/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz కేబీఆర్‌ పార్కు వద్ద అతిపెద్ద అండర్‌పాస్‌ Raghu ram reddy
కేబీఆర్‌ పార్కు వద్ద అతిపెద్ద అండర్‌పాస్‌

గ్రేటర్‌లో అతి పెద్ద అండర్‌పాస్‌ కేబీఆర్‌ పార్క్‌ వద్ద అందుబాటులోకి రానుంది. సిగ్నల్‌ చిక్కులు లేకుండా వాహనదారులు నిరాటంకంగా ప్రయాణించేలా బహుళ మార్గాలకు రూపకల్పన చేస్తున్నారు. కేబీఆర్‌ పార్కు చుట్టూ ఉన్న పలు జంక్షన్లలో సిగ్నల్‌ ఫ్రీ ప్రయాణం చేసేలా వీటిని రూపొందించారు.

నగరంలోని కేబీఆర్‌ (కాసు బ్రహ్మానందరెడ్డి)పార్క్‌ చుట్టూరా సిగ్నల్‌ ఫ్రీ ప్రయాణాలు సాగేలా అండర్‌పాస్‌లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తున్నది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ –45 వైపు నుంచి కేబీఆర్‌ పార్కు ప్రధాన గేటు(ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌) వైపు 740 మీటర్ల మేర అతిపెద్ద భూగర్భ మార్గం నిర్మించనున్నారు. దీంతో ఐటీ కారిడార్‌, ఫిల్మ్‌నగర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు జూబ్లీ చెక్‌పోస్ట్‌ కంటే ముందు ఉండే అండర్‌పాస్‌ నుంచి సిగ్నల్‌ చిక్కులు లేకుండా రాకపోకలు సాగించే వెసులుబాటు కలగనుంది.

మూడు లేన్లుగా అండర్‌పాస్‌ నిర్మాణానికి రూపకల్పన చేశారు. గతంలో నిర్మించిన అండర్‌పాస్‌లలో మెజార్టీ 200–300 మీటర్లు మాత్రమే ఉన్నాయి. దీంతో కేబీఆర్‌ పార్కు వద్ద నిర్మించే అండర్‌పాస్‌ అతిపెద్దది కానుంది. హైదరాబాద్‌ సిటీ ఇన్నోవేటీవ్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్మేటీవ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌(హెచ్‌– సిటీ)లో భాగంగా కేబీఆర్‌ పార్కు చుట్టూ ఏడు అండర్‌పాస్‌లు నిర్మిస్తుండగా, మెజార్టీ 300 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్నాయి. ఇవి నగర ప్రయాణంలో వాహనదారులకు వినూత్న అనుభూతి కలిగిస్తాయని అధికారులు చెబుతున్నారు.

సిగ్నల్‌ చిక్కులు లేకుండా జంక్షన్ల వారీగా బహుళ మార్గాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. వంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. జూబ్లీ చెక్‌పోస్ట్‌ వద్ద మాత్రం రెండో లెవల్‌లో ఓ వంతెన ప్రతిపాదించారు.

కేబీఆర్‌ పార్క్‌ మెయిన్‌ గేట్‌ చౌరస్తా వద్ద రూ.192 కోట్లతో రెండు అండర్‌పాస్‌లు, (ముగ్ద జంక్షన్‌తో కలిపి) ఓ వంతెన ప్రతిపాదించారు. యూసుఫ్‌గూడ వైపు నుంచి వచ్చే వాహనాలు మూడు లేన్ల వంతెన నుంచి జూబ్లీచెక్‌పోస్ట్‌ వైపు వెళ్లనున్నాయి. జూబ్లీచెక్‌పోస్ట్‌ నుంచి వచ్చే వాహనాలు ఫ్రీ లెఫ్ట్‌ ద్వారా యూసుఫ్‌గూడ వైపు, కేన్సర్‌ ఆస్పత్రి వైపు వెళ్లాల్సిన వాహనాలు అండర్‌పాస్‌ వినియోగించాల్సి ఉంటుంది.

