/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz పత్తి కొనుగోళ్లు బంద్‌ Raghu ram reddy
పత్తి కొనుగోళ్లు బంద్‌

పత్తి రైతులపై పిడుగు పడింది. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు బంద్‌ చేస్తున్నట్టు జిన్నింగ్‌ మిల్లులు ప్రకటించాయి. సీసీఐ, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇకపై పత్తి కొనుగోలు చేయబోమని రాష్ట్ర జిన్నింగ్‌, స్పిన్నింగ్‌ మిల్లుల యాజమాన్యాల సంఘం ప్రకటించింది.

పత్తి రైతులపై పిడుగు పడింది. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు బంద్‌ చేస్తున్నట్టు జిన్నింగ్‌ మిల్లులు ప్రకటించాయి. సీసీఐ, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇకపై పత్తి కొనుగోలు చేయబోమని రాష్ట్ర జిన్నింగ్‌, స్పిన్నింగ్‌ మిల్లుల యాజమాన్యాల సంఘం ప్రకటించింది. ఆదివారం సమావేశమైన సంఘం నేతలు పత్తి కొనుగోళ్ల నిలిపివేతకు సంబంధించి కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, సీసీఐ సీఎండీకి లేఖ రాశాయి. పత్తి కొనుగోలులో కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) అమలు చేస్తున్న అడ్డదిడ్డ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు లేఖలో పేర్కొన్నాయి. ఈ సీజన్‌లో తెలంగాణలో రైతుల నుంచి పత్తి కొనుగోలుపై సీసీఐ ఎన్నడూ లేని విధంగా కొర్రీలు పెడుతున్నది.

రెండు రోజుల క్రితం సీసీఐ తీసుకున్న నిర్ణయం ఇటు మిల్లులకు, అటు రైతులకు శరాఘాతంగా మారింది. మొన్నటి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 318 జిన్నింగ్‌ మిల్లుల్లో పత్తి కొనుగోలు చేసేది. కానీ శనివారం నుంచి సీసీఐ ఈ విధానాన్ని ఎత్తేసి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం ఒక జిల్లాలోని మిల్లులకు ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3.. ఇలా క్రమసంఖ్యను కేటాయిస్తుంది. క్లస్టర్ల వారీగా విభజించి మొదటి మిల్లులో సామర్థ్యం మేరకు కొనుగోళ్లు పూర్తయిన తర్వాతే మరో మిల్లులో కొనుగోళ్లు ప్రారంభిస్తుంది. అప్పటి వరకు మిగిలిన మి ల్లుల్లో ఎలాంటి కొనుగోళ్లు ఉండవు.

ఈ విధం గా నల్గొండ జిల్లాలో మొత్తం 23 జిన్నింగ్‌ మిల్లులు ఉండగా కేవలం 7 మిల్లుల్లోనే కొనుగోళ్లు జరుగుతున్నాయి. దీంతో మిగిలిన మిల్లు ల పరిధిలోని రైతులు ఈ ఏడు మిల్లులకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తద్వారా రైతులపై రవాణా భారం పడుతున్నది. ఈ కొత్త విధానాన్ని ఎత్తేయాలని జిన్నింగ్‌ మిల్లులు, రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే పత్తి కొనుగోలు భారం నుంచి తప్పించుకొనేందుకే సీసీఐ ఉన్నతాధికారులు ఇలాంటి కుట్రలు చేస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులు నష్టపోయినా పర్వాలేదు.. ప్రభుత్వానికి నష్టం రావొద్దనే విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చేతులెత్తేసిన మార్కెటింగ్‌ శాఖ

సీసీఐ పత్తి కొనుగోలులో ఇష్టారీతిగా కొర్రీలు పెడుతూ తెలంగాణ రైతులను ఇబ్బంది పెడుతుంటే బాధ్యతగా వ్యవహరించాల్సిన మార్కెటింగ్‌ శాఖ చేష్టలుడిగి చూస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ సచివాలయానికి, మార్కెటింగ్‌ శాఖకు తిరగడానికే సరిపోతున్నారని, క్షేత్రస్థాయిలో పరిస్థితిని చక్కదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పత్తి కొనుగోలులో రైతుల ఇబ్బందులు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. సచివాలయంలో కూర్చొని సమీక్షలు చేసినంత మాత్రాన సమస్యలు పరిష్కారమవుతాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ వెళ్లి సీసీఐ అధికారులను కలిసి తేమ శాతం సడలింపుపై, కొత్తగా అమలు చేస్తున్న నిబంధనల తొలగింపుపై ఎందుకు విజ్ఞప్తి చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.

నిబంధనలు సడలించాలి

సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జిన్నింగ్‌ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు బంద్‌ చేయాలని నిర్ణయించాం. కొన్ని మిల్లుల్లోనే కొనుగోలు చేయాలనే సీసీఐ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. తద్వారా మిగిలిన మిల్లులు మూతపడే ప్రమాదం ఏర్పడింది. అదే విధంగా రైతులు రవాణా ఖర్చులు భరించి ఇతర ప్రాంతాల మిల్లులకు పత్తిని తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. అదే విధంగా తేమ శాతాన్ని సైతం సడలించాలి.

