NLG: బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: బండారు ప్రసాద్
నల్గొండ మండలం బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం కార్యశాల బిజెపి నల్గొండ మండల అధ్యక్షుడు బోగరి అనిల్ కుమార్ అధ్యక్షతన శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా బిజెపి నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్ పాల్గొని కార్యకర్తలను, ఉద్దేశించి మాట్లాడుతూ.. నల్లగొండ మండలంలో అధిక సంఖ్యలో బిజెపి సభ్యత్వానికి నల్లగొండ మండల నాయకులందరూ కృషి చేయాలని తద్వారా రానున్న స్థానిక ఎన్నికలలో అధిక స్థానాలలో సర్పంచ్, వార్డ్ మెంబర్లు గెలవడానికి అవకాశం ఉంటుందని,m కార్యకర్తలు అందరూ సమిష్టి కృషితో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ప్రతి బూత్ లో 200 మంది సభ్యత్వానికి తగ్గకుండా చేసి నల్లగొండ జిల్లాలో నల్లగొండ మండలాన్ని మొదటి స్థానంలో నిలపాలని కోరారు.
ఈ సమావేశంలో బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు బొబ్బిలి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు కొత్తపళ్లి ప్రమోద్, చామకూరి మహేష్, మండల సభ్యత్వ కన్వీనర్ పనస సురేష్, మండల ఉపాధ్యక్షులు రేగట్టే రూక్న గౌడ్, మండల కార్యదర్శిలు చింతపల్లి వెంకన్న, మేకల అనిల్, నారబోయిన మల్లేష్,మాజీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కొత్తపల్లి వినోద్, మాజీ వార్డ్ మెంబర్ కస్పరాజు ధర్మయ్య, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు పోతేపాక శంకర్, ఓబిసి మోర్చా మండల అధ్యక్షుడు జక్కల శంకర్, మైనార్టీ మోర్చా మండల అధ్యక్షుడు ఎస్ కె. సాదక్, భూత్ అధ్యక్షులు ఉప్పునూతల శ్రీహరి,సుంకర బోయిన లింగ స్వామి,అంతటి శ్రీకాంత్, పోతేపాక నవీన్, బైరెడ్డి రాంరెడ్డి, చిలుకల అనిల్, బోయిన జానయ్య యాదవ్, నరేష్ ముప్ప వెంకటరెడ్డి , పగిల్లా వెంకన్న, సురిగి వెంకటరెడ్డి మండల సీనియర్ నాయకులు పోతేపాక విజయ్, పోతేపాక సురేష్ ,శరత్, సంజీవ, రాజు మండల సోషల్ మీడియా కన్వీనర్ గన్నెబొయిన శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Sep 01 2024, 08:57