జూబ్లీచెక్‌పోస్ట్‌ వద్ద రెండు వంతెనలు, ఓ అండర్‌పాస్‌ నిర్మించనున్నారు. ఇందుకు రూ.229 కోట్లు అవసరమని అంచనా వేశారు. కేబీఆర్‌ పార్క్‌ మెయిన్‌ గేట్‌ వైపు నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ –36 (పెద్దమ్మ గుడి వైపు) మూడు లేన్ల చొప్పున రెండు వైపులా వాహనాలు రాకపోకలు సాగించేందుకు ఆరు లేన్ల వంతెన అందుబాటులోకి రానుంది. రోడ్‌ నెంబర్‌–45 వైపు నుంచి కేబీఆర్‌ పార్క్‌ మెయిన్‌ గేట్‌ వైపు వెళ్లేందుకు మూడు లేన్ల అండర్‌పాస్‌, యూసుఫ్‌గూడ వైపు వాహనాల కోసం మరో అండర్‌పాస్‌ ప్రతిపాదించారు. యూసుఫ్‌గూడ వైపు నుంచి రోడ్‌ నంబర్‌–45 వైపు వెళ్లే వాహనాల కోసం సెకండ్‌ లెవల్‌లో రెండు లేన్ల వంతెన నిర్మించనున్నారు.

కేన్సర్‌ ఆస్పత్రి చౌరస్తా వద్ద ఓ అండర్‌పాస్‌, ఓ వంతెనను రూ.83 కోట్లతో ప్రతిపాదించారు. కేబీఆర్‌ పార్క్‌ మెయిన్‌ గేట్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు అండర్‌పాస్‌ నుంచి మహారాజ అగ్రసేన్‌ చౌరస్తా (తెలంగాణ భవన్‌) వైపు వెళ్తాయి. తెలంగాణ భవన్‌ నుంచి వెళ్లే వాహనాలు వంతెన మీదుగా బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌–10, రోడ్‌ నంబర్‌–1 వైపు వెళ్లొచ్చు.

మహారాజ అగ్రసేన్‌ చౌరస్తా వద్ద రూ.110 కోట్లతో ఓ అండర్‌పాస్‌, వంతెన ప్రతిపాదించారు. కేన్సర్‌ ఆస్పత్రి వైపు నుంచి వచ్చే వాహనాలు అండర్‌పాస్‌ మీదుగా ఫిల్మ్‌నగర్‌ చౌరస్తా వైపు వెళ్లాలి. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ –12 నుంచి వచ్చే వాహనాలు వంతెన మీదుగా ఫిల్మ్‌నగర్‌ చౌరస్తాకు వెళ్లొచ్చు.

ఫిల్మ్‌నగర్‌ చౌరస్తా వద్ద అండర్‌పాస్‌, ఓ వంతెనను రూ.115 కోట్లతో నిర్మించనున్నారు. మహారాజ అగ్రసేన్‌ చౌరస్తా వైపు నుంచి వచ్చే వాహనాలు అండర్‌పాస్‌ నుంచి జర్నలిస్ట్‌ కాలనీ చౌరస్తా వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఫిల్మ్‌నగర్‌ వైపు నుంచి వచ్చే వాహనదారులు వంతెన మీదుగా మహారాజ అగ్రసేన్‌ జంక్షన్‌ వైపు వెళ్లే అవకాశం కలుగుతుంది.

రోడ్‌ నంబర్‌ –45 జంక్షన్‌ వద్ద రూ.97 కోట్లతో ఓ అండర్‌పాస్‌, వంతెన నిర్మాణం ప్రతిపాదించారు. జర్నలిస్ట్‌ కాలనీ చౌరస్తా వైపు నుంచి అండర్‌పాస్‌ ద్వారా జూబ్లీ చెక్‌పోస్ట్‌కు వెళ్లొచ్చు. జూబ్లీ చెక్‌పోస్ట్‌ నుంచి వచ్చే వాహనదారులు వంతెన మీదుగా కేబుల్‌ బ్రిడ్జి వైపు వెళ్లాల్సి ఉంటుంది. కేబుల్‌ బ్రిడ్జి వైపు నుంచి వచ్చే వాహనదారులు ఫ్రీ లెఫ్ట్‌ను వినియోగించుకుంటే జూబ్లీ చెక్‌పోస్ట్‌ వైపు వెళ్లొచ్చు.

అండర్‌పాస్‌ల వివరాలు..