రెండు రోజుల క్రితం సీసీఐ తీసుకున్న నిర్ణయం ఇటు మిల్లులకు, అటు రైతులకు శరాఘాతంగా మారింది. మొన్నటి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 318 జిన్నింగ్‌ మిల్లుల్లో పత్తి కొనుగోలు చేసేది. కానీ శనివారం నుంచి సీసీఐ ఈ విధానాన్ని ఎత్తేసి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం ఒక జిల్లాలోని మిల్లులకు ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3.. ఇలా క్రమసంఖ్యను కేటాయిస్తుంది. క్లస్టర్ల వారీగా విభజించి మొదటి మిల్లులో సామర్థ్యం మేరకు కొనుగోళ్లు పూర్తయిన తర్వాతే మరో మిల్లులో కొనుగోళ్లు ప్రారంభిస్తుంది. అప్పటి వరకు మిగిలిన మి ల్లుల్లో ఎలాంటి కొనుగోళ్లు ఉండవు.

ఈ విధం గా నల్గొండ జిల్లాలో మొత్తం 23 జిన్నింగ్‌ మిల్లులు ఉండగా కేవలం 7 మిల్లుల్లోనే కొనుగోళ్లు జరుగుతున్నాయి. దీంతో మిగిలిన మిల్లు ల పరిధిలోని రైతులు ఈ ఏడు మిల్లులకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తద్వారా రైతులపై రవాణా భారం పడుతున్నది. ఈ కొత్త విధానాన్ని ఎత్తేయాలని జిన్నింగ్‌ మిల్లులు, రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే పత్తి కొనుగోలు భారం నుంచి తప్పించుకొనేందుకే సీసీఐ ఉన్నతాధికారులు ఇలాంటి కుట్రలు చేస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులు నష్టపోయినా పర్వాలేదు.. ప్రభుత్వానికి నష్టం రావొద్దనే విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సీసీఐ పత్తి కొనుగోలులో ఇష్టారీతిగా కొర్రీలు పెడుతూ తెలంగాణ రైతులను ఇబ్బంది పెడుతుంటే బాధ్యతగా వ్యవహరించాల్సిన మార్కెటింగ్‌ శాఖ చేష్టలుడిగి చూస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ సచివాలయానికి, మార్కెటింగ్‌ శాఖకు తిరగడానికే సరిపోతున్నారని, క్షేత్రస్థాయిలో పరిస్థితిని చక్కదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పత్తి కొనుగోలులో రైతుల ఇబ్బందులు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. సచివాలయంలో కూర్చొని సమీక్షలు చేసినంత మాత్రాన సమస్యలు పరిష్కారమవుతాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ వెళ్లి సీసీఐ అధికారులను కలిసి తేమ శాతం సడలింపుపై, కొత్తగా అమలు చేస్తున్న నిబంధనల తొలగింపుపై ఎందుకు విజ్ఞప్తి చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.

సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జిన్నింగ్‌ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు బంద్‌ చేయాలని నిర్ణయించాం. కొన్ని మిల్లుల్లోనే కొనుగోలు చేయాలనే సీసీఐ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. తద్వారా మిగిలిన మిల్లులు మూతపడే ప్రమాదం ఏర్పడింది. అదే విధంగా రైతులు రవాణా ఖర్చులు భరించి ఇతర ప్రాంతాల మిల్లులకు పత్తిని తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. అదే విధంగా తేమ శాతాన్ని సైతం సడలించాలి.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు

తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఘనంగా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. అందుకోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో సబ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. సచివాలయంలో ఈ కమిటీ సమావేశమై విజయోత్సవ ఉత్సవాలపై చర్చించింది.

తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt.,) ఏర్పడి డిసెంబర్ 7వ తేదీతో ఏడాది పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు 26 రోజుల (26 days) పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు (Public celebrations) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ (Revanth Govt.,) ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఘనంగా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. అందుకోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో సబ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. సచివాలయంలో ఈ కమిటీ సమావేశమై విజయోత్సవ ఉత్సవాలపై చర్చించింది.

ఈ నెల 14వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజా ప్రభుత్వం సంవత్సర కాలంలో దేశంలోని మరే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేని విప్లవాత్మక, ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. ఆ కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వ గ్యారంటీ పథకాలైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 5 వందలకే గ్యాస్ సిలిండర్, 2 వందల యూనిట్ల ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరా మహిళా శక్తి తదితర పథకాలతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలపై 26 రోజులపాటు చైతన్య పరిచేలా కార్యక్రమాలు చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 50 వేల ఉద్యోగ నియామకాలు చేసిందని, దాదాపు రూ. 18 వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేయడంతోపాటు మహిళా సంఘాలకు రూ. 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేశామని పేర్కొన్నారు.

