/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz మూసీ ప్రక్షాళనకు కాదు రియల్‌ వ్యాపారాలకే వ్యతిరేకం Raghu ram reddy
మూసీ ప్రక్షాళనకు కాదు రియల్‌ వ్యాపారాలకే వ్యతిరేకం

సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టే మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని మూసీ అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లు కూల్చి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలన్న ఆలోచనకే వ్యతిరేకమని ఆపార్టీ రంగారెడ్డి అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి అన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టే మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని మూసీ అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లు కూల్చి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలన్న ఆలోచనకే వ్యతిరేకమని ఆపార్టీ రంగారెడ్డి అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి అన్నారు. శుక్రవారం ఎల్బీనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సామ రంగారెడ్డి మాట్లాడారు.

మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు తాము ఇబ్బందులకు గురవుతున్నామని ఎప్పుడైనా దరఖాస్తు చేసుకున్నారా? అని ప్రశ్నించగా.. సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఎంపీ ఈటల రాజేందర్‌ను మూసీ పరీవాహక ప్రాంతాల్లో బసచేయాలని విసిరిన సవాలును పార్టీ స్వీకరిస్తుందన్నారు. అందులో భాగంగా శనివారం సాయంత్రం మూసీ పరీవాహక ప్రాం తాల్లో 27చోట్ల బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యేలు బస చేయనున్నారని ఆయన తెలిపారు.

సీఎం రేవంత్‌రెడ్డివి ఊకదంపుడు ఉపన్యాసాలని విమర్శించారు. పేదల ఇళ్లు కూలగొట్టి పెద్ద షాపింగ్‌లు కట్టడమే రేవంత్‌రెడ్డి మూసీ ప్రక్షాళన అన్నారు. గతం లో మోదీ సబర్మతి నది ప్రక్షాళన కోసం దాదాపు 25వందల కిలోమీటర్లు 12నెలల్లో పూర్తి చేశారని గుర్తుచేశారు. 55 కిలోమీటర్ల మూసీకి ఇంతవరకు డీపీఆర్‌ ఖరారు చేయకుండానే ముందుగానే లక్షా యాభైవేల కోట్ల తో పునరుద్ధరిస్తామనడం అవివేకానికి నిదర్శనం అన్నారు.

ఎంపీ ఈటల శనివారం సాయంత్రం 4గంటల నుంచి ఆదివారం ఉదయం వరకు ఫణిగిరి కాలనీలోని మూసీ పరీవాహక ప్రాంతాల కాలనీవాసులతో బస చేస్తారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొత్త రవీందర్‌గౌడ్‌, సునీతారెడ్డి, ఆలే పురంధర్‌ పాల్గొన్నారు.

కోటికి చేరిన సభ్యత్వాలు

విక్రవాండిలో తమిళగ వెట్రి కళగం(టీవీకే) తొలి మహానాడు విజయవంతంగా ముగిసి నెల రోజులు కూడా పూర్తి కాకముందే ఆ పార్టీలో సభ్యత్వం ఊపందుకుంది. నిర్వాహకుల అంచనాలను పటాపంచలు చేస్తూ సభ్యత్వం కోటికి చేరుకుంది. 2026 అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారిస్తూ టీవీకే నేత విజయ్(Vijay) తొలిమహానాడును విక్రవాండిలో నిర్వహించి పార్టీ సిద్ధాంతాలను ప్రకటించారు.

విక్రవాండిలో తమిళగ వెట్రి కళగం(టీవీకే) తొలి మహానాడు విజయవంతంగా ముగిసి నెల రోజులు కూడా పూర్తి కాకముందే ఆ పార్టీలో సభ్యత్వం ఊపందుకుంది. నిర్వాహకుల అంచనాలను పటాపంచలు చేస్తూ సభ్యత్వం కోటికి చేరుకుంది. 2026 అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారిస్తూ టీవీకే నేత విజయ్(Vijay) తొలిమహానాడును విక్రవాండిలో నిర్వహించి పార్టీ సిద్ధాంతాలను ప్రకటించారు. అక్టోబరు 27న మహానాడు జరిగే సమయానికి ఆ పార్టీలో సుమారు 75 లక్షలకు పైగా సభ్యత్వాలున్నాయి.

మహానాడు ఏర్పాట్ల కారణంగా సభ్యత్వ నమోదును కొన్ని రోజులపాటు ఆపారు. మహానాడు ముగిసిన కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆన్‌లైన్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించగా ఆ పార్టీ నేతలు కూడా ఊహించని విధంగా లక్షల సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం ఒకే సమయంలో లక్షలాది మంది ఆన్‌లైన్‌లో సభ్యత్వం కోసం దరఖాస్తు చేయడంతో పార్టీ యాప్‌ సర్వర్‌ స్తంభించింది.

ఆ తర్వాత సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లతో(Software engineers) సర్వర్‌ చక్కదిద్దటంతో మళ్ళీ సభ్యత్వ ముమ్మర కార్యక్రమం ఊపందుకుంది. శుక్రవారం మధ్యాహ్నానికి టీవీకే సభ్యత్వాలు కోటికి చేరాయి. ఈ విషయమై పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌ ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

ఘోర అగ్ని ప్రమాదం - నవజాత శిశువులు సహా 10మంది చిన్నారులు సజీవ దహనం

ఉత్తర్ప్రదేశ్లోని ఝాన్సీ లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం- పిల్లల వార్డులో చెలరేగిన మంటలు- నవజాత శిశువులు సహా 10మంది చిన్నారులు మృతి

ఉత్తరప్రదేశ్‌ ఝాన్సీ జిల్లా మహారాణి లక్ష్మీ బాయి మెడికల్‌ కాలేజీలోని పిల్లల వార్డులో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగి 10మంది చిన్నారులు సజీవ దహనమయ్యారు.

