దేవాలయంగా మారింది. పంచలోహాలతో అయ్యప్ప స్వామి మూల విగ్రహాన్ని తయారుచేయించి, కేరళ సంప్రదా యం ప్రకారం ప్రతిష్ఠించారు. అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాంగణంలో గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, భగవతి అమ్మవారు, నాగదేవతల ఆలయాలను సైతం నిర్మించారు.

ప్రతీ ఏటా నవంబరు నెలలో ప్రారంభమైయ్యే మండల పూజల సమయంలో వేసుకునే అయ్యప్ప మాలలు ఇప్పటికే ప్రారంభమవగా మండల పూజలకు దేవాల యం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. డిసెంబరు 26 వరకూ జరిగే మండల పూజలు, అయ్యప్ప ఊరేగింపు తో ముగుస్తాయి. ఇప్పటికే దాదాపు 3 వేల మంది యువకులు, వృద్ధులు, పిల్లలు అయ్యప్ప దీక్షను తీసుకున్నారు.

స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప భక్తుల శరణుఘోషలు, శభరిగిరీశుని నామస్మరణలతో భెల్‌ టౌన్‌షి్‌పలోని అయ్యప్పస్వామి ఆలయంలో శుక్రవారం మండల పూజలు వైభవంగా ప్రారంభమైయ్యాయి. కేరళ సంప్రదాయ బద్దంగా, ఆలయ తంత్రీల ఆధ్వర్యంలో విశేష పూజల నడుమ మండల పూజలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఉదయం నాలుగు గంటలకు మహాగణపతి హోమం, అయ్యప్పస్వామికి ప్రీతిప్రదమైన నెయ్యి అభిషేకం, మూల విగ్రహానికి పంచామృతాభిషేకం తదితర విశేషపూజ కార్యక్రమాలు జరిగాయి. అనంతరం దేవాలయ ప్రధాన గురుస్వామి ఆధ్వర్యంలో వందలాది మంది భక్తులు మాలలు ధరించి దీక్షలకు శ్రీకారం చుట్టారు. కేరళ నుంచి వచ్చిన కళాకారులు రెండు గంటల పాటు పంచవాద్యాన్ని నిర్వహించారు. ఆలయంలో ప్రతీరోజు ఉదయం 4.30 నుంచి 8.30 వరకు సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు భజనలు, ప్రత్యేక పూజలు జరుతాయని నిర్వాహకులు తెలిపారు.

అయ్యప్ప దీక్షలను చేపట్టిన స్వాములు 41 రోజుల పాటు భక్తి శద్ధ్రలతో అయ్యప్పస్వామికి పూజలు నిర్వహిస్తుండడంతో వారి సౌకర్యార్థం దేవాలయ ప్రాంగణంలో అన్నపూర్ణదేవి కల్యాణ మండపంలో నిత్యాన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం నుంచి డిసెంబరు 26 వరకు మండల పూజలు జరిగే ప్రతీరోజు ఉదయం, సాయంత్రం స్వాములకు భిక్షను ఏర్పాటు చేశారు.

మూసీ ప్రక్షాళనకు కాదు రియల్‌ వ్యాపారాలకే వ్యతిరేకం

సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టే మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని మూసీ అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లు కూల్చి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలన్న ఆలోచనకే వ్యతిరేకమని ఆపార్టీ రంగారెడ్డి అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి అన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టే మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని మూసీ అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లు కూల్చి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలన్న ఆలోచనకే వ్యతిరేకమని ఆపార్టీ రంగారెడ్డి అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి అన్నారు. శుక్రవారం ఎల్బీనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సామ రంగారెడ్డి మాట్లాడారు.

మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు తాము ఇబ్బందులకు గురవుతున్నామని ఎప్పుడైనా దరఖాస్తు చేసుకున్నారా? అని ప్రశ్నించగా.. సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఎంపీ ఈటల రాజేందర్‌ను మూసీ పరీవాహక ప్రాంతాల్లో బసచేయాలని విసిరిన సవాలును పార్టీ స్వీకరిస్తుందన్నారు. అందులో భాగంగా శనివారం సాయంత్రం మూసీ పరీవాహక ప్రాం తాల్లో 27చోట్ల బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యేలు బస చేయనున్నారని ఆయన తెలిపారు.

