/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png StreetBuzz AP : శ్రీశైలంలో ఈ రోజు నుండి కార్తీక మాసోత్సవాలు... Andrapradesh
AP : శ్రీశైలంలో ఈ రోజు నుండి కార్తీక మాసోత్సవాలు...

శ్రీశైల మహాక్షేత్రంలో ఈ రోజు నుండి డిసెంబర్ 1 వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. 

భ్రమరాంబికా మల్లికార్జున స్వామివార్లను దర్శించుకునేందుకు భారీగా భక్తులు రానుండటంతో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. కార్తీక సోమవారాలు, పౌర్ణమి రోజున పుష్కరిణి వద్ద లక్ష దీపార్చన, హారతి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నారు.

 ఉత్సవాల ప్రారంభ సూచికగా ఆలయ ప్రాంగణంలో నేడు అర్చకులు ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు.

AP : ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీని ప్రారంభించిన సీఎం

ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ అయిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని సీఎం చంద్రబాబు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.

 ఇది ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకమే అయినా ముందుగా డబ్బు చెల్లిస్తేనే సిలిండర్ బుక్ అవుతుంది. అయితే డబ్బులు ముందుగా కట్టకుండానే సిలిండర్ ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. అదే జరిగితే లబ్దిదారులకు భారీ ఊరట కాబోతోంది.

AP : వచ్చే నెల 1వ తేదీ నుండి కరెంట్‌ చార్జీల పెంపు !

ఏపీలో నవంబర్‌ 1వ తేదీ నుంచే కరెంట్‌ చార్జీల పెంచేందుకు రెడీ అయ్యారని చంద్రబాబు సర్కార్‌ పై ఫైర్‌ అయ్యారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.

ఎన్నికలకు ముందు 5 సంవత్సరాల వరకు విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పిన కూటమి ప్రభుత్వం ఓట్లు కోసం ప్రజల వద్దకు వెళ్లిందని తెలిపారు. నవంబర్ 1వ తేదీ నుండి విద్యుత్ చార్జీలు పెంచనున్నారన్నారు. ఎన్నికల ముందు ఒక మాట, ఇప్పుడు ఇంకో మాట, ఇది చంద్రబాబు నైజం అని తెలిపారు.

ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్ చార్జీలు పెంచితే వైసిపి తీవ్ర స్థాయిలో ఉద్యమం చేయాలని సంకల్పిస్తిందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయవలసిన పరిస్థితి ఆసన్నమైంది. లేదంటే ప్రజల జీవితాలు గాడాంధకారంలోకి వెళ్ళే పరిస్థితి ఉందన్నారు. ప్రజలు 164 సీట్లు ఇచ్చి బాబు కు షాక్ ఇస్తే, బాబు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలకు షాక్ ఇచ్చారని తెలిపారు.

మధ్య తరగతి ప్రజలపై అధిక భారం మోపనున్నారని తెలిపారు. దీపావళి నుండి గ్యాస్ ధరలు తగ్గింపు అని సంవత్సరానికి 4250 కోట్లు ఖర్చు అయితే, అదే డబ్బు విద్యుత్ చార్జీల రూపంలో దండుకుంటున్నారని నిప్పులు చెరిగారు.

కార్తీక మాసములో చేయకూడని పనులు

ఈ మాసమందు పరాన్నభక్షణ చేయరాదు. ఇతరుల యెంగిలి ముట్టకూడదు, తినకూడదు. శ్రాద్ధభోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినరాదు. తిలాదానము పట్టరాదు. శివార్చన, సంధ్యావందనము చేయనివారు వండిన వంటలు తినరాదు.

పౌర్ణమి, అమావాస్య, సోమవారములనాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందు భోజనం చేయరాదు. కార్తీకమాసమున నెలరోజులూ కూడా రాత్రులు భుజించరాదు, విధవ వండినది తినరాదు. ఏకాదశీ, ద్వాదశీ వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరము ఉండవలెను.

ఒక్కపూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీకమాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విమర్శించరాదు. కార్తీకమాసమున వేడినీటితో స్నానము కూడదు, చేసిన కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను.