మృతుల్లో రోజుల వయస్సున్న నవజాత శిశువులు ఉన్నారు. ఘటనా సమయంలో NICUలో మొత్తం 54 మంది పిల్లలు అడ్మిట్‌ అయి ఉన్నారు. ఆస్పత్రి NICU విభాగంలో రాత్రి 10.45 గంటలకు ఆక్సీజన్‌ కాన్సన్‌ట్రేటర్‌లో విద్యుత్‌ షాట్ సర్క్యూట్‌ జరిగి మంటలు చెలరేగాయి.

పిల్లల వార్డు గదుల్లో ఆక్సీజన్‌ పూర్తిగా వ్యాపించి ఉండటం వల్ల మంటలు భారీగా విస్తరించాయని ఆస్పత్రి సూపరిండెంట్‌ సచిన్‌మహోర్‌ తెలిపారు. మంటల ధాటికి వార్డులోని పిల్లల బెడ్లు, ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. అటు చిన్నారుల మృతితో ఆస్పత్రి ప్రాంగణంలో కన్నవారి రోదనలు మిన్నంటాయి.

రిజిస్ట్రేషన్‌కు రూ.2లక్షలు లంచం డిమాండ్‌ చేశారంటూ పిటిషన్‌

తమ సేల్‌డీడ్‌ రిజిస్ర్టేషన్‌ చేయడానికి రూ.2 లక్షలు లంచం డిమాండ్‌ చేస్తున్నారని కేపీహెచ్‌బీ 9వ ఫేజ్‌కు చెందిన పి.రమ్యశ్రీ, కొండాపూర్‌ రాజరాజేశ్వర నగర్‌కు చెందిన వల్లూరి వెంకటరమణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

తమ సేల్‌డీడ్‌ రిజిస్ర్టేషన్‌ చేయడానికి రూ.2 లక్షలు లంచం డిమాండ్‌ చేస్తున్నారని కేపీహెచ్‌బీ 9వ ఫేజ్‌కు చెందిన పి.రమ్యశ్రీ, కొండాపూర్‌ రాజరాజేశ్వర నగర్‌కు చెందిన వల్లూరి వెంకటరమణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రంగారెడ్డి జాయింట్‌ సబ్‌రిజిస్ర్టార్‌-1(మూసాపేట్‌) కార్యాలయంలో సిబ్బంది లక్ష్మణ్‌రెడ్డి, సాయి, సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయ డాక్యుమెంట్‌ రైటర్‌ రూ.2 లక్షల లంచం డిమాండ్‌ చేశారని పిటిషనర్లు పేర్కొన్నారు.

కొండాపూర్‌ రాజరాజేశ్వర్‌నగర్‌లోని 300 చదరపు గజాల ప్లాట్‌కు సంబంధించిన సేల్‌డీడ్‌ రిజిస్ర్టేషన్‌ చేయడంలేదని తెలిపారు. ఈ పిటిషన్‌ జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం ఎదుట విచారణకు రాగా జాయింట్‌ సబ్‌రిజిస్ర్టార్‌ను ప్రత్యక్షంగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.

విచారణకు హాజరైన రంగారెడ్డి జాయింట్‌ సబ్‌రిజిస్ర్టార్‌-1 వివరణ ఇస్తూ.. పిటిషనర్లు అసలు డాక్యుమెంట్‌ సమర్పించలేదని.. పిటిషనర్లు ఆరోపిస్తున్న తేదీన తాను సెలవులో ఉన్నట్లు పేర్కొన్నారు. రూ.2 లక్షలు డిమాండ్‌ చేసినట్లు పిటిషనర్లు ఆరోపణలు చేయడం సరికాదని తెలిపారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం..‘రాష్ట్రంలోని అన్ని సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయాలి. ఫిర్యాదులపై అధికారులు విచారణకు ఆదేశించి.. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. రిజిస్ర్టేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌ కమిషనర్‌ అండ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ తనిఖీలు నిర్వహించి తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ రిజిస్ర్టేషన్ల వ్యవస్థను సరిచేస్తారని, తమ మార్గదర్శకాలను అమలుచేస్తారని భావిస్తున్నాం.

ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న రంగారెడ్డి జాయింట్‌ సబ్‌రిజిస్ర్టార్‌-1, సిబ్బందిపై విచారణ చేపట్టాలి. పిటిషనర్‌ల సేల్‌డీడ్‌ డాక్యుమెంట్లను వారం రోజుల్లో రిజిస్ర్టేషన్‌ చేయాలి. తదుపరి విచారణ నాటికి రంగారెడ్డి జాయింట్‌ సబ్‌రిజిస్ర్టార్‌-1, సిబ్బందిపై వచ్చిన ఆరోపణలపై విచారణ నివేదికను సీల్డ్‌ కవర్‌లో రంగారెడ్డి జిల్లా రిజిస్ర్టార్‌ సమర్పించాలి’ అని పేర్కొంది.

ఎస్సీ వర్గీకరణ పై చంద్రబాబు కీలక నిర్ణయం

ఎస్సీ వర్గీకరణ అంశం పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్గీకరణ పైన సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పై అధ్యయనం కోసం కమిషన్ ఏర్పాటు చేసింది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌ మిశ్రాకు ఈ బాధ్యతలు అప్పగిస్తూ ఏక సభ్య కమిషన్ నియమించింది. 60 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నివేదిక అందిన తరువాత ప్రభుత్వం వర్గీకరణ విషయంలో నిర్ణయం తీసుకోనుంది.

ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు అధ్యయనం చేసి నివేదిక కోరుతూ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. ఇందు కోసం రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా తో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కమిషన్ నివేదిక ఇచ్చేందుకు 60 రోజుల గడువు నిర్దేశిస్తూ ప్రభుత్వం స్పష్టం చేసింది. వర్గీకరణకు తాము సానుకూలంగా ఉన్నామని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. వర్గీకరణ దిశగా నిర్దిష్టమైన సిఫార్సులను సూచించేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కమిషన్ కు కావాల్సిన సహకారం అందించేలా అన్ని శాఖలకు ఆదేశాలు ఇచ్చింది.

వర్గీకరణ పై ఏర్పాటైన కమిషన్ విధి విధానాలను ఖరారు చేసారు. రాష్ట్ర, జిల్లా, జోనల్ స్థాయిలో సమకాలీన సమాచారం అందించాల్సి ఉంటుంది. జనాభా గణన పరిగణనలోకి తీసుకోవటంతో పాటుగా.. ఎస్సీ ఉప కులాలను ఒక హేతుబద్ధమైన ఉపవర్గీకరణ చేయటం పైన సూచనలు చేయాలి. షెడ్యూల్డ్‌ కులాల్లోని ఉప కులాల వెనుకబాటుతనాన్ని గుర్తించేందుకు అధ్యయనం చేయాలని ప్రభుత్వం సూచించింది. సర్వీసుల్లో ప్రాతినిధ్యం లేకపోవడం, విద్యాసంస్థల్లో ప్రవేశాలపై దృష్టిపెట్టాలి. అదే విధంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని పరిశీలించాల్సి ఉంటుంది.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఏపీలో ఎస్సీ వర్గీకరణను సమర్థంగా అమలు చేసేలా విధానాన్ని గుర్తించాలని కమిటీకి ప్రభుత్వం సూచించింది. వర్గీకరణ ప్రయోజనాలు అన్ని ఎస్సీ ఉప కులాలకు సమానంగా అందేలా పంపిణీ అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఈ ఏక సభ్య కమిషన్ నిర్దేశించాల్సి ఉంటుంది.

ఇందుకు రెండు నెలల సమయం ప్రభుత్వం నిర్దేశించింది. మాజీ ఐఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఈ మేరకు అధ్యయనం చేయటంతో పాటుగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.

30 వేల ఎకరాల్లోఫ్యూచర్‌ సిటీ

హైదరాబాద్‌ నగర శివార్లలో నిర్మించతలపెట్టిన ఫ్యూచర్‌ సిటీ కోసం అదనంగా 15 వేల ఎకరాలను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రభుత్వం దాదాపు 13,973 ఎకరాల భూమిని సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్‌ నగర శివార్లలో నిర్మించతలపెట్టిన ఫ్యూచర్‌ సిటీ కోసం అదనంగా 15 వేల ఎకరాలను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రభుత్వం దాదాపు 13,973 ఎకరాల భూమిని సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. దీనికి అదనంగా 15 వేల ఎకరాలకు పైగా భూమిని ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా సేకరించాలని సర్కారు నిర్ణయించింది. అంటే మొత్తం 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్‌ సిటీని ఏర్పాటు చేయనుంది. రైతుల అంగీకారంతో భూమిని సేకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. అంతేగాక పక్కనే ఉన్న వేల ఎకరాల అటవీ భూముల్లో కూడా పర్యాటకులను ఆకర్షించేలా నైట్‌ సఫారీ, తదితర ప్రాజెక్టుల రూపకల్పన చేస్తోంది. ఫ్యూచర్‌ సిటీ నిర్మాణ పనులను శరవేగంగా చేపట్టేందుకు ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయనుంది. దానికి పాలకవర్గంతో పాటు కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తూ ఇటీవల బదిలీ అయిన శశాంకను ప్రభుత్వం కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ఇటీవల జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫ్యూచర్‌ సిటీ నిర్మాణ బాధ్యతలు కూడా ఆయనకే అప్పగిస్తున్నారు. ఫ్యూచర్‌ సిటీ పనుల పర్యవేక్షణకు నానక్‌రాంగూడలోని హెచ్‌ఎండీఏ గ్రోత్‌ కారిడార్‌ కార్యాలయాన్ని కేటాయించారు. త్వరలోనే అవసరమైన సిబ్బందినీ నియమించనున్నారు. ఫ్యూచర్‌ సిటీ కోసం అదనంగా 15 వేల ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌ విధానంలో సేకరించనున్నారు.

భూసేకరణ విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరిహారం విషయంలోనూ కొంత ఉదారంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో అభివృద్ధి చేసిన ప్లాట్లలో రైతులకు 50-60 శాతం భూమి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. రైతులు కోల్పోతున్న భూమి విలువకు సమానంగా ఉండేలా అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలని భావిస్తోంది. ఫ్యూచర్‌ సిటీలో నిర్మించే ప్రధాన రోడ్లకు ఆనుకొని ఉండే ప్లాట్లనే బాధిత రైతులకు కేటాయించనున్నట్లు సమాచారం. ఆ ప్లాట్లలో భారీ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వనున్నారు. దీంతో రైతులకు ఇచ్చే ప్లాట్లకు ఎక్కువ ధర లభించే అవకాశాలు ఉంటాయి. అసైన్డ్‌ భూములు సేకరించినా, వాటిని అనుభవిస్తున్న వారికి తగిన న్యాయం చేసేలా.. అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వనున్నారు. ఔటర్‌ రింగు రోడ్డు నుంచి ఫ్యూచర్‌ సిటీని కలుపుతూ రీజనల్‌ రింగురోడ్డు వరకు 41.5 కి.మీ. మేర నిర్మిస్తున్న 300 అడుగుల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి పనులను ప్రభుత్వం వేగిరం చేసింది.

