/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: అనారోగ్య బాధితుడికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన నాయకులు Mane Praveen
NLG: అనారోగ్య బాధితుడికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన నాయకులు
నల్గొండ జిల్లా, గట్టుప్పల్ మండలం, నామపురం గ్రామానికి చెందిన జంపాల ధనలక్ష్మి సతీష్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

అతని ఆర్థిక పరిస్థితి బాగా లేనందున సిఎం రేవంత్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 20 వేల రూపాయల ఆర్థిక సహాయం మంజూరు అయింది.

ఈ మేరకు కంచుకట్ల సంపత్ మునుగోడు నియోజకవర్గం  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నామపురం మాజీ సర్పంచ్ చేతుల మీదుగా ఈరోజు బాధితుడికి చెక్కును అందజేశారు.

ఈ కార్యక్రమంలో సురిగి యాదయ్య మాజీ ఉపసర్పంచ్, భీమనపల్లి రాములు మాజీ ఉపసర్పంచ్ మరియు జంపాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. జంపాల ధనలక్ష్మి సతీషు గణేష్ కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి, మరియు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
నల్గొండ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏర్పాటు.. అధ్యక్షులుగా ఎర్రెడ్ల చంద్రశేఖర్ రెడ్డి

నల్గొండ లోని స్థానిక APUS భవన్ లో ప్రెస్ క్లబ్ నల్లగొండ తొలి సర్వసభ్య సమావేశం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సభ్యుల అందరి సమక్షంలో ఏకగ్రీవంగా నూతన కమిటీ ఎన్నుకొన్నారు. వివరాలు ఇలా..

గౌరవ అధ్యక్షుడు : గార్లపాటి కృష్ణారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్

గౌరవ సలహాదారులు :

పి. ప్రభాకర్ రెడ్డి, TUWJ(IJU)

పుప్పాల మట్టయ్య, TWJF

వెకెన్సీ TUWJ(143)

చింతకింది గణేష్ (సాక్షి)

డి. సత్యనారాయణ (సూర్య)

రాతికింది అంజయ్య(మన తెలంగాణ)

పసుపులేటి కిరణ్ (ఆంద్రప్రభ)

ఎం. యాదగిరి (సూర్య)

వెంకటేశ్వర్లు (న్యాయం కావాలి)

విజయ్ (సత్య)

సాదత్ అలీ (నవతెలంగాణ)

మామిడి దుర్గాప్రసాద్ (సిటీ కేబుల్)

సోమ చంద్రశేఖర్ (మన సాక్షి)

జుబేర్ అహ్మద్ (సాహఫియే ఈ డెక్కన్)

శేశరాజుపల్లి వీరస్వామి(వార్త)

కార్యవర్గం :

1.అద్యక్షులు : ఎర్రెడ్ల చంద్రశేఖర్ రెడ్డి (10 టీవీ)

2.జనరల్ సెక్రటరీ : వంగాల శ్రీనివాస్ రెడ్డి (సాక్షి)

3. కోశాధికారి : గుండాల యాదగిరి (నమస్తే తెలంగాణ)

4. ఉపాధ్యక్షులు : కట్టా సుధాకర్ (ఈనాడు)

5. ఉపాధ్యక్షులు (ఎలక్ట్రానిక్ మీడియా ) : విజయ భాస్కర్ (N టీవీ)

6. ఉపాధ్యక్షులు : జెల్లా యాదయ్య (ప్రజాపక్షం)

7. ఉపాధ్యక్షులు (ఉర్డూ మీడియా) : అశ్వక్ అహ్మద్ (ది ఇత్తేమాద్)

8. ఉపాధ్యక్షులు (చిన్న పత్రికలు) : ఏ. మధనాచారి (జనవార్త)

9. ఉపాధక్షులు : సయ్యద్ జాకిర్ అలీ (నమస్తే తెలంగాణ)

10. సంయుక్త కార్యదర్శి (వీడియో జర్నలిస్ట్) : నత్తి ఉపేందర్ కుమార్(టీవీ 5)