రోడ్‌ నంబర్‌–45 వైపు నుంచి కేబీఆర్‌ పార్కు మెయిన్‌ గేటు వైపు మూడు లేన్ల అండర్‌పాస్‌– 740 మీటర్లు

జూబ్లీ చెక్‌పోస్ట్‌ వైపు నుంచి కేబీఆర్‌ పార్కు మెయిన్‌ గేట్‌ చౌరస్తా మీదుగా క్యాన్సర్‌ ఆస్పత్రి వైపు రెండు లేన్ల అండర్‌పాస్‌– 330 మీటర్లు

కేబీఆర్‌ పార్కు మెయిన్‌ గేట్‌ జంక్షన్‌ వైపు నుంచి పంజాగుట్ట వైపు (ముద్ర చౌరస్తా వద్ద) మూడు లేన్ల అండర్‌పాస్‌ – 260 మీటర్లు

కేబీఆర్‌ పార్క్‌ మెయిన్‌ గేట్‌ జంక్షన్‌ వైపు నుంచి క్యాన్సర్‌ ఆస్పత్రి జంక్షన్‌ మీదుగా మహరాజ్‌ అగ్రసేన్‌ చౌరస్తా వైపు రెండు లేన్ల అండర్‌పాస్‌– 330 మీటర్లు

క్యాన్సర్‌ ఆస్పత్రి చౌరస్తా వైపు నుంచి మహారాజ్‌ అగ్రసేన్‌ జంక్షన్‌ మీదుగా ఫిల్మ్‌నగర్‌ జంక్షన్‌ వరకు రెండు లేన్ల అండర్‌పాస్‌– 410 మీటర్లు

మహరాజ అగ్రసేన్‌ చౌరస్తా వైపు నుంచి ఫిల్మ్‌నగర్‌ చౌరస్తా మీదుగా జర్నలిస్టు కాలనీ చౌరస్తా వరకు రెండు లేన్ల అండర్‌పాస్‌ – 340 మీటర్లు

జర్నలిస్ట్‌ కాలనీ చౌరస్తా వైపు నుంచి రోడ్‌ నంబర్‌–45 జంక్షన్‌ మీదుగా జూబ్లీచెక్‌పోస్ట్‌ వరకు రెండు లేన్ల అండర్‌పాస్‌ – 290 మీటర్ల

కేబీఆర్‌ పార్క్‌ మెయిన్‌ గేట్‌ వైపు నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ – 36 వరకు ఒక్కోవైపు రెండు లేన్ల చొప్పున ఫస్ట్‌ లెవల్‌ వంతెన – 745 మీటర్లు

యూసుఫ్‌గూడ వైపు నుంచి రోడ్‌ నంబర్‌ –45 జంక్షన్‌ వైపు సెకండ్‌ లెవల్‌లో రెండు లేన్ల వంతెన – 770 మీటర్లు

పంజాగుట్ట వైపు నుంచి కేబీఆర్‌ పార్క్‌ మెయిన్‌గేట్‌ జంక్షన్‌ మీదుగా జూబ్లీచెక్‌పోస్ట్‌ వైపు మూడు లేన్ల వంతెన – 900 మీటర్లు

మహరాజ అగ్రసేన్‌ జంక్షన్‌ వైపు నుంచి క్యాన్సర్‌ ఆస్పత్రి చౌరస్తా మీదుగా బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌–10 వైపు రెండు లేన్ల వంతెన –540 మీటర్లు

ఫిల్మ్‌నగర్‌ జంక్షన్‌ వైపు నుంచి మహరాజ అగ్రసేన్‌ చౌరస్తా మీదుగా బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌–12 వైపు రెండు లేన్ల వంతెన – 590 మీటర్లు

ఫిల్మ్‌నగర్‌ వైపు నుంచి మహరాజ అగ్రసేన్‌ చౌరస్తా వైపు రెండు లేన్ల వంతెన – 600 మీటర్లు

జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వైపు నుంచి రోడ్‌ నంబర్‌–45 చౌరస్తా మీదుగా కేబుల్‌ బ్రిడ్జి వైపు రెండు లేన్ల వంతెన – 500 మీటర్లు