కావున, వేడినీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యము వుండి యెలాగైనా విడువకుండా కార్తీకమాసవ్రతం చేయవలెనన్న కుతూహలం గలవాడు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును. అటుల చేయువారలు గంగ, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను.

ఏ నది తనకు దగ్గరలో వుంటే ఆ నదిలో ప్రాతఃకాలమున స్నానము చేయవలయును. అటుల చేయనియెడల మహాపాపియై జన్మజన్మములు నరకకూపమున బడి కృశింతురు.

ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరగాని, చెరువునందుగాని స్నానము చేయవచ్చును. అప్పుడు యీ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను.

గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ |

నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు ||

అని పఠించుచు స్నానము చేయవలయును. కార్తీకమాస వ్రతము చేయువారు పగలు పురాణపఠన శ్రవణం, హరికథా కాలక్షేపములతో కాలము గడుపవలెను.

ఈ రోజు నుండి విశాఖ - విజయవాడ మధ్య విమాన సర్వీసులు...

ఈ రోజు నుంచి విజయవాడ - విశాఖ మధ్య మరో ఇండిగో విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ఈ రోజు సా.7.15 గంటలకు బయల్దేరి రాత్రి 8.20 గంటలకు విశాఖ చేరుకోనుంది ఫ్లైట్.. తిరిగి 8.45 గంటలకు బయల్దేరి రాత్రి 9.50 గంటలకు విజయవాడకు రానుంది విమానం. 

ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారు అయింది. ఇది ఇలా ఉండగా.. .విశాఖ భోగాపురంలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్ సర్వీసెస్ యూనివర్శిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.

చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంక్ స్కామ్ కేసులో ఊహించని పరిణామం!

ఏపీలోని గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంక్ స్కాం కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న బ్యాంక్ మేనేజర్ నరేష్ చంద్రశేఖర్ కనిపించడం లేదంటూ అతని భార్య పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు ఫైల్ చేసింది. రెండు రోజులుగా తన భర్త ఇంటికి రాలేదని, ఫోన్ చేస్తే కలుస్తలేదని నరేష్ భార్య సరోజిని పడమట పీఎస్‌లో ఫిర్యాదు చేసింది.

సెప్టెంబర్ 26న నరేష్ హైదరాబాద్ వెళ్లాడని, 28న తనకు కాల్ చేసి తనకు రావల్సిన డబ్బులు ఇవ్వడం లేదని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడని తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. బ్యాంక్ స్కాం కేసులో అటు బెజవాడ పోలీసులు గాలిస్తుండగా.. హైదరాబాద్‌లో సీఐడీ పోలీసులు వెతుకుతున్నారు.

ఇదిలాఉండగా, కస్టమర్లకు చెందిన రూ.28కోట్ల డిపాజిట్లను 72 ఖాతాల ద్వారా ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ నరేష్ బృందం దారి మళ్లించాయి. ఆ డబ్బులను నెక్సస్ గ్రోత్ అనే సంస్థలో పెట్టుబడులు పెట్టినట్లు సీఐడీ పోలీసులు గుర్తించారు.ప్రస్తుతం ఆ సంస్థ ఓనర్ ప్రభు కిషోర్ పరారీలో ఉండగా.. నరేష్ సైతం కనిపించకుండా పోయాడు.

4 నెలల తర్వాత పాపికొండలు విహారయాత్రలు పునః ప్రారంభం

విహార యాత్రలు వెళ్లే వారికి శుభవార్త అందింది. తూర్పు గోదావరి జిల్లాలో పాపికొండలు విహారయాత్రలు ఈ రోజు నుండి ప్రారంభం కానున్నాయి.

 నాలుగు నెలల విరామం తర్వాత పాపికొండలు విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టూరిజం శాఖ.

దీంతో తూర్పు గోదావరి జిల్లాలో పాపికొండలు విహారయాత్రలకు బయలుదేరి వెళుతున్నారు పర్యాటకులు. ఈ తరునంలోనే.. దేవీపట్నం మండలం పోసమ్మ గండి నుండి బయలుదేరనున్నారు బోట్లు. దీంతో దేవీపట్నం మండలం పోసమ్మ గండి పర్యాటకులతో సందడిగా మారింది. 

