/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz రేపు దేశవ్యాప్తంగా వైద్యుల నిరాహార దీక్ష Raghu ram reddy
రేపు దేశవ్యాప్తంగా వైద్యుల నిరాహార దీక్ష

కోల్‌కతాలో అత్యాచారానికి, హత్యకు గురయిన ట్రైనీ డాక్టరుకు న్యాయం చేయాలని డిమాండు చేస్తూ మంగళవారం దేశ వ్యాప్తంగా వైద్యులు నిరాహార దీక్ష చేయనున్నారు.

కోల్‌కతాలో అత్యాచారానికి, హత్యకు గురయిన ట్రైనీ డాక్టరుకు న్యాయం చేయాలని డిమాండు చేస్తూ మంగళవారం దేశ వ్యాప్తంగా వైద్యులు నిరాహార దీక్ష చేయనున్నారు.

ఈ విషయాన్ని ఆదివారం ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) ప్రకటించింది. ఇదే విషయమై కోల్‌కతాలోని ఆర్‌.జి.కర్‌ వైద్యకళాశాల వద్ద జూనియర్‌ డాక్టర్లు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష తొమ్మిదో రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఐఎంఏ ఈ ప్రకటన చేసింది.

ఇదిలా ఉండగా, ఆందోళనకారుల డిమాండ్లు సోమవారంలోగా పరిష్కరించకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని బెంగాల్‌లోని కల్యాణి జేఎన్‌ఎం ఆస్పత్రికి చెందిన 77 మంది సీనియర్‌ వైద్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ట్విస్ట్ ఇచ్చిన ఆమ్రపాలి సహా ఆ ఇద్దరు.. క్యాట్‌లో పిటిషన్.. సీఎం రేవంత్ రంగంలోకి దిగుతారా..?

తెలంగాణలో కొనసాగుతోన్న ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు సొంత రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని కేంద్రం.. ఉత్తర్వులు జారీ చేయగా.. కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీలో రిపోర్ట్ చేసేందుకు మరో రెండు రోజులే ఉండగా.. తాము మాత్రం తెలంగాణలోనే ఉంటామంటూ క్యాట్‌ను ఆశ్రయించారు. తమకు ఇచ్చిన ఆదేశాలు రద్దు చేయాలంటూ క్యాట్‌లో పిటిషన్లు దాఖలు చేశారు. ఆమ్రపాలి సహా ఇద్దరు ఐఏఎస్‌లు పిటిషన్లు దాఖలు చేయగా.. రేపు విచారణ జరగనుంది.

తెలంగాణలో కొనసాగుతోన్న ఆంధ్రప్రదేశ్‌ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్‌లు, ఏపీలో కొనసాగుతున్న తెలంగాణ కేడర్ అధికారులు.. తమ సొంత రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని ఇటీవల కేంద్ర సర్కార్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో.. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్‎గా కొనసాగుతోన్న ఆమ్రపాలితో పాటు మిగతా 10 మంది అధికారులకు డిపార్ట్‏మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ సెంటర్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16లోగా ఏపీలో రిపోర్టు చేయాల్సి ఉండగా.. ఐఏఎస్‌లు ట్విస్ట్ ఇచ్చారు. డీఓపీటీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆమ్రపాలి సహా నలుగురు ఐఏఎస్‎లు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (CAT)ను ఆశ్రయించారు. ఐఏఎస్‎లు ఆమ్రపాలి, వాకాటి కరుణ, సృజన, వాణి ప్రసాద్ వేర్వేరుగా క్యాట్‏లో పిటిషన్లు దాఖలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాలని డీఓపీటీ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసి.. తెలంగాణలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆమ్రపాలితో పాటు వాకాటి కరుణ, వాణి ప్రసాద్ క్యాట్‎కు విజ్ఞప్తి చేశారు. ఇక.. తనను ఏపీలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్ సృజన కూడా క్యాట్‎లో పిటిషన్ దాఖలు చేశారు. ఐఏఎస్‎లు వేసిన పిటిషన్లపై రేపు (అక్టోబర్ 15న) క్యాట్ విచారణ చేపట్టనుంది.

