/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz ఆరోరోజు అలిగిన బతుకమ్మ... ఎందుకు అలిగిందో తెలుసా Raghu ram reddy
ఆరోరోజు అలిగిన బతుకమ్మ... ఎందుకు అలిగిందో తెలుసా

ఆరవరోజైన ఈరోజుకు అలిగిన బతుకమ్మ అని పేరు. ఇంతకీ బతుకమ్మకు ఈ పేరు ఎలా వచ్చింది... బతుకమ్మ ఎందుకు అలిగింది... ఈరోజు ఎందుకు బతుకమ్మను చేయరో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆశ్వయుజ శుద్ధ పంచమి (సోమవారం) నాడు అలిగిన బతుకమ్మగా వ్యవహరిస్తారు. పూర్వకాలంలో బతుకమ్మలను పేర్చే సమయంలో మాంసం ముద్ద తగిలి అపచారం జరిగిందట. అందుకని ఈ రోజు బతుకమ్మ అలిగి ఏదీ తినదంటారు.

కాబట్టి ఈ రోజు పూలతో బతుకమ్మలను తయారు చెయ్యరు. నైవేద్యం కూడా ఏదీ సమర్పించరు. బతుకమ్మ అలక తీరాలని మహిళలందరూ కలిసి ప్రార్థిస్తారు.

అలిగిన బతుకమ్మపై మరో చరిత్ర కూడా ఉంది. దేవీభాగవతం ప్రకారం నవరాత్రుల్లో అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి రూపాల్లో రాక్షస సంహారం చేసిందని చెబుతారు. భండాసురుణ్ని, చండముండల్ని సంహరించిన తర్వాత అలసిపోయిన అమ్మవారికి ఒక రోజు విశ్రాంతి ఇవ్వాలని ఆరోనాడు బతుకమ్మ ఆడరు. దానినే అర్రెం అనీ, అలసిన బతుకమ్మ అని పిలుస్తారు. కాలక్రమంలో అదే అలిగిన బతుకమ్మగా పేరు స్థిరపడిపోయింది.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు కూడా వైభవంగా జరుగుతున్నాయి. ఐదవరోజుకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు చేరుకున్నాయి. తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఒక్కో ఆలయంలో ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శమనిస్తుంటారు అమ్మవారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు తరలివెళ్తారు. దుర్గాష్టమితో నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి.

పాలిటిక్స్‌లో ప‌వ‌న్ ఫుట్‌బాల్ లాంటివారు.. మ‌రోసారి ప్ర‌కాశ్ రాజ్ సెటైర్లు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ మ‌రోసారి సెటైర్లు వేశారు. పాలిటిక్స్‌లో ప‌వ‌న్ ఫుట్‌బాల్ లాంటివారని, ఆయ‌న‌ను ఎవ‌రైనా ఉప‌యోగించుకుంటార‌ని తెలిపారు. 

ఆయ‌న చెబుతున్న‌ట్లు స‌నాత‌న ధ‌ర్మం, హిందూ మ‌తం ప్ర‌మాదంలో లేవ‌ని అన్నారు. కేవ‌లం బీజేపీ మాత్ర‌మే ఇబ్బందుల్లో ఉంద‌ని పేర్కొన్నారు. 

"న‌టుడిగా వివిధ చిత్రాల్లో వేర్వేరు పాత్ర‌లు పోషిస్తారు. పాలిటిక్స్ అలా కాద‌ని ఆయ‌న తెలుసుకోవాలి. ఓ స్థిర‌మైన ఆలోచ‌న ఉంటే బాగుంటుంది" అని ప్ర‌కాశ్ రాజ్ హిత‌వు ప‌లికారు. 

ఇక ఇప్ప‌టికే ప్ర‌కాశ్ రాజ్ ప‌లుమార్లు జ‌న‌సేనానిపై సెటైర్లు వేస్తూ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) లో పోస్టు పెట్టిన విష‌యం తెలిసిందే. ఎంజీఆర్‌పై ప‌వ‌న్ ట్వీట్ చేయ‌గా... దానికి స్పందించిన ప్ర‌కాశ్ రాజ్‌.. ఉన్న‌ట్టుండీ ఎంజీఆర్‌పై ఎందుకింత ప్రేమో అంటూ సెటైర్ వేసిన విష‌యం తెలిసిందే.

