పెన్షన్లు ఇక వీరికే వారికి కోత
ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏపీలో కొత్త పెన్షన్ల మంజూరుతో పాటుగా అనర్హులవి రద్దు దిశగా కసరత్తు జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ రూ 4 వేలకు పెంచి అమలు చేస్తున్నారు. 26 రకాల పెన్షన్లు ప్రస్తుతం అందిస్తున్నారు. అయితే, కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పెన్షన్ల కొనసాగింపు పైన ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా స్పష్టత ఇచ్చింది.
ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరు పైన కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నెలకు రూ 4 వేలకు పెన్షన్ పెంచి అమలు చేస్తోంది. ప్రతీ నెలా ఒకటో తేదీన ఇంటి వద్దకు వెళ్లి అందిస్తోంది. ప్రస్తుతం ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ప్రస్తుతం మొత్త 64,14,174 మంది పెన్షన్ అందుకుంటున్నారు. వీరిలో వృద్ధులతో పాటుగా, దివ్యాంగులు, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారు ఉన్నారు. అదే సమయంలో గత ఏడాది కాలంగా కొత్త పెన్షన్ల మంజూరుకు పెద్ద సంఖ్యలో లబ్దిదారులు నిరీక్షిస్తున్నారు.
అసెంబ్లీలో కొత్త పెన్షన్ల మంజూరు పైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో అర్హులైన పెన్షన్‌దారులు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. డిసెంబర్ 1 నుంచి సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయంలో దరఖాస్తుకు అవకాశం కల్పిస్తా మని చెప్పారు. దీనికి సంబంధించి విధి విధానాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అదే విధంగా రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల వరకు అర్హత లేని వారు పెన్షన్లు తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దివ్యాంగుల పెన్షన్ల మంజూరులో అర్హత లేని వారికి లబ్ది అందుతున్నట్లు గుర్తించారు. వీరి వివరాలను ప్రభుత్వానికి సమర్పించారు.
రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం దాదాపు రెండు లక్షల మంది వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, గత ఏడాది కాలంగా కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదు. కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరిం చి .. డిసెంబర్ నెలాఖరులో గా పరిశీలన పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జనవరిలో ప్రారంభించే జన్మభూమి -2 లో కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించారు. నకిలీ ధృవపత్రాలతో పెన్షన్లు అందుకుంటున్న వారిని గుర్తించి వారికి తెలిగించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక, పెన్షన్లు రెండు నెలల వరకు తీసుకోని వారికి మూడో నెలలో మొత్తం కలిపి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Nov 15 2024, 11:04