సమగ్ర కుల గణన వెంటనే చేపట్టాలి, గ్రామాలలో బెల్ట్ షాపులను వెంటనే బంద్ చేయాలి: జన సేవా సమితి
జన సేవా సమితి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం
సమగ్ర కుల గణన వెంటనే చేయాలని జన సేవా సమితి సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం, సూర్యాపేట జిల్లా కేంద్రం 60 ఫీట్ల రోడ్ లో శ్రీనిధి జూనియర్ కళాశాలలో తగుళ్ళ జనార్ధన్ యాదవ్ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ వూర రామూర్తి పాల్గొని మాట్లాడారు. సమగ్ర కుల గణన వెంటనే చేయాలని, బీసీ కమిషన్ వెంటనే విధివిధానాలు మీడియా ద్వారా విడుదల చేయాలని అన్నారు. బహుజనుల సమస్యలు రోజు రోజు అధికమైపోతున్నాయి ఇవి తగ్గాలంటే గ్రామాలలో ఉన్న బెల్ట్ షాపులను వెంటనే బందు చేయించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. EWS ద్వారా Sc, St, Bc, Oc లలో ఉన్న పేదలకు అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయం జరగకుండా ఉండాలంటే EWS ను రద్దు చేయాలని అన్నారు. సమగ్ర కుల గణన జరిగిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. సభాధ్యక్షులు మాట్లాడుతూ సమగ్ర కుల గణన న్యాయబద్ధంగా జరగాలి, త్వరగా జరగాలి అన్నారు. *బహుజనులు చైతన్యవంతులు, రానున్న రోజుల్లో మనమే రాజ్యాలను పరిపాలించేది ఉంటది కనుక రాజ్య విద్యలు నేర్చుకోవాలని బహుజనులకు పిలుపునిచ్చారు. త్వరలో సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి బహుజన మహా సభను లక్ష మందితో ఏర్పాటు చేయబోతున్నామని, ఈ జరగబోయే సభకు బహుజనులు తండోపతండాలుగా కదిలి వచ్చి విజయవంతం చేసి మన చైతన్యాన్ని, మన మేదస్సును ఈ అగ్రవర్ణాలకు తెలియజేయాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.
ఈ యొక్క కార్యక్రమంలో ధరావత్ నాగేందర్ నాయక్ లంబాడ హక్కుల పోరాట సమితి సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఉద్యమకారులు గుండాల సందీప్, విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షులు బొమ్మగాని వినయ్ గౌడ్, యాదవ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు వీరన్న యాదవ్, Rvsp జిల్లా అధ్యక్షులు చామకూరి మహేందర్,Nsui రాష్ట్ర అధికార ప్రతినిధి పచ్చిపాల ఎల్లేష్, Bc విద్యార్థి సంఘం పెన్ పహాడ్ మండల అధ్యక్షులు దుబాని మల్లేష్, నాగరాజ్, సాయి, మహేష్, గోవర్ధన్, రాజు, వీరబాబు, నాగు, రవి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Nov 02 2024, 18:41