రేపే తిరుమలలో గరుడ సేవ: 2 లక్షల మందికి పైగా భక్తులు: పార్కింగ్ స్థలాలు ఇవే: టీటీడీ నిర్ణయాలు

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమ‌లలో శ్రీ‌వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు ఆదివారం రాత్రి శ్రీమలయప్ప స్వామివారు బకాసుర వధ అలంకారంలో దర్శనం ఇచ్చారు. శ్రీదేవి, భూదేవితో కలిసి ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులను కరుణించారు.

బ్రహ్మోత్సవాల్లో కీలకమైనది గరుడ సేవ. మంగళవారం సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల గరుడ వాహనారూఢుడై దర్శనం ఇస్తారు శ్రీమలయప్ప స్వామివారు. ఈ వైభవాన్ని తిలకించడానికి ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తిరుమలకు చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ సారి ⁠దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు తిరుమలకు వస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లను పూర్తి చేశారు. దీనిపై టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. గరుడ సేవ దర్శనం కోసం గ్యాలరీలతో పాటు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఔటర్‌ రింగ్‌ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్‌ వెస్ట్‌ కార్నర్‌, గోవింద నిలయం నార్త్‌ వెస్ట్‌ గేట్‌, నార్త్‌ ఈస్ట్‌ గేట్ల ద్వారా ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. అన్ని పాయింట్ల వద్ద అవసరమైన సైన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు.

భక్తులు లగేజీని తీసుకెళ్లకుండా ఆయా పాయింట్లలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. భక్తుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల ఘాట్‌ రోడ్లలో ద్విచక్రవాహనాల రాకపోకలను ఈ రాత్రి 9 గంట‌ల నుంచి అక్టోబ‌రు 9వ తేదీ ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు రద్దు చేశారు. తిరుమలలో వాహనాల రద్దీని నివారించడంలో భాగంగా ప్రజారవాణాను వినియోగించుకోవాలి.

దాదాపు మూడు లక్షల మంది భక్తులను తరలించేలా ఏపీఎస్ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. మూడువేల ట్రిప్పులను నడిపించనున్నారు. తిరుపతి, కడప, చిత్తూరు, శ్రీకాళహస్తి రూట్లలో కూడా పార్కింగ్‌ స్థలాల నుంచి కూడా తిరుమలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు.

పార్కింగ్ స్థలాలను సులభంగా గుర్తించడానికి క్యూఆర్‌ కోడ్‌లను అందిస్తారు. తిరుమలలోని బాలాజీ నగర్, కౌస్తుభం ఎదురుగా, రామ్‌బగీచా బస్టాండ్, ముళ్లగుంట ప్రాంతాల్లో దాదాపు 25 చోట్ల 9,000 వాహనాలకు సరిపడా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. అలాగే- తిరుపతిలోని అలిపిరి పాత చెక్‌పాయింట్‌ వద్ద రెండు వేల ద్విచక్ర వాహనాలు, వినాయకనగర్‌ క్వార్టర్స్‌, నెహ్రూ మున్సిపల్‌ పార్కు, భారతీయ విద్యాభవన్‌, దేవలోక్‌, అదనంగా శ్రీవారి మెట్టు వద్ద కార్లు, బస్సులను పార్క్ చేయవచ్చు.గరుడ సేవ నాడు తిరుమలకు వచ్చే భక్తులకు వైద్య సేవలను అందించడానికి మాడ వీధుల్లో నాలుగు మూలల్లో మొబైల్ క్లినిక్‌లను ఏర్పాటు చేశారు. 12 అంబులెన్సులు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. గరుడసేవను తిలకించడానికి మాడవీధులు, భక్తులతో రద్దీగా ఉండే మ్యూజియం, వరాహస్వామి విశ్రాంతి భవనం, అన్నదానం కాంప్లెక్స్, రామ్ బగీచ విశ్రాంతి భవనం, ఫిల్టర్ హౌస్ తదితర ప్రాంతాల్లో 28 భారీ డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.గరుడ సేవను పర్యవేక్షించడానికి 1,250 మంది టీటీడీ విజిలెన్స్, భద్రతా సిబ్బంది, 5,000 మంది పోలీసులతో పాటు ఆక్టోపస్, గ్రే హౌండ్స్ బలగాలను సిద్ధం చేశారు. శ్రీవారి సేవకులు అన్ని గ్యాలరీలు, క్యూలైన్లు సహా భక్తులు వేచివున్న ప్రతి చోటా అల్పాహారం, మంచినీరు, పాలు అందిస్తారు.