మూతపడిన ములుగు జిల్లాలోని కమలాపూర్‌ రేయాన్స్‌ పరిశ్రమను రూ.4 వేల కోట్లతో పునరుద్ధరించబోతున్నామన్నామని భట్టి విక్రమార్క తెలిపారు. వీటిని విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి ఈ నెల 14న రోజున ప్రారంభమయ్యే ఈ ‘ప్రజా విజయోత్సవాల’ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. చివరి రోజైన డిసెంబరు 9న హైదరాబాద్‌లో వేలాది మంది కళాకారులతో ప్రదర్శనలు, లేజర్‌ షోలు, క్రాకర్స్‌ ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఇటీవల తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఎంపికైన గ్రూప్‌-4 అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేస్తామని తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించిన పాలసీ విధానాలను ప్రకటిస్తారు.

కాగా 26 రోజుల వేడుకల్లో భాగంగా కంపెనీలతో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకుంటారు. స్సోర్ట్స్ యూనివర్శిటీకి ఫౌండేషన్, 16 నర్సింగ్ కళాశాలలు, 28 పారామెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం, ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ట్ర డిజాస్టర్ రస్పాన్స్ ఫోర్స్ ప్రారంభిస్తారు. పోలీస్ శాఖ ద్వారా డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలు, డాగ్ షోలు, పోలీస్ బ్యాండ్ ప్రదన్శలు నిర్వహిస్తారు. అందుకు సంబంధించిన పకడ్బంధి ఏర్పాట్లను చేయాలని సంబంధిత శాఖ కార్యదర్శులను భట్టి విక్రమార్క ఆదేశించారు.

అక్కడ తింటే చావు కొని తెచ్చుకున్నట్లే

హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. నిత్యం ఏదో ఓ చోట అధికారులు దాడులు చేస్తున్నారు. అధికారులు తనిఖీ చేసిన ప్రతి చోట ఉల్లంఘనలు కనిపిస్తున్నాయి. కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లలో దారుణ పరిస్థితులు ఉన్నాయి. పలు రెస్టారెంట్లు, హోటళ్లలో కుల్లిపోయిన కూరగాయలు, గడువు దాటిన పదార్థాలు, కుల్లిపోయిన మాంసంతో వంటలు చేసి అందులో మసాలాలు వేసి వినియోగదారులకు వడ్డిస్తున్నారు. టేస్ట్ బాగుందని కస్టమర్లు లాగించేస్తున్నారు.

కొన్ని హెటళ్లలో కెమికల్స్ కూడా ఇష్టారితీగా వినియోగిస్తున్నారు. నవంబర్ 2న హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ బృందం దాడులు చేసింది.సంతోష్ నగర్‌లోని హోటల్ స్వీకర్, స్వాతి హోటల్, హోటల్ శ్రీ రాఘవేంద్ర ఉడిపిలో దాడులు నిర్వహించారు. హోటళ్లలో అనేక ఉల్లంఘనలు గుర్తించారు. పాచీ ఉన్న ఫ్లోర్, ఎక్కడపడితే అక్కడ నీరు, కిచెన్ రాక్‌లలో బొద్దింకలు, గడువు ముగిసిన మలబార్ పరోటాలు కనిపించాయి. వంట చేసేవారు, వడ్డించేవారికి తలపాగాలు, అప్రాన్‌లు, గ్లౌజుల లేవు. తాజాగా ఆదివారం ఉదయం హబ్సిగూడ, నాచారంలోని పలు చోట్ల ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు చేశారు.

హబ్సిగూడలోని సీసీఎంబీ క్యాంటీన్‎లో తనిఖీలు చేశారు. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకుండానే హోటల్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. వంట గదిలో బొద్దింకలు, ఎలుకలు కనిపించాయి. దారుణ పరిస్థితులు ఉండడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలం చెల్లిన ఫుడ్ ఇంగ్రిడియెంట్స్‎తో వంటకాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు నాచారంలోని మను కిచెన్ రెస్టారెంట్, శ్రీ సుప్రభాత హోటల్‎ల్లోనూ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. అక్కడ కుళ్లిపోయిన టమాటా, ఆలుగడ్డ, గడువు తీరిన పన్నీరు, మష్రూమ్ ప్యాకెట్లను గుర్తించారు.

హోటల్ యజమాన్యాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజల ఆరోగ్యాలతో ఆడుకొవద్దని సూచించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు కొన్ని నెలలుగా తనిఖీలు నిర్వహిస్తున్నా.. పలు రెస్టారెంట్లు, హోటళ్ల పరిస్థితి మారడం లేదు. కఠిన చర్యలు తీసుకుంటేనే.. వారు మారుతారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా

ఎనుముల వారి ఏడాది పాలనలో చెప్పుకోవడానికి ఏమున్నది గర్వకారణం అంటే.. మూసీలో లక్షన్నర కోట్ల మూటల వేట.. కొడంగల్ లిఫ్టులో వేల కోట్ల కాసుల వేట.. బావమరిదికి అమృత్ టెండర్లు, కొడుకులకు వేలకోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టే ముఖ్యమంత్రి, మంత్రులు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదని.. “కరప్షన్ కార్నివాల్” అని కేటీఆర్ విమర్శించారు.