తొలి విడత రావిర్యాలలోని ఔటర్‌ రింగు రోడ్డు ఎగ్జిట్‌ 13 నుంచి ఫ్యూచర్‌ సిటీలోని స్కిల్‌ డెవల్‌పమెంట్‌ యూనివర్సిటీ వరకు గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణం కోసం ఇటీవల భూసేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ రహదారి కోసం 449 ఎకరాల 27 సెంట్ల భూమిని సేకరిస్తోంది. ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి వెంటే మెట్రో రైలు నిర్మాణం కూడా చేపట్టనుంది. దీనికి సంబంధించి భూసేకరణ కోసం నోటిఫికేషన్‌ ఇచ్చిన సర్కారు.. రోడ్డు నిర్మాణానికి మార్కింగ్‌ పనులు కూడా పూర్తి చేసింది. మహేశ్వరం మండలంలోని కొంగరకుర్దు-ఏ గ్రామంతో పాటు ఇబ్రహీంపట్నం మండలంలోని ఫిరోజ్‌గూడ, కొంగరకలాన్‌, కందుకూరు మండలంలోని లేమూరు, రాచలూరు, తిమ్మాపూర్‌, గుమ్మడివెల్లి, పంజాగూడ, మీర్‌ఖాన్‌పేట గ్రామాల్లో మార్కింగ్‌ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారికి ఆనుకునే మెట్రోరైల్‌ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ రహదారికి రెండో విడత భూసేకరణ నోటిఫికేషన్‌ను ఈ వారంలోనే ఇవ్వనున్నారు. స్కిల్‌ వర్సిటీ నుంచి కొత్తగా నిర్మించే రింగు రోడ్డు వరకు భూసేకరణ కోసం నోటిఫికేషన్‌ సిద్ధం చేశారు. ఇందుకోసం దాదాపు 500 ఎకరాల వరకు సేకరిస్తున్నారు.

ఫ్యూచర్‌ సిటీలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న స్కిల్‌ వర్సిటీ నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి. స్కిల్‌ యూనివర్సిటీ నిర్మాణ పనులకు అదాని కంపెనీ రూ.100 కోట్ల విరాళం ఇవ్వగా, మేఘా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ కంపెనీ (ఎంఈఐఎల్‌) రూ.200 కోట్లతో ఇక్కడ భవన నిర్మాణం చేపడతామని ముందుకు వచ్చింది. ఈ మేరకు కంపెనీ నిర్మాణ పనులను ప్రారంభించింది. వచ్చే ఏడాది తెలంగాణ అవతరణ దినోత్సవం నాటికి తొలివిడత భవన నిర్మాణం పూర్తిచేస్తామని ప్రకటించింది.

ఇదిలా ఉంటే అంతర్జాతీయ నగరాలకు దీటుగా ఫ్యూచర్‌సిటీని నిర్మిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇందులో అన్ని వనరులు, సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. అన్నివర్గాల వారు ఇక్కడ జీవించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే మలక్‌పేటలో 150 ఎకరాల్లో ఉన్న హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ను ఇక్కడకు తరలించే ఏర్పాట్లు మొదలు పెట్టింది. అలాగే ప్రపంచ స్థాయి గోల్ఫ్‌ క్లబ్‌ నిర్మించేందుకు 250 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది. ఇక్కడ పలు అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉండడంతో ఇందులో పనిచేసే ఉన్నతశ్రేణి ఉద్యోగులు, వ్యాపారవేత్తల అభిరుచులకు అనుగుణంగా బిలియనీర్ల క్లబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. బీసీసీఐ కూడా ఇక్కడ అతిపెద్ద స్టేడియం నిర్మించేందుకు ముందుకు వచ్చింది. ఇక్కడ కంపెనీలు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. అమెరికాలోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ తరహాలో వాణిజ్య కేంద్రాన్ని నిర్మించేందుకు వరల్డ్‌ ట్రేడ్‌ ప్రతినిధులు ముందుకు వచ్చారు. ఈ మేరకు ఇటీవల స్థల పరిశీలనకు వచ్చిన అసోసియేషన్‌ ప్రతినిధులు 70 ఎకరాలు కేటాయించాలని కోరినట్లు తెలిసింది. ఫ్యూచర్‌ సిటీకి అవసరమైన తాగునీటిని కృష్ణా నది నుంచి తరలించనున్నారు. అలాగే ఇక్కడ వేల ఎకరాల్లోని పార్కులు, రోడ్లకు ఇరువైపులా ఉండే మొక్కల కోసం మూసీ నీటిని శుద్ధి చేసి వినియోగించాలని నిర్ణయించారు. మూసీ నీటిని తరలించేందుకు గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు పక్క నుంచే ప్రత్యేక పైపులైన్‌ ఏర్పాటు చేస్తున్నారు.

ఫ్యూచర్‌ సిటీలో హెల్త్‌ సైన్స్‌ పేరుతో 5 వేల ఎకరాల్లో గ్రీన్‌ ఫార్మాసిటీని నిర్మించనున్నారు. ఇప్పటికే ఇక్కడ భూమి కోసం దాదాపు 300 ఫార్మా కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో రాష్ట్రంలోని ప్రధాన ఫార్మా కంపెనీలకు తొలి విడత భూ కేటాయింపులు చేసేందుకు సర్కారు సన్నద్ధమవుతోంది. వీటిని ఫ్యూచర్‌ సిటీకి చివర్లో ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఐదు ఫార్మా కంపెనీలకు 50 ఎకరాల చొప్పున 500 ఎకరాలను కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. మేడిపల్లి గ్రామ పరిధిలో ఈ భూ కేటాయింపులు చేయనున్నట్లు తెలిసింది. ‘కాలుష్య రహిత’ హామీతోనే ఈ భూములు కేటాయిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి కాలుష్యం లేకుండా పరిశోధన చేసే సంస్థలకు, బయటి నుంచి ముడి సరుకు తీసుకొచ్చి ఔషధాలు తయారు చేసే సంస్థలకే భూములు ఇవ్వనున్నారు.