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ను కాల్చిచంపిన దుండగులు

ముంబైలో శనివారం రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి చెందిన కీలక నేత బాబా సిద్ధిక్ హత్యకు గురయ్యారు. ముంబైలోని బాంద్రాలో ఆయనను దండగులు కాల్చిచంపారు. శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో షూటర్లు ఆయనపైకి ఆరు బుల్లెట్లు కాల్చారు. బాబా సిద్దిక్‌కు 4 బుల్లెట్లు తగిలాయి. అతడి సహాయకులలో ఒకరికి గాయాలయ్యాయి. కాగా తన కొడుకు, బాంద్రా ఈస్ట్ ఎమ్మెల్యే జీషాన్ కార్యాలయానికి సమీపంలోనే బాబా సిద్దిక్‌పై కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపిన వెంటనే ఆయనను లీలావతి ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

బాబా సిద్దిక్ బాంద్రా వెస్ట్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 -2008 మధ్య రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, కార్మిక శాఖల మంత్రిగా పనిచేశారు. 48 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో ఉన్న ఆయన ఈ ఏడాది ఫిబ్రవరిలోనే హస్తం పార్టీని వీడి అజిత్ పవార్ ఎన్‌సీపీ వర్గంలో చేరారు. మరోవైపు ఆయన కొడుకు జీషాన్ సిద్ధిక్‌ను ఈ ఏడాది ఆగస్టులో పార్టీ నుంచి కాంగ్రెస్ అధిష్టానం బహిష్కరించింది.

బాబా సిద్దిక్ హత్యపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందించారు. ‘‘ ఈ ఘటన చాలా దురదృష్టకరం. సిద్ధిక్ చనిపోయారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఒకరు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు, మరొకరు హర్యానాకు చెందినవారు. మరొకరు పరారీలో ఉన్నారు. ఈ ఘటన విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను నేను కోరాను. ముంబయిలో శాంతిభద్రతలను ఎవరూ వారి చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదు’’ అని ఆయన అన్నారు.

మరోవైపు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమాచారం తెలిసిన వెంటనే ఆసుపత్రికి వెళ్లారు. సిద్దిక్ హత్య విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని మరో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎక్స్ వేదికగా స్పందించారు. సహచరుడిని, స్నేహితుడిని కోల్పోయానని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది చివరిలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని కొన్ని నెలల ముందు నుంచే అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది. బాబా సిద్దిక్ హత్యపై రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

అత్యధికంగా సంపాదించిన భారతీయుడిగా గౌతమ్ అదానీ.

అదానీ గ్రూపు కంపెనీల అధినేత గౌతమ్ అదానీ ప్రస్తుత ఏడాది 2024లో అత్యధిక సంపాదన పొందిన భారతీయ సంపన్నుడిగా నిలిచారు. ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో హయెస్ట్ వెల్త్ గెయినర్స్ జాబితాలో ఆయన అగ్రస్థానంలో నిలిచారు. 2024లో గౌతమ్ అదానీ సంపద ఏకంగా 48 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4 లక్షల కోట్లు) మేర పెరిగింది. గతేడాది కంటే ఈ పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది.

ఒక సంవత్సరంలో ఒక భారతీయుడు ఆర్జించిన అత్యధిక సంపద కూడా ఇదే కావడం గమనామర్హం. ఈ ఏడాది రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఓపీ జిందాల్ గ్రూప్‌ గౌరవ చైర్మన్ సావిత్రి జిందాల్‌ల ఉమ్మడి సంపద పెరుగుదల కంటే ఎక్కువగా గౌతమ్ అదానీ ఆర్జించడం గమనార్హం. దీంతో ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ సంపద 116 బిలియన్ డాలర్లకు చేరింది. 

ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో ఈ ఏడాది అత్యధిక సంపద పొందిన వ్యక్తుల జాబితాలో అదానీ తర్వాత స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నిలిచారు. 2024లో ఆయన సంపద 27.5 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. దీంతో అతడి నికర ఆస్తి విలువ 119.5 బిలియన్ డాలర్లకు చేరింది. గౌతమ్ అదానీతో పోల్చితే 3.5 బిలియన్ డాలర్లు మాత్రమే ఎక్కువ సంపదను కలిగివున్నారు.

ఇక 2024లో సావిత్రి జిందాల్ 19.7 బిలియన్ డాలర్లు సంపాదించి నికర ఆస్తిలో శివ్ నడార్‌ను అధిగమించారు. సావిత్రి జిందాల్ దేశంలో అత్యంత సంపన్న మహిళగా కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికల్లో హిసార్ నుంచి ఎమ్మెల్యేగా ఆమె గెలుపొందారు.