వర్షా కాలం తగ్గడం.. చలి కాలంలో ప్రారంభం కానున్న తరునంలోనే.. తూర్పు గోదావరి జిల్లాలో పాపికొండలు విహారయాత్రలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి.

వాడిని మీరు చంపుతారా.. మమ్మల్ని చంపమంటారా: తల్లి ఆవేదన

AP. ప్రేమోన్మాది దాడిలో కడప జిల్లాలోని బద్వేల్లో ఇంటర్ విద్యార్థిని మృతిచెందిన విషయం తెలిసిందే. కడప రిమ్స్ పోస్ట్ మార్టం రూం వద్ద బద్వేల్ విద్యార్థిని తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. నిందితుడ్ని మీరు చంపుతారా..? నన్ను చంపమంటారా.. నడిరోడ్డుపై ఉరి తీస్తారా అంటూ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్నె ల్లూరు జిల్లాలో క్రైస్తవులుగా మారిన కుటుంబం యొక్క ఎస్సీ సర్టిఫికేట్‌ను ప్రభుత్వం రద్దు చేసింది

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) మాల సామాజికవర్గానికి చెందిన ఎస్పీఎస్ గణనీయమైన విజయం సాధించింది. రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం క్రైస్తవ మతంలోకి మారినందుకు టి.లక్ష్మణరావు మరియు అతని కుటుంబం యొక్క ఎస్సీ సర్టిఫికేట్లను రద్దు చేసింది. మత మార్పిడి తర్వాత కూడా ఎస్సీ ప్రత్యేకాధికారాలను పొందడంపై ప్రశ్నలను లేవనెత్తిన గ్రామస్థుల సుదీర్ఘ ఫిర్యాదు ప్రక్రియ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ముఖ్యంగా లక్ష్మణరావు కుటుంబం తమ ఇంటిని అక్రమ చర్చిగా మార్చడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మతపరమైన కార్యకలాపాలు సామాజిక అశాంతికి దారితీస్తున్నాయని, మత మార్పిడికి ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామస్తులు నొక్కి చెప్పారు. చట్టవిరుద్ధమైన చర్చి మరియు మత మార్పిడి కార్యకలాపాలపై దృష్టి సారించి 2021లో దత్తం శ్రీనివాసులు మరియు మోచెర్ల మహేష్‌లు ప్రాథమిక ఫిర్యాదులను దాఖలు చేశారు. అయితే తహసీల్దార్‌కు, జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినా గ్రామస్తుల విన్నపాలను తొలుత పట్టించుకోలేదు. అయితే ఆయన పట్టుదలతో కృషి చేయడంతో ఎట్టకేలకు జిల్లా కలెక్టర్‌ దీనిపై విచారణకు ఆదేశించారు. తహసీల్దార్ చేసిన విచారణ గ్రామస్తుల ఆరోపణలను ధృవీకరించింది మరియు డిసెంబర్ 2023 లో జిల్లా స్థాయి విచారణ కమిటీ లక్ష్మణ్ రావు మరియు అతని కుటుంబ సభ్యుల ఎస్సీ సర్టిఫికేట్‌లను రద్దు చేయాలని సిఫార్సు చేసింది. ఈ ప్రయోజనాలు వాస్తవానికి ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తులకు మాత్రమేనని, మతమార్పిడి తర్వాత వారి అర్హతలు నిలిచిపోతాయని కమిటీ నివేదిక స్పష్టం చేసింది.

ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వం సరైన చర్య తీసుకుందని స్పష్టమవుతోంది. మతం మారిన తర్వాత కూడా ఎస్సీ సర్టిఫికేట్‌ను నిలుపుకునే ప్రయత్నం ఈ కమ్యూనిటీకి చెందిన నిజమైన వ్యక్తుల హక్కులను బలహీనపరుస్తుంది. ఈ సందర్భంలో, గ్రామస్తులు మరియు చట్టపరమైన న్యాయవాద సమూహాల సమిష్టి చర్య ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది, ఇది సామాజిక న్యాయాన్ని కొనసాగించడానికి పోరాటంలో సహాయపడింది.