అయితే.. తమను తెలంగాణ కేడర్‌లోనే కొనసాగించాలంటూ 11 మంది ఆలిండియా సర్వీసెస్ అధికారులు చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. 11 మంది అధికారులు వెంటనే సొంత రాష్ట్రంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే.. తనకు తెలంగాణ కేడర్ కావాలని ఆమ్రపాలి కేంద్రానికి విజ్ఞప్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె విజ్ఞప్తిపై సమీక్షించిన డీఓపీటీ.. తెలంగాణ కేడర్‌ను కేటాయించే ప్రసక్తే లేదంటూ తేల్చి చెబుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇదే క్రమంలోనే.. తెలంగాణ విద్యుత్ శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్‌కు కూడా ఇవే ఆదేశాలు ఇచ్చింది.

ఇదిలా ఉంటే.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జోక్యంతో కేంద్రాన్ని ఒప్పించేందుకు ఐఏఎస్‌లు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదే విషయాన్ని తెలంగాణ సీఎస్ శాంతి కుమారికి కూడా స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో.. ఆమ్రపాలి కోసం సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగుతారా అన్న ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది.

2014 ఏపీ విభజన తర్వాత.. తెలంగాణ కేడర్ కావాలని కేంద్రాన్ని 11 మంది ఆలిండియా సర్వీసెస్ అధికారులు కేంద్రాన్ని కోరారు. తెలుగు రాష్ట్రాల్లో ఆలిండియా సర్వీసెస్ అధికారుల మార్పులను చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గడిచిన 10 సంవత్సరాలలో డీఓపీటీకి సంబంధించి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. డిప్యూటేషన్ మీద పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పని చేస్తున్న 11 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌లు తక్షణమై రిలీవ్ అయి తమ కేడర్‌ రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

అయితే.. ఇటీవల ఢిల్లీలో జరిగిన డీఓపీటీ సమావేశానికి ఈ అధికారులంతా హాజరుకాగా.. సొంత రాష్ట్రాలకు వెళ్లలేమని పిటిషన్ ఇచ్చారు. ఈ క్రమంలో.. ఆ పిటిషన్ క్యాన్సిల్ అయింది. కానీ.. కేంద్రం మాత్రం సొంత రాష్ట్రాలకు వెళ్లాల్సిందే అంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో వారు ప్రస్తుతం కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు.

తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

14వ తేదీన ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని తెలిపింది.

15వ తేదీన... నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

16వ తేదీన... ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

17వ తేదీన... ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వెల్లడించింది.

18వ తేదీన ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వెల్లడించింది.

ప్రశాంతంగా ముగిసిన మద్యం దుకాణాల కేటాయింపు.. లాటరీలో మహిళల హవా

ఏపీ వ్యాప్తంగా మద్యం దుకాణాల కేటాయింపు ప్రశాంతంగా ముగిసింది. లాటరీ విధానం ద్వారా దరఖాస్తుదారులకు షాపుల కేటాయింపు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 3396 దుకాణాల లాటరీ ద్వారా కేటాయింపు కోసం మొత్తం 89, 882 దరఖాస్తులు రాగా.. లాటరీ ప్రక్రియ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కాగా.. పూర్తి బందోబస్తు నడుమ నిర్వహించిన ఈ లాటరీ కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలను తలపించింది.

