/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz ఈనెల 6న వలిగొండలో మూసి ప్రక్షాళన, గోదావరి కృష్ణా జలాల సాధన సదస్సును జయప్రదం చేయండి: మాటూరి బాలరాజు జిల్లా కన్వీనర్, సిర్పంగి స్వామి పిలుపు Vijay.S
ఈనెల 6న వలిగొండలో మూసి ప్రక్షాళన, గోదావరి కృష్ణా జలాల సాధన సదస్సును జయప్రదం చేయండి: మాటూరి బాలరాజు జిల్లా కన్వీనర్, సిర్పంగి స్వామి పిలుపు

ఈనెల 6వ తేదీన వలిగొండ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మూసీ ప్రక్షాళన-బునాది గాని,భీమ లింగం కాల్వల ద్వారా గోదావరి కృష్ణా జలాల సాధన కోసం జరుగు సదస్సును జయప్రదం చేయాలని జిల్లా కన్వీనర్ మాటూరు బాలరాజు-కోకన్వీనర్ సిర్పంగి స్వామి లు పిలుపునిచ్చారు మంగళవారం మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలో సదస్సుకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేసిన సందర్భంగా వారు మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు రైతాంగానికి మూగజీవాలకు గత 30 సంవత్సరాల క్రితం స్వచ్ఛమైన నీరును అందించిన మూసీ నేడు పరిశ్రమల వ్యర్థ కాలుష్యాల వల్ల విష కోపంగా మారిందని ఈ విషపు నీటి వల్ల జిల్లా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే మూసి కాలుష్యాన్ని అరికట్టేందుకు నిధులు కేటాయించి మూసీ ప్రక్షాళన నిర్వహించాలని అదేవిధంగా గోదావరి జలాలను బస్వాపురం ప్రాజెక్టు ద్వారా వలిగొండ, భువనగిరి, బీబీనగర్, ఆత్మకూరు,మోత్కూరు, అడ్డగూడూరు,గుండాల మోటకొండూరు మండలాలకు బునాది గాని భీమలింగం కాల్వల ద్వారా నీరు అందించేందుకు అవకాశం ఉందని ప్రభుత్వ తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు బునాది గాని కాల్వను వెంటనే పూర్తి చేసి అడ్డగూడూరు మండలం ధర్మారం వరకు సాగునీరును అందించాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న ఈ సదస్సును ప్రజలు రైతులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వాకిటి వెంకటరెడ్డి, దొడ్డి బిక్షపతి, వరికుప్పల యాదయ్య, వడ్డమాని వెంకటయ్య,మారబోయిన నరసింహ,బొడ్డు రాములు,వేముల దావీదు, వేముల నాగరాజు,గ్రామ రైతులు పాల్గొన్నారు.
గోపరాజు పల్లి లో ఘనంగా ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజు పల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు .వలిగొండ మండల జన నాయకులు మేడి కుమార్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు ,పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు చిల్లర స్వామి ,పాలకూర్ల మల్లేశం, కోమటిరెడ్డి మల్లారెడ్డి, పాలకూర్ల అంజయ్య, ఏనుగుల మల్లయ్య, రుద్రపల్లి మచ్చ గిరి , పాలకూర్ల రాములు , పులగూర్ల శంకర్ రెడ్డి ,గాజుల రాజయ్య, ఎనుగుల సత్తయ్య, పాలకూర్ల రఘుపతి, పోలబోయిన గోపాల్ ,ఏనుగుల విష్ణు , సలిలిగంజి పృథ్వి,గ్రామ యూత్ మరియు మహిళలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

జిట్టా బాలకృష్ణారెడ్డి సంపూర్ణ ఆరోగ్యంతో కోలు కోవాలని అన్నారం షరీఫ్ దర్గాలో ప్రార్థనలు