సీఎం రేవంత్‌రెడ్డివి ఊకదంపుడు ఉపన్యాసాలని విమర్శించారు. పేదల ఇళ్లు కూలగొట్టి పెద్ద షాపింగ్‌లు కట్టడమే రేవంత్‌రెడ్డి మూసీ ప్రక్షాళన అన్నారు. గతం లో మోదీ సబర్మతి నది ప్రక్షాళన కోసం దాదాపు 25వందల కిలోమీటర్లు 12నెలల్లో పూర్తి చేశారని గుర్తుచేశారు. 55 కిలోమీటర్ల మూసీకి ఇంతవరకు డీపీఆర్‌ ఖరారు చేయకుండానే ముందుగానే లక్షా యాభైవేల కోట్ల తో పునరుద్ధరిస్తామనడం అవివేకానికి నిదర్శనం అన్నారు.

ఎంపీ ఈటల శనివారం సాయంత్రం 4గంటల నుంచి ఆదివారం ఉదయం వరకు ఫణిగిరి కాలనీలోని మూసీ పరీవాహక ప్రాంతాల కాలనీవాసులతో బస చేస్తారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొత్త రవీందర్‌గౌడ్‌, సునీతారెడ్డి, ఆలే పురంధర్‌ పాల్గొన్నారు.

కోటికి చేరిన సభ్యత్వాలు

విక్రవాండిలో తమిళగ వెట్రి కళగం(టీవీకే) తొలి మహానాడు విజయవంతంగా ముగిసి నెల రోజులు కూడా పూర్తి కాకముందే ఆ పార్టీలో సభ్యత్వం ఊపందుకుంది. నిర్వాహకుల అంచనాలను పటాపంచలు చేస్తూ సభ్యత్వం కోటికి చేరుకుంది. 2026 అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారిస్తూ టీవీకే నేత విజయ్(Vijay) తొలిమహానాడును విక్రవాండిలో నిర్వహించి పార్టీ సిద్ధాంతాలను ప్రకటించారు.

విక్రవాండిలో తమిళగ వెట్రి కళగం(టీవీకే) తొలి మహానాడు విజయవంతంగా ముగిసి నెల రోజులు కూడా పూర్తి కాకముందే ఆ పార్టీలో సభ్యత్వం ఊపందుకుంది. నిర్వాహకుల అంచనాలను పటాపంచలు చేస్తూ సభ్యత్వం కోటికి చేరుకుంది. 2026 అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారిస్తూ టీవీకే నేత విజయ్(Vijay) తొలిమహానాడును విక్రవాండిలో నిర్వహించి పార్టీ సిద్ధాంతాలను ప్రకటించారు. అక్టోబరు 27న మహానాడు జరిగే సమయానికి ఆ పార్టీలో సుమారు 75 లక్షలకు పైగా సభ్యత్వాలున్నాయి.

మహానాడు ఏర్పాట్ల కారణంగా సభ్యత్వ నమోదును కొన్ని రోజులపాటు ఆపారు. మహానాడు ముగిసిన కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆన్‌లైన్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించగా ఆ పార్టీ నేతలు కూడా ఊహించని విధంగా లక్షల సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం ఒకే సమయంలో లక్షలాది మంది ఆన్‌లైన్‌లో సభ్యత్వం కోసం దరఖాస్తు చేయడంతో పార్టీ యాప్‌ సర్వర్‌ స్తంభించింది.

ఆ తర్వాత సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లతో(Software engineers) సర్వర్‌ చక్కదిద్దటంతో మళ్ళీ సభ్యత్వ ముమ్మర కార్యక్రమం ఊపందుకుంది. శుక్రవారం మధ్యాహ్నానికి టీవీకే సభ్యత్వాలు కోటికి చేరాయి. ఈ విషయమై పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌ ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

ఘోర అగ్ని ప్రమాదం - నవజాత శిశువులు సహా 10మంది చిన్నారులు సజీవ దహనం

ఉత్తర్ప్రదేశ్లోని ఝాన్సీ లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం- పిల్లల వార్డులో చెలరేగిన మంటలు- నవజాత శిశువులు సహా 10మంది చిన్నారులు మృతి

ఉత్తరప్రదేశ్‌ ఝాన్సీ జిల్లా మహారాణి లక్ష్మీ బాయి మెడికల్‌ కాలేజీలోని పిల్లల వార్డులో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగి 10మంది చిన్నారులు సజీవ దహనమయ్యారు.