ఉదయం నుంచి నిరాటంకంగా జరిగి లాటరీ విధానాన్ని మధ్యాహ్నం 3 గంటలకు పూర్తి అయింది. ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, యూపీ రాష్ట్రాల నుంచి టెండర్లు వేసి వ్యాపారులు షాపులను దక్కించుకున్నారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచరులకు 3 నుంచి 5 వరకు షాపులు దక్కినట్లు సమాచారం. 50 నుంచి 100 షాపులకు దరఖాస్తులు చేసిన సిండికేట్‌కు ఐదు నుంచి 10 షాపులు దక్కినట్లు తెలిసింది. విశాఖ, విజయవాడ, కృష్ణ వంటి పలు జిల్లాల్లో మద్యం దుకాణాలను మహిళలు చేజిక్కించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 16, కృష్ణా జిల్లాలో ఏడు, విశాఖ జిల్లాలో 11 షాపులను మహిళా మణులు కైవసం చేసుకున్నారు. సిండికేట్‌గా ఏర్పడి 10 నుంచి 30 వరకు షాపులు వేసినా అదృష్టం తలుపు తట్టకపోవడంతో కొంతమంది దరఖాస్తుదారులు నిరాశతో వెనుదిరిగారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు షాపుల కేటాయింపు ప్రక్రియ కొనసాగింది.

ఇవాళ షాపు పొందిన వారి నుంచి డబ్బు కట్టించుకొని అధికారులు ప్రొవిజనల్ లైసెన్స్ ఇస్తున్నారు. రేపు సాయంత్రం నుంచి డిపోలో స్టాక్ తీసుకొని 16వ తారీఖున దుకాణాలను వ్యాపారులు తెరవనున్నారు.

రేపు సాయంత్రం వరకు ప్రభుత్వ మద్యం దుకాణాలు నడవనున్నాయి. అనంతరం షాపులు దక్కించుకున్నవారు మద్యం అమ్మకాలను జరపనున్నారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం - భారీవర్షాలతో బిక్కుబిక్కుమంటున్న కోస్తా జిల్లాలు

గత నెల భారీవర్షాలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ను మరో కొత్త సమస్య కలవరపెడుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా వెళ్తోంది. ఇది ఉత్తర తమిళనాడు, కోస్తా ప్రాంతంలో మరింత బలపడుతుంది. ఈ ప్రభావం వల్ల దక్షిణ కోస్తా కొన్ని జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసి అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలు, కృష్ణ ,బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణశాఖ ముఖ్య అధికారి కేవీఎస్ శ్రీనివాస్ ప్రకటించారు.

వర్షాలు పడే సమయంలో దక్షిణ కోస్తాలో 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపారు. గడిచిన 24 గంటల్లో ఒంగోలులో 8 సెం.మీ, నెల్లూరు జిల్లా కందుకూరులో 5, విశాఖలో 2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయింది. ఈరోజు, రేపు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. చిత్తూరు, కడప జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయింది. ఇవాళ్టి నుంచి రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రానికి వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.తీరంలో తీవ్ర తుపాన్ హెచ్చరికలు :ఈ ఏడాది బంగాళాఖాతంలో తుపాను తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందే అంచనా వేసింది. సాధారణంగా అక్టోబరు, నవంబరు నెలల్లో ఏపీకి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో దేశవ్యాప్తంగా ఏటా నైరుతి రుతుపవనాలు తిరోగమించి, ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈ సమయంలో సముద్ర ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. ఈ పరిస్థితులు బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడటానికి అనుకూలంగా ఉండటంతో, అవి క్రమేపీ వాయుగుండాలు, తుపాన్లుగా మారతాయి.

ఇవాళ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే రోజుల్లో తుపానుగా మారే అవకాశం లేకపోలేదు. అల్పపీడనం, తీవ్ర వాయుగుండంగా మారి, తర్వాత తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేస్తోంది. గత పదేళ్లలో అక్టోబరు - డిసెంబరు మధ్యకాలంలో 11 తుపాన్లు ఏర్పడగా, అందులో 6 ఏపీలోనే తీరం దాటాయి. అటూ అరేబియా సముద్రంలో ఇప్పటికే తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.