ఇక సునీల్ మిట్టల్ సంపద 13.9 బిలియన్ డాలర్లు, దిలీప్ షాంఘ్వి సంపద 13.4 బిలియన్ డాలర్ల మేర పెరిగాయి. ఈ ఏడాది అత్యధిక సంపాదించిన సంపన్నుల జాబితాలో వీరిద్దరూ వరుసగా నాలుగు, ఐదవ స్థానాల్లో నిలిచిచారు.

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. త్వరలోనే మీ పొలాలకు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యూ ఎనర్జీ పాలసీపై కసరత్తు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. త్వరలోనే రైతుల బోరు బావులకు ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు.

తెలంగాణ రైతులకు(Farmers) ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) శుభవార్త చెప్పారు. రైతుల బోరు బావులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. దీని ద్వారా అన్నదాతలకు అదనపు ఆదాయం వస్తుందని భట్టి ఆశాభావం వ్యక్తం చేశారు. అశ్వరావుపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో నిర్మించిన పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. రూ.36కోట్లతో నిర్మించిన 2.5 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను డిప్యూటీ సీఎం భట్టితోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.." న్యూ ఎనర్జీ పాలసీపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలో రైతుల బోరు బావులకు ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేస్తాం. దీని ద్వారా రైతులకు కరెంట్ ఖర్చు ఉండదు. పైగా సోలార్ ప్యానల్స్ ద్వారా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేయడం వల్ల రైతులకు అదనపు ఆదాయం వస్తుంది. పంటతోపాటు పవర్‌పైనా అన్నదాతలు అదనపు లాభం పొందేలా పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నాం. ముందుగా పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ ఖర్చుతో రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్టు చేపడతాం. విజయ దశమి రోజు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో బయో మాస్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రపంచమంతా థర్మల్ పవర్ నుంచి గ్రీన్ పవర్ వైపు అడుగులు వేస్తోంది. తెలంగాణలో 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ స్థాపనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రుణమాఫీ చేశాం. బీఆర్ఎస్ పార్టీ నేతలు రుణమాఫీపై విమర్శలు చేస్తున్నారు. మేము చేసిన మంచిని చూసి వాళ్లు ఓర్వలేకపోతున్నారు. పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. రూ.73వేల కోట్లు తెలంగాణ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయించాం" అని చెప్పారు.

అనంతరం అశ్వరావుపేటలో ఆయిల్ పామ్ రైతులకు సాగు, పంట విస్తరణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, కూనంనేని, రాగమయి, ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి హాజరయ్యారు.

శారద పీఠం భూముల వ్యవహారంలో ట్విస్ట్, వైసీపీకి ఎఫెక్ట్ !!

శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రసరస్వతిని వైఎస్ జగన్ కు రాజగురువుగా పలువురు బావించారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో శారదా పీఠానికి మేలు చేకూర్చేలా వ్యవహరించారని, వందల కోట్ల రూపాయల విలువైన భూములను కేవలం రూ. 15 లక్షలకే 15 ఎకరాల భూమిని శారదా పీఠానికి అప్పగించిందని వెలుగు చూడటంతో ఆ విషయంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తి వివరాలను బయటకు లాగుతోంది.

శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రసరస్వతిని వైఎస్ జగన్ కు ఉన్న సంబంధం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విశాఖ జిల్లాలోని భీమిలి సమీపంలో వేద విద్యాలయం ఏర్పాటు చెయ్యడానికి భూమి కేటాయించాలని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రసరస్వతి అప్పటి వైసీపీ ప్రభుత్వానికి మనవి చేసింది. గురువు అడిగిన వెంటనే అప్పటి సీఎం జగన్ శారదా పీఠానికి భూమి ఇవ్వడానికి అంగీకరించారు.