గ్రేటర్ ఎన్నికల వేళ ప్రభుత్వం సంచలన నిర్ణయం - నాలుగు ముక్కలు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధి పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ పరిధిని విస్తరించనుంది. నాలుగు ముక్కలుగా మారనుంది. ఔటర్‌ రింగు రోడ్డును సరిహద్దుగా చేసుకొని ఏర్పాటు చేయనున్న హైదరాబాద్‌ మహానగరాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం మార్పులు చేయాలని భావిస్తోంది. నిధుల లభ్యతకోసం ఒకటే కార్పొరేషన్‌ కాకుండా ఒకేసారి నాలుగు కార్పొరేషన్లుగా ఏర్పా టు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ప్రస్తుతం జీహెచ్ఎంసీతో పాటుగా ఓఆర్ఆర్ లోపల ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు..30 మున్సిపాల్టీలు ఉన్నాయి. వీటిని మొత్తంగా నాలుగు మున్సిపల్ కార్పోరేషన్లు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఇప్పటికే కసర త్తు ప్రారంభించింది. ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న గ్రామ పంచాయతీలను సైతం పక్కనే ఉన్న మున్సిపాలిటీల్లో విలీనం చేయడంతో ఈ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. సుమారు 51 గ్రామపంచాయతీలను విలీనం చేసినట్లు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చింది.

ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పదవీకాలంతో పాటు శివారు ప్రాంతాల్లోని ఏడు మున్సిపల్‌ కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలకు ఈ ఏడాది చివరి వరకు గడువు ఉండటంతో ఈ లోపే గ్రేటర్‌ హైదరాబాద్‌ను నాలుగు భాగాలుగా మార్చాలని భావిస్తున్నారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి గ్రేటర్‌ హైదరాబాద్‌ను 4 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తామని, నలుగురు మేయర్లు వస్తారని ప్రకటించడంతో మరింత స్పష్టత వచ్చింది. తాజా ఆలోచన మేరకు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌, శంషాబాద్‌ పేర్లతో నాలుగు మున్సిపల్‌ కార్పొరేషన్లు ఏర్పా టు చేస్తే అన్ని విధాలా సహేతుకంగా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఉన్న జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం 625 చదరపు కి.మీలు ఉండగా, ఓఆర్‌ఆర్‌ వరకు విస్తరించడంవల్ల ఒకేసారి దాని పరిధి సుమారు 2500 చదరపు కి.మీ మేర అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జనాభా ప్రాతిపదికన డివిజన్లు చేసి, 4 కార్పొరేషన్లలో డివిజన్లు సమానంగా ఉండేలా నిర్ణయించిన తర్వాత ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న జీహెచ్‌ఎంసీ, 7 కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలన్నీంటినీ ఒక్కటిగా మార్చ డం ద్వారా ఓఆర్‌ఆర్‌ లోపల నివాసముండే జనాభా ఒకేసారి 1.80 లక్షల నుంచి 2 కోట్లకు చేరుకుంటుందని అంచనా. కొత్తగా నాలుగో నగరంగా శంషాబాద్‌ పేరును ఖరారు చేయనున్నట్లు సమాచారం.

మద్యం షాపులకు కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ - చివరి తేదీ ఎప్పుడంటే