ఇది వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. దీని ప్రభావం అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం వరకూ ద్రోణి కొనసాగుతోంది.సెప్టెంబరు నెలలో ఇదే విధంగా బంగాళాఖాతంలో వాయుగుండం, అరేబియా సముద్రంపై కదులుతున్న తుపాను ప్రభావంతో ఏర్పడిన ద్రోణి విజయవాడ నగరంలో కుంభవృష్టికి కారణమైంది.

ఇప్పుడు అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావం బంగాళాఖాతంలో ద్రోణిపై పడినట్లుగా తెలుస్తోంది. దీనివల్లే బంగాళాఖాతంలోనూ అల్పపీడనం ఏర్పడింది.అక్టోబరు - డిసెంబరు మధ్యలో ఏపీపై ప్రభావం చూపిన కొన్ని తుపాన్లు :

క్రమ సంఖ్య సంవత్సరం తుపాను తీరం దాటిన ప్రాంతం ప్రభావితమైన జిల్లాలు

కేటిఆర్ పిటిషన్‌‌పై నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మంత్రి కొండ సురేఖపై దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ జరగనుంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ క్రిమినల్ దావా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు నాంపల్లి స్పెషల్ ఎక్సైజ్ కోర్టు విచారించనుంది.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి కేటీఆర్ (Ex Minister KTR) మంత్రి కొండ సురేఖ (Minister Konda Surekha)పై దాఖలు చేసిన పిటిషన్‌ (Petition)పై సోమవారం నాంపల్లి స్పెషల్ కోర్టు (Nampally Special Court)లో విచారణ (Hearing ) జరగనుంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ క్రిమినల్ దావా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు నాంపల్లి స్పెషల్ ఎక్సైజ్ కోర్టు విచారించనుంది. బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌లను సాక్షులుగా కేటీఆర్ పేర్కొన్నారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కేటిఆర్ పిటిషన్‌ దాఖలు చేశారు.

2014-2023 వరకూ ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశానని.. 5 సార్లు వరుసగా సిరిసిల్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నానని.. 9 ఏళ్లు మంత్రిగా పనిచేశానని.. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నానని కేటీఆర్ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నానని, మంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ది చేశానన్నారు. ప్రపంచంలోని బహుళజాతి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా పనిచేశానని, తెలంగాణా వేగంగా అభివృద్ది చెందడంలో కృషి చేశానన్నారు. మంత్రి కొండా సురేఖ వాఖ్యలు తన పరువుకు తీవ్ర నష్టం చేకూర్చాయంటూ.. ఆమె మాట్లాడిన వీడియో, ఆడియో టేపులను కేటీఆర్ న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. బీఎన్ఎస్ (BNS) యాక్ట్ 356 సెక్షన్ కింద చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ.. 23 రకాల ఆధారాలను న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు.

కాగా అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) కారణమంటూ మంత్రి కొండా సురేఖ (Minister konda Surekha) చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిందే. అంతేకాకుండా కేటీఆర్‌‌ను ఉద్దేశించి మంత్రి అనేక కామెంట్స్ కూడా చేశారు. ఈ క్రమంలో కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు. కొండా సురేఖపై నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్‌‌లో పిటిషన్ వేశారు. తనపై చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేటీఆర్ వేసిన పిటిషన్‌పై ఈనెల 10వ తేదీన విచారణ ప్రారంభమై.. సోమవారం నాటికి వాయిదా పడింది. ఈరోజు విచారణ జరగనుంది.

మరోవైపు ఇదే కేసులో ఇప్పటికే మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని హీరో నాగార్జున పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కోర్టుకు నాగార్జున వ్యక్తిగతంగా హాజరయ్యారు. మరోవైపు నాగార్జున మేన కోడలు సుప్రియ కూడా ఈ కేసులో నాగార్జున తరుపున కోర్టుకు హాజరయి.. సాక్షిగా తన వాంగ్మూలం ఇచ్చారు. అలాగే నాగ్ కుటుంబ సభ్యులు కూడా కోర్టులో సాక్షి వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరో ప్రయత్నంలో ఆ ఐఏఎస్, ఐపీఎస్‌లు !