రాష్ట్రంలో కోలుకోలేని విధ్వంసం సృష్టించి విజయోత్సవాలు నిర్వహిస్తారా.. ఎనుముల వారి ఏడాది ఏలికలో.. తెలంగాణ (Telangana) బతుకు చీలికలు, పీలికలైందని, కాంగ్రెస్ సర్కారు (Congress Govt.,) కొలువుదీరి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించాల్సింది విజయోత్సవాలు కాదని.. ‘కుంభకోణాల కుంభమేళా’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ‘ఎక్స్’ సోషల్ మీడియా (Social Media) వేదికగా విమర్శలు (Comments) గుప్పించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకి పాతరేసిన నేపథ్యంలో జరపాల్సింది విజయోత్సవాలు కాదని.. ప్రజావంచన వారోత్సవాలని అన్నారు.

ఎనుముల వారి ఏడాది పాలనలో చెప్పుకోవడానికి ఏమున్నది గర్వకారణం అంటే.. మూసీలో లక్షన్నర కోట్ల మూటల వేట.. కొడంగల్ లిఫ్టులో వేల కోట్ల కాసుల వేట.. బావమరిదికి అమృత్ టెండర్లు, కొడుకులకు వేలకోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టే ముఖ్యమంత్రి, మంత్రులు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదని.. “కరప్షన్ కార్నివాల్” అని కేటీఆర్ అన్నారు. ఏడాది కాలంగా ప్రతిరోజూ పరిపాలనా వైఫల్యాలకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కారని.. సకల రంగాల్లో సంక్షోభం తప్ప సంతోషం లేని సందర్భాలకు చిరునామా రేవంత్ పాలన అని.. మరి ఏ ముఖం పెట్టుకుని విజయోత్సవాలు నిర్వహిస్తారని కేటీఆర్ ప్రశ్నించారు.

ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీల్లో ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా సరిగ్గా అమలుచేయకుండా జనం పైసలతో 25 రోజులపాటు జల్సాలు చేసుకుంటారా.. అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘రుణమాఫీ కాక, పెట్టుబడి సాయం అందక పేద రైతులు దు:ఖంలో ఉంటే.. మీరు వందల కోట్లతో విజయోత్సవాలు చేసుకుంటారా.. హైడ్రా, మూసీ బాధితులు బాధలో ఉంటే మీరు బాజాభజంత్రీలతో పండుగ చేసుకుంటారా.. ఆడబిడ్డలు రక్షణ లేక అల్లాడుతుంటే మీరు విజయోత్సవాల పేరిట విర్రవీగుతారా.. వృద్ధులు పింఛన్ల పెంపు కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటే మీరు దయలేకుండా దావత్‌లు చేసుకుంటారా‘‘ అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు.

బీఆర్ఎస్ భర్తీ చేసిన ఉద్యోగాల ప్రక్రియను కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడం నయవంచన కాదా.. అని కేటీఆర్ ప్రశ్నించారు. పావుశాతం కూడా రుణమాఫీ పూర్తిచేయకుండా వందశాతం చేశామని చెప్పుకోవడం దగా కాదా.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కే సిలిండర్ పథకాలకు సవాలక్ష ఆంక్షలు పెట్టి మెజారిటీ అర్హులను దూరం చేయడం మోసం కాదా.. 75 ఏళ్ల స్వతంత్య్ర భారత చరిత్రలో అతితక్కువ సమయంలో అత్యధిక ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న తొలి ప్రభుత్వం, ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఇదేనని.. ఈ ముఖ్యమంత్రికి పాలనపై పట్టు కాదు.. ఈ ప్రభుత్వానికి తెలంగాణపై ప్రేమలేదని విమర్శించారు. పేదల ఇళ్లు కూల్చి రోడ్డున పడేసిన కాంగ్రెస్ సర్కారుకు అసలు మనసే లేదని. విజయోత్సవాలు అంటే ఏంటో కూడా తెలియని ఈ అసమర్థ పాలకులకు ఆ పదాన్ని వాడే హక్కే లేదని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

వివరాల నమోదుకు సొంతూరు వెళ్లాలా

తెలంగాణలో రెండోదశ సమగ్ర కుటుంబ సర్వే నేటి (నవంబర్ 9) నుంచి ప్రారంభం కానుంది. కుటుంబ వ్యక్తిగత వివరాలను ఎన్యూమరేటర్లు సేకరించనున్నారు. ఈనెల 6 నుంచి 8 వరకు మాడ్రోజుల పాటు ఇంటి నెంబర్ల ప్రక్రియ పూర్తి కావటంతో నేటి నుంచి వివరాల సేకరణ మెుదలుపెట్టనున్నారు. అయితే ఉద్యోగం, ఉపాధి, వృత్తి కోసం సొంతూళ్లను వదిలి వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారు తమ వివరాలు నమోదు చేసుకోవటం కోసం సొంతూళ్లకు వెళ్లాల్సిన అసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఎక్కడి వారు అక్కడే వివరాలు చెబితే సరిపోతుందని అంటున్నారు.

తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 6న సర్వే ప్రారంభం కాగా.. ఈనెల 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈనెల 6 నుంచి 8 వరకు ఇంటి నంబరు, యజమాని పేరు నమోదు చేసి స్టిక్కరింగ్ వేశారు. తెలంగాణలో మొత్తం 1,17,44,954 కుటుంబాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. అందుకు అనుగుణంగా 87,092 ఎన్యూమరేషన్‌ బ్లాక్‌లుగా విభజించి వారికి సర్వే బాధ్యతలు అప్పగించారు.

