/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అస్తమయం, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో చికిత్స పొందుతూ మృతి Vijay.S
తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అస్తమయం, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో చికిత్స పొందుతూ మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు భువనగిరి ముద్దుబిడ్డ జిట్టా బాలకృష్ణారెడ్డి శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు .గత కొన్ని రోజులుగా ఆయన బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలోని ఐసిలు చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఉదయం ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో తుది శ్వాస విడిచారు. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసి పడేలా చేయడంలో ఆయన పాత్ర మరువలేనిది. ప్రజా సంక్షేమం కోసం నిత్యం తపించే నాయకుడు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం పట్ల ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఆయన అనుచరులు ,అభిమానులు కన్నీరు అవుతున్నారు .ఉమ్మడి జిల్లాలో టిఆర్ఎస్ పార్టీకి అన్ని తానై వ్యవహరించిన జిట్టా స్వరాష్ట్ర కాంక్షలు రగిలించి ప్రజల్లోకి పార్టీని విస్తృతంగా తీసుకెళ్లాడు. జిట్టా బాలకృష్ణారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి గ్రామంలో జిట్ట బాల్ రెడ్డి, రాధమ్మ దంపతులకు జన్మించారు .వారు 1987లో బీబీనగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్య పూర్తి చేశారు. 1989లో భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు 1993లో ఎల్బీనగర్ లోని డివియం డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో పూర్తి చేశారు. ఆయన అంత్యక్రియలు భువనగిరి శివారులోని మగ్గంపల్లి రోడ్డులోని ఆయన ఫామ్ హౌస్ లో నాలుగు గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
అజ్ఞాన చీకట్లను పారదోలే ఆయుధమే విద్య : ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని రావి భద్ర రెడ్డి ఫంక్షన్ హాల్లో విజ్ఞాన్ ఓకేషనల్ కాలేజి వారు నిర్వహించిన ఫ్రెషర్స్ పార్టీ వేడుకల్లో *తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు* పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీర్ల ఐలయ్య గారిని కళాశాల యాజమాన్యం, కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఘనస్వాగతం పలికారు.అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు.ఆ తర్వాత విద్యార్థులు చేపట్టిన నృత్యాలు చూసి అభినందించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య గారు.మాట్లాడుతూ.సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు సందర్భంగా ఉపాధ్యాయుల మధ్య ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందన్నారు.సమాజంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం ఉపాద్యాయులకు ఇవ్వబడిందన్నారు. ఉపాధ్యాయులు పాఠాలు,గుణపాఠంలు జీవిత పాఠాలు నేర్పిస్తారన్నారు.మనలో ఉన్న టాలెంట్ ని వెలికితీసి ఉన్నత శిఖరాలకు చేరుస్తారన్నారు. అజ్ఞాన చీకట్లను పారదోలే ఆయుధమే విద్య అని అన్నారు..సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారత రాష్ట్రపతి గా ఉన్నపుడు ఆయన మిత్రుల కోరిక మెరకు తన పుట్టిన రోజును ఉపాధ్యాయ దినోత్సవం గా మార్చిన మహనీయుడన్నారు.విద్యార్థులందరు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకున్నారు.