రాష్ట్రంలో కొత్తగా మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. కడప జిల్లాలో 2024- 26 ఏడాదికి సంబంధించి 139 మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని కడప జిల్లా ఎక్సైజ్ పర్యవేక్షణ అధికారి రవికుమార్ వెల్లడించారు. ఇప్పటివరకు 139 దుకాణాలకు 110 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తుల తుది గడువు ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని చెప్పారు. ఆసక్తి ఉన్న టెండరుదారులు దరఖాస్తులను వారి ఇంటి వద్దనే కూర్చుని కంప్యూటర్ ద్వారా చేసుకోవచ్చని తెలిపారు.గతంలో వలే దరఖాస్తులను భర్తీ చేసి గంటల తరబడి బారులు తీరాల్సిన అవసరం లేదని, ఆన్లైన్ సెంటర్కు వెళ్లినా కూడా నిర్భయంగా దరఖాస్తు చేసుకోవచ్చునని అన్నారు. రెండు లక్షల రూపాయలు చలానాలు చెల్లించి ఎవరైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు. టెండర్ దారులకు ఏవైనా సందేహాలు, అనుమానాలు ఉంటే సంబంధిత ఎక్సైజ్ స్టేషన్కు వెళ్లి అక్కడ ఉన్న అధికారులను సంప్రదించాలని సూచించారు. పదవ తేదీన కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా ద్వారా దుకాణాలను కేటాయిస్తామని చెప్పారు. సమయం ఉంది కదా అని నిర్లక్ష్యం చేస్తే చివరి రోజు సాంకేతిక సమస్యలు తలెత్తవచ్చునని, ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం చర్చ అంతా మద్యం దుకాణాలపైనే జరుగుతోంది. జిల్లాలో ఈ సారి పోటీపడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుందని, బినామీ పేర్లతో వాటిని దక్కించుకోవాలన్న ఆలోచనతో నేతలు ముందుకు వెళ్తున్నారు. మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు పలువురు ముఖ్యనేతలు, వారి బంధువులు, అనుచరులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ దుకాణాలు దక్కించుకునేందుకు యత్నిస్తున్నారు.100కు పైగా దరఖాస్తులు:పశ్చిమ గోదావరి జిల్లాలో మద్యం దుకాణాల ఏర్పాటుపై తెరవెనుక మంత్రాంగాలు జోరుగా సాగుతున్నాయి. వ్యక్తిగతంగా దరఖాస్తు చేసేవారు కూడా శుక్రవారం ఆబ్కారీ స్టేషన్ల వద్ద క్యూలు కట్టారు. జిల్లాలో ఆరు స్టేషన్ల పరిధిలో శుక్రవారం 100కుపైగా దరఖాస్తులు అధికారులు చెబుతున్నారు.

భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు ప్రాంతాల్లో కొంతమంది సిండికేట్‌గా ఏర్పడి ఒక్కో దుకాణానికి 12 మంది చొప్పున టెండరు దాఖలు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. మద్యం దుకాణాలకు పెద్ద మొత్తంలో పోటీ నెలకొనడంతో అధికార పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకు మేమెంత చెబితే అంతంటూ కొంతమంది బడా బాబులు తయారై బేరసారాలకు తెర లేపుతున్నారు. టెండర్ల ప్రక్రియ ముగిసి ప్రభుత్వానికి చెల్లించే నగదుతో పాటు ఆయా నియోజకవర్గాల్లో వ్యాపారాన్ని బట్టి ఒక్కో మద్యం దుకాణానికి 8 నుంచి 25 లక్షల రూపాయలను పెద్దలకు చెల్లించాలన్న ప్రతిపాదన తెరపైకి తెచ్చినట్లు తెలిసింది.

ఈ నెల 12వ తేదీ నుంచి ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణ మళ్లీ ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించాలన్న నిర్ణయించిన ప్రభుత్వం, రెండేళ్ల కాలపరిమితితో నూతన మద్యం విధానాన్ని ఖరారు చేసింది. అక్టోబరు 12 నుంచి 2026 సెప్టెంబరు 30 వరకూ ఈ విధానం అమల్లో ఉంటుంది. మొత్తం 3 వేల 396 మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీకి నోటిఫికేషన్ విడుదలైంది.దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే: ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు.

ఒక్కో దానికి 2 లక్షలు చొప్పున నాన్‌ రిఫండబుల్‌ రుసుము చెల్లించాలి. డెబిట్, క్రెడిట్‌ కార్డుల ద్వారా లేదా బ్యాంకు చలానా ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాలి. డీడీ తీసుకుని నేరుగా ఎక్సైజ్‌ స్టేషన్లలో అందించాలి. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఈ నెల 11న లాటరీ తీసి లైసెన్స్‌లు అందించనున్నారు. ఈ నెల 12 నుంచి లైసెన్సుదారులు కొత్త దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చు.

సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా రాజకీయం చేస్తున్నారు: జగన్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ మరోసారి విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా... తిరుమల లడ్డూ ప్రసాదంపై టీడీపీ రాజకీయాన్ని కొనసాగిస్తోందని పేర్కొన్నారు.