భీమిలి మండలంలోని కొత్తవలసలో ఎకరం భూమి బహిరంగ మార్కెట్ లో సుమారు రూ 15 కోట్లు ఉందని స్థానికులు అంటున్నారు. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం శారద పీఠంపై ప్రేమతో ఎకరం భూమి రూ 1 లక్షకు ఇవ్వడానికి అంగీకరించింది. రెండు సర్వే నెంబర్లలోని 15 ఎకరాల భూమిని కేవలం రూ 15 లక్షలకు శారదా పీఠానికి అప్పగించారు. శారదా పీఠానికి అప్పగించిన భూమి విలువ బహిరంగ మార్కెట్ లో రూ. 225 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

రూ. 225 కోట్ల విలువైన భూమిని కేవలం రూ 15 లక్షలకు శారదా పీఠానికి అప్పగించడంతో ఆ సమయంలో జగన్ ప్రభుత్వంపై అనేక మంది విమర్శలు చేశారు. గురుభక్తి చాటుకోవాలంటే ప్రభుత్వ భూములు దానం చెయ్యాల్సిన అవసరం లేదని విశాఖకు చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అప్పటి జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అదే సందర్బంలో అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులపై ఎదురు దాడికిదిగడంతో మాటల యుద్దం జరిగింది.

వేద విద్యాలయం కోసం తీసుకున్న భూములను వాణిజ్య అవసరాలు, రెవెన్యూ, నివాస అవసరాల కోసం ఉపయోగించుకునేలా మార్పులు చెయ్యాలని శారదా పీఠం ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ దెబ్బతో గత వైసీపీ ప్రభుత్వం ఎందుకు అంత తక్కువ ధరకు శారదా పీఠానికి వందల కోట్ల విలువైన భూములు అప్పగించింది అంటూ విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శారదా పీఠానికి సుమారు రూ. 22 కోట్లకు భూమి కేటాయించవచ్చు అని అప్పట్లో అధికారులు నివేదిక ఇచ్చినా జగన్ ప్రభుత్వం మాత్రం ఆ నివేదిక పట్టించుకోకుండా కేవలం రూ 15 లక్షలకు 15 ఎకరాల భూమి ఇచ్చేసిందని వెలుగు చూడటంతో ఇప్పుడు ఆ భూముల వ్యవహారంపై విచారణ జరుగుతోంది.

ముఖ్య‌మంత్రి హోదాలో తొలిసారి స్వ‌గ్రామానికి రేవంత్‌రెడ్డి

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్వ‌గ్రామంలో పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది. అందుకు కారణం నేడు ఆయ‌న సొంతూరుకు తొలిసారిగా సీఎం హోదాలో బ‌య‌లుదేర‌డ‌మే. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండా రెడ్డిప‌ల్లి రెవంత్ రెడ్డి స్వ‌గ్రామం. ఈసారి దసరా పండుగ వేడుకలు అక్క‌డే జ‌రుపుకోనున్న నేప‌థ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు.

రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి హోదాలో తొలిసారి సొంతూరులో అడుగుపెట్ట‌నున్నారు. భాగ్య‌న‌గ‌రం నుంచి ఈ రోజు సాయంత్రం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కొండారెడ్డి పల్లికి సీఎం చేరుకుంటారు. అక్క‌డే గ్రామస్తులతో కలిసి దసరా వేడుకల‌ను జ‌రుపుతారు. దీంతోపాటు కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్ట‌నున్నారు. గ్రామ పంచాయతీ, బీసీ భవనం, గ్రంథాలయం, పశువైద్య శాలలను ప్రారంభిస్తారు. గ్రామాన్ని సౌర విద్యుత్ ఆధారిత గ్రామంగా మార్చేందుకు కృషి చేయ‌నున్నారు. ముఖ్య‌మంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి గ్రామంలో అడుగుపెట్టనుండ‌డంతో సంద‌డి వాతావ‌ర‌ణం మొద‌లైంది.

కొండారెడ్డి పల్లి గ్రామంలో ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్, అండర్ డ్రైనేజీ, నాలుగు లైన్‌ల‌ రోడ్డు, సెంటర్ లైటింగ్, చిల్డ్రన్స్ పార్క్, జిమ్, దేవాలయం తదితర వాటికి ముఖ్య‌మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇప్ప‌టికే రేవంత్‌రెడ్డి పర్యటన నేప‌థ్యంలో హెలిప్యాడ్ ప్రాంతం, పర్యటన జరిగే ప్రదేశాలను పోలీసుల ముందస్తుగా ఆధీనంలోకి తీసుకోనున్నారు.

పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు సీఎంను కలిసేందుకు రానుండడంతో భద్రతా లోపాలు తలెత్తకుండా అన్ని ర‌కాల జాగ్రత్తలు పోలీసులు తీసుకుంటున్నారు. ముఖ్య‌మంత్రి తిరిగి హైదరాబాద్ వెళ్లేంత వరకు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అధికారుల‌కు సూచించారు.