భువనగిరి: సమయానుకూలంగా బస్సులు నడిపించాలని SFI వినతి

భువనగిరి జిల్లా కేంద్రం నుండి అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సులను సమయానుకూలంగా నడిపించాలని కోరుతూ గురువారం భువనగిరి కంట్రోలర్ వై.ఎన్. రావు కు ఎస్ ఎఫ్ ఐ ఆద్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు మాట్లాడుతూ పులిగిల్ల నుండి బోనగిరి కి వచ్చే బస్సులు సమయానికి రావడం లేదన్నారు. ప్రతి రోజూ ఉదయం 7:30 కి మరియు సాయంత్రం 4:30 కి రావాల్సి ఉండగా, సమయానుకూలంగా నడవడం లేదన్నారు. అదేవిధంగా కేచుపల్లి నుండి భువనగిరికి రావాల్సిన బస్సు రావడం లేదన్నారు.ఆ బస్సును వెంటనే పునః ప్రారంభించాలని ఆయన కోరారు .అదేవిధంగా పులిగిల్ల నుండి బోనగిరి కి ఉదయం 7:30 సాయంత్రం 4:30 కి, అదేవిధంగా రెండో బస్సు ఉదయం 8 గంటలకు సాయంత్రం 5 గంటలకు వచ్చే విధంగా చూడాలన్నారు. బస్సులు రాక విద్యార్థులు సమయానికి పాఠశాల/ కళాశాల లకు వెళ్ళలేక ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆయన అన్నారు. ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి సమయానుకూలంగా బస్సులు నడపాలని, లేనియెడల విద్యార్థులను సమీకరించి ఆర్టీసి డిపో కార్యాలయం ముందు ధర్నా, నిరసనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ జిల్లా నాయకులు బుగ్గ ఉదయ్ కుమార్, కాసాని శ్వేత, ఆలేటి సాత్విక, వేముల హారిక ,వీరవెల్లి పూజిత, మహేందర్ ,సందీప్, వినయ్ ,వంశీ, తరుణ్ అరుణ్, తదితరులు పాల్గొన్నారు.

వలిగొండ నూతన ఎస్సైగా వి యుగేందర్ గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ నూతన ఎస్సైగా వి యుగేందర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. బదిలీలో భాగంగా పోచారం ఐటి కార్డార్ నుండి బదిలీపై ఇక్కడికి వచ్చారు ఇక్కడ పనిచేసిన ఎస్ఐ డి మహేందర్ లాల్ ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యారు ఈ సందర్భంగా నూతన ఎస్సై మాట్లాడుతూ మండల ప్రజలు శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలన్నారు. గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకొని పోలీసులకు సహకరించాలని కోరారు.
స్వామి రామానంద తీర్థ సంస్థలో బేసిక్ కంప్యూటర్ డాటా ఎంట్రీ ఆపరేటర్ కొరకు ఉచిత శిక్షణ: పి ఎస్ ఎస్ ఆర్ లక్ష్మి డైరెక్టర్


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆద్వర్యంలో స్వామి రామానంద తీర్థ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని సంస్థ డైరెక్టర్ పి ఎస్ ఎస్ ఆర్ లక్ష్మీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా "దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన" పథకం ను గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. బేసిక్ కంప్యూటర్స్ (డాటా ఎంట్రీ ఆపరేటర్) కోర్సును 3 నెలల పాటు ఉచిత శిక్షణ, వసతి మరియు భోజనం ఉచితంగా అందించి, శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామన్నారు. ఇంటర్ పాసైన,18-35 సంవత్సరాల లోపు వయస్సు కల్గిన యువతీ యువకులు సెప్టెంబర్ 09-2024 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు. ఎస్సీ/ ఎస్టీ/ మైనారిటీ అభ్యర్థులకు ప్రాదాన్యత ఉంటుందని ఆమె తెలిపారు. పూర్తి వివరాలకు పోన్ నెంబర్ (1) 9133908000 (2) 9133908111 (3) 9133908222 లను సంప్రదించాలని ఆమె కోరారు
మా డిగ్రీ కళాశాల మాకే కావాలి: BJYM జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్

