ప్రభుత్వ పాఠశాల లను మెరుగైన మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తాం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా:
మునుగోడు: నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ మేరకు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య, పాఠశాలలలో ఉన్న మౌలిక సదుపాయాల పై అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు.
ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేయడానికి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలంలో ఒకటి నుండి పదవ తరగతి వరకు ఓకే కాంపౌండ్ లో చదివే విధంగా, మెరుగైన మౌలిక సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తానని, దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖ అధికారులను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశించారు.
మొదటి విడతగా 30 నుండి 40 ప్రభుత్వ పాఠశాలల ను మెరుగైన మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
ప్రభుత్వపరంగా ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరు పాటుపడాలని అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ రెడ్డి, వివిధ మండలాల ముఖ్య నాయకులు, డిఈఓ బిక్షపతి, మునుగోడు, చండూరు, నాంపల్లి, మర్రిగూడ, గట్టుప్పల్ మండలాల ఎంఈఓ లు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్ లు పాల్గొన్నారు.
Nov 16 2024, 21:09