ఏపీ క్యాడర్ కేటాయించినా తెలంగాణలో పని చేస్తున్న ఎనిమిది మంది ఐఏఎస్, ఐపీఎస్‌లు.. తెలంగాణ కేటాయించిన ఏపీలో పని చేస్తున్న ముగ్గురు ఐఏఎస్‌లు పదహారో తేదీలోపు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాల్సి ఉంది.

కానీ వారెవరికి స్థానాలు మారడం ఇష్టం లేదు. అందుకే అత్యున్నత స్థాయిలో తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. నేరుగా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి తమను ఉన్న రాష్ట్రాల్లోనే కొనసాగించేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ గా కీలక స్థానంలో అమ్రపాలి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో ఉండాలనుకుంటున్నారు. రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న ఐపీఎస్ అంజనీకుమార్ కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. ఆలాగే కృష్ణజిల్లా కలెక్టర్ సృజన తెలంగాణకు వెళ్లేందుకు ఆసక్తిగా లేరు. అందరూ .. తమ స్థాయిలో గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. నేరుగా ప్రభుత్వం ద్వారా ప్రయత్నం చేయడానికి సమయం తక్కువగా ఉంది. పదహారో తేదీలోపు ఆయా రాష్ట్రాల్లో రిపోర్టు చేయాల్సి ఉంది. అందుకే న్యాయపోరాటం కూడా చేయాలనుకుంటున్నారు.

కానీ సోమేష్ కుమార్ విషయంలో ఇప్పటికే కోర్టు స్పష్టమైన తీర్పు వచ్చింది. మిగిలిన వారికి భిన్నంగా తీర్పులు వచ్చే అవకాశం లేదు. అయితే తమ స్థానికత విషయంలో వారు కొత్త వాదనలు వినిపించే అవకాశం ఉంది. యూపీఎస్సీకి దరఖాస్తు చేసిన సమయంలో నమోదు చేసిన అడ్రస్ ఆధారంగా స్థానికత ఖరారు చేశారని.. కానీ తమ అసలు నేటివ్ తాము ప్రస్తుతం ఉన్న రాష్ట్రాలేనని వారు వాదించే అవకాశం ఉంది. మెత్తంగా ఆ ఐపీఎస్, ఆ ఐఎఎస్‌లకు కదలడం ఇష్టం లేదు. మరి వారి పవర్ పని చేస్తుందా ?

కుప్పకూలిన డీమార్ట్ షేర్లు.. ఒక్కరోజే రూ.27 వేల కోట్లు నష్టం.

సామాన్యుల సూపర్ మార్కెట్‌గా పేరు గాంచి దూసుకెళ్తున్న డీమార్ట్ షేర్లు కుప్పకూలుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 10 శాతానికిపైగా నష్టపోయింది. దీంతో డీమార్ట్ మాతృ సంస్థ అవెన్యూ సూపర్ మార్కెట్స్ కంపెనీ మార్కెట్ విలువ రూ.27 వేల కోట్లు తగ్గిపోయింది. మరి ఇంతలా పడిపోయేందుకు గల కారణాలేంటి? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

డీమార్ట్ గురించి తెలియని వారు ఉండరు. మధ్య తరగతి ప్రజల సూపర్ మార్కెట్‌గా పేరుగాంచింది. దేశవ్యాప్తంగా రిటైల్ వ్యాపారం నిర్వహిస్తోంది. డీమార్ట్ మాతృ సంస్థ అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ షేర్లు సోమవారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ రోజున కుప్పకూలాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో దాదాపు 10 శాతానికిపైగా నష్టపోయాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా రూ.27 వేల కోట్ల మేర ఆవిరైపోయింది. అందుకు ప్రధాన కారణంగా ఇటీవల ప్రకటించిన ఫలితాలేనని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి గానూ ప్రకటించిన ఫలితాల్లో ఇన్వెస్టర్లను మెప్పించడంలో కంపెనీ విఫలమైనట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోందని చెబుతున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో డీమార్ట్ ఏకీకృత నికర లాభం రూ.659.44 కోట్లుగా ప్రకటించింది.