జిట్టా అభిమానులతో కలిసి ప్రార్థనలు నిర్వహించిన మహమ్మద్ అబ్దుల్ రావుఫ్* *వలిగొండ సెప్టెంబర్ 2 తెలుగు ప్రభ* *మండల పరిధిలోని గోకారం గ్రామానికి చెందిన జిట్ట బాలకృష్ణారెడ్డి అభిమాని మహమ్మద్ అబ్దుల్ రావుఫ్ ఆధ్వర్యంలో సోమవారం వరంగల్ జిల్లాలోని తొర్రూరు దగ్గరలో ఉన్న అన్నారం షరీఫ్ దర్గాలో 20 మంది జిట్టా అభిమానులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ప్రార్థనలు నిర్వహించి ఈసందర్భంగా వారు మాట్లాడుతూ బాలకృష్ణారెడ్డి అమ్మ కీ.శే జిట్టా రాధమ్మ పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్ లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. కానీ ఈరోజు ఆయన సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందడం చాలా బాధాకరమని బాలకృష్ణారెడ్డి అభిమానులుగా ఎంతో భావోద్వేగానికి లోనవుతున్నామని అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థన (ఫాతేహా)చేశామని తెలిపారు. అనంతరం భక్తులకు పండ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిట్ట అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ డిగ్రీ ప్రవేశాల గడువు సెప్టెంబర్ 30 వరకు పొడగింపు: డాక్టర్ గంజి రమేష్ లెర్నింగ్ సెంటర్ కోఆర్డినేటర్

భువనగిరి:  డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం (బీఆర్ఎఓయూ) డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు భువనగిరి శ్రీ లక్ష్మినరసింహ డిగ్రీ కళాశాల లెర్నింగ్ సపోర్ట్ సెంటర్ కో- ఆర్డినేటర్ డాక్టర్ గంజి రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బిఏ, బీకాం , బీఎస్సీ లో ప్రవేశానికి ఇంటర్ చదివిన విద్యార్థులు, పదో తరగతి తర్వాత రెండేళ్ల ఒకేషనల్ కోర్సులు చేసిన వారు, ఇంటర్ సర్టిఫికెట్ లేదా సమాన స్థాయి కలిగిన నేషనల్ ఓపెన్ స్కూల్ సోసైటీ విద్యార్హత కలిగిన వారు కూడా అర్హులేనని, అలాగే రెండు సంవత్సరాలు ఐటిఐ చేసిన వారు కూడా అర్హులేనని ఆయన తెలిపారు. విద్యార్హతలు, ఫీజుల వివరాలు వెబ్సైట్ లో పొందుపర్చామని ఆయన తెలిపారు. డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సెప్టెంబర్ 30 లోపు ట్యూషన్ ఫీజును ఆన్లైన్లో చెల్లించాలని ఆయన కోరారు. పూర్తి సమాచారం కోసం సెల్ 9000590545 నంబర్ ను సంప్రదించాలని ఆయన కోరారు.
తెలంగాణ ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి త్వరగా కోలుకోవాలని అభిమానుల పాదయాత్ర

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ,తెలంగాణ ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జిట్టా  బాలకృష్ణ రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుతూ వారి అభిమానులు ఆదివారం భువనగిరి పట్టణంలోని రేణుక ఎల్లమ్మ ఆలయం నుండి పాత బస్టాండ్ సాయిబాబా దేవాలయం మీదుగా మాసుకుంట ఆంజనేయస్వామి దేవాలయం మీదుగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు.
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి: ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్

రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన ఉద్యమకారులను గుర్తిస్తామని మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా హామీలను అమలు చేయాలని ఆదివారం భువనగిరి జిల్లా కేంద్రంలో చైతన్య యాత్ర కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహంకు. పూల.మాలవేసి పోస్టర్ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ జార్ఖండ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లుగానే మన ప్రభుత్వం కూడా అమలు చేయాలని అన్నారు..ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి 250 గజాల ఇంటి స్థలం తో పాటు 25 వేల రూపాయల పెన్షన్ హెల్త్ కార్డు బస్సు పాసు మిగతా రాయితీలు కల్పించి ఉద్యమకారుల న్యాయం చేయాలని అలాగే ఉద్యమంలో పనిచేసి నష్టపోయి కేసులు కానటువంటి ఉద్యమకాలను గుర్తించడానికి ఒక కమిటీ వేయాలని ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు ఈనెల 27న సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్ లో జరుగు ఆత్మీయ ఘన. సన్మానం కార్యక్రమాన్ని ఉద్యమకాల పెద్ద ఎత్తున హాజరుకావాలని ఆయన అన్నారు భువనగిరిలో స్వరాజ్ షోరూమ్ దగ్గర నుండి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు కార్లు.లో ర్యాలీతో వెళ్లడం జరిగింది..ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా రాష్ట్ర కమిటీ మహిళా అధ్యక్షురాలు పోతు జ్యోతి రెడ్డి .ప్రధాన కార్యదర్శి పటోళ్ల. సురేందర్ రెడ్డి. జానకి రెడ్డి. గగన్ కుమార్. నెట్టెం భాస్కర్.ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొంతం యాదిరెడ్డి.నియోజకవర్గ అధ్యక్షులు జోగు అంజయ్య. మారగొని శ్రీనివాస్ గౌడ్.మంటి రమేష్. శీలం స్వామి. మల్లం వెంకటేశం.. గంధం మల్ల. మల్లమ్మ. . . ఈ తాప .మల్లేశం రాంబాబు. దయానంద్ భూపాల్ అవినాష్. మరుగన్ శ్రీనివాస్. నోముల శంకర్. కదిరేని. స్వామి మంటి లింగం శంకర్. ఐటిపాముల పుష్ప. గంధ మల్ల బాలయ్య....తదితరులు పాల్గొన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ డి మహేందర్


యాదాద్రి భువనగిరి జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వలిగొండ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై డి మహేందర్ అన్నారు. వర్షాల కారణంగా మండల ప్రజలు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోవాలని కరెంటు వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని మండల ప్రజలకు తెలియజేశారు.
హామీలు తప్ప నిధులు లేవు: ఎండి జహంగీర్ సిపిఎం జిల్లా కార్యదర్శి

రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న భువనగిరి జిల్లా కేంద్రంలో చిన్న నీటి వనరులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో హామీలు తప్ప నిధుల ఊసే లేదని ఆర్బాటపు హామీలు చేయడంలో కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ అన్నారు. జిల్లాలో చిన్న నీటి వనరులపై గత ప్రభుత్వాల మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా హామీలకే పరిమితం అయ్యిందని నిధుల విడుదల ఊసే లేదని, బునాదిగాని పిలాయిపళ్లి, ధర్మారెడ్డిపళ్లి కాల్వల విషయాన్ని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఊరడింపుగా ప్రస్తావించిన నిధులు మాత్రం ప్రకటించలేదని వారు అన్నారు. నిధులు విడుదల చేయకుండా సమీక్ష సమావేశాలతో ఒరిగేదేమీ లేదని ఇది ఆర్భాటపు ప్రచారానికే తప్ప దేనికి ఉపయోగపడదని అన్నారు. 2016-17 సంవత్సరంలో ప్రారంభించిన బునాధిగాని కాలువ 98 కిలోమీటర్లు విస్తీర్ణం ఉంటే 34 కిలోమీటర్ల పని మాత్రమే జరిగిందని కాలువ పూర్తి కావడానికి రూ 260 కోట్ల అంచనాకు కేవలం రూ 33 కోట్లు మాత్రమే మంజూరు అయినవని వారు అన్నారు. గత తెలుగుదేశం, కాంగ్రెస్, టిఆర్ఎస్ ప్రభుత్వాలు ఈ కాలువలను నిర్లక్ష్యం చేసినవి ధర్మారెడ్డిపల్లి, పిల్లాయిపల్లి కాలువల పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నవి అందుకే చిత్తశుద్ధి లేని మాటలు మాని నిధుల విడుదలపై దృష్టి పెట్టాలని వారు అన్నారు. ఈ అంశాలపై సిపిఎం ప్రజల్లోకి వెళ్లి ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని ఇందులో భాగంగానే సెప్టెంబర్ 8,9 తేదీలలో అడ్డగూడూరు నుండి జిల్లా కలెక్టరేట్ వరకు గ్రామ గ్రామాన మోటార్ సైకిల్ యాత్ర నిర్వహించి 9న కలెక్టరేట్ ముందు మహాధర్న నిర్వహిస్తామని వారు తెలిపారు.
ఎమ్మెల్యే వీరేశం ను అడ్డుకున్న పోలీసు అధికారులపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి:ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ

యాదాద్రి భువనగిరి జిల్లా లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నీటిపారుదల శాఖ పనులపై సమీక్ష సమావేశం కోసం ముఖ్య అతిథులు గా విచేస్తున్న తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గార్ల ను సమావేశానికి ఆహ్వానించడం కోసం మిగతా ప్రజా ప్రతినిధుల తో పాటు హెలిపాడ్ దగ్గరకు వెళ్తున్న నకిరేకల్ యం ఎల్ ఏ మాదిగ జాతీ ముద్దు బిడ్డ వేముల వీరేశాన్ని వెళ్లనివ్వకుండా ప్రోటోకాల్ విస్మరించి పోలీస్ అధికారులు అడ్డుకోవడం విచారకరం. ఈ సంఘటన యావత్ మాదిగ, దళిత, పీడిత వర్గాల సమాజాన్ని కలచి వేసింది. ఒక నియోజకవర్గానికి రాజ్యాంగ బద్దంగా ప్రజల ఓట్ల తో ఎన్నికైన శాసన సభ్యుడి నే ప్రోటోకాల్ పాటించకుండా అడ్డుకోవడం తో సాధారణ సగటు సమాజానికి అధికారులు ఎలాంటి సందేశం ఇస్తున్నారని, ఇది పీడిత వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అని ఈ సంఘటన ను తీవ్రంగా ఖండిస్తున్నామని తక్షణమే యం ఎల్ ఏ వేముల వీరేశం కు పీడిత వర్గాల సమాజానికి క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పియాస్ రాష్ట్ర నాయకులు - యం యస్ పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ అన్నారు. శాసన సభ్యులు ప్రోటోకాల్ పరిధి లో వస్తారని మరి యం ఎల్ ఏ వీరేశం పేరు ప్రోటోకాల్ జాభితాలో చేర్చలేదా? చేర్చకుంటే ప్రోటోకాల్ జాభితా రూపొందించిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేదా ప్రోటోకాల్ జాభితాలో యం ఎల్ ఏ వీరేశం పేరు చేర్చినా కూడా భద్రత కల్పిస్తున్న పోలీస్ అధికారులు ఉద్దేశ్య పూర్వకంగా అడ్డుకుంటే ఆ అడ్డుకున్న పోలీస్ అధికారులపై విచారణ జరిపి సంఘటన కు కారకులేవరో తేల్చి వారిపై ఉన్నత స్థాయి అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి అని భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి అన్నారు.లేకుంటే దీనిపై పీడిత వర్గాల సమాజాన్ని ఏకం చేసి ఉద్యమాలు చెపడుతామని అన్నారు.
స్వామి రామానంద తీర్థ సంస్థలో ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు : పి ఎస్ ఎస్ ఆర్ లక్ష్మి డైరెక్టర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వామి రామానంద తీర్థ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షతోపాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని సంస్థ డైరెక్టర్ పి ఎస్ ఎస్ ఆర్ లక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకమును గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకులకు యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. 1. ఎలక్ట్రీషియన్ డొమెస్టిక్ 2. సోలార్ సిస్టం ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ ... ఆరు నెలలు, ఐటిఐ డిప్లమా పాస్ 3. కంప్యూటర్ హార్డ్వేర్ మరియు సెల్ఫోన్ ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ & సిసి టీవీ టెక్నీషియన్ .... ఆరు నెలలు, పదవ తరగతి పాస్ 4. టైలరింగ్ ఎంబ్రాయిడరీ జర్దోజి క్వి ల్డ్ బ్యాగ్ మేకింగ్.... ఆరు నెలలు 8వ తరగతి పాస్ అయి ఉండాలి. వయస్సు 18 నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన యువతీ యువకులు తేదీ 09-09-2024 సోమవారం ఉదయం 10 గంటలకు సంస్థలో హాజరుకావాలని ఆమె కోరారు.