నోయల్ టాటా ఎవరు? రతన్ టాటా తర్వాత టాటా ట్రస్ట్ ఛైర్మన్‌గా ఎవరు

టాటా ట్రస్ట్‌కు కొత్త ఛైర్మన్‌ ఎంపికయ్యారు. రతన్ టాటా మరణానంతరం టాటా ట్రస్ట్ పగ్గాలు ఎవరు చేపడతారనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది. రతన్ టాటా వారసుడి కోసం అన్వేషణ పూర్తయింది.

రతన్ టాటా మరణానంతరం నోయెల్ టాటా ఇప్పుడు టాటా ట్రస్ట్ బాధ్యతలు చేపట్టనున్నారు. టాటా ట్రస్ట్ కొత్త ఛైర్మన్‌కు సంబంధించి శుక్రవారం జరిగిన టాటా ట్రస్ట్ ముఖ్యమైన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. టాటా ట్రస్ట్ బోర్డు శుక్రవారం ఆయనను చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంది.

ఈ నియామకంతో, నోయెల్ సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌కు 11వ ఛైర్మన్ మరియు సర్ రతన్ టాటా ట్రస్ట్‌కు ఆరవ ఛైర్మన్‌గా మారారు. అతను నావల్ హెచ్. టాటా మరియు సైమన్ ఎన్. టాటా కుమారుడు మరియు రతన్ టాటా సవతి సోదరుడు. నోయెల్‌కు టాటా గ్రూప్‌తో 40 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. ప్రస్తుతం ఆయన పలు టాటా గ్రూప్ కంపెనీల బోర్డుల్లో కూర్చున్నారు. అతను టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్, వోల్టాస్ మరియు టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్‌కు చైర్మన్ మరియు టాటా స్టీల్ అండ్ టైటాన్ కంపెనీ లిమిటెడ్ వైస్ చైర్మన్.

2010-11లో టాటా ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులైనప్పటి నుండి, రతన్ టాటా తర్వాత టాటా గ్రూప్ అధిపతిగా నోయెల్ తయారవుతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. టాటా ఇంటర్నేషనల్ అనేది విదేశాలలో అందించే ఉత్పత్తులు మరియు సేవల కోసం టాటా గ్రూప్ యొక్క విభాగం.

నోయెల్ టాటా యూనివర్శిటీ ఆఫ్ సస్సెక్స్ (UK) నుండి పట్టభద్రుడయ్యాడు మరియు ఫ్రాన్స్‌లోని INSEAD నుండి ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ (IEP) పూర్తి చేశాడు. నోయెల్ టాటా గతంలో నెస్లే, UKలో పనిచేశారు. నోయెల్ ఐరిష్ పౌరుడు మరియు టాటా సన్స్‌లో అతిపెద్ద వాటాదారుగా ఉన్న పల్లోంజీ మిస్త్రీ కుమార్తె ఆలూ మిస్త్రీని వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు - లేహ్, మాయ మరియు నెవిల్లే.

దసరా వేళ హైదరాబాద్‌లో అమ్మవారికి అవమానం

నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో దారుణం చోటు చేసుకుంది. దేవి నవరాత్రుల సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని గత అర్థరాత్రి దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి.. నిర్వాహకులకు సమాచారం అందించారు.

నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో దారుణం చోటు చేసుకుంది. దేవి నవరాత్రుల సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని గత అర్థరాత్రి దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి.. నిర్వాహకులకు సమాచారం అందించారు. దీంతో అమ్మవారి భక్తులతోపాటు పలు హిందు సంఘాల నేతలు.. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బేగంబజార్ పోలీసులు నాంపల్లి గ్రౌండ్స్‌కు చేరుకున్నారు.

అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్‌తోపాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోకి ప్రవేశించిన దుండగులు తొలుత విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆ తర్వాత ఆ ప్రదేశంలోని సీసీ కెమెరాలను పగలకొట్టారు. అనంతరం అమ్మవారి విగ్రహం చేతిని విరగొట్టారు. అంతేకాకుండా అమ్మవారి విగ్రహం వద్దనున్న పూజా సామాగ్రిని సైతం చెల్లాచెదురుగా పడేశారు. అమ్మవారి విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన బారికేడ్లను సైతం దుండగులు తొలగించారు.