గతేడాదితో పోలిస్తే ఈసారి నికర లాభం 5 శాతం మేర పెరిగింది. కంపెనీ ఆదాయం సైతం 14.41 శాతం పెరిగి రూ.14,444.50 కోట్లుగా నమోదు చేసింది. అదే సమయంలో కంపెనీ ఖర్చులు 14.94 శాతం మేర పెరిగాయి. అయితే, కంపెనీకి క్యూ2లో భారీ లాభాలు వస్తాయని అంతా అంచనా వేయగా.. ఆ అంచనాలను అందుకోలేకపోయిందని నిపుణులు భావిస్తున్నారు.

ఈ ఫలితాలు ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయాయి. దీంతో ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు డీమార్ట్ షేరుకు టార్గెట్ ప్రైస్ తగ్గించేశాయి. ఈ అంశాన్ని కలిసి డిమార్ట్ షేర్లు ఇవాళ క్షీణించాయి. అలాగే క్విక్ కామర్స్ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీ సైతం డీమార్ట్ షేర్లు పడిపోయేందుకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.

గత ప్రభుత్వంలో పంచాయతీ రాజ్‌ మంత్రి ఎవరో కూడా తెలీదు.. పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు

పరిపాలనలో చంద్రబాబు తనకు స్ఫూర్తి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి చాలా బలమని కొనియాడారు. నాయకుడి అనుభవం ఉపయోగించుకోకపోతే తప్పుచేసిన వాళ్లమవుతామని అభిప్రాయపడ్డారు.

పరిపాలనలో చంద్రబాబు తనకు స్ఫూర్తి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి చాలా బలమని కొనియాడారు. నాయకుడి అనుభవం ఉపయోగించుకోకపోతే తప్పుచేసిన వాళ్లమవుతామని అభిప్రాయపడ్డారు. అందుకే కూటమిగా ఏర్పడ్డామని తెలిపారు. కృష్ణా జిల్లా కంకిపాడులో సోమవారం నిర్వహించిన ‘పల్లె పండుగ-పంచాయతీ వారోత్సవాలు’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దెబ్బలు తట్టుకుని నిలబడ్డామని అందుకే ఇప్పుడు పనులు చేయగలుగుతున్నామని చెప్పారు.

గత పాలనతో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎవరో కూడా తెలియదని పవన్‌ కల్యాణ్‌ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో గ్రామసభలు కూడా పెట్టలేదని.. నిర్ణయాలు ఎలా తీసుకున్నారో తెలియదని అన్నారు. గత పాలనలో డబ్బులు ఎలా ఖర్చయ్యాయో ఎవరికీ తెలియదని విమర్శించారు. అభివృద్ధి జరగలేదు కానీ నిధులు మాయమయ్యాయని ఆరోపించారు. ఆగస్టు 23న రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించామని తెలిపారు. గ్రామ సభల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు పల్లెల్లో పనులు మొదలుపెట్టామని పేర్కొన్నారు. ప్రతి పనికి డిస్‌ప్లే బోర్డు ఉంటుందని అన్నారు.

గ్రామసభల్లో తీసుకున్న నిర్ణయాలు అమలు చేయడం అంత ఈజీ కాదని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పారదర్శకతతో తాము పాలిస్తున్నామని తెలిపారు. తాము పారదర్శకంగా ఉన్నా అధికారుల తీరు మారడం లేదని మండిపడ్డారు. మా పేరుతో ఓ అధికారి కాకినాడలో డబ్బులు వసూలు చేశారని తెలిపారు. ఏ అధికారి అయిన తప్పు చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తమలాగే అధికారులు కూడా పారదర్శకంగా ఉండాలని సూచించారు. ఇది లంచాల ప్రభుత్వం కాదు.. మంచి ప్రభుత్వమని స్పష్టం చేశారు.

