NLG: 'కష్టజీవుల హక్కుల సాధనకై నిరంతరం పోరాడేది ఎర్రజెండా'
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: నిరంతరం కష్టజీవుల పక్షాన, విద్యార్థులు, యువకులు, మహిళలు, దళితులు, గిరిజనులు, మైనార్టీల హక్కుల సాధనకై నిత్యం పోరాడేది ఎర్రజెండా అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున అన్నారు.
మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన మండల సిపిఐ(ఎం) ఎనిమిదవ మహాసభల్లో వారు పాల్గొని మాట్లాడారు.కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, కార్మిక, ఉద్యోగ ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ కోసం సిపిఐ అండగా నిలుస్తుందని అన్నారు. స్థానిక సంస్థల సంస్థలకు నిధులు కేటాయించి, అభివృద్ధి పనులు చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేది ఎర్రజెండా అని,ప్రజల సంక్షేమం, అభివృద్ధితో పాటు ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం ఉద్యమిస్తూ సిపిఐ ఎం ముందుకు వెళ్తుందని వారు చెప్పారు.
గత టిఆర్ఎస్ ప్రభుత్వం లాగ కాకుండా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు చేసిన వాగ్దానాలను అన్ని అమలు చేయాలని అన్నారు. పంటలకు మద్దతు ధర రాక చేసిన అప్పులు తీరక రైతాంగం ఆత్మహత్యలకు నేటికీ పాల్పడుతున్నారు అని అన్నారు. అర్హులందరికీ రెండు లక్షల రుణమాఫీ అమలు చేయాలని, రైతుకు భరోసా నిధులు విడుదల చేయాలని,రైతు బీమా వర్తింపచేయాలని, కౌలు రైతులకు వ్యవసాయ కార్మికులకు రూ.12,000.. మహిళలకు రూ.25, 000 చెల్లించాలని.. ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ కార్పొరేషన్లకు అధిక నిధులు కేటాయించాలని పేర్కొన్నారు.
ఇప్పటికైనా సర్వే అనంతరం ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందరికి వచ్చేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నాంపల్లి చంద్రమౌళి, మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు బోట్ట శివకుమార్, మండల కమిటీ సభ్యుడు నీలకంఠ రాములు కొట్టం యాదయ్య, చెల్లం ముత్యాలు, గడగూటి వెంకటయ్య, దామేర లక్ష్మమ్మ, రామలింగా చారి,
మల్ రెడ్డి నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Nov 08 2024, 22:42