ప్రతి ఏడాది ఎక్కడో అక్కడ హిందు దేవతల విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారని ఈ సందర్భంగా భక్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం హిందూదేశంలో ఉన్నామా? లేకుంటే ఇస్లామిక్ దేశంలో ఉన్నామా? అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహంపై దాడి చేసిన దుండగులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని పలు హిందు సంఘాలు నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఇంకోవైపు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతి ఏడాది ఎగ్జిబిషన్ సొసైటీ, సిబ్బంది ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. అందులోభాగంగా ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే గురువారం రాత్రి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో దాండియా కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమం అయ్యే వరకు పోలీసులు అక్కడే విధులు నిర్వహించారని ఉన్నతాధికారులు తెలిపారు. అమ్మవారి విగ్రహాం ధ్వంసం ఘటన అర్థరాత్రి లేకుంటే... శుక్రవారం తెల్లవారుజామున జరిగి ఉండవచ్చని పోలీస్ ఉన్నతాధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల పుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఐఏఎస్, ఐపీఎస్‌లకు బిగ్ షాక్..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పని చేస్తున్న అఖిల భారత సర్వీస్ అధికారులకు(IAS & IPS) కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ(DOPT) బిగ్ షాక్ ఇచ్చింది. కేడర్ మార్పు కోసం చేసుకున్న విజ్ఞప్తులను డీఓపీటీ తిరస్కరించింది. కేటాయించిన కేడర్ రాష్ట్రాల్లోనే ..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పని చేస్తున్న అఖిల భారత సర్వీస్ అధికారులకు(IAS & IPS) కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ(DOPT) బిగ్ షాక్ ఇచ్చింది. కేడర్ మార్పు కోసం చేసుకున్న విజ్ఞప్తులను డీఓపీటీ తిరస్కరించింది.

కేటాయించిన కేడర్ రాష్ట్రాల్లోనే కొనసాగాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది డీఓపీటీ.

తెలంగాణలో పని చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కేడర్ అధికారులు ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్, వాణి ప్రసాద్, వాకాటి కరుణ, ఏం. ప్రశాంతి తదితరులకు రిలీవ్ ఆర్డర్ జారీ చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్న తెలంగాణ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎస్‌ఎస్ రావత్, అనంత్ రాము, సృజన, శివశంకర్ లోతేటి లకు రిలీవ్ ఆర్డర్ జారీ చేసింది.

తెలంగాణలో పని చేస్తున్న ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిషేక్ మహంతి, అభిలాష బిస్త్‌లకు రిలీవ్ ఆర్డర్ ఇచ్చింది. ఏపీలో పని చేస్తున్న తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి సీహెచ్ హరి కిరణ్‌కు డీఓపీటీ రిలీవ్ ఆర్డర్స్ ఇచ్చింది. అక్టోబర్16వ తేదీ లోగా విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

రతన్ టాటా జీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను...అమిత్ షా పీయూష్ గోయల్

ఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. రతన్ టాటా జీ నిన్న మరణించారు, నేను ఆయనకు హృదయపూర్వక నివాళులర్పిస్తున్నాను. రతన్ టాటా భారతదేశ ప్రపంచంలోనే కాకుండా ప్రపంచంలోనే గౌరవనీయమైన పారిశ్రామికవేత్త.

టాటా గ్రూప్ ప్రముఖ టాటా గ్రూప్‌కు అనేక మార్పులు అవసరమైన సమయంలో అతను టాటా గ్రూప్ నాయకత్వాన్ని స్వీకరించాడు ఇకపై మనతో లేరు కానీ ఆయన వదిలేసిన వారసత్వం చిరకాలం దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుంది...ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

రతన్ టాటాతో తన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ భావోద్వేగానికి గురయ్యారు.

అతను ఇలా అన్నాడు ...ఒకప్పుడు అతను ముంబైలో అల్పాహారం కోసం ఇంటికి వచ్చినప్పుడు నాకు గుర్తుంది, మేము సాధారణ ఇడ్లీ, సాంబార్, దోస మాత్రమే వడ్డించాము ... కానీ అతను దానిని చాలా మెచ్చుకున్నాడు. అంత గొప్పవాడు రతన్ టాటా