రేవంత్ కు పరీక్షగా మారిన కొండా సురేఖ - హైకమాండ్ క్లారిటీ..!!

మంత్రి కొండా సురేఖ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మంత్రిగా ఉంటూ చేస్తున్న వ్యాఖ్యలు...నిర్ణయాలు ముఖ్యమంత్రి రేవంత్ కు సమస్యలు తెచ్చి పెడుతోంది. సురేఖ శైలి ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతోంది. ఇప్పటికే నాగార్జున కుటుంబం పైన చేసిన వ్యాఖ్యలతో జాతీయ స్థాయిలో సురేఖ విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా మంత్రిగా ఉండి పోలీసు స్టేషన్ కు వెళ్లి సీఐ సీట్లో కూర్చోవటం వివాదాస్పదంగా మారింది. సురేఖ వ్యవహారం పైన ఏఐసీసీ సైతం ఇప్పటికే రేవంత్ కు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.

మంత్రి కొండా సురేఖ దూకుడు కొత్త సమస్యలకు కారణమవుతోంది. మాజీ మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేసే క్రమంలో సమంత గురించి సురేఖ చేసిన వ్యాఖ్యల పైన పెద్ద దుమారమే చెలరేగింది. కేటీఆర్ అంశం పక్కకు పోయి..సురేఖ టార్గెట్ అయ్యారు. పరోక్షంగా ప్రభుత్వం, కాంగ్రెస్ లక్ష్యంగా మారాయి. ఆ తరువాత సురేఖ తన వ్యాఖ్యలను ఉప సంహించుకున్నా.. వివాదం మాత్రం సమిసిపోలేదు. సురేఖ పైన హీరో నాగార్జున కేసు దాఖలు చేసారు. ఈ వ్యవహారం పైన అమల నేరుగా ప్రియాంక గాంధీతో మాట్లాడారు. పార్టీ నాయకత్వం సైతం సురేఖ విషయంలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

అయితే, సురేఖ పైన వెంటనే చర్యలు తీసుకుంటే రాజకీయంగా సమస్యలు వస్తాయని సీఎం రేవంత్ భావించారు. దీంతో, సురేఖ తన వ్యాఖ్యలు ఉప సంహించుకొనేలా పార్టీ సూచించింది. ఇక, తాజాగా సొంత పార్టీ నేత రేవూరి ప్రకాశ్రెడ్డి వర్గీయులతో సురేఖ వర్గ మధ్య విభేదాలు పోలీసు స్టేషన్ కు చేరాయి. వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్టుగా వార్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఫోటోతో మొదలైన వివాదం, తర్వాత ఫ్లెక్సీల చింపివేత, ధర్నాలు, దాడులు, అరెస్టుల దాకా వెళ్లింది. దీంతో మంత్రి రంగంలోకి దిగి పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం..సీఐ కుర్చీలో ఆమె కూర్చోవడం మరో వివాదానికి కారణమైంది. తమ వారిని విడిచి పెట్టాలని మంత్రి హోదాలో సురేఖ చెప్పటం మరింత వివాదంగా మారింది.

మంత్రి నేరుగా స్టేషన్ కు చేరటంతో కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కూడా చేరుకున్నారు. తన వర్గీయులపై పెట్టిన కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో ఆమె వర్గీయులు అక్కడకు భారీగా చేరుకుని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.

అధికారంలో ఉన్న సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేతో విభేదాల కారణంగా మంత్రి స్టేషన్ కు వచ్చి అధికారి కుర్చీలో కూర్చోవటం ఇప్పుడు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతోంది. సురేఖ దూకుడు స్వభావం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ కు సమస్యగా మారుతోంది. దీంతో..సురేఖ తీరు ఇదే విధంగా ఉంటే త్వరలోనే చర్యలు తప్పవనే సంకేతాలు పార్టీ నుంచి ఇస్తున్నట్లు సమాచారం.