ఈ మేరకు ఆయన ఈరోజు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను ఆయన బీజేపీతో పాటు వివిధ రాజకీయ పార్టీలు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులకు ట్యాగ్ చేశారు. 

నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా సీఎం చంద్రబాబుపై జగన్ విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టు మీకు మొట్టికాయలు వేస్తూ తీర్పును వెలువరించిందని...

అయినా సిగ్గు లేకుండా తీర్పును వక్రీకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. లడ్డూ కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు సీరియస్ అయిందని... అయినా అబద్ధం మీద అబద్ధం చెప్పుకుంటూ పోతున్నారని దుయ్యబట్టారు. మనిషి అన్నాక కొద్దిగానైనా దైవ భక్తి ఉండాలని అన్నారు

రాజేంద్ర‌ప్ర‌సాద్ కుమార్తె క‌న్నుమూత … చంద్ర‌బాబు, ప‌వ‌న్ సంతాపం

సీనియర్ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం చోటుచేసుంది. ఆయన కుమార్తె గాయత్రి (38) గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం హఠాత్తుగా గుండెపోటు రావడంతో వెంటనే హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. కుమార్తె మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. కుమార్తె మరణంతో రాజేంద్రప్రసాద్ కన్నీరుమున్నీరవుతున్నారు. రాజేంద్రప్రసాద్ కు ఏపీ సిఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హీరో జూనియర్ ఎన్టీఆర్ సానుభూతి తెలియజేశారు.

రాజేంద్రప్రసాద్‌ కుమార్తె గాయత్రి (38) మరణం దిగ్భ్రాంతి కలిగించిందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ”సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి చిన్న వయసులోనే అకాల మరణానికి గురికావడం అత్యంత దురదృష్టకరం. ఈ విషాద సమయంలో ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. గాయత్రి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని కోరుకుంటున్నాను” అని చంద్రబాబు సంతాపం తెలియజేశారు

రాజేంద్రప్రసాద్ గారి కుమార్తె గాయత్రి హఠాన్మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. రాజేంద్రప్రసాద్ కు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. పుత్రిక వియోగాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని రాజేంద్రప్రసాద్ కు ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నానని చెప్పారు.

చిన్నప్పుడే ఎంజీఆర్‌ను కలిశా

సనాతన ధర్మ పరిరక్షణపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి. అక్కడ అధికారంలో ఉన్న డీఎంకే యువజన విభాగం అధినేత, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించడం పట్ల తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొనాల్సి వచ్చిందాయనకు.

గతంలో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. డెంగ్యూ, మలేరియా తరహాలోనే సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాల్సిన అవసరం ఉందంటూ ఓ సమావేశంలో బహిరంగంగా విమర్శలు చేశారు. అప్పట్లో నిరసనలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

అవే వ్యాఖ్యలను పవన్ కల్యాణ్ ఇటీవలే తిరుపతిలో నిర్వహించిన వారాహి సభలో ప్రస్తావించారు. ఎక్కడా ఉదయనిధి స్టాలిన్‌ పేరు ఎత్తకుండా విమర్శలు గుప్పించారు. ఫలితంగా డీఎంకే నుంచి ఎదురుదాడిని ఎదుర్కొనాల్సి వచ్చింది పవన్ కల్యాణ్‌కు. దీనిపై ఉదయనిధి సైతం స్పందించారు.

ఈ పరిస్థితుల మధ్య డీఎంకే రాజకీయ ప్రత్యర్థి పార్టీ ఏఐఏడీఎంకేకు మద్దతుగా ఓ ట్వీట్ పోస్ట్ చేయడం చర్చనీయాంశమౌతోంది. తన వ్యక్తిగత ఎక్స్ అకౌంట్ హ్యాండిల్ నుంచి పోస్ట్ పెట్టారు. ఈ నెల 17వ తేదీన 53వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకొంటోన్న ఏఐఏడీఎంకేకు శుభాకాంక్షలు చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అన్నా డీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎం జీ రామచంద్రన్‌పై ఆసియా వీక్ ప్రచురించిన కవర్ పేజీ ఫొటోను తన ట్వీట్‌కు జత చేశారు పవన్ కల్యాణ్. పురచ్చి తలైవాగా అభివర్ణించారు. తన బాల్యం చెన్నైలో గడిచిందని, అప్పట్లో ఎంజీఆర్ నుంచి స్ఫూర్తి పొందానని వ్యాఖ్యానించారు.

