రైతు తెలివి మామూలుగా లేదుగా..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది రైతులు తమ పంట పొలాలను జంతువుల బారి నుంచి రక్షించుకునేందుకు లక్షలు ఖర్చు చేస్తుంటారు. అయితే కొందరు రైతులు మాత్రం రూపాయి ఖర్చు చేయకుండా అందుబాటులో ఉన్న వస్తువులతోనే వినూత్న ప్రయోగాలు చేస్తుంటారు.
అడవి జంతువుల కారణంగా పంట సాగు చేసే రైతులు కొన్నిసార్లు తీవ్రంగా నష్టపోతుంటారు. తీరా పంట చేతికొచ్చే సమయంలో ఏ మూల నుంచి ఏ పందులో, ఏనుగులో వచ్చి నాశనం చేస్తుంటాయి. దీంతో వారు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. దీంతో చాలా మంది అడవి జంతువులు తమ పొలాల్లోకి రాకుండా ఉండేందుకు ఏవేవో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటుంటారు. ఈ క్రమంలో అయితే కొందరు రైతులు తెలివితేటలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ రైతు తన పంట పొలాన్ని జంతువుల బారి నుంచి రక్షించుకునేందుకు చేసిన ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చాలా మంది రైతులు (Farmers) తమ పంట పొలాలను జంతువుల బారి నుంచి రక్షించుకునేందుకు లక్షలు ఖర్చు చేస్తుంటారు. అయితే కొందరు రైతులు మాత్రం రూపాయి ఖర్చు చేయకుండా అందుబాటులో ఉన్న వస్తువులతోనే వినూత్న ప్రయోగాలు చేస్తుంటారు. తద్వారా తమ పంటకు రక్షణ కల్పిస్తుంటారు.
తాజాగా, ఓ రైతు చేసిన ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు. అతను తన పంట పొలంలోకి జంతువులు రాకుండా ఉండేందుకు పెద్ద పెద్ద శబ్ధాలు వచ్చేలా చేశాడు. ఇందుకోసం మనుషుల అవసరం లేకుండా.. తన తెలివిని ఉపయోగించి అద్భుతమైన ఏర్పాట్లు చేశాడు. ముందుగా రెండు వైపులా పొడవాటి కర్రలను పాతాడు. దానికి మధ్యలో ఇనుప రేకును ఉంచాడు. అలాగే దానికి పైన ఓ కర్రను కట్టి, అది పైకి కిందకు కదిలేలా చివర్లో ఓ ప్లాస్టిక్ డబ్బాను కట్టి ఉంచాడు. అందులో నీళ్లు పడగానే కర్ర పైకి, కిందకు కదులుతూ రేకును తాకుతుంది.
దీనివల్ల పెద్ద పెద్ద శబ్ధాలు వస్తున్నాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న అడవి జంతువులు భయంతో పారిపోతున్నాయి. ఇలా రూపాయి ఖర్చు చేయకుండా తన తెలివితేటలతో ఈ రైతు చేసిన ఏర్పాట్లు చూసి అంతా షాక్ అవుతున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘‘ఈ రైతు ఆలోచన మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఐడియా బాగానే ఉంది కానీ.. ఇలా చేయడం వల్ల నీళ్లన్నీ వృథా అయిపోతాయిగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 70 వేలకు పైగా లైక్‌లు, 7.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Oct 24 2024, 11:06