11. సంయుక్త కార్యదర్శి (ఫోటో గ్రాఫర్) : బజరంగ్ ప్రసాద్ (సాక్షి)

12. సంయుక్త కార్యదర్శి : మీసాల శ్రీనివాస్ (సాక్షి)

13. సంయుక్త కార్యదర్శి (డెస్క్ జర్నలిస్ట్) : కోమటిరెడ్డి రవీందర్ (నవతెలంగాణ)

14. సంయుక్త కార్యదర్శి : మహ్మద్ సయ్యద్ (మనం)

15. సంయుక్త కార్యదర్శి : పి రామకృష్ణ (అక్షరకలం)

16. కార్యదర్శి (మహిళ) : మంజుల (డీడీ న్యూస్)

17. కార్యదర్శి (కల్చరల్) : జూలకంటి అశోక్ రెడ్డి (టీవీ 5)

18. కార్యదర్శి (స్పోర్ట్స్) : లింగయ్య (ఆంద్రప్రభ)

19. కార్యదర్శి (పబ్లిసిటీ) : వరకాంతం కిరణ్ రెడ్డి (ఐ న్యూస్)

ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ :

20. జాజుల కృష్ణ (వార్త)

21. ఎల్. సత్యనారాయణ (వెలుగు)

22. కె. కనకయ్య (మన తెలంగాణ)

23. ఎన్. మల్లేష్ (తెలంగాణ సంకల్పం)

24. డి. ప్రేమ్ కుమార్ (ప్రజాపక్షం)

25. పి రమేష్(నమస్తే తెలంగాణ)

26. ఎం. హరిప్రసాద్ (రాజ్ న్యూస్)

27. పి. అశోక్ కుమార్ (అక్షర అన్వేషణ)

NLG: పూర్వ విద్యార్థినికి ఆర్థిక సహాయం అందించిన తోటి పూర్వ విద్యార్థులు
నల్లగొండ జిల్లా:
చిట్యాల మండలం, పేరేపల్లి గ్రామానికి చెందిన స్నేహితురాలి కుటుంబానికి పూర్వ విద్యార్థులు అండగా నిలిచారు. వెలిమినేడు జడ్పీహెచ్ఎస్ 2011-12 10వ తరగతి బ్యాచ్ తమతో చదువుకున్న బండ్ల రాధ తండ్రి బండ్ల మల్లేష్ ఇటీవల మృతి చెందారు.

తండ్రిని కోల్పోయిన పేద కుటుంబానికి అండగా నిలవాలని, పూర్వ విద్యార్థులందరూ కలిసి పోగుచేసిన రూ. 31వేలు అందజేశారు. అరూరి శ్రీశైలం ప్రజాపతి, షేక్ జహంగీర్, శ్రీశైలం, శివ, మహేష్, పి.శంకర్ ఉన్నారు.
NLG: నిండుకుండ తలపిస్తున్న పెద్ద కాపర్తి చెరువు
నల్లగొండ జిల్లా:
చిట్యాల మండలం, పెద్ద కాపర్తి చెరువు నిండు కుండను తలపిస్తోంది. చెరువు నిండి అలుగు పోస్తోంది. ఎగువ కురిసిన వర్షాలకు పిల్లాయిపల్లి కాలువ ద్వారా పెద్దకాపర్తి చెరువులోకి నీరు వచ్చి చేరుతోంది. చెరువు నుండి అలుగు పోసిన నీరు ఆరెగూడెం నుండి చిన్నకాపర్తి చెరువు లోకి చేరుతోంది.

పెద్ద కాపర్తి చెరువు హైదరాబాద్- విజయవాడ హైవే పై ఉండడంతో ప్రయాణికులు ఆగి చూస్తున్నారు. చెరువు నిండడం తో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
NLG: గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారులను అభినందించిన కలెక్టర్ త్రిపాఠి

నల్గొండ: జిల్లాకు చెందిన అండర్ 17,19 విభాగం షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు గోల్డ్ మెడల్ సాధించి, మధ్యప్రదేశ్ లో జరుగు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక అయ్యారని, ఎస్ జి ఎఫ్ సెక్రటరీ దగ్గుపాటి విమల తెలిపారు.