ఒక్కో ఎన్యూమరేటర్ 150 నుంచి 175 ఇళ్ల దాకా కేటాయించడంతో వీటి నంబర్ల నమోదు పూర్తి చేశారు. గ్రామాల్లో స్టిక్కరింగ్ పూర్తి కాగా.. పట్టణాలు, నగరాల్లో అక్కడక్కడా కొన్ని ఇండ్లు మిగిలాయి. వాటి వివరాల నమోదు నేటితో పూర్తి చేయనున్నారు. ఇక స్టిక్కరింగ్ అయిపోవటంతో నేటి రెండోదశ సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం కానుంది. కుటుంబ వ్యక్తిగత వివరాలను ఎన్యూమరేటర్లు సేకరిస్తారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి కుటుంబంలోని సభ్యులందరి సమగ్ర వివరాలను నమోదు చేస్తారు. అయితే వృత్తి, వ్యాపారం, ఉద్యోగాల కోసం స్వగ్రామంలోని ఇల్లు వదిలి చాలా మంది దూరప్రాంతాల్లోని పట్టణాలు, నగరాల్లో ఉంటున్నారు. ఆధార్‌ కార్డులో అడ్రస్ ఉన్న చోటికి, సొంతింటికి, స్వగ్రామానికి వెళితేనే కుటుంబ వివరాలు నమోదు చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

దీంతో చాలా మంది సొంతూళ్లకు పయనమయ్యారు. మరికొందరు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఒక కుటుంబం ప్రస్తుతం ఎక్కడ నివసిస్తుంటే అక్కడే ఎన్యుమరేటర్ల వద్ద తమ వివరాలను నమోదు చేయించుకునే అవకాశమిచ్చింది. స్వగ్రామం, సొంతిటికి వెళ్లాల్సిన పని లేదని చెప్పారు. ఉన్నచోట వివరాలు చెబితే సరిపోతుందని వెల్లడించారు.

కుటుంబ సభ్యుల ఆధార్, మెుబైల్ నంబర్లు, ప్రశ్నపత్రంలో అడిగిన వివరాలన్నీ తెలపాలన్నారు. ఆధార్, రేషన్‌కార్డు, ధరణి పాసుపుస్తకం, బ్యాంకు అకౌంట్ పాస్ పుస్తకం వంటివి అందుబాటులో ఉంచుకుంటే ఈజీగా ఉంటుందని చెబుతున్నారు. సర్వే కోసం వచ్చిన ఎన్యుమరేటర్లకు త్వరగా సమాచారం ఇవ్వవచ్చునని అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్‌లో ట్రంప్‌ టవర్లు

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు చెందిన నిర్మాణ సంస్థ తెలంగాణలోనూ అడుగు పెడుతోంది. హైదరాబాద్‌లో ట్రంప్‌ టవర్లను నిర్మించనుంది. భారత్‌లో ఇప్పటికే నాలుగు నగరాలు ముంబై, కోల్‌కతా, గుర్గావ్‌, పుణెల్లో ట్రంప్‌ టవర్స్‌ నిర్మించిన ఆ సంస్థ.. తాజాగా మరో ఆరు టవర్లను నిర్మించాలని నిర్ణయించింది.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు చెందిన నిర్మాణ సంస్థ తెలంగాణలోనూ అడుగు పెడుతోంది. హైదరాబాద్‌లో ట్రంప్‌ టవర్లను నిర్మించనుంది. భారత్‌లో ఇప్పటికే నాలుగు నగరాలు ముంబై, కోల్‌కతా, గుర్గావ్‌, పుణెల్లో ట్రంప్‌ టవర్స్‌ నిర్మించిన ఆ సంస్థ.. తాజాగా మరో ఆరు టవర్లను నిర్మించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌తోపాటు నోయిడా, బెంగళూరుతోపాటు పుణెలో మరో టవర్‌ను నిర్మించనుంది. దీంతో భారత్‌లో ట్రంప్‌ టవర్ల సంఖ్య 10కి చేరనుంది. తద్వారా అమెరికా బయట అత్యధికంగా ట్రంప్‌ టవర్లు భారత్‌లోనే ఏర్పాటు కానున్నాయి. కాగా, హైదరాబాద్‌లో స్థానిక మంజీరా గ్రూప్‌తో కలిసి జంట టవర్లు నిర్మించే యోచనలో ట్రంప్‌ నిర్మాణ సంస్థ ఉంది.

ఇందుకోసం 2022లోనే మాదాపూర్‌లోని ఖానామెట్‌లో 2.92 ఎకరాల భూమిని హెచ్‌ఎండీఏ వేలంలో కొనుగోలు చేసింది. 27 అంతస్తుల్లో నాలుగు బెడ్‌రూంలు, ఐదు బెడ్‌రూంల అపార్టుమెంట్లతో నిర్మించనున్నారు. నాలుగు బెడ్‌రూంల అపార్టుమెంట్ల విస్తీర్ణం 4వేల నుంచి 5వేల చదరపు అడుగులు, ఐదు బెడ్‌రూంల అపార్టుమెంట్ల విస్తీర్ణం 6వేల చదరపు అడుగులు ఉండనున్నట్లు తెలుస్తోంది.