భారతీయ జనతా యువ మోర్చా BJYM ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లోని కార్యాలయ అధికారి జగన్మోహన్ గారికి మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ డిగ్రీ పురుషుల గురుకుల కళాశాలను అనంతారం, భువనగిరి మండలం యాదాద్రి భువనగిరి జిల్లా నుండి తరలించకుండా ఆపాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది* ఈ సందర్భంగా బిజెవైఏం జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్ గారు మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ బిసి సంక్షేమ పురుషుల డిగ్రీ కళాశాల ను కందుకూర్ మండలం, మహేశ్వరం నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా కు తరలించే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కాలం నుండి జిల్లా నుండి ప్రభుత్వ విద్యాసంస్థలను తలరించే ప్రయత్నం కొనసాగుతూనే ఉంది, యాదగిరిగుట్ట మెడికల్ కళాశాల తరలిస్తుంటే ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లు ఐలయ్య గారు ఏం చేశారు అదేవిధంగా భువనగిరి నుండి అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ తరలిస్తుంటే ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి గారు ఏం చేశారు బీజేవైఎం ఉద్యమాలు చేసి ఆ రెండు విద్యాసంస్థలను రక్షించుకుంది అదేవిధంగా ఈ మహాత్మ జ్యోతిబాపూలే ప్రభుత్వ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను రక్షించుకుంటాం అయ్యా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు మీరు ఇకనైనా నిద్ర మత్తును వీడండి ఈ నియోజకవర్గంలో విద్యారంగం ఎలా బ్రష్టు పడుతుందో చూడండి ఈ డిగ్రీ కళాశాల ఆపడానికి మీకు వారం రోజులు టైం ఇస్తున్నాం లేనియెడల సోమవారం రోజు మీ క్యాంప్ ఆఫీస్ ముట్టడించడానికి BJYM కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు కుంభ అనిల్ కుమార్ రెడ్డి గారు దయచేసి కళాశాల రక్షించండి అని ఆయన డిమాండ్ చేశారు" మా డిగ్రీ కళాశాల మాకే కావాలి " అనే నినాదంతో ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ఆయన హెచ్చరించారు...... ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు బూరుగు మణికంఠ, మంగు నరసింహారావు, బట్టు క్రాంతి, పల్లెపాటి వేణుగోపాల్, రాళ్ల బండి కృష్ణ చారి, కానుకుంట్ల రమేష్, కొలిచేలిమ మల్లిఖార్జున్,భువనగిరి సిద్దు గౌడ్, నూనె బాలకృష్ణ, బొజ్జ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 6న వలిగొండలో మూసి ప్రక్షాళన, గోదావరి కృష్ణా జలాల సాధన సదస్సును జయప్రదం చేయండి: మాటూరి బాలరాజు జిల్లా కన్వీనర్, సిర్పంగి స్వామి పిలుపు

ఈనెల 6వ తేదీన వలిగొండ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మూసీ ప్రక్షాళన-బునాది గాని,భీమ లింగం కాల్వల ద్వారా గోదావరి కృష్ణా జలాల సాధన కోసం జరుగు సదస్సును జయప్రదం చేయాలని జిల్లా కన్వీనర్ మాటూరు బాలరాజు-కోకన్వీనర్ సిర్పంగి స్వామి లు పిలుపునిచ్చారు మంగళవారం మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలో సదస్సుకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేసిన సందర్భంగా వారు మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు రైతాంగానికి మూగజీవాలకు గత 30 సంవత్సరాల క్రితం స్వచ్ఛమైన నీరును అందించిన మూసీ నేడు పరిశ్రమల వ్యర్థ కాలుష్యాల వల్ల విష కోపంగా మారిందని ఈ విషపు నీటి వల్ల జిల్లా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే మూసి కాలుష్యాన్ని అరికట్టేందుకు నిధులు కేటాయించి మూసీ ప్రక్షాళన నిర్వహించాలని అదేవిధంగా గోదావరి జలాలను బస్వాపురం ప్రాజెక్టు ద్వారా వలిగొండ, భువనగిరి, బీబీనగర్, ఆత్మకూరు,మోత్కూరు, అడ్డగూడూరు,గుండాల మోటకొండూరు మండలాలకు బునాది గాని భీమలింగం కాల్వల ద్వారా నీరు అందించేందుకు అవకాశం ఉందని ప్రభుత్వ తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు బునాది గాని కాల్వను వెంటనే పూర్తి చేసి అడ్డగూడూరు మండలం ధర్మారం వరకు సాగునీరును అందించాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న ఈ సదస్సును ప్రజలు రైతులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వాకిటి వెంకటరెడ్డి, దొడ్డి బిక్షపతి, వరికుప్పల యాదయ్య, వడ్డమాని వెంకటయ్య,మారబోయిన నరసింహ,బొడ్డు రాములు,వేముల దావీదు, వేముల నాగరాజు,గ్రామ రైతులు పాల్గొన్నారు.
గోపరాజు పల్లి లో ఘనంగా ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజు పల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు .వలిగొండ మండల జన నాయకులు మేడి కుమార్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు ,పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు చిల్లర స్వామి ,పాలకూర్ల మల్లేశం, కోమటిరెడ్డి మల్లారెడ్డి, పాలకూర్ల అంజయ్య, ఏనుగుల మల్లయ్య, రుద్రపల్లి మచ్చ గిరి , పాలకూర్ల రాములు , పులగూర్ల శంకర్ రెడ్డి ,గాజుల రాజయ్య, ఎనుగుల సత్తయ్య, పాలకూర్ల రఘుపతి, పోలబోయిన గోపాల్ ,ఏనుగుల విష్ణు , సలిలిగంజి పృథ్వి,గ్రామ యూత్ మరియు మహిళలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