సరూర్ నగర్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో ఈ విజయం సాధించారని చెప్పారు.

ఈ మేరకు గోల్డ్ మెడల్ సాధించిన అన్విత్ నిహాల్ రెడ్డి,శశాంక్,అఖిలేష్ గౌడ్,లాస్య లను జిల్లా కలెక్టర్ త్రిపాఠి అభినందించారు.

విద్యార్థి దశ నుండే చదువు మరియు ఆటలలో విద్యార్థులు రాణించాలని తద్వారా మంచి భవిష్యత్తు పొందవచ్చునని క్రీడాకారులకు వారు సూచించారు.
తిరుమల: దీపావళి రోజున పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.
నిన్న దీపావళి రోజున  స్వామివారిని     63,987 మంది భక్తులు దర్శించుకున్నారు. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట టిబిసి వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత  సర్వదర్శనానికి  సుమారు 18 గంటల సమయం పట్టింది.

టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 12 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 5 గంటల సమయం పట్టింది. రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పట్టింది.

నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 20,902.
నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ. 2.66 కోట్లు.



  
NLG: ఘనంగా ఏఐటీయూసీ 105 వ ఆవిర్భావ దినోత్సవం
నల్లగొండ జిల్లా:
దేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ అని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఏఐటీయూసీ 105 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా.. నల్లగొండ పట్టణంలో ఏఐటీయూసీ  జెండాను పల్లా దేవేందర్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్ర ఉద్యమం లో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించినదని తెలిపారు. ఏఐటీయూసీ 1920 అక్టోబర్ 31 న ఏర్పాటు జరిగిన తర్వాత కార్మికుల కు అనేక సంక్షేమ చట్టాలు,హక్కులు, సాధించిన  ఘనత ఏఐటీయూసీ దే అని అన్నారు.

అటు స్వాతంత్ర పోరాటం మరోవైపు కార్మిక చట్టాల సాధన కోసం పోరాటం దేశంలో మొదటిసారిగా ఏఐటియుసి నాయకత్వంలోనే జరిగాయని అన్నారు. బ్రిటీష్ వాళ్ళు దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలోనే కనీస వేతనాల చట్టం ను సంఘం పెట్టుకొని హక్కును సాధించిన ఘనత ఏఐటియూసి దే అని అన్నారు.

మోడీ ప్రభుత్వం కార్మికులు పొరాడి సాధించిన 29 చట్టాల ని 4 కోడ్ లుగా మార్చి హక్కులు లేకుండా చేసి యాజమాన్యంలకు తొత్తు లుగా చట్టాలు మార్పులు చేశారని ఆరోపించారు. నేడు కేంద్ర ప్రభుత్వం సంగం పెట్టుకునే హక్కు లేకుండా వేతనాల కోసం సమ్మె చేసే హక్కు లేకుండా చట్టాలు మార్చడం విచారకరమని అన్నారు.

దేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ అని నాటి నుండి నేటి వరకు కార్మికుల హక్కుల కోసం నిరంతరం రాజీలేని సమరశీల పోరాటాలు నడుపుతుందని అన్నారు. కాంటాక్ట్ వ్యవస్థ రద్దు కోసం కనీస వేతనాలు అమలు కోసం, ఉద్యోగ భద్రత కోసం రాబోయే కాలంలో  పోరాటాలకు సిద్ధం కావాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో  ఏఐటీయూసి  జిల్లా ఉపాధ్యక్షులు కేఎస్ రెడ్డి, డివిజన్ కార్యదర్శి విశ్వనాధుల లెనిన్, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి వెంకటయ్య,  భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ అధ్యక్షులు గుండె రవి, కార్యదర్శి రేవల్లి యాదయ్య, జి.నరేందర్, యాదయ్య, పుల్లారావు, దుబ్బాక యాదయ్య, కంభంపాటి జానయ్య,ఎండి యూసుఫ్ ఎస్కే మదార్, అంజయ్య, లక్ష్మయ్య, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
NLG: గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల ఆధ్వర్యంలో ఎస్జిఎఫ్ జిల్లా కార్యదర్శికి సన్మానం
నల్లగొండ: గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీజ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల ఆధ్వర్యంలో పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి దగ్గుపాటి విమల ను శాలువాతో ఘనంగా సన్మానించారు. గాంధీ సంస్థల రాష్ట్ర క్రీడల కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి.. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల  వైస్ చైర్మన్ డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థలు కొన్ని సంవత్సరాలుగా క్రీడలను, క్రీడాకారులను, కోచ్, లను ప్రోత్సహిస్తూ ఎన్నో క్రీడా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. 2023 సంవత్సరంలో SGF మండల, డివిజన్ స్థాయిలో నిర్వహించిన క్రీడల్లో దాదాపు 5000 మంది క్రీడాకారులకు భోజన వసతి కల్పించామని గుర్తు చేశారు. ప్రస్తుత ఎస్జిఎఫ్ సెక్రెటరీ దగ్గుపాటి విమల ఎంతో నిబద్ధత కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గాంధీ సంస్థల రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పాముల అశోక్, సంస్థల బాధ్యులు అజీజ్ షరీఫ్, గొర్రె వెంకట్ రెడ్డి, యానాల రాధిక, ఫిజికల్ డైరెక్టర్లు ఇమాం కరీం, నుస్రత్, లెనిన్, విజయ్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
NLG: ఛలో నల్లగొండ... కర పత్రాలు ఆవిష్కరణ
నల్లగొండ జిల్లా:
మునుగోడు: షెడ్యూల్ కులాల వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో 'మాల ఉద్యోగుల స్వాభిమానసభ' కర పత్రాలను  గురువారం మండల కేంద్రం లోని అంబేద్కర్ చౌరస్తాలో, కమిటి మండల అధ్యక్షుడు చలిచీమల యాదగిరి ఆధ్వర్యంలో మాలమహానాడు నాయకులు ఆవిష్కరణ చేశారు.

నవంబర్ 3 ఆదివారం రోజున, నల్లగొండ చర్లపల్లి బైపాస్లో గల ఎన్ఆర్ఎస్ గార్డెన్ లో జరిగే మాల ఉద్యోగుల స్వాభిమానసభ కు మాలలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో కమిటి నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లపు బాలశివ రాజు, మండల ప్రధాన కార్యదర్శి భేరి రవీందర్, సీనియర్ నాయకులు రెడ్డిమల్ల యాదగిరి, గుంటుక కృష్ణయ్య, మండల నాయకులు బొల్లు సైదులు, బొల్లు శ్రీను, అన్నిమళ్ళ నాగరాజు, ముచ్ఛపోతుల శ్రీకాంత్, శిర్గమల్ల రమేష్, దాసరి సాయి కుమార్, బొల్లు పెద్ద శ్రీను, బొల్లు రామలింగయ్య, ఓడిగా కృష్ణయ్య, అద్దంకి అంజయ్య, బొల్లు లింగయ్య, గోలి వెంకన్న, భేరి అంజయ్య, మండల నాయకులు పాల్గొన్నారు.



NLG: అగ్రికల్చర్ సైంటిస్ట్ కృష్ణంరాజు ను కలిసిన చత్రపతి శివాజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు
అగ్రికల్చర్ సైంటిస్ట్, ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత, జీకే సీడ్స్ జీకే బయో సైన్సెస్ ప్రై. లిమిటెడ్ చైర్మన్ జి.కృష్ణంరాజు ను చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ ద్వారా క్రీడల అభివృద్ధికై కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ద్వారా సహకరించాలని కోరారు.