చదరపు అడుగుకు రూ.13 వేలుగా ధరను నిర్ణయించాలని అప్పట్లో భావించారు. నాటి లెక్క ప్రకారమే నాలుగు బెడ్‌రూంల అపార్టుమెంట్‌ ధర రూ.5.5 కోట్లు కానుంది. ఇక ఇతర నగరాల్లో ట్రిబెకా డెవలపర్స్‌తో కలిసి నిర్మించే టవర్లలో అపార్టుమెంట్లే కాకుండా.. ఆఫీసులు, విల్లాలు, గోల్ఫ్‌ కోర్స్‌లు ఉండనున్నాయి.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా

జస్టిస్ సంజీవ్ ఖన్నా భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే బాధ్యతలు స్వీకరించడానికి ముందే తనకు ఎంతో ఇష్టమైన ఒక అలవాటును ఆయన వదులుకోవాల్సి వచ్చింది. ప్రతి రోజూ ఉదయం ఎంతో ఇష్టంగా కొన్ని కిలోమీటర్ల మేర మార్నింగ్ వాకింగ్ చేయడం ఆయనకు అలవాటు. తనను ఎవరూ గుర్తుపట్టరనే నమ్మకంతో ఢిల్లీలోని లోధి గార్డెన్ ప్రాంతం, తన ఇంటి చుట్టుపక్కల ఒంటరిగా వాకింగ్ చేస్తుండేవారు.

అయితే గత నెలలో సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత.. భద్రతా సిబ్బందితో మార్నింగ్ వాక్‌కు వెళ్లాలని భద్రతా అధికారులు ఆయనకు సూచన చేశారు. అయితే చాలా సాధారణ జీవితాన్ని గడపడానికి ఇష్టపడే జస్టిస్ సంజీవ్ ఖన్నా మార్నింగ్ వాక్‌కు వెంట సెక్యూరిటీని తీసుకెళ్లడం ఇష్టంలేదని తిరస్కరించారు. ఆ అలవాటునే పూర్తిగా మానేయాలని ఆయన నిర్ణయించుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

కాగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఢిల్లీలోని బరాఖంబా రోడ్‌లోని మోడరన్ స్కూల్‌లో పాఠశాల విద్య పూర్తి చేశారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్, ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్ లా సెంటర్‌ నుంచి లా డిగ్రీ పొందారు. ఢిల్లీలో పెరిగిన ఆయనకు నగరంలోని ప్రతి మూల గురించి బాగా అవగాహన ఉంది. ఆయన ఇప్పటికీ తన స్కూలు, కాలేజీ, క్యాంపస్ లా సెంటర్ స్నేహితులతో టచ్‌లో ఉన్నారని, వారి ఇళ్లకు వెళ్లడానికి ఇష్టపడుతుంటారని సంజీవ్ ఖన్నా సన్నిహితులు తెలిపారు.

జస్టిస్ ఖన్నా పెద్దగా మారలేదని ఆయన స్నేహితులు చెబుతున్నారు. స్కూలు, కాలేజీ రోజుల నుంచి ఇప్పటికీ సాదాసీదాగా, ప్రశాంతంగా ఉంటారని అంటున్నారు.

కెమెరాలకు, ప్రచారానికి దూరంగా ఉంటారని ఒక స్నేహితుడు చెప్పారు. కాగా భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా 6 నెలలు కొనసాగుతారు. మే 13, 2025న ఆయన పదవీ విరమణ చేయనున్నారు.

రిటైర్ కానున్న సీజేఐ డీవై చంద్రచూడ్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదివారం రిటైర్ కానున్నారు. రిటైర్మెంట్ అనంతరం సుప్రీంకోర్టు సీజేఐ, న్యాయమూర్తులు.. కోర్టుల్లో ప్రాక్టీస్ చేయవచ్చా?

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదివారం అంటే నవంబర్ 10వ తేదీన రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపట్టునున్నారు. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును కేంద్రానికి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇప్పటికే ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనకు కేంద్రం ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో సోమవారం అంటే నవంబర్ 11వ తేదీన సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో పాటు ఇతర న్యాయమూర్తులు సైతం రిటైర్ అవుతుంటారు. అనంతరం వారు దేశంలోని వివిధ కోర్టుల్లో న్యాయవాదులుగా ప్రాక్లీస్ చేయవచ్చా? అనే సందేహాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులే కాదు ఇతర న్యాయమూర్తులు సైతం.. న్యాయాన్ని రక్షించడంతోపాటు భారత రాజ్యాంగాన్ని పరిరక్షిచడంలో వీరంతా కీలకంగా వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలో వారి పదవి కాలం ముగిసిన అనంతరం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(7) ప్రకారం.. సీజేఐలు, ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏ భారతీయ కోర్టులో న్యాయవాద వృత్తిని నిర్వహించకూడదని నిషేధం విధించింది.