జిట్టా బాలకృష్ణారెడ్డి సంపూర్ణ ఆరోగ్యంతో కోలు కోవాలని అన్నారం షరీఫ్ దర్గాలో ప్రార్థనలు

జిట్టా అభిమానులతో కలిసి ప్రార్థనలు నిర్వహించిన మహమ్మద్ అబ్దుల్ రావుఫ్* *వలిగొండ సెప్టెంబర్ 2 తెలుగు ప్రభ* *మండల పరిధిలోని గోకారం గ్రామానికి చెందిన జిట్ట బాలకృష్ణారెడ్డి అభిమాని మహమ్మద్ అబ్దుల్ రావుఫ్ ఆధ్వర్యంలో సోమవారం వరంగల్ జిల్లాలోని తొర్రూరు దగ్గరలో ఉన్న అన్నారం షరీఫ్ దర్గాలో 20 మంది జిట్టా అభిమానులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ప్రార్థనలు నిర్వహించి ఈసందర్భంగా వారు మాట్లాడుతూ బాలకృష్ణారెడ్డి అమ్మ కీ.శే జిట్టా రాధమ్మ పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్ లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. కానీ ఈరోజు ఆయన సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందడం చాలా బాధాకరమని బాలకృష్ణారెడ్డి అభిమానులుగా ఎంతో భావోద్వేగానికి లోనవుతున్నామని అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థన (ఫాతేహా)చేశామని తెలిపారు. అనంతరం భక్తులకు పండ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిట్ట అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ డిగ్రీ ప్రవేశాల గడువు సెప్టెంబర్ 30 వరకు పొడగింపు: డాక్టర్ గంజి రమేష్ లెర్నింగ్ సెంటర్ కోఆర్డినేటర్

భువనగిరి:  డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం (బీఆర్ఎఓయూ) డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు భువనగిరి శ్రీ లక్ష్మినరసింహ డిగ్రీ కళాశాల లెర్నింగ్ సపోర్ట్ సెంటర్ కో- ఆర్డినేటర్ డాక్టర్ గంజి రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బిఏ, బీకాం , బీఎస్సీ లో ప్రవేశానికి ఇంటర్ చదివిన విద్యార్థులు, పదో తరగతి తర్వాత రెండేళ్ల ఒకేషనల్ కోర్సులు చేసిన వారు, ఇంటర్ సర్టిఫికెట్ లేదా సమాన స్థాయి కలిగిన నేషనల్ ఓపెన్ స్కూల్ సోసైటీ విద్యార్హత కలిగిన వారు కూడా అర్హులేనని, అలాగే రెండు సంవత్సరాలు ఐటిఐ చేసిన వారు కూడా అర్హులేనని ఆయన తెలిపారు. విద్యార్హతలు, ఫీజుల వివరాలు వెబ్సైట్ లో పొందుపర్చామని ఆయన తెలిపారు. డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సెప్టెంబర్ 30 లోపు ట్యూషన్ ఫీజును ఆన్లైన్లో చెల్లించాలని ఆయన కోరారు. పూర్తి సమాచారం కోసం సెల్ 9000590545 నంబర్ ను సంప్రదించాలని ఆయన కోరారు.