ట్రూడో లిట్మస్ టెస్ట్: ఉగ్రవాది అర్ష్ డల్లాపై భారత్ పెద్ద ఎత్తుగడ వేసింది కెనడా ప్రధాని ఇప్పుడు ఏం చేస్తారు?

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన దేశంలో ఖలిస్తానీ ఉగ్రవాదులు లేరని అంతర్జాతీయ సమాజానికి భరోసా ఇవ్వడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్ దల్లా భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు. అతను ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌కు సన్నిహితుడైన గ్యాంగ్‌స్టర్. అతను కొన్నేళ్లుగా కెనడాలో ఉన్నాడు మరియు ట్రూడో ప్రభుత్వం ముక్కు కింద ముఠా మరియు భారత వ్యతిరేక ప్రచారాలను నడుపుతున్నాడు. అయితే ఇప్పుడు కెనడాలో ఇటీవలి పరిణామాలు ట్రూడో యొక్క ఈ వాదనలను బహిర్గతం చేశాయి.

ఇప్పుడు అర్ష్ డల్లాను అరెస్టు చేయడంతో, ట్రూడో ప్రభుత్వం అతన్ని రక్షించడంలో నిమగ్నమై ఉంది. ఖలిస్తానీ ఓటు నిషేధం కారణంగా, ట్రూడో ప్రభుత్వం ఉగ్రవాదిని భారత్‌కు అప్పగించాలని కోరుకోవడం లేదు. అయితే, భారతదేశం కూడా చూస్తూ ఊరుకోదు. అర్ష్ సింగ్ గిల్ అలియాస్ అర్ష్ డల్లాను అప్పగించేందుకు భారత్ తన ఎత్తుగడలను వేసింది, భయంకరమైన ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్ సింగ్ గిల్ అలియాస్ అర్ష్ డల్లాను అప్పగించాలని కెనడాకు భారత్ అధికారికంగా విజ్ఞప్తి చేసింది.

అర్ష్ డల్లా కేసు గురించి మీడియా కవరేజీ ఉండదు

వాస్తవానికి, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ నాయకుడు అర్ష్ సింగ్ గిల్ అలియాస్ అర్ష్ డల్లాను అరెస్టు చేసిన తర్వాత గురువారం కెనడా కోర్టులో హాజరుపరిచారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇక్కడ కూడా భారత శత్రువులపై తన ప్రేమను దాచుకోలేకపోయారు. అతనిని రక్షించడానికి, కెనడా ప్రభుత్వం ఫుల్ కోర్టులో ఒక ఎత్తుగడ వేసింది. ఉగ్రవాది అర్ష్ డల్లా గురించి భారతదేశం మరియు ప్రపంచానికి ఎటువంటి సమాచారం తెలియకుండా చూసేందుకు, కెనడాలోని జస్టిన్ ట్రూడో ప్రభుత్వ న్యాయవాది మీడియా కవరేజీని నిషేధించాలని డిమాండ్ చేశారు. 517 పబ్లికేషన్ యాక్ట్ కింద కవరేజీకి సంబంధించి మీడియాపై నిషేధం విధించాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. దీని తర్వాత, అర్ష్ డల్లా కేసుపై మీడియా కవరేజీ ఉండకూడదని కెనడా కోర్టు ఆదేశించింది. ఈ విధంగా ట్రూడో తన భారత వ్యతిరేక చర్యల్లో ఒకటి బహిరంగంగా చేశాడు.

భారత ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది

భారత ప్రత్యర్థులకు ఆశ్రయం కల్పించేందుకు ట్రూడో తన శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ, మోడీ ప్రభుత్వం కూడా మౌనంగా ఉండడం లేదు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌ను వెనక్కి రప్పించడానికి మరియు అతనిని భారతదేశంలో న్యాయస్థానానికి తీసుకురావడానికి ఇది అనేక చర్యలు తీసుకుంటోంది. అతడిని అప్పగించేందుకు భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు ప్రారంభించింది.

అర్ష్ డల్లాను నవంబర్ 10న అరెస్టు చేశామని, ఇప్పుడు అతని కేసును అంటారియో కోర్టులో విచారించనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. "హత్య, హత్యాయత్నం, దోపిడీ మరియు టెర్రర్ ఫండింగ్‌తో సహా 50కి పైగా ఉగ్రవాద చర్యల కేసుల్లో అర్ష్ డల్లా ప్రకటిత నేరస్థుడు" అని మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది. మే 2022లో అతనిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయబడింది. 2023లో అతడిని భారత్‌లో ఉగ్రవాదిగా గుర్తించారు. జూలై 2023లో, భారత ప్రభుత్వం అతని అరెస్టు కోసం కెనడా ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఇది తిరస్కరించబడింది. ఈ కేసులో అదనపు సమాచారం అందించబడింది.

మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ (MLAT) కింద కెనడాకు ప్రత్యేక అభ్యర్థన కూడా పంపబడింది - అర్ష్ డల్లా అనుమానాస్పద నివాస చిరునామా, భారతదేశంలో అతని ఆర్థిక లావాదేవీలు, చర / స్థిరమైన ఆస్తులు, మొబైల్ నంబర్ వివరాలు మొదలైనవి. ఇవన్నీ జనవరి 2023లో కెనడియన్ అధికారులకు అందించబడ్డాయి. డిసెంబర్ 2023లో, కెనడియన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఈ కేసుపై అదనపు సమాచారాన్ని అభ్యర్థించింది. ఈ ప్రశ్నలకు సమాధానాలను ఈ ఏడాది మార్చిలో పంపారు.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, 'ఇటీవలి అరెస్టు దృష్ట్యా, మా ఏజెన్సీలు అప్పగింత అభ్యర్థనను ప్రాసెస్ చేస్తాయి. "భారతదేశంలో అర్ష్ డల్లా యొక్క నేర చరిత్ర మరియు కెనడాలో ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలలో అతని ప్రమేయం ఉన్నందున, భారతదేశంలో న్యాయాన్ని ఎదుర్కొనేందుకు అతన్ని రప్పించడం లేదా బహిష్కరించబడుతుందని భావిస్తున్నారు."