చెన్నై మైలాపూర్‌లో చదువుకుంటోన్నప్పుడు తమిళ ఉపాధ్యాయుడి ద్వారా ఎంజీఆర్‌ను కలిశానని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. తిరుక్కరల్ నుంచి తీసుకున్న వాక్యాలను ట్వీట్‌లో పొందుపరిచారు. పరోపకారం, క్షమాగుణం, నిష్కల్మషం, ప్రజల పట్ల శ్రద్ధ ఉన్న వాళ్లే రాజులా వెలుగొందుతారనే అర్థం వచ్చే వాక్యాలవి.

సీఎం రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా.. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ హెచ్చరిక

 డబ్బు మూటలు ఢిల్లీకి పంపించేందుకు మూసీ సుందరీకరణ

 రంగారెడ్డి జిల్లా.. కందుకూరులో.. రైతుల తరపున ధర్నా

 హాజరైన మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ తదితరులు..

బీఆర్ఎస్ పార్టీ కొంత ట్రాక్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. రైతుల తరపున కేటీఆర్ ధర్నా చెయ్యడం అనేది ప్రతిపక్షానికి మంచి అంశం అంటున్నారు. మరి కేటీఆర్ ఏమన్నారో తెలుసుకుందాం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో.. 2 లక్షల రుణం తీసుకోమని రైతులకు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పారని నిలదీశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రంగారెడ్డి జిల్లా.. కందుకూరులో.. రైతుల తరపున ధర్నాకు దిగిన ఆయన.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. 

రైతుల ధర్నా కోసం మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి ఎందుకు చెయ్యలేదని ప్రశ్నించారు. 10 నెలలైనా రుణమాఫీ కాలేదని మండిపడ్డారు.

సెక్రటేరియట్‌కి లంకె బిందెల కోసం వచ్చిన రేవంత్ రెడ్డి.. దొంగ లాగా తయారయ్యారని కేటీఆర్ సెటైర్ వేశారు. కనిపించిన దేవుడికల్లా ఓటు వేస్తారు గానీ.. రుణమాఫీ మాత్రం అమలు చెయ్యట్లేదు. ఆయనకి చిట్టి నాయుడు అనే పేరు సరైనది అని సెటైర్ వేసిన కేటీఆర్.. ప్రజలు రాజకీయ నేతల చేతిలో మోసపోతూనే ఉంటారని రేవంత్ రెడ్డి ఓ వీడియోలో చెప్పారన్న కేటీఆర్.. ప్రజలు నిజంగానే మోసపోయారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి లక్షయాబై వేల కోట్లు మూసీకి ఖర్చు పెడుతున్నాడన్న కేటీఆర్… డబ్బు మూటలు ఢిల్లీకి పంపించేందుకు మూసీ సుందరీకరణ అన్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అడ్డగోలు హామీలు ఇచ్చారనీ… ఇప్పుడు ముఖ్యమంత్రి పదవీని కాపాడుకునే పనిలో ఉన్నారని సెటైర్ వేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కూడా పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు. “సబితా ఇంద్రారెడ్డి కొడుకుల ఇళ్లను కూడా కూల్చుతామన్నారు. అసలు సబితా ఇంద్రారెడ్డి కొడుకుల ఇళ్లు ఎక్కడ ఉన్నాయో చూపించు చిట్టినాయుడు” అని కామెంట్స్ చేశారు కేటీఆర్.. కేపి

హర్యానాలో మొదలైన పోలింగ్.. 90 అసెంబ్లీ స్థానాలు, 1,031 మంది అభ్యర్థుల్లో గెలుపెవరిదో?

హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 1,031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.

20,632 పోలింగ్ కేంద్రాల్లో 2 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

హర్యానా రాష్ట్రం చిన్నదే అయినప్పటికీ, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. గత పదేళ్లుగా బీజేపీ ఈ రాష్ట్రాన్ని పాలిస్తోంది. అయితే, ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న బీజేపీ ముందు పెద్ద సవాలే ఉంది.

ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత, కుల సమీకరణాలు పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.