న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతోపాటు సమగ్రతపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొంచిందే ప్రధాన ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశం భారత్. అలాంటి దేశంలో న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యానికి ఒక మూల స్తంభంగా పరిగణింపబడుతుంది. ఆ వ్యవస్థ యొక్క విశ్వసనీయత.. వాస్తవ నిష్పాక్షికతపై ఆధారపడి ఉంటుంది. దీంతో న్యాయమూర్తి విధులు నిర్వహించిన అనంతరం న్యాయవాదిగా చేయడానికి అనుమతించినట్లు అయితే వారి పదవీ కాలంలో ఇచ్చిన తీర్పులపై పలు సందేహాలు రేకెత్తినట్లు అవుతుంది. ఇంకా చెప్పాలంటే.. వైరుధ్యాలను నివారించడం, న్యాయవ్యవస్థ హుందాతనాన్ని కొనసాగించడం, అనవసరమైన ప్రభావాన్ని నిరోధించడం కోసం.. కోర్టుల్లో వీరి ప్రాక్టీస్‌పై భారత రాజ్యాంగం నిషేధం విధించింది.

ది ఆర్బిట్రేషన్ అండ్ కొన్సలైషన్ యాక్ట్ -1996 ప్రకారం.. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు మధ్యవర్తులుగా అంటే ఆర్బిట్రేటర్స్ లేదా మీడియేటర్స్‌ (arbitrators or mediators)గా వ్యవహరించవచ్చు. ఎందుకంటే చట్టపరమైన పలు అంశాలు క్లిష్టంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆయా అంశాలను పరిష్కరించడం కోసం వీరిని ఆర్బిట్రేటర్స్‌గా నియమించే అవకాశం ఉంది. .

అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి విరమణ చేసిన వారిని వివిధ కమిషన్లకు చైర్మన్లుగా ప్రభుత్వం నియమిస్తుంది. అంటే జాతీయ మనవ హక్కుల కమిషన్, లేదా నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ చైర్మన్‌గా నియమించ వచ్చు.

ఇక చాలా మంది పదవి విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తులు.. న్యాయ కళాశాలల్లో విద్యార్థులకు పాఠాలను బోధిస్తుంటారు. అలాగే న్యాయ శాస్త్రంలో తమకున్న జ్ఞానాన్నివిద్యార్ధులకు తమ ప్రసంగాల పాఠాల ద్వారా అందిస్తారు. ఇంకొంత మంది అయితే.. న్యాయ శాస్త్రాలకు చెందిన పుస్తకాలను రాస్తుంటారు. అదే విధంగా రాజ్యాంగ బద్ద సంస్థలకు అధిపతులుగా లేకుంటే రాష్ట్రాలకు గవర్నరులు, ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీల్లో సభ్యులుగా సైతం నియమించే అవకాశముంది.

అయితే గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రంజన్ గోగోయి విధులు నిర్వహించారు. ఆయన పదవి విరమణ చేశారు. ఆ కొద్ది కాలానికే ఆయన రాజ్యసభ సభ్యుడుగా పెద్దల సభలో అడుగు పెట్టారు. ఈ వ్యవహారంపై ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి. అలాగే సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నివాసంలో ఇటీవల వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. దీనిపై కూడా పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో బీజేపీ అగ్రనాయకత్వం స్పందించిందిన విషయం విధితమే.

370 అధికరణపై మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధులేలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ శుక్రవారంనాడు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్ ఎజెండాను, కశ్మీర్‌లో వేర్పాటువాద భాషను ఇక్కడ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలను ఓటర్లు తిప్పికొట్టాలన్నారు.

జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో కేంద్రం రద్దు చేసిన 370వ అధికరణ (Article 370)ను దేశంలోని ఏ శక్తి పునరుద్ధరించ లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తెగేసి చెప్పారు. కేంద్ర పాలిత ప్రాంతంలో (జమ్మూకశ్మీర్) కాంగ్రెస్ పార్టీ కుట్రలను మహారాష్ట్ర ఓటర్లు గుర్తించాలని హెచ్చరించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధులేలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ శుక్రవారంనాడు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్ ఎజెండాను, కశ్మీర్‌లో వేర్పాటువాద భాషను ఇక్కడ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలను ఓటర్లు తిప్పికొట్టాలన్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణను తిరిగి పునరుద్ధరించాలంటూ రెండ్రోజుల క్రితం అక్కడి అధికార 'ఇండియా' కూటమి అసెంబ్లీలో తీర్మానం ఆమోదించిన నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్ కుట్రలను మహారాష్ట్ర ప్రజలు అవగాహన చేసుకోవాలని, 370వ అధికరణపై అక్కడి అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని దేశం అంగీకరించిందని అన్నారు. ఏ శక్తి కూడా ఆ అధికరణను వెనక్కి తేలేదని స్పష్టం చేశారు. 370వ అధికరణకు మద్దతుగా అసెంబ్లీ వెలుపల బ్యానర్లు పెట్టారు. ఆ అధికరణను పునరుద్ధరించాలంటూ కాంగ్రెస్ కూటమి ఒక తీర్మానాన్ని ఆమోదించింది.. దీనిని దేశ ప్రజలు ఆమోదిస్తారా? ఈ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు శక్తవంచన లేకుండా నిరసన తెలిపినప్పటికీ వారిని అసెంబ్లీ నుంచి బయటకు పంపించేశారు. కాంగ్రెస్ కూటమి నిజస్వరూపం ఏమిటో యావద్దేశం అవగాహన చేసుకోవాలి'' అని మోదీ అన్నారు.