తప్పుగా సర్టిఫికెట్లు జారీ చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సీ, ఎస్టీ హక్కుల వేదిక అధ్యక్షుడు ఎంకే నాగరాజు హెచ్చరించారు. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన సర్క్యులర్‌ను ఆయన ఉదహరించారు, ఇది అనర్హులకు ఎస్సీ సర్టిఫికేట్లు జారీ చేసే అధికారులకు శిక్ష మరియు జైలు శిక్షను అందిస్తుంది.

మత మార్పిడి జరిగినప్పటికీ కుల ఆధారిత ప్రయోజనాలను తీసుకునే ధోరణిని ఎదుర్కోవడానికి కఠినమైన విచారణ మరియు చర్య అవసరమని కూడా ఈ నిర్ణయం హైలైట్ చేస్తుంది. మార్పిడి రాకెట్ మరియు అక్రమ సంపాదన సంఘటనలు ఇలాంటి కేసులలో మరింత అప్రమత్తంగా మరియు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాయి. నిజమైన లబ్ధిదారులకు వారి హక్కులు అందేలా చూస్తామని, అన్యాయంగా సద్వినియోగం చేసుకునే వారిని నియంత్రించవచ్చని ప్రభుత్వం సరైన చర్య తీసుకుందని ఈ నిర్ణయం స్పష్టం చేస్తోంది.

219 దేవాలయాలను అపవిత్రం చేశారు, విగ్రహాలు ధ్వంసం చేశారు: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన “ప్రాయశ్చ దీక్ష”కు సంబంధించి ప్రకటన విడుదల చేశారు. గత 5-10 సంవత్సరాలుగా నిత్యం ఏదో ఒక అపవిత్రం జరుగుతోందని, దాదాపు 219 ఆలయాలను అపవిత్రం చేశారని, రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని అపవిత్రం చేశారన్నారు 'ప్రాయశ్చిత్ దీక్ష'ని ముందుకు తీసుకెళ్లడం చాలా ముఖ్యం, అలాంటి సంఘటనలను వివిధ స్థాయిలలో పరిష్కరించాలి, నేను దానిని పూర్తి చేసిన తర్వాత, మేము రేపు ప్రకటన చేస్తాము.

తిరుపతి దేవస్థానంలోని లడ్డూలలో (ప్రసాదం) కల్తీ నెయ్యి వినియోగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో 11 రోజుల పాటు భగవంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు చేపట్టిన తపస్సులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ తిరుపతి దేవస్థానంలో శుద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. ఇక్కడ కనక దుర్గ గుడి. ఈ సమయంలో ఆయన వెంట పార్టీ నేతలు కూడా ఉన్నారు. గుడి మెట్లను బ్రష్ తో స్క్రబ్ చేసి శుభ్రం చేసి కడిగాడు. కళ్యాణ్ ఆలయంలో విలేకరులతో మాట్లాడుతూ, “నేను సనాతన ధర్మాన్ని (హిందుత్వ) గట్టిగా అనుసరిస్తాను. మేము రామభక్తులం, మా ఇళ్లలో రామనామాన్ని జపిస్తాము.'' భారతదేశంలో ముస్లిం, క్రిస్టియన్ మరియు పార్సీ వంటి అన్ని మతాలను సమానంగా గౌరవిస్తున్నారని ఆయన అన్నారు. జనసేన అధినేత మాత్రం లౌకికవాదం అనేది వన్‌వే కాదనీ, అన్ని మతాలను గౌరవించాల్సిన రెండు మార్గాలేనని అన్నారు.

లడ్డూ వివాదానికి సంబంధించి నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్‌కు ప్రతిస్పందనగా కళ్యాణ్ తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడు మరియు ఈ విషయంతో నటుడికి ఏమి సంబంధం అని అడిగాడు. ప్రకాష్ రాజ్ నాకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు. నేను హిందువుల పట్ల జరిగిన అవమానాల గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ పాత్ర ఏమిటి? నేను ఏదైనా మతాన్ని అవమానించానా?, ఇస్లాంను అవమానించానా?, క్రైస్తవాన్ని అవమానించానా? తప్పు జరిగితే, తప్పులుంటే నేను మాట్లాడకూడదా?'