ట్రూడో ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి?

భారతదేశ అభ్యర్థనపై జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఏమి చేస్తుందో సమాధానం తర్వాత తెలుస్తుంది, అయితే ఇటీవలి నిర్ణయాలు ఖచ్చితంగా దాని ఉద్దేశాలను బహిర్గతం చేశాయి. కెనడాలో ఇటీవలి కాలంలో హిందువులు మరియు భారతదేశంపై రెండు ప్రధాన సంఘటనలు జరిగాయి. దీపావళి సందర్భంగా కెనడాలోని హిందూ దేవాలయాలపై ఖలిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేశారు. అప్పుడు కెనడియన్ పోలీసులు హింస మరియు దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి వెంటనే విడుదల చేశారు.

మరోవైపు, భారతదేశంలో శౌర్యచక్ర విజేత బల్వింద్ సింగ్ సంధును హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సందీప్ సింగ్ సిద్ధూ అలియాస్ సన్నీ టొరంటోకు ట్రూడో ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చింది. కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (CSIS) సన్నీపై వచ్చిన ఉగ్రవాద ఆరోపణలపై దర్యాప్తు చేస్తోంది. ఏజెన్సీ అతనికి క్లీన్ చిట్ ఇచ్చింది. సన్నీ కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ (CBSA)లో పోస్ట్ చేయబడింది. ఆయనను మళ్లీ సూపరింటెండెంట్‌గా నియమించారు.ట్రూడో లిట్మస్ టెస్ట్: ఉగ్రవాది అర్ష్ డల్లాపై భారత్ పెద్ద ఎత్తుగడ వేసింది, కెనడా ప్రధాని ఇప్పుడు ఏం చేస్తారు?

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన దేశంలో ఖలిస్తానీ ఉగ్రవాదులు లేరని అంతర్జాతీయ సమాజానికి భరోసా ఇవ్వడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్ దల్లా భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు. అతను ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌కు సన్నిహితుడైన గ్యాంగ్‌స్టర్. అతను కొన్నేళ్లుగా కెనడాలో ఉన్నాడు మరియు ట్రూడో ప్రభుత్వం ముక్కు కింద ముఠా మరియు భారత వ్యతిరేక ప్రచారాలను నడుపుతున్నాడు. అయితే ఇప్పుడు కెనడాలో ఇటీవలి పరిణామాలు ట్రూడో యొక్క ఈ వాదనలను బహిర్గతం చేశాయి.

ఇప్పుడు అర్ష్ డల్లాను అరెస్టు చేయడంతో, ట్రూడో ప్రభుత్వం అతన్ని రక్షించడంలో నిమగ్నమై ఉంది. ఖలిస్తానీ ఓటు నిషేధం కారణంగా, ట్రూడో ప్రభుత్వం ఉగ్రవాదిని భారత్‌కు అప్పగించాలని కోరుకోవడం లేదు. అయితే, భారతదేశం కూడా చూస్తూ ఊరుకోదు. అర్ష్ సింగ్ గిల్ అలియాస్ అర్ష్ డల్లాను అప్పగించేందుకు భారత్ తన ఎత్తుగడలను వేసింది, భయంకరమైన ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్ సింగ్ గిల్ అలియాస్ అర్ష్ డల్లాను అప్పగించాలని కెనడాకు భారత్ అధికారికంగా విజ్ఞప్తి చేసింది.

అర్ష్ డల్లా కేసు గురించి మీడియా కవరేజీ ఉండదు

వాస్తవానికి, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ నాయకుడు అర్ష్ సింగ్ గిల్ అలియాస్ అర్ష్ డల్లాను అరెస్టు చేసిన తర్వాత గురువారం కెనడా కోర్టులో హాజరుపరిచారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇక్కడ కూడా భారత శత్రువులపై తన ప్రేమను దాచుకోలేకపోయారు. అతనిని రక్షించడానికి, కెనడా ప్రభుత్వం ఫుల్ కోర్టులో ఒక ఎత్తుగడ వేసింది. ఉగ్రవాది అర్ష్ డల్లా గురించి భారతదేశం మరియు ప్రపంచానికి ఎటువంటి సమాచారం తెలియకుండా చూసేందుకు, కెనడాలోని జస్టిన్ ట్రూడో ప్రభుత్వ న్యాయవాది మీడియా కవరేజీని నిషేధించాలని డిమాండ్ చేశారు. 517 పబ్లికేషన్ యాక్ట్ కింద కవరేజీకి సంబంధించి మీడియాపై నిషేధం విధించాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. దీని తర్వాత, అర్ష్ డల్లా కేసుపై మీడియా కవరేజీ ఉండకూడదని కెనడా కోర్టు ఆదేశించింది. ఈ విధంగా ట్రూడో తన భారత వ్యతిరేక చర్యల్లో ఒకటి బహిరంగంగా చేశాడు.

భారత ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది

భారత ప్రత్యర్థులకు ఆశ్రయం కల్పించేందుకు ట్రూడో తన శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ, మోడీ ప్రభుత్వం కూడా మౌనంగా ఉండడం లేదు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌ను వెనక్కి రప్పించడానికి మరియు అతనిని భారతదేశంలో న్యాయస్థానానికి తీసుకురావడానికి ఇది అనేక చర్యలు తీసుకుంటోంది. అతడిని అప్పగించేందుకు భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు ప్రారంభించింది.