370వ అధికరణను పునరుద్ధరించేందుకు దేశ ప్రజలు అంగీకరించరని, కశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆటలు మోదీ ఉన్నంత వరకూ సాగవని ప్రధాని అన్నారు. బీమ్‌రావ్ అంబేద్కర్ రాజ్యాంగం మాత్రమే అక్కడ నడుస్తుందని, ఏ శక్తీ 370వ అధికరణను వెనక్కి తేలేదని మరోసారి ఆయన స్పష్టం చేశారు. విపక్ష సభ్యలు తీవ్ర ప్రతిఘటన, నిరసనల మధ్య జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో 370వ అధికరణను పునరుద్ధరించే తీర్మానాన్ని గత శుక్రవారంనాడు మూజువాణి ఓటుతో ఆమోదించారు.

తిరుమల లడ్డూ వివాదంపై బిగ్ అప్డేట్

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ వ్యవహారం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ లడ్డూ వివాదంపై బిగ్ అప్డేట్ వచ్చింది.

తిరుమల లడ్డు వ్యవహారంపై త్వరలో విచారణ జరగనుంది. సీబీఐ నియమించిన బృందానికి సహాయపడేందుకు అదనంగా సిబ్బంది కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో సీబీఐ అనుమతి తీసుకుని మరి కొంతమంది పోలీస్ అధికారులను, సపోర్టింగ్ స్టాఫ్ ను నియమించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున విచారణ కోసం సీబీఐ డైరెక్టర్ 5 గురు అధికారులను నియమించారు.

సీబీఐ హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ ఏస్ వీరేష్ ప్రభు, గుంటూరు రేంజ్ IG సర్వశ్రేష్ఠ త్రిపాటి, విశాఖ రేంజ్ DIG జెట్టి గోపీనాథ్, విశాఖ సీబీఐ ఎస్పీ మురళీ రంభ, FSSAI సలహాదారుడు డాక్టర్ సత్య కుమార్ పండా లను సీబీఐ నియమించింది. ఈ బృందం సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో పని చేస్తుందని సీబీఐ పేర్కొంది. అయితే, సీబీఐ నియమించిన బృందానికి మరి కొంతమంది అధికారులు, ఇతర స్టాఫ్ కావాలని అధికారులు కోరారు.

తిరుమల లడ్డూ అంటే తెలియని వారు ఉండరు. ఎన్నో రకాల ప్రసాదాలున్నప్పటికి భక్తులకు తిరుమల లడ్డూ అంటే ఎంతో ప్రత్యేకం. అయితే, ఈ లడ్డూ న్యాణతపై గత కొంతకాలంగా విమర్శలు వస్తునే ఉన్నాయి. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు ఉందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా తిరుమల లడ్డూ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతోపాటు అభ్యంతరకర పదార్థాలు ఉన్నాయంటూ ఓ లాబ్ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. దీనిని నిర్థారించుకోవడానికి ఈ కంపెనీలు సరఫరా చేస్తున్న నెయ్యి శాంపిల్‌ను పరీక్షల నిమిత్తం గుజరాత్ లోని ల్యాబ్‌కు పంపారు. ఆ రిపోర్టులో తమిళనాడుకు చెందిన కంపెనీ అందిస్తున్న నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్లు తేలడంతో తమిళనాడుకు చెందిన సంస్థ నుంచి నెయ్యి సరఫరాను నిలిపివేశారు. అయితే, ఈ సంఘటన భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. ఈ విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో తిరుమల లడ్డూ వ్యవహారంపై విచారణకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది.

తిరుమల కల్తీ నెయ్యి వివాదం పరిశీలనకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ రంగంలోకి దిగింది. తిరుపతిలో సిట్ కోసం ప్రత్యేక కార్యలయం ఏర్పాటు చేశారు. ఇప్పటికే ల్యాబ్ రిపోర్ట్‌ని సీబీఐ అధికారులు పరిశీలించారు. త్వరలోనే క్షేత్ర స్థాయిలోకుడా సిట్ బృందం పరిశీలన చేయనుంది. ఇప్పటికే సిట్ అధికారులు పరిశీలించిన దర్యాప్తు నివేదికని సీబీఐ బృందం పరిశీలించే అవకాశం ఉంది. త్వరలోనే తిరుమలలోని ల్యాబ్, లడ్డు తయారీ పోటుని దర్యాప్తు బృందం పరిశీలించనుంది. టీటీడీకి నెయ్యి సప్లై చేసిన ఏఆర్ డైరీని కూడా సీబీఐ బృందం పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. విచారణను స్వయంగా సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షించనున్నారు..