బలహీనపడిన అల్పపీడనం
నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 12వ తేదీ ఏర్పడి స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడింది. అయినప్పటికీ ఉత్తర తమిళనాడు కోస్తాతీరం నైరుతి బంగాళాఖాతంలో చెన్నై(Chennai)కి సమీపంలో బాహ్య ఉపరితల ఆవర్తన ద్రోణి నెలకొంది. ఈ కారణంగా తిరువళ్లూరు, వేలూరు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో వర్షాలు కురుస్తాయనివాతావారణ కేంద్రం తెలిపింది.
నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 12వ తేదీ ఏర్పడి స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడింది. అయినప్పటికీ ఉత్తర తమిళనాడు కోస్తాతీరం నైరుతి బంగాళాఖాతంలో చెన్నై(Chennai)కి సమీపంలో బాహ్య ఉపరితల ఆవర్తన ద్రోణి నెలకొంది. ఈ కారణంగా తిరువళ్లూరు, వేలూరు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో వర్షాలు కురుస్తాయనివాతావారణ కేంద్రం తెలిపింది. కేరళ సముద్రతీర ప్రాంతానికి సమీపంలో ఆగ్నేయ అరేబియా సముద్రంలో బాహ్య ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడింది.
దీని ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు పుదుచ్చేరి, కారైక్కాల్(Puducherry, Karaikal)లో తేలికపాటి వర్షాలు కురిశాయి. గురువారం చెంగల్పట్టు, కాంచీపురం, కళ్ళకుర్చి, తిరువణ్ణామలై, విల్లుపురం, కడలూరు, మైలాడుదురై, నాగపట్టణం, తంజావూరు, తిరువారూర్(Nagapattinam, Thanjavur, Thiruvarur), అరియలూరు, పెరంబలూరు, పుదుక్కోట, శివగంగై, మదురై, విరుదునగర్, తెన్‌కాశి, రామనాథపురం, తేని, తూత్తుకుడి, తిరునెల్వేలి, కన్నియాకుమారి, రామనాథపురం, శివగంగై, నీలగిరి, కోయంబత్తూరు, తిరుపూరు తదితర ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి.
ఈ నెల 15న పైన పేర్కొన్న జిలాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. 16వ తేదీన నీలగిరి, కోయంబత్తూరు, తిరుపూరు, తేని, దిండిగల్ జిల్లాల సహా చెన్నై, దాని పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ అధికారులు తెలిపారు.
Nov 15 2024, 12:52