మృతుల్లో రోజుల వయస్సున్న నవజాత శిశువులు ఉన్నారు. ఘటనా సమయంలో NICUలో మొత్తం 54 మంది పిల్లలు అడ్మిట్‌ అయి ఉన్నారు. ఆస్పత్రి NICU విభాగంలో రాత్రి 10.45 గంటలకు ఆక్సీజన్‌ కాన్సన్‌ట్రేటర్‌లో విద్యుత్‌ షాట్ సర్క్యూట్‌ జరిగి మంటలు చెలరేగాయి.

పిల్లల వార్డు గదుల్లో ఆక్సీజన్‌ పూర్తిగా వ్యాపించి ఉండటం వల్ల మంటలు భారీగా విస్తరించాయని ఆస్పత్రి సూపరిండెంట్‌ సచిన్‌మహోర్‌ తెలిపారు. మంటల ధాటికి వార్డులోని పిల్లల బెడ్లు, ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. అటు చిన్నారుల మృతితో ఆస్పత్రి ప్రాంగణంలో కన్నవారి రోదనలు మిన్నంటాయి.

రిజిస్ట్రేషన్‌కు రూ.2లక్షలు లంచం డిమాండ్‌ చేశారంటూ పిటిషన్‌

తమ సేల్‌డీడ్‌ రిజిస్ర్టేషన్‌ చేయడానికి రూ.2 లక్షలు లంచం డిమాండ్‌ చేస్తున్నారని కేపీహెచ్‌బీ 9వ ఫేజ్‌కు చెందిన పి.రమ్యశ్రీ, కొండాపూర్‌ రాజరాజేశ్వర నగర్‌కు చెందిన వల్లూరి వెంకటరమణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

తమ సేల్‌డీడ్‌ రిజిస్ర్టేషన్‌ చేయడానికి రూ.2 లక్షలు లంచం డిమాండ్‌ చేస్తున్నారని కేపీహెచ్‌బీ 9వ ఫేజ్‌కు చెందిన పి.రమ్యశ్రీ, కొండాపూర్‌ రాజరాజేశ్వర నగర్‌కు చెందిన వల్లూరి వెంకటరమణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రంగారెడ్డి జాయింట్‌ సబ్‌రిజిస్ర్టార్‌-1(మూసాపేట్‌) కార్యాలయంలో సిబ్బంది లక్ష్మణ్‌రెడ్డి, సాయి, సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయ డాక్యుమెంట్‌ రైటర్‌ రూ.2 లక్షల లంచం డిమాండ్‌ చేశారని పిటిషనర్లు పేర్కొన్నారు.

కొండాపూర్‌ రాజరాజేశ్వర్‌నగర్‌లోని 300 చదరపు గజాల ప్లాట్‌కు సంబంధించిన సేల్‌డీడ్‌ రిజిస్ర్టేషన్‌ చేయడంలేదని తెలిపారు. ఈ పిటిషన్‌ జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం ఎదుట విచారణకు రాగా జాయింట్‌ సబ్‌రిజిస్ర్టార్‌ను ప్రత్యక్షంగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.

విచారణకు హాజరైన రంగారెడ్డి జాయింట్‌ సబ్‌రిజిస్ర్టార్‌-1 వివరణ ఇస్తూ.. పిటిషనర్లు అసలు డాక్యుమెంట్‌ సమర్పించలేదని.. పిటిషనర్లు ఆరోపిస్తున్న తేదీన తాను సెలవులో ఉన్నట్లు పేర్కొన్నారు. రూ.2 లక్షలు డిమాండ్‌ చేసినట్లు పిటిషనర్లు ఆరోపణలు చేయడం సరికాదని తెలిపారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం..‘రాష్ట్రంలోని అన్ని సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయాలి. ఫిర్యాదులపై అధికారులు విచారణకు ఆదేశించి.. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. రిజిస్ర్టేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌ కమిషనర్‌ అండ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ తనిఖీలు నిర్వహించి తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ రిజిస్ర్టేషన్ల వ్యవస్థను సరిచేస్తారని, తమ మార్గదర్శకాలను అమలుచేస్తారని భావిస్తున్నాం.

ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న రంగారెడ్డి జాయింట్‌ సబ్‌రిజిస్ర్టార్‌-1, సిబ్బందిపై విచారణ చేపట్టాలి. పిటిషనర్‌ల సేల్‌డీడ్‌ డాక్యుమెంట్లను వారం రోజుల్లో రిజిస్ర్టేషన్‌ చేయాలి. తదుపరి విచారణ నాటికి రంగారెడ్డి జాయింట్‌ సబ్‌రిజిస్ర్టార్‌-1, సిబ్బందిపై వచ్చిన ఆరోపణలపై విచారణ నివేదికను సీల్డ్‌ కవర్‌లో రంగారెడ్డి జిల్లా రిజిస్ర్టార్‌ సమర్పించాలి’ అని పేర్కొంది.

ఎస్సీ వర్గీకరణ పై చంద్రబాబు కీలక నిర్ణయం

ఎస్సీ వర్గీకరణ అంశం పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్గీకరణ పైన సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పై అధ్యయనం కోసం కమిషన్ ఏర్పాటు చేసింది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌ మిశ్రాకు ఈ బాధ్యతలు అప్పగిస్తూ ఏక సభ్య కమిషన్ నియమించింది. 60 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నివేదిక అందిన తరువాత ప్రభుత్వం వర్గీకరణ విషయంలో నిర్ణయం తీసుకోనుంది.

ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు అధ్యయనం చేసి నివేదిక కోరుతూ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. ఇందు కోసం రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా తో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కమిషన్ నివేదిక ఇచ్చేందుకు 60 రోజుల గడువు నిర్దేశిస్తూ ప్రభుత్వం స్పష్టం చేసింది. వర్గీకరణకు తాము సానుకూలంగా ఉన్నామని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. వర్గీకరణ దిశగా నిర్దిష్టమైన సిఫార్సులను సూచించేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కమిషన్ కు కావాల్సిన సహకారం అందించేలా అన్ని శాఖలకు ఆదేశాలు ఇచ్చింది.

వర్గీకరణ పై ఏర్పాటైన కమిషన్ విధి విధానాలను ఖరారు చేసారు. రాష్ట్ర, జిల్లా, జోనల్ స్థాయిలో సమకాలీన సమాచారం అందించాల్సి ఉంటుంది. జనాభా గణన పరిగణనలోకి తీసుకోవటంతో పాటుగా.. ఎస్సీ ఉప కులాలను ఒక హేతుబద్ధమైన ఉపవర్గీకరణ చేయటం పైన సూచనలు చేయాలి. షెడ్యూల్డ్‌ కులాల్లోని ఉప కులాల వెనుకబాటుతనాన్ని గుర్తించేందుకు అధ్యయనం చేయాలని ప్రభుత్వం సూచించింది. సర్వీసుల్లో ప్రాతినిధ్యం లేకపోవడం, విద్యాసంస్థల్లో ప్రవేశాలపై దృష్టిపెట్టాలి. అదే విధంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని పరిశీలించాల్సి ఉంటుంది.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఏపీలో ఎస్సీ వర్గీకరణను సమర్థంగా అమలు చేసేలా విధానాన్ని గుర్తించాలని కమిటీకి ప్రభుత్వం సూచించింది. వర్గీకరణ ప్రయోజనాలు అన్ని ఎస్సీ ఉప కులాలకు సమానంగా అందేలా పంపిణీ అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఈ ఏక సభ్య కమిషన్ నిర్దేశించాల్సి ఉంటుంది.

ఇందుకు రెండు నెలల సమయం ప్రభుత్వం నిర్దేశించింది. మాజీ ఐఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఈ మేరకు అధ్యయనం చేయటంతో పాటుగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.