అర్ష్ డల్లాను నవంబర్ 10న అరెస్టు చేశామని, ఇప్పుడు అతని కేసును అంటారియో కోర్టులో విచారించనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. "హత్య, హత్యాయత్నం, దోపిడీ మరియు టెర్రర్ ఫండింగ్‌తో సహా 50కి పైగా ఉగ్రవాద చర్యల కేసుల్లో అర్ష్ డల్లా ప్రకటిత నేరస్థుడు" అని మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది. మే 2022లో అతనిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయబడింది. 2023లో అతడిని భారత్‌లో ఉగ్రవాదిగా గుర్తించారు. జూలై 2023లో, భారత ప్రభుత్వం అతని అరెస్టు కోసం కెనడా ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఇది తిరస్కరించబడింది. ఈ కేసులో అదనపు సమాచారం అందించబడింది.

మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ (MLAT) కింద కెనడాకు ప్రత్యేక అభ్యర్థన కూడా పంపబడింది - అర్ష్ డల్లా అనుమానాస్పద నివాస చిరునామా, భారతదేశంలో అతని ఆర్థిక లావాదేవీలు, చర / స్థిరమైన ఆస్తులు, మొబైల్ నంబర్ వివరాలు మొదలైనవి. ఇవన్నీ జనవరి 2023లో కెనడియన్ అధికారులకు అందించబడ్డాయి. డిసెంబర్ 2023లో, కెనడియన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఈ కేసుపై అదనపు సమాచారాన్ని అభ్యర్థించింది. ఈ ప్రశ్నలకు సమాధానాలను ఈ ఏడాది మార్చిలో పంపారు.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, 'ఇటీవలి అరెస్టు దృష్ట్యా, మా ఏజెన్సీలు అప్పగింత అభ్యర్థనను ప్రాసెస్ చేస్తాయి. "భారతదేశంలో అర్ష్ డల్లా యొక్క నేర చరిత్ర మరియు కెనడాలో ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలలో అతని ప్రమేయం ఉన్నందున, భారతదేశంలో న్యాయాన్ని ఎదుర్కొనేందుకు అతన్ని రప్పించడం లేదా బహిష్కరించబడుతుందని భావిస్తున్నారు."

ట్రూడో ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి?

భారతదేశ అభ్యర్థనపై జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఏమి చేస్తుందో సమాధానం తర్వాత తెలుస్తుంది, అయితే ఇటీవలి నిర్ణయాలు ఖచ్చితంగా దాని ఉద్దేశాలను బహిర్గతం చేశాయి. కెనడాలో ఇటీవలి కాలంలో హిందువులు మరియు భారతదేశంపై రెండు ప్రధాన సంఘటనలు జరిగాయి. దీపావళి సందర్భంగా కెనడాలోని హిందూ దేవాలయాలపై ఖలిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేశారు. అప్పుడు కెనడియన్ పోలీసులు హింస మరియు దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి వెంటనే విడుదల చేశారు.

మరోవైపు, భారతదేశంలో శౌర్యచక్ర విజేత బల్వింద్ సింగ్ సంధును హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సందీప్ సింగ్ సిద్ధూ అలియాస్ సన్నీ టొరంటోకు ట్రూడో ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చింది. కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (CSIS) సన్నీపై వచ్చిన ఉగ్రవాద ఆరోపణలపై దర్యాప్తు చేస్తోంది. ఏజెన్సీ అతనికి క్లీన్ చిట్ ఇచ్చింది. సన్నీ కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ (CBSA)లో పోస్ట్ చేయబడింది. ఆయనను మళ్లీ సూపరింటెండెంట్‌గా నియమించారు.

కులగణనకు బీజేపి అనుకూలమే

కాంగ్రెసుకు చిత్తశుద్ది ఉంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది..కానీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగడం లేదని ఎద్దేవచేస్తు కులగణనకు బిజేపీ అనుకూలమే అని బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవిగౌడ్ అన్నారు

బీసీల సంక్షేమంపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కులగణన పై ప్రజలకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు కులగణన చేస్తున్న అధికారులను ప్రజలు నిలదీయడానికి కారణం ఇదేనని అన్నారు..

బీసీ సంక్షేమంపై చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కులగనల పైన అనేక అనుమానాలు ఉన్నాయని అందుకే అధికారులపై ప్రజలు తిరగబడుతున్నారని అన్నారు కులగణన గురించి ప్రజలు అడిగితే అధికారులు కూడా సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు అని అన్నారు

కులగననకు బిజెపి వ్యతిరేకం కాదు అని కులగణలలో 75 ప్రశ్నలు పెట్టారు ప్రశ్నలు తగ్గిస్తే బాగుంటుంది కులం ఉపకులం అడిగితే సరిపోతుంది అంతేగాని ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా ఏసి ఉందా మీకు రాజకీయ నాయకులు తెలుసా ఇలాంటి ప్రశ్నలు ఎందుకు ఏసీ ఫ్రిడ్జ్ లేకుంటే రేవంత్ రెడ్డి ఇస్తాడా ఇవన్నీ చెబితే సంక్షేమ పథకాలు ఏం చేస్తారో అని ప్రజలు అనుమానాలు కలుగుతున్నాయి అని అన్నారు.

ప్రభుత్వం అన్నింటి పైన స్పష్టత ఇయ్యాలి అని ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంటుంది సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పై అధికారులపై ఉండాలి అని.. రేవంత్ రెడ్డి బీసీలకు ఇచ్చిన హామీలపై ,అదేవిధంగా ఆరు గ్యారెంటీ పథకాల అమలుపై ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు అని అయినప్పటికీ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని రవిగౌడ్ విమర్శించారు..

గాడిద పాలు పేరుతో రూ. 100 కోట్ల మోసం

గాడిద పాల వ్యాపారం పేరుతో రైతులను డ్యాంకీ ప్యాలెస్ సంస్థ నట్టేట ముంచింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో శుక్రవారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. గాడిద పాల ఉత్పత్తి పేరిట తమిళనాడుకు చెందిన డ్యాంకీ ప్యాలెస్ సంస్థ రూ. 100 కోట్ల మోసానికి పాల్పడింది. లీటర్ గాడిద పాలు రూ. 1600 లకు కొనుగోలు చేస్తామంటూ దక్షిణ భారతంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రైతులను నమ్మించింది.

అందుకు వారితో ఒప్పందం సైతం కుదుర్చుకుంది. ఆ క్రమంలో ఒక్కొ గాడిదను వారికి రూ. లక్షన్నరకు విక్రయించింది. ఒప్పందం ప్రకారం తొలి మూడు నెలలు రైతులకు సక్రమంగా సంస్థ నగదు చెల్లించింది. ఆ తర్వాత వారికి నగదు చెల్లింపులు నిలిపివేసింది. దీంతో సంస్థ యాజమాన్యాన్ని రైతులు నిలదీశారు.

దాంతో వారికి చెక్కులను అందజేసింది. అవి సైతం బౌన్స్ అయ్యాయి. తాము మోసపోయామని రైతులు భావించారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన బాధితులు శుక్రవారం సోమాజిగూడలోని ప్రెస్‌ క్లబ్‌లో తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమను న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరారు. గత 18 నెలలుగా తమకు నగదు చెల్లించడం లేదని వారు తెలిపారు.

ఇటీవల కాలంలో గాడిద పాలు విక్రయం బాగా పెరిగింది. వీటికి మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే ఆవు పాలు, గేదె పాలు కంటే గాడిద పాలు శ్రేష్టమైనవని ఓ ప్రచారం అయితే జరుగుతుంది. ఎన్నో ఆరోగ్య సమస్యలకు సైతం ఈ గాడిద పాలు చెక్ పెడుతుందని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అలాగే ఈ గాడిద పాల ధర అధికంగా ఉంటుందని సమాచారం.

అయితే ఆరోగ్య దృష్ట్యా ఈ పాల వినియోగం అధికంగా ఉంది. దీంతో భారీగా లాభాలు ఆర్జించ వచ్చంటూ..రైతులను డాంకీ ప్యాలెస్ సంస్థ ఆశ చూపింది. ఆ క్రమంలో భారీగా నగదు వెచ్చించి.. గాడిదలను కొనుగోలు చేసేలా వ్యూహా రచన చేశారు. తొలి నాళ్లలో సజావుగా నగదు చెల్లించిన సదరు సంస్థ.. ఆ తర్వాత రైతులను నట్టేట ముంచేసింది. ఈ విషయం ఆలస్యంగా అర్థం చేసుకున్న రైతులు లబోదిబోమంటున్నారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాలను వారు అభ్యర్థిస్తున్నారు.

రిజిస్ట్రేషన్‌ల నిలిపివేత అప్రజాస్వామ్యం

రిజిస్ట్రేషన్‌ల నిలిపివేత అప్రజాస్వామ్యమని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. మల్కాజిగిరి సర్కిల్‌ పరిధిలోని వక్ఫ్‌ బోర్డు భూములని(Waqf Board Lands) కొన్ని సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్‌లను నిలిపివేయడంలో ప్రజలలో గందరగోళం ఏర్పడిందన్నారు.

రిజిస్ట్రేషన్‌ల నిలిపివేత అప్రజాస్వామ్యమని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం బోయిన్‌పల్లి క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే (MLA Rajasekhar Reddy) మాట్లాడుతూ.. మల్కాజిగిరి సర్కిల్‌ పరిధిలోని వక్ఫ్‌ బోర్డు భూములని(Waqf Board Lands) కొన్ని సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్‌లను నిలిపివేయడంలో ప్రజలలో గందరగోళం ఏర్పడిందన్నారు. కొన్ని దశాబ్దాలుగా అన్ని రకాల ప్రభుత్వ పన్నులు కట్టి 40గజాలు, 50గజాలు, 100గజాలలో పేదలు ఇండ్లు కట్టుకుని నివసిస్తున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వం విద్యుత్‌ కనెక్షన్‌లు, సీసీ రోడ్లు, స్ట్రీట్‌ లైట్లు, డ్రైనేజీ సౌకర్యం కల్పించాయి. పేదల కోసం వక్ఫ్‌ బోర్డు కొన్ని సవరణలు చేయాల్సిఉందని, లేదంటే ప్రజల పక్షాన నిలబడి వారికి చట్ట బద్దంగా న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని అన్నారు. వక్ఫ్‌ బోర్డు తమ భూమిఅని చెబుతున్న సర్వే నంబర్‌ 398, 399లో దాదాపు 20ఎకరాల ఖాళీగా ఉన్న భూమి రిజిస్ట్రేషన్‌ చట్టం సెక్షన్‌ 22ఎ నిషేధిత జాబితాలో ఉన్న ఆ ఖాళీ భూమిని తమదంటూ ఇతరులు స్థానిక పోలీసుల సహకారంతో కబ్జాలో ఉన్నారని అన్నారు.

ఈ భూమిని కాపాడాల్సిన వక్ఫ్‌ బోర్డు సీఈఓ, జిల్లా ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఆడిటర్‌(వక్ఫ్‌), మూతవాలి వక్ఫ్‌ బోర్డు చట్టం సెక్షన్‌ 52ఎ కింద కేసులు నమోదు చేయడంలో విఫలమయరన్నారు. ఇప్పటికైనా ఆ భూమిని కాపాడాలని, కబ్జా చేసిన వారిపై వక్ఫ్‌ బోర్డు చట్టం సెక్షన్‌ 52ఎ కింద పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు. పేద ప్రజల కోసం న్యాయపరంగా ఏ సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు.