NLG: వ్యాపారాలు నిర్వహించి లాభాలు పొంది తోటి వారికి ఉపాధి కల్పించాలి: మెప్మా స్టేట్ కోఆర్డినేటర్
నల్లగొండ: పట్టణంలో 'ఇందిరా మహిళా శక్తి' కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన యూనిట్లను, మహిళా పొదుపు సంఘము వారు చేపట్టిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను.. మంగళవారం మెప్మా స్టేట్ మిషన్ కో -ఆర్డినేటర్ ప్రసన్న కుమార్, మున్సిపల్ కమిషనర్ మూసాబ్ అహమద్ సందర్శించారు.
ఈ మేరకు హోమ్ ఫూడ్స్, పచ్చళ్ల తయారీ మరియు కంప్యూటరు ఎంబ్రాయిడరీ యూనిట్లను వారు పరిశీలించారు.
ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం 'మహిళలకు స్వయం ఉపాధి తో లాభాలు పొందుటకు గాను రుణాలు మంజూరు చేస్తున్నది' అని అట్టి మహిళా పొదుపు సంఘాలు తీసుకున్న రుణాలను వృధా చేయకుండా వ్యాపారాలు నిర్వహించి లాభాలు పొంది తోటి వారికి ఉపాధి కల్పించాలని అన్నారు.
నల్లగొండలో ఏర్పాటు చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కి సంబంధించి వారు తయారు చేస్తున్న అరిసెలు, లడ్డులు, బూంది, సద్ద బూరెలు, గరజలు, కరపప్పలు, చేగోడీలు, సకినాలు, మురుకులు, పచ్చళ్ల తయారీ లో మామిడి, నిమ్మకాయ, టమాట, ఉసిరి, చికెన్, మటన్ మరియు చేపల పచ్చలు చేసే విధానంను వ్యాపార లావాదేవీల గూర్చి సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తయారు చేయు విధానాన్ని పరిశీలించి వ్యాపారం చాలా బాగుందని ప్రశంసించారు. అదేవిధంగా కంప్యూటరు ఎంబ్రాయిడరీ గురించి అడిగి తెలుసుకున్నారు.
పిండి వంటలు కేజీ రూ. 200 ల నుండి రూ. 300 వరకు పచ్చలు రూ.400 నుండి రూ. 1000 వరకు అమ్మడం జరుగుతున్నదని మహిళలు వారికి తెలిపారు.
కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ మిషన్ కొ- ఆర్డినేటర్ శివాజీ, మెప్మా సిబ్బంది శ్రీనివాస్, నరసింహ, జ్యోతి, అనిల్, రాజు, ఆర్పీ లు మరియు సంఘ సభ్యులు, యూనిట్ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.